
పాతబస్తీని సందర్శించిన సీపీ మహేందర్ రెడ్డి
ఉగ్రవాద శిక్షణ కోసం అఫ్ఘానిస్థాన్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిమి కార్యకర్తలను మాత్రమే తాము అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ ప్రాంతాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఇద్దరు సిమి కార్యకర్తలు మినహా వేరెవ్వరినీ తాము అరెస్టు చేయలేదని కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటుకోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ పాతబస్తీ ప్రాంతాన్ని సందర్శించారు.