ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బీసీ భవన్‌లో నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్‌విధానం పూర్తయినా నోటిఫికేషన్‌లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. అన్ని శాఖల్లో అడ్‌హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను కూడా ప్రమోషన్లకింద భర్తీ చేశారని ఆరోపించారు. సీఎం జోక్యం చేసుకొని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టులను పూర్తిస్థాయిలో లెక్కించి భర్తీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment