Krishnaiah
-
టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య ఫోర్జరీ కేసులో దర్యాప్తు వేగవంతం
-
KIMS చైర్మన్ పై క్రిమినల్ కేసు
-
‘కిమ్స్’ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మెదటి భార్య, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణ. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్లనూ నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. విశాఖపటా్ననికి చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పని చేస్తుండగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణయ్యతో పరిచయమైంది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నారు. వీళ్లు బంజారాహిల్స్‌లో కాపురం పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతోపాటు బంధువులకూ భార్యగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికారు. వీరికి 2004లో కుమారుడు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య, కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 2006లో అనారోగ్య కారణాలు చెప్పిన కృష్ణయ్య తన కుమారుడిని తనతో తీసుకెళ్లారు. తర్వాత ఇద్దరు కుమార్తెలు... 2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పిన కృష్ణయ్య వైష్ణవినీ తీసుకెళ్లిపోయారు. వీరికి 2011లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత నుంచి కృష్ణయ్య... కృష్ణవేణి వద్దకు రావడం మానేశారు. కుమారుడు, మొదటి కుమార్తె వివరాలను కూడా ఆమెకు తెలియనీయలేదు. కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను చూపించడానికి సుముఖత చూపలేదు. ప్రతి నెలా కృష్ణవేణికి నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వచ్చారు. 2016లో ఆమెను ఖాజాగూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతోపాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరారు. దీంతో ఆయన వీళ్లు నివసిస్తున్న విల్లాను మాత్రం శ్రీనిక పేరుతో బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని పట్టించుకోవడం మానేశారు. తన కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణవేణి ఎట్టకేలకు 2021లో కలవగలిగారు. ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతోపాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు చెప్పాడు. ఈమె అర్జున్ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య మానుకోవాలని బెదిరించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. 2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలిసేవారు. వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్‌ల కుమార్తెగా పెరుగుతున్నట్లు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించారు. వీటి ఆధారంగానే జీహెచ్ఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు పొందినట్లు తెలుసుకున్నారు. ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తొలుత చీటింగ్, ఆపై అదనపు ఆధారాలతో ఫోర్జరీ కేసుగా మారింది. సీసీఎస్ పోలీసులు కేసును రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్షమించరాని తప్పు ఆర్.కృష్ణయ్య రాజీనామాపై కారుమూరి రియాక్షన్
-
మద్యానికి బానిసలై అమ్మలనే చంపేశారు
గండేడ్/ మహమ్మదాబాద్/త్రిపురారం: మద్యానికి బానిసలై కన్న తల్లులనే కడతేర్చారు ఆ కుమారులు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఒకరు, తనకు విడాకులిచ్చిన యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆ వేడుకకు వెళ్లారన్న కక్షతో మరో వ్యక్తి మద్యం మత్తులో విచక్షణ మరచి.. జన్మనిచ్చి న అమ్మలనే చంపుకున్నారు. రాడ్డుతో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ(55), కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్‌కు చెందిన టంకర రాములు పెళ్లయిన తర్వాత ముంబైకి వలస వెళ్లారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత రాములు మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడు కృష్ణయ్యతో కలసి అక్కడే ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేది. రెండేళ్ల క్రితం అక్కడ ఇంటిని అమ్ముకుని పుట్టినిల్లయిన సల్కర్‌పేట్‌కు చేరుకుంది. అయితే ఆమె కుమారుడు కృష్ణయ్య మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బుల కోసం తల్లిని వేధించడంతోపాటు ఇల్లు అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టావని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో కృష్ణయ్య ఇనుపరాడ్డుతో వెంకటమ్మ తలపై కొట్టాడు. అంతటితో ఆగక కత్తి తీసుకొని గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి కొద్దిదూరంలో పడేశాడు. ఆదివారం తెల్లవారుజామున తన మేనమామ రాములుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని, ఎవరో చంపేశారని చెప్పా డు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహం పడేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరం వరకు గడ్డిపై రక్తం పడి ఉండడంతో, అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇల్లు కడిగి ఉండడంతో అనుమానం వచ్చి కృష్ణయ్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిని గొంతుకోసి చంపి, కొడుకు ఆత్మహత్య నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల చినవీరయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వీరికి శ్రీను, శివకుమార్ అనే కుమారులు, పద్మ అనే కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శివకుమార్‌కు అక్క పద్మ కుమార్తె మేఘనతో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివకుమార్ తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. కాగా, మేఘనకు శనివారం హైదరాబాద్‌లో రెండో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి తండ్రి, అన్న హాజరుకావడంతో ఆగ్రహానికి గురైన శివకు మార్ రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడ్డాడు.తర్వాత తల్లి నిద్రిస్తుండగా.. కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయపడి శివకుమార్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చినవీరయ్య ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉండటం గమనించాడు. వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు
-
సీఎం జగన్ దేవుడిచ్చిన వరం మనకు
-
బీసీలకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు: కృష్ణయ్య
-
మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా చేర్చాలి : R. కృష్ణయ్య
-
మెగా డీఎస్సీని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సరికాదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు... మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం అంటే ఇదేనా?
-
గ్యాంగ్ స్టర్ కు బీహార్ ప్రభుత్వం కొమ్ము కాస్తుందా?
-
తెలుగు ఐఏఎస్ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!
పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్ మోహన్. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్ మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు. నితీశ్ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్ మండల్ కూడా ఉన్నారు. ఏం జరిగింది? 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్ మోహన్ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్ మోహన్ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం మూక దాడికి బలైన ఐఏఎస్ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్ చంపారన్ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది. కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. ఇప్పటికీ మాఫియా రాజ్యమే కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ‘‘ఆనంద్ మోహన్ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్‌లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్ మోహన్ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు. కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరుద్యోగులతో సర్కారు చెలగాటం
సైదాబాద్ (హైదరాబాద్): ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు, గురుకుల పాఠశాలల్లోని 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. శనివారం సైదాబాద్ డివిజన్ గడ్డిఅన్నారంలోని రామయ్య కోచింగ్ సెంటర్ హాల్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోతే.. నిరుద్యోగులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
పేదల చదువులకు సీఎం వైఎస్ జగన్ చేయూతనిస్తున్నారు
-
మునుగోడు ఎన్నికతో టీఆర్ఎస్ సైలెంట్! ఉనికేలేని బీజేపీకి ఇది ప్లస్?
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టదలచుకోలేదా? ప్రత్యర్థి పార్టీ కార్యకర్త చనిపోయినా తమకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఖమ్మం జిల్లాలో అసలు కమలనాథుల వ్యూహం ఏంటి? తెలంగాణలో బీజేపీ ఉనికి లేని జిల్లా ఏదంటే ఖమ్మం అనే చెప్పాలి. ఈ జిల్లాలో కాషాయ సేనకు చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. దీంతో ఇక్కడ కమలం పార్టీ పుంజుకోవడం సాధ్యం కావడంలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా వామపక్షాలు, టీఆర్ఎస్ పార్టీల హవా కూడా నడుస్తోంది. వామపక్షాలకు సీట్లు లేకపోయినా ఓట్ బ్యాంక్, కేడర్ బలం అయితే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఒక్కొక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. కాషాయ నేతల హడావుడి ఖమ్మం జిల్లాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న కమలం పార్టీ పుంజుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే రాజకీయంగా రచ్చ జరిగిన ఏ ఘటనను వదిలిపెట్టడంలేదు. సొంత పార్టీ కార్యకర్త చనిపోతే ఎంత హడావుడి చేశారో.. టీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురైన సందర్భంలో కూడా అంతే హడావుడి చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ నాయకత్వం, ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆ పార్టీ కేడర్లోనే అసంతృప్తి వెల్లడవుతోంది. ఇక్కడే బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో టిఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో సొంత పార్టీ కార్యకర్త కృష్ణయ్య హత్యకు గురైతే అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ సరిగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు కారణమని ప్రచారం ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటనలో టిఆర్ఎస్ సైలెంట్ గా ఉండటానికి ప్రదాన కారణం మునుగోడు ఉప ఎన్నికనే అనే విషయాన్ని జనంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నాయకులు. కృష్ణయ్య హత్యలో సీపీఎం నాయకుల పాత్ర ఉండటంతో.. కేసు నుంచి బయట పడటానికి మునుగోడులో టిఆర్ఎస్కు మద్దతు ప్రకటించిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. కృష్ణయ్య హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కమలనాథులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్వయంగా కృష్ణయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య హత్య విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి వర్మ వారికి మాటిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పరామర్శకు ప్లాన్ చేశారు. చనిపోయింది టీఆర్ఎస్ నాయకుడే అయినా మానవత్వంతో అయినా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం! కొన్ని నెలల క్రితం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. టిఆర్ఎస్ నాయకులు, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని ప్రకటించి సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మృతుని అమ్మమ్మ, చెల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పడం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఖమ్మం వచ్చి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయడంతో.. కల్ గా బీజేపీకి కొంత మైలేజ్ వచ్చింది. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపిందన్న అంశాన్ని గుర్తుచేస్తూ... కృష్ణయ్య హత్యను టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారన్న చర్చ సైతం ఖమ్మం జిల్లాలో మొదలైంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలను బీజేపీలోకి రప్పించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కృష్ణయ్య హత్యకేసులో ఆ ఇద్దరూ లొంగుబాటు
ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. గతనెల 15న జరిగిన కృష్ణయ్య హత్యకేసులో చార్జీషీట్లో నిందితులుగా పది మందిని చేర్చారు. హత్య జరిగాక 3 రోజుల వ్యవధిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఏ9గా ఉన్న తమ్మినేని కో టేశ్వరరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు), ఏ10గా ఉన్న ఎల్లంపల్లి నాగయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి అరెస్టులో జాప్యం జరగడంతో పోలీసుల తీరుపై కృష్ణయ్య కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మౌనిక ఎదుట కోటేశ్వరరావు, నాగయ్య లొంగిపోయారు. న్యాయవాది కొల్లి సత్యనా రాయణ వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరినీ జిల్లా జైలుకు తరలించారు. -
తమ్మినేని కృష్ణయ్య హత్య.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తమ్ముళ్లు
సాక్షి, ఖమ్మం రూరల్: జిల్లాలోని తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను ఎవరైనా సమర్థిస్తే వారు అంతరాత్మను మోసం చేసుకున్నట్లేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. పలువురు నాయకులతో కలిసి సోమవారం ఆయన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ విషయంలో పోలీసులు తమ బాధ్యతను పకడ్బందీగా నెరవేర్చి హంతకులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ఏది ఏమైనా ఇలాంటి హత్యలను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టంచేశారు. హత్య కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు తన శాయశక్తులా కృషిచేస్తానని తుమ్మల వెల్ల డించారు. తొలుత కృష్ణయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్ల మల వెంకటేశ్వరరావు, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, శాఖమూరి రమేష్, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రియాదవ్, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీపీఎంకు కృష్ణయ్య సోదరుల రాజీనామా ఇటీవల దారుణ హత్యకు గురైన తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య సోదరులు తమ్మినేని వెంకటేశ్వరరావు, బుచ్చయ్య సీపీఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం తెల్దారుపల్లిలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ సోదరుడితో పాటు తాము సీపీఎం అభివృద్ధికి అంకితభావంతో పనిచేశామని.. కానీ ఆ పార్టీ నాయకులే తమ సోదరుడిని హత్య చేయడం కలిచివేసిందని పేర్కొన్నారు. నలభై ఏళ్ల పాటు సీపీఎంలో కొనసాగిన కృష్ణయ్యను హత్య చేయడంతో తాము పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. సీపీఎం పార్టీ నేతలు చేసిన హత్యకు నైతిక బాధ్యతగా, తమ సోదరుడు కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 15 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్లు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని, బీసీ, ఈబీసీ విద్యార్థుల మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని కోరారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని, రెండేళ్లుగా 15 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చలో కలెక్టరేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో టెన్షన్ వాతావరణం
-
తుమ్మల అనుచరుడి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, ఖమ్మం /ఖమ్మం రూరల్: వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబురాల వేళ ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. తెల్దారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. రాజకీయ కక్షతో వీరభద్రం, ఆయన సోదరులే ఈ హత్య చేయించారని కృష్ణయ్య కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. తన తండ్రి హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, మరో ఆరుగురు కారకులని పేర్కొంటూ కృష్ణయ్య కుమారుడు నవీన్ ఖమ్మం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ హత్యోదంతంతో కోపోద్రిక్తులైన కృష్ణయ్య బంధువులు, కుటుంబీకులు, అనుచరులు..వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు, అనుమానితుల ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి దాడి కృష్ణయ్యకు భార్య (ఎంపీటీసీ) మంగతాయారుతో పాటు కుమార్తె రజిత, కుమారుడు నవీన్ ఉన్నారు. కుమారుడు గ్రానైట్ వ్యాపారం చేస్తుండగా, కృష్ణయ్య ఇటీవల వరకు సీపీఎంలోనే కొనసాగారు. కోటేశ్వరరావుతో విభేదాలు రావడంతో సీపీఎంను వీడి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరుడిగా, టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సమితి సభ్యుడిగా కొనసాగుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పొన్నెకల్‌లోని రైతువేదికలో జాతీయ జెండా ఎగురవేసి, మండలంలోని గుర్రాలపాడులో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వాహనాన్ని తెల్దారుపల్లికే చెందిన ముత్తేశం నడుపుతుండగా కృష్ణయ్య వెనుకాల కూర్చున్నారు. గ్రామం సమీపిస్తుండగా వెనుక నుండి ఆటోలో వచ్చిన దుండగులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న చిన్న కాల్వలో పడిపోగానే తల్వార్లతో తలను, చేతులను ఇష్టారాజ్యంగా నరికారు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు ఆటోలో తెల్దారుపల్లి గ్రామంలోకి వెళ్లారు. గ్రామస్తులే చంపారన్న ప్రత్యక్ష సాక్షి భయంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రత్యక్ష సాక్షి ముత్తేశం కాసేపటికి ఘటనాస్థలానికి వచ్చాడు. అక్కడే మీడియా, పోలీసులతో వేర్వేరుగా మాట్లాడాడు. గ్రామానికే చెందిన బోడపట్ల శ్రీను (తండ్రి చిన్న ఎల్లయ్య), గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడినట్లు చెప్పాడు. డాగ్‌స్క్వాడ్‌తో వచ్చిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా జాగిలం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ఇంటి వద్ద ఆగింది. దీంతో కృష్ణయ్య అనుచరులు, కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు అప్పటికే ఇంటి నుండి వెళ్లిపోయారు. గ్రామంలో సీపీఎం దిమ్మెలను ధ్వంసం చేయడంతో పాటు వీరభద్రం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను కృష్ణయ్య అనుచరులు చించేశారు. గ్రామంలో 144 సెక్షన్ కృష్ణయ్య హత్య జరిగిన 20 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణయ్య హత్య దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు అభివృద్ధికి అవరోధం కల్పిస్తాయని పేర్కొన్నారు. నిందితులెంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ్మినేని వీరభద్రమే హత్య చేయించారు.. గ్రామంలో సీపీఎంకు ఆదరణ తగ్గడం, కృష్ణయ్యకు మంచి పేరు వస్తుండటంతో తట్టుకోలేక తమ్మినేని వీరభద్రమే తన భర్త కృష్ణయ్యను హత్య చేయించినట్లు మంగతాయారు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి హత్యకు వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావే కారణమని, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నంచడంతో హత్యకు పాల్పడ్డారని కృష్ణయ్య కుమార్తె రజిత ఆరోపించారు. -
బీసీలు అందరూ సీఎం జగన్ కి సెల్యూట్ చేస్తున్నారు
-
ఔట్సోర్సింగ్ సెక్రటరీలను విధుల్లోకి తీసుకోవాలి’
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ఔట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ 2018లో పరీక్ష రాసి మెరిట్ లిస్టుతోపాటు రోస్టర్ పద్ధతి ద్వారా ఎంపికైన 370 మంది జూనియర్ పం చాయతీ కార్యదర్శులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిరుద్యోగులంతా రోడ్డుపై తిరుగుతుంటే రిటైర్మెంట్ అయినవారికి ఎక్కువ జీతాలిచ్చి నియమించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షురాలు అనసూర్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ హిమామ్ వల్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
బీసీలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి: ఆర్. కృష్ణయ్య
కాచిగూడ (హైదరాబాద్): అసెంబ్లీలో ఈనెల 7న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన 14 బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలసి బీసీల బడ్జెట్‌పై చర్చించామన్నారు. ఈ సారి బడ్జెట్ పెంచకపోతే వెనకబడిన వర్గాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అలాగే బీసీలకు సబ్‌ప్లాన్‌ను, బీసీబంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.3వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ అడ్వొకేట్లకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్స్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్లు కేటాయిం చాలని, అర్హులందరికీ డీఎస్సీ, పోలీస్, గ్రూప్ పరీక్షలు, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోల జనార్దన్, జయంతి పాల్గొన్నారు. -
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
కాచిగూడ: బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య శిక్షణాతరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల నాయకత్వం పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో బీసీల తిరుగుబాటు మొదలవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జన గణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, కోల జనార్ధన్, నీల వెంకటేష్, మట్టా జయంతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘బడుగుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర బడ్జెట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలు మార్లు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమకుట్టినట్లుకూడా లేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలమంతా ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ మోదీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నాయని ఆరోపించారు. సురేశ్ మాట్లాడుతూ దేశంలోని 6 వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్‌ను పునఃసమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, అంజి, జయం తిగౌడ్, హరీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించాలి
కాచిగూడ (హైదరాబాద్): కేంద్రప్రభుత్వం వచ్చే బడ్జెట్లో బీసీల సంక్షేమం, అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో అఖిలపక్ష పార్టీల, బీసీ సంఘాల సమావేశం జరిగింది. సమావేశంలో వి.హనుమంతరావు (కాంగ్రెస్), అజీజ్‌పాషా (సీపీఐ), ఎస్.వీరయ్య (సీపీఎం), ఇందిరా శోభన్ (ఆమ్ఆద్మీ), ఎ.సుద ర్శన్ (శివసేన), రవీందర్ (ఎన్సీపీ), జ్యోతి (శివసేన), లాల్ కృష్ణ, కోల జనార్ధన్ (బీసీ సంక్షేమ సంఘం)లతో పాటు 56 కులసంఘాలు, 36 బీసీ సంఘాలు, 26 బీసీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం బీసీల ఆర్థికాభి వృద్ధికి ఎలాంటి పథకాలు పెట్టడం లేదని, రాయితీ లు కల్పించడం లేదని, బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేయగా.. కేవలం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారని, మిగతా ఆర్థికపరమైన ఒక్క స్కీమ్ కూడా అమలు చేయడానికి బడ్జెట్ కేటాయించడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమం లో నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించండి
కాచిగూడ (హైదరాబాద్): కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి లక్షకోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్ కేటాయించరా? అని ప్రశ్నించారు. గతేడాది కేంద్రం బీసీలకు రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోల జనార్దన్, మట్ట జయంతిగౌడ్, నీల వెంకటేశ్, మల్లేశ్‌యాదవ్, రాజేందర్, అంజి, బబ్లూ, శివ, చంటి, భాస్కర్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అభినందనీయం’
కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బీసీ భవన్లో నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్విధానం పూర్తయినా నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను కూడా ప్రమోషన్లకింద భర్తీ చేశారని ఆరోపించారు. సీఎం జోక్యం చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను పూర్తిస్థాయిలో లెక్కించి భర్తీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. -
గురుకులం దూరాభారం
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్‌లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్ జిల్లా మహేంద్రహిల్స్‌లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్‌లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ ఫొటోలోని భవనం శామీర్‌పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్ వసతులు సరిపోక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్‌కర్నూల్ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇక్కడి గురుకులం మరెక్కడో ♦రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు. ♦ హైదరాబాద్ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. ♦రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్‌పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్లోనే నిర్వహిస్తున్నారు. -
మెస్ చార్జీలు రూ.2,500కు పెంచాలి
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్ చార్జీలను రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం వందలాది మంది హాస్టల్ విద్యార్థులతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం 2008లో నూతన వసతి గృహాలు, కాలేజీలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని నిరాహార దీక్ష చేయగా ప్రభుత్వం దిగొచ్చి హామీలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 27 శాతం, ఎమ్మెల్యేలకు 50 శాతం వేతనాలు పెంచడం ఏం ధర్మమని ప్రశ్నించారు. హాస్టల్ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న అనంతరం రెండేళ్లపాటు ప్రభుత్వం వారికి కోచింగ్ ఇప్పించి వసతి కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంఘాల నేతలు మల్లేశ్‌యాదవ్, దాసు సురేశ్, సతీశ్, నర్సింహగౌడ్, కృష్ణయాదవ్, చంటి ముదిరాజ్, వెంకట్, చరణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వారికి వెంటనే ఉద్యోగాలివ్వాలి: ఆర్ కృష్ణయ్య
ఖైరతాబాద్(హైదరాబాద్): కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయ ముట్టడిలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2018లో పరీక్షలు రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 2020లో కరోనా కారణంగా అర్ధంతరంగా వాయిదా వేశారని తెలిపారు. కొన్ని జిల్లాల్లోనే అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, గతంలో ఎంపికైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి దృష్టిసారించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మంది బీసీలు జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకా?’అంటూ నినదించారు. ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. 16 రాష్ట్రాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యమే లేదని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ధనస్వామ్యమని ఆరోపించారు. పార్లమెంట్లో 96 మంది బీసీ సభ్యులున్నా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను బీసీ సంఘాల నేతలు కలిశారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.1,050 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ జేఏసీ చైర్మన్ నీరడి భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగాల భర్తీ చేసేవారికే మా మద్దతు’
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేసే వారికే తమ మద్దతు ఉంటుం దని తెలంగాణ నిరుద్యో గ సంఘం స్పష్టం చేసిం ది. విద్యానగర్‌లో మంగళవారం జరిగిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి బీసీ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో పాటుగా తెలంగాణ నిరుద్యోగ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని కృష్ణయ్య అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో 18వేల ఉద్యోగాల ను మాత్రమే భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్ పోస్టుల తోపాటుగా ప్రభుత్వ జూనియర్, డీగ్రీ, వర్సిటీ ల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులకు నోటిఫి కేషన్ జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు టీఆర్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరులో మరో కృష్ణుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీకి ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి మింగుడుపడని విధంగా మారింది. జిల్లాలో మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలకు ఇక్కడ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి నేతలు గ్రూప్‌లుగా విడిపోయి స్థానికంగా మంత్రులు అండతో ఇన్చార్జి పదవి దానితో పాటు టికెట్ దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరంగా వెళ్లిన క్రమంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కన్నబాబు మళ్లీ తెరపైకి వచ్చారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహకారంతో ఆత్మకూరు ఇన్చార్జిని దక్కించుకోవటానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ పెద్దల్ని కలిసి కొద్ది రోజులు హడావుడి చేశారు. మరోవైపు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ్‌రెడ్డి కూడా ఇన్చార్జి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా పావులు కదిపారు. చివరికి ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు చర్చించి ఇన్చార్జిని నియమించే వరకు ఆదాలనే పర్యవేక్షించాలని సూచించారు. దీంతో కన్నబాబు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు దిగడం తర్వాత పార్టీ ముఖ్యుల జోక్యంతో మంత్రి నారాయణ విరమింపజేశారు. ఈ పరిణమాల క్రమంలో గందరగోళంగా మారిన ఆత్మకూరు వ్యవహారంలో ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్ బొల్లినేని కృష్ణయ్య తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆదాలతో కలసి సీఎంను కలిసిన కృష్ణయ్య ఇన్చార్జి కోసం తీవ్రంగా యత్నిస్తున్న కన్నబాబు, ధనుంజయరెడ్డికి పోటీగా బొల్లినేనిని పార్టీలోకి తీసుకొచ్చేందకు ఆదాల యత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సీఎం వద్దకు ఆదాల, బొల్లినేని వెళ్లి నియోజకవర్గ విషయాలను చర్చించారు. దీని కొనసాగింపుగా నియోజకవర్గంలో బొల్లినేని తన సొంత మనుషులతో చర్చలు మొదలుపెట్టారు. మరోవైపు రాజకీయంగా వైరం ఉన్న కొమ్మి లక్ష్మయ్యనాయుడుతో వేర్వేరు సందర్భాల్లో రెండు సార్లు కలిశారు. రాజకీయ ప్రత్యర్థులు అయి ఇరువురూ శనివారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు కూడా. ఇక బొల్లినేని కూడా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపుతూ రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని ముఖ్యుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఆత్మకూరులో మరో కృష్ణుడు రాకతో సరికొత్త వివాదాలకు తెర లేచినట్లయింది. -
మోసగించడానికే బీసీ జనగణన: కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలను మరోసారి మోసగించడానికే కేసీఆర్ ప్రభుత్వం బీసీల జనగణన చేపడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేలో కులాల వారీగా పూర్తిస్థాయి లెక్కలున్నాయని, మరోసారి బీసీ గణన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతోపాటు, గ్రామజ్యోతి సర్వేలో బీసీ గణన లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, కేవలం బీసీలను తప్పుదారి పట్టిస్తూ, పార్టీ ప్రచారం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 34 నుంచి 56 శాతానికి పంచాయతీ రిజర్వేషన్లు అడుగుతుంటే ప్రభుత్వం 23 శాతానికి తగ్గించే విధంగా కుట్ర చేస్తోందన్నారు. బీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
బీసీల పట్ల టీఆర్ఎస్ వివక్ష చూపుతోంది: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసిన బీసీలందరికీ రుణాలు ఇవ్వాలని, 500 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న కలెక్టరేట్లను ముట్టడించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం జరిగిన బీసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల విపక్ష చూపుతోందని ఆరోపించారు. కొన్ని కులాలకు పూర్తి ఫీజు చెల్లించి, బీసీ విద్యార్థులకు మాత్రం అనేక ఆంక్షలు పెట్టి విద్యనభ్యసించకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా..గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించలేదన్నారు. 0బీసీ కార్పొరేషన్లు, 11 కుల ఫెడరేషన్లకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులు, బీసీలను అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్ సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల సాధారణ బదిలీల్లో బీసీ ఉద్యోగులను ప్రాధాన్యతా స్థానాల్లో నియమించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కృష్ణయ్య నేతృత్వంలో విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో సీఎండీ, డైరెక్టర్ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని బీసీలను సీఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య వెంట విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, యాదగిరి, చంద్రుడు, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. -
భగీరథ అక్రమాలపై విచారణ చేపట్టాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు బీసీ సంక్షేమ సం ఘం ఆరోపించింది. పనుల్లో నాణ్యత లోపిం చిందని, దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో వృథా అయిందని మండిపడింది. రూ.48 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొంది. మిషన్ భగీరథ అక్రమాలపై శాసనసభా కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. ఈ పనుల్లో నాసిరకం పైపులు వాడుతున్నారని తెలిపారు. గ్రామ శివారు వరకు కొత్త పైపులు వేస్తుండగా.. గ్రామం, పట్టణాల్లో మాత్రం పాత పైపులను వినియోగిస్తున్నారన్నారు. సిమెంటు పైపుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. దీని కోసం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలతోపాటు సామాజిక అం శాలపై పోరాడుతున్న సంఘాలతో కలసి పనిచేస్తామన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నా యని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకుపైగా ఖాళీలున్నాయని, అలాగే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఖాళీల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఉద్యమం ద్వారానే ఖాళీలు భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని తెలిపారు. యూనివర్సిటీలు, జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలకు సూచించారు. క్షేత్రస్థాయి నిరసనలు ముగిసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. సంఘం అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించి న తర్వాత ఆయన ప్రసంగించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రా న్ని కోరారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు, ఉన్నతాధికారి జె. శ్రీనివాస్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, నేతలు బ్రహ్మేంద్రరావు, శేఖర్‌బాబు, జి. స్వామి, కె. సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధి కోసం తయారు చేస్తున్న బీసీ నివేదిక రూపకల్పన తుదిదశకు చేరుకుంది. సోమవారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో భేటి అయిన బీసీ కమిటీ సభ్యులు.. నివేదికలోని అంశాలపై మరోమారు చర్చించి పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సుమారు రెండొందల అంశాలతో రూపొందించిన ప్రాథమిక నివేదికలో రిజర్వేషన్లు, విద్య, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతానికి తుదిదశలో ఉన్న ప్రాథమిక నివేదికపై సభ్యులు మంగళవారం మరోమారు భేటీ కానున్నారు. అనంతరం పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావుతో పాటు బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘ఐఐటీ, ఐఐఎం’లోనూ రీయింబర్స్మెంట్ బీసీ నివేదికలో విద్యకే ప్రాధాన్యమిచ్చారు. పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే అంశంపై సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐఐటీ, ఐఐఎం, నీట్ విద్యార్థులకూ రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే అంశానికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 2017–18లో 119 గురుకులాలు ప్రారంభించినా జనాభాకు అనుగుణంగా గురుకులాలు ఏర్పాటు చేయాలనే వాదన వినిపించాయి. దీంతో 119 గురుకులాల ఏర్పాటుకు సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. మరో 61 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్ల సంఖ్య పెంచడం, కొత్త జిల్లాల్లోనూ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 50కి పెంచాలని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు.. బీసీ ఉన్నతాధికారులకు ప్రాధాన్యమున్న పోస్టులు ఇవ్వడం లేదనే విమర్శలకు చెక్ పెడుతూ కీలక విభాగాల్లో బీసీ అధికారులు ఉండాలనే డిమాండ్‌కు మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ ఇప్పించాలనే అంశం చర్చలో భాగంగా ప్రస్తావనకు వచ్చింది. ఏటా బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలనే అంశంపైనా చర్చించారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో ప్రాధాన్యంపైనా సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బీసీ కులాల రిజర్వేషన్లపై బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా మంగళవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై నివేదికను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. -
సబ్ప్లాన్తోనే బీసీలకు సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు.. బీసీ కమిటీ సభ్యులు మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారిలకు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ పాలసీ అవసరమని, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ లేదా బీసీ ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన వర్తింపజేయాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు 50శాతం వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు.. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని తెలు గు రాష్ట్రాల సీఎంలను కోరామని కృష్ణయ్య చెప్పారు. దీనికి ఇద్దరు సీఎంలు అంగీకరించారని, ప్రధాని అపా యింట్మెంట్ దొరకగానే వెళ్దామని చెప్పారన్నారు. -
కాపు రిజర్వేషన్లపై ముద్రగడ కేవియట్
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నందున దీనిపై తమ వాదనలు కూడా వినాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో నలుగురు ఉమ్మడి హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఆర్.కృష్ణయ్యతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముద్రగడ తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది జి.గంగయ్యనాయుడు వాదనలు వినిపించనున్నారు. తొలుత మాకు నోటీసులిచ్చి వాదనలు వినాలి ‘కాపులు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల ప్రజలను బీసీల్లో చేర్చాలంటూ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నాం. సామాజిక, విద్యా, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మా వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతి కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. మా డిమాండ్ న్యాయమైందని బీసీ సంఘం కూడా తన నివేదికలో చెప్పింది. కాపులను బీసీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో మా వాదనలు వినకుండా ఏవైనా ఆదేశాలిస్తే మాకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే తొలుత మాకు నోటీసులు ఇచ్చి మా వాదనలు వినండి’అని ముద్రగడ తదితరులు తమ కేవియట్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
రాజకీయ లబ్ధికే బీసీల్లో చేర్చారు: కృష్ణయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీల్లో చేర్చడం హేయమైన చర్య అని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. దీనిపై బీసీలంతా టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తారనే వార్తలు వెలువడ్డ నాటి నుంచి బీసీలంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా ప్రయత్నిస్తే తాను హైకోర్టులో పిల్ వేసి అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీల కోసం త్వరలో పార్టీ బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించే దిశగా యోచిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామానికి వెళ్లినా బీసీల కోసం పార్టీ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారన్నారు. వారందరి మేలు కోసమే పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో 72 బీసీ కులాల సభలో కృష్ణయ్య మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్రణాళికతోనే బీసీలకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న బీసీ కులాలు ఇప్పటికీ పలు రంగాల్లో ప్రాతినిథ్యం లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. శుక్రవారం బీసీ భవన్లో వెనుకబడిన తరగతుల కుల సంఘాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీల ఎంపికలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.2లక్షలకు పెంచాలన్నారు. కుల సంఘాల భవనాల నిర్మాణానికి రూ.10 ఎకరాల భూమి, రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. బీసీ సంక్షేమ కమిషనర్‌గా బీసీ వ్యక్తిని, గురుకులాల కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన అన్నారు. బీసీలకు అమలు చేస్తున్న క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, ఐఐటీ, ఐఐఎంలలో చదివే విద్యార్థులకు ఫీజులివ్వాలని కోరారు. -
బీసీ బిల్లు కోసం కృషి చేయండి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం కృషి చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం అసెంబ్లీలో సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఓ బృందం సీఎం కేసీఆర్‌ను కలిసింది. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా, ఆ తర్వాత ప్రక్రియ చేపట్టలేదని, ప్రధాని మోదీతో చర్చించి పార్లమెంటులో బీసీబిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య కోరారు. 56% జనాభా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో 14% వాటా కూడా లేదని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరముంద న్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. బీసీ పారిశ్రామిక పాలసీని ప్రకటించి పూర్తి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని కోరారు. ఈ డిమాండ్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రధానిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. -
పంటంతా నష్టపోయానని ..
సూర్యాపేట రూరల్: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి దోమకాటుకు గురై దెబ్బ తినడంతో మనోధైర్యం కోల్పోయిన రైతు విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం యండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోన కృష్ణయ్య తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. కాగా దోమకాటుతో ఆరు ఎకరాల వరిచేను పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన కృష్ణయ్య.. తన పొలంలో ఉన్న 11/33 కేవీ విద్యుత్ టవర్ ఎక్కాడు. ఇదే సమయంలో గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన సూర్యాపేట ఎంపీపీ వట్టే జానయ్య యాదవ్ విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరారు. రైతును సముదాయించేందుకు విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఎంపీపీ.. సమస్యను మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతు కృష్ణయ్య టవర్‌పై నుంచి కిందికి దిగాడు. -
ఇంటికో ఉద్యోగం ఇచ్చే వరకు పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇలా ప్రకటించడం సీఎంకు కొత్తకాదు. నిరుద్యోగులను మోసం చేయడానికే ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. ఇంటికో ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడాలి’ అని నిరుద్యోగులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం వివిధ సాకులతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా జాప్యం చేసిందని, ఇప్పుడు కొత్త జోన్ల పేరుతో మరోసారి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. మంగళవారం బీసీ భవన్లో రాష్ట్ర నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 30 వేల ఉద్యోగాలు అదనం గా వచ్చాయని, అందులో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. సచివాలయంలో ఏ శాఖకు వెళ్లినా అరకొర సిబ్బంది ఉన్నారన్నారు. కొత్తగా 21 జిల్లాలు, 125 మండలాలు, 25 ఆర్డీవో ఆఫీసులు, పోలీసుస్టేషన్లను ప్రారంభించినా ఇందులో అరకొర సిబ్బందితో పని నెట్టుకొస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్సిటీల విద్యార్థులు, సంఘం నేతలు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘పాత పెన్షన్ అమలు బాధ్యత ప్రభుత్వానిదే’
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బీసీ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. సీపీఎస్ విధానం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని తీర్మానించారు. అప్పుడే డిమాండ్ల సాధన సాధ్యం అవుతుందని అభిప్రాయ పడ్డారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంలో సంఘాలన్నీ మరోసారి సమావేశమై ఐక్య కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సుధాకర్, సత్యనారాయణగౌడ్, రామలింగం, ఆంజనే యులు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయండి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్ విద్యార్థుల గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం వివిధ జిల్లా కేంద్రాల్లో వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరపు ఫీజు బకాయిలు రాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. వారి నుంచి బలవంతంగా ఫీజు లు వసూలు చేస్తున్నారని, కోర్సులు పూర్తయినా ఫీజులు కట్టేవరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రీయింబర్స్‌మెంటు స్కీము ప్రవేశపెట్టినప్పుడు పూర్తి ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, పరీక్షా ఫీజులతోసహా మంజూరు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రైవేటు కాలేజీ లలో చదివే ఇంటర్ విద్యార్థుల ఫీజులు 8 వేల నుంచి 12 వేలవరకు ఉంటేæ ప్రభు త్వం 2 వేలు మాత్రమే మంజూరు చేస్తుందని, బ్యాలెన్సు ఫీజులు కట్టే పరిస్థితి లేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్, గుజ్జ రమేష్, భూపేష్, నరేష్, అనంతయ్య, అభిలాష్, రామకృష్ణ, లక్ష్మి, రమ్య పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల వర్గీకరణతో సమన్యాయం
క్రీమీలేయర్‌ను తొలగించాలి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఓబీసీ జాబితాలో ఉన్న 2,600 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కులాల్లో కూడా హెచ్చుతగ్గుల వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పుడు వర్గీకరణ చేయడంతో అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని వివరించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించినందుకు, ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించినందుకు అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించాలని నిర్ణయించామని తెలిపారు. గురువారం సచివాలయం మీడియా పాయింట్లో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం 2011 జనాభా లెక్కలు తీసుకున్నా ఇంతవరకు కులాలవారీ లెక్కలు ప్రకటించలేదని, లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ పూర్తిగా జరుగుతుందన్నారు. గ్రూప్‌లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే దాని ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని, అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంచడం కాదని, పూర్తిగా తొలగించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయా లన్నారు. గుజ్జ కృష్ణ, గుజ్జ రమేశ్, నీల వెంకట్, కె.నరసింహగౌడ్, రాజేందర్, చీపురు మల్లేష్ యాదవ్, జి.కృష్ణయాదవ్ పాల్గొన్నారు. -
‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ చర్యతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చుతామని, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, లబ్ధికోసం రిజర్వేషన్లు నిర్ణయించవద్దని, అలాచేస్తే బీసీ కులాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాయన్నారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు ర్యాగ అరుణ్, సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీ కమిషన్ బిల్లు పాస్ చేయాలి
ఆర్. కృష్ణయ్య డిమాండ్.. నేడు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదం తెలుపుతూ జాతీయ బీసీ కమిషన్ బిల్లును పాస్ చేయాలని, దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు 36 రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం లేఖలు రాశారు. ఈ బిల్లు మార్చిలోనే పాసైందని, రాజ్యసభలో కొన్ని పార్టీలు ఈబిల్లును వీగిపోయేటట్లు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీల పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. -
హాస్టళ్లు మూసివేస్తే ఉద్యమిస్తాం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఉత్తర్వులు లేకుండా హాస్టళ్ల మూసి వేత ఆలోచనలను సహించేది లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మిస్తామని బీసీ సంక్షేమ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లను మూసివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంపై మండి పడ్డారు. పాఠశాలల్లోని 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి, విద్యా ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లను యథాతథంగా కొనసాగించాలని, దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, రాజేందర్, సాగర్, నీలం వెంకటేశ్, నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల మెస్ చార్జీలు పెంపు
ప్రభుత్వం ఉత్తర్వులు.. 16.99 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: ప్రిమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చార్జీల పెంపుపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయాన్ని 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,650 హాస్ట ళ్లు, 450 గురుకులాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3.32 లక్షల మంది విద్యార్థులున్నారు. మరో 13.67 లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉన్నారు. తాజా పెంపుతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లలో చదివే విద్యార్థులతో పాటు రోజు వారీగా కాలేజీకి వెళ్లే విద్యార్థులు అనే నాలుగు కేటగిరీలకు ప్రభు త్వం నిధులు విడుదల చేస్తోంది. వీరిలో డేస్కాలర్ విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో, మిగిలిన వారికి సంబంధించి వారి వసతిగృహ సంక్షేమాధికారులకు మెస్ చార్జీల రూపంలో ప్రభుత్వం నిధులిస్తోంది. తాజా పెంపుతో ఆయా విద్యార్థులకు మరింత మెరుగైన భోజనం అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. విద్యార్థుల ఉద్యమాలకు ఫలితమిది: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఉపకారవేతనాలు, మెస్ చార్జీల పెంపు కోసం విద్యార్థులు చేసిన ఉద్యమాలు ఫలించాయి. వారి ఉద్యమాలకు స్పందించిన ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేశా రు. చార్జీల పెంపుతో వసతిగృహాల్లో విద్యార్థు లకు మంచి భోజనం పెట్టే అవకాశం కల్పిం చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -
పాఠశాలల మూసివేత వద్దు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు లేరనే కారణం చూపుతూ 4,637 పాఠశాలలను మూసేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయటం పేదవర్గాల పిల్లలను చదువుకు దూరం చేయడమే అవుతుందని సీఎంకు రాసిన బహిరంగలేఖలో పేర్కొ న్నారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఇంగ్లిష్ మీడియంను ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టాలని కోరారు. సుజనా చౌదరితో భేటీ... బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, తదితర అంశాలపై కేంద్ర మంత్రి సుజనాచౌదరితో బీసీ సంక్షేమ సంఘం చర్చలు జరిపింది. బుధ వారం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ తదితరులు మంత్రితో సమావేశమయ్యారు. బీసీలకు శాఖ ఏర్పాటు విషయమై ప్రధానితో చర్చిస్తామని సుజనాచౌదరి తమ బృందానికి హామీనిచ్చి నట్టు వారు తెలిపారు. -
బీసీ సంక్షేమ సంఘంలో చీలిక
తెలంగాణ సంఘ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ - సంఘంలో కృష్ణయ్య కొడుకు అరుణ్ జోక్యం పెరిగింది - ఇకపైనా కృష్ణయ్య నేతృత్వంలోనే పనిచేస్తాం: జాజుల సాక్షి, హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నిట్టనిలువునా చీలింది. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్యా నెలకొన్న అసంతృప్తులు తారస్థాయికి చేరుకుని మంగళ వారం భగ్గుమన్నాయి. బీసీ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్యకు కుడి భుజంగా నిలిచిన ఆ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో.. కొత్త కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 31 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన, మహిళా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలకు చెందిన 400 మంది ప్రతినిధులు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆర్.కృష్ణయ్యే మా నాయకుడు: జాజుల ఆర్.కృష్ణయ్య తమ నాయకుడని, ఆయనతో విభేదించే పరిస్థితే లేదని, ఆయన నేతృత్వం లోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పని చేస్తుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశా రు. సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘంలో కృష్ణయ్య కొడుకు డాక్టర్ అరుణ్ జోక్యం బాగా పెరిగిందని, తమకు నచ్చిన వాళ్లకు ఏకపక్షంగా పదవులు కట్ట బెడుతూ ఉద్యమ సంస్థలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే ఎర్ర సత్య నారాయణను తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సంఘంలో గందరగోళం చెలరేగిందన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య నుంచి స్పష్టత లేకపోవ డంతో తాము విడిగా సమావేశమైనట్లు చెప్పారు. దశాబ్దాల ఉద్యమంలో చీలిక.. సామాజికంగా వెనుకబడిన కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా 1986లో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. బీసీల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాల్లో అగ్ర భాగాన నిలిచింది. బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్‌షిప్పుల కోసం.. అలాగే నిరుద్యోగుల కోసం పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘మన రాష్ట్రంలో మన రాజ్యం’ నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీకి శంకర్రావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎర్ర సత్యనారాయణ పేరు ప్రచారంలోకి రావడం, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకపక్షంగా మార్చేయడం తాజా చీలికకు దారితీసింది. అరుణ్ జోక్యం లేదు: ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘంలో చీలికపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. తమది ఉద్యమ సంస్థ అని, ఇందులో తన కొడు కు అరుణ్ జోక్యం ఏమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పదవుల విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని చెప్పారు. అరుణ డాక్టర్ అని, బీసీ సంక్షేమ సంఘంలో అతని పాత్ర పరిమితమన్నారు. ‘ఇది ఉద్యమ సంస్థ. పోరాడిన వాళ్లే ముందు నిలుస్తారు. శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా’అని కృష్ణయ్య చెప్పారు. -
ప్రేమ విఫలం: యువకుడి ఆత్మహత్య
నర్వ: మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.కృష్ణయ్య(23) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు అంటున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏప్రిల్‌లోగా నీళ్లివ్వకపోతే పోరాటమే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) కింద రెండు పంటలు పండా యని, రాష్ట్రం వచ్చాక ఒక్క పంటకే పరిమితం కావాల్సి వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. సాగర్‌లో నీళ్లు ఉన్నా ఇవ్వలేకపోతున్నారని, ఏప్రిల్ 15లోగా చెరువులు నింపి నీళ్లు ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని, తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. మిషన్ భగీరథ విషయంలో సీఎంను అభినందిస్తున్నామని, అయితే రూ.20 వేల కోట్ల విలువైన 26 ప్యాకేజీలను నలుగురు కాంట్రాక్టర్లకే దోచిపెడితే ఎలా? అని ప్రశ్నించారు. సర్పంచ్ వేతనం 20 వేలకు పెంచాలి: కృష్ణయ్య గ్రామీణ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావాలంటే 14వ ఆర్థిక సంఘం నిధులను ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాలు కూడా పెంచాలన్నారు. ఉపాధి కూలీల వేతనం పెంచాలి: సున్నం రాజయ్య ఉపాధి హామీ పని దినాలను పెంచడంతోపాటు కూలీ మొత్తాన్ని రూ.300కు పెంచాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామాల్లో త్రీఫేస్ కరెంటు ఇవ్వాలన్నారు. వికారాబాద్‌కు అన్యాయం: రామ్మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల రీడిజైన్‌లో వికారాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ద్వారా నీళ్లు తేవాలని ప్రయ త్నిస్తే రీడిజైన్‌లో చేవెళ్ల లేకుండా పోయిందన్నారు. పాలమూరు– రంగారెడ్డిలోనూ మార్పులు చేయడం వల్ల నష్టం వాటిల్లిందన్నారు. -
గొర్రెలకు తోడేలు కాపలా పెట్టినట్లు ఉంది
కేసీఆర్ పాలనపై బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజం రామన్నపేట: కేసీఆర్ పాలన అమాయక గొర్రెలకు తోడేలును కాపలా పెట్టినట్లుగా ఉందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా రామన్నపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ, ప్రజాసంఘాల నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. 1,200 మంది విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోగా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం లక్షా 27 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా ఇప్పటి వరకు కేవలం 22 వేలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు రూ.60 వేల కోట్లు కాగా రెండేళ్లలో కేసీఆర్ వాటిని రెండింతలు చేశారని ఆరోపించారు. -
మద్యానికి డబ్బివ్వలేదని..
భార్య గొంతుకోసి హత్య సంక్రాంతి రోజే దారుణం కేవీబీ పురం(పిచ్చాటూరు): మద్యానికి డబ్బు ఇవ్వలేదని గొంతుకోసి భార్యను హత్య చేసిన సంఘటన కేవీబీపురం మండలం సీకే పురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సీకేపురానికి చెందిన కృష్ణయ్య(49), అముద(37) 19 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రమ్య(17), శశి చంద్రిక(8) కుమార్తెలు ఉన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ఆదిత్య మిల్లులో అముద, పెద్ద కుమార్తె రమ్య కూలి పని చేస్తున్నారు. కృష్ణయ్య కూడా అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మానేశాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బు కోసం తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. శనివారం తెల్లవారుజామున అముద కేకలు వేసింది. పక్క గదిలో పడుకున్న పిల్లలు లేచి వెళ్లారు. కృష్ణయ్య పరుగులు తీస్తూ కనిపిం చాడు. లోపలికి వెళ్లి చూడగా తల్లి అముద రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్థానికులు వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందింది. పండుగ రోజే హత్య జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ సాయినాథ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి పెద్ద కుమార్తె రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దార్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఒకే రోజు ఆరు బిల్లులకు ఆమోదం
బీసీ కమిషన్ కోరలులేని పులి వంటిదే: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఒకేరోజు శాసనసభ ఆరు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. భూసేకరణ బిల్లు, బీసీ కమిషన్ చట్ట బిల్లు, ఏపీ ట్రిబ్యునల్‌లోని తెలంగాణ పెండింగ్ కేసులు హైదరాబాద్ ఉన్నత న్యాయ వ్యవస్థకు బదిలీ చేసే బిల్లు, టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ బిల్లు, ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని ఉపయోగం లేని శాసనాలను రద్దు చేసే బిల్లు, ఖమ్మం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు బిల్లుకు బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్‌పై సభలో తీవ్ర చర్చ జరిగింది. బీసీ కమిషన్ బిల్లు కోరలు లేని పులిలాంటిదేనని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కమిషన్ చైర్మన్ నియామకం కోసమే బిల్లు ప్రవేశపడు తున్నట్లు ఉందన్నారు. బీసీలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను కమిషన్ ఆపలేకపోతోందని, రిజర్వేషన్ల అమలులో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించలేక పోతోందని వివరించారు. కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కావాలని కోరారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ కమిషన్ 112 కులాల స్థితిగతులకు అనుగుణం గా పని చేయాలని, వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని, ప్రఖ్యాత రచయితగా , సామాజిక శాస్త్రవేత్తగా బీఎస్ రాములుకు మంచి పేరుందని, ఆయన పేరును చెడగొట్టే విధంగా బీసీ కమిషన్ ఉండొద్దని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, సీపీఎం సభ్యులు సున్నం రాజయ్య తదితరులు బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు ఇవ్వాలని సూచించారు. సభ్యుల సూచనలను పరిగిణలోకి తీసుకొ¯నే బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. -
ఏ నిమిషానికి.. ఏమి జరుగునో!
-
ఏ నిమిషానికి.. ఏమి జరుగునో!
నయీమ్‌తో సంబంధాలున్న గులాబీ నేతల్లో గుబులు ⇒ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ ⇒ రాజీనామాలు.. సస్పెన్షన్లు అంటూ ప్రచారం ⇒ నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభావం చూపే అవకాశం ⇒ ఇప్పటికే అవకాశం కోల్పోయిన ఓ ఎమ్మెల్సీ ⇒ సొంత పార్టీలో చర్యల తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలపై దృష్టి ⇒ నయీమ్‌తో బంధాన్ని బయటపెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య ⇒ ఒకట్రెండు రోజుల్లో సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్ టీఆర్ఎస్ రాజకీయం గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ చుట్టూ తిరుగుతోంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ సంచలనాత్మకంగా మారింది. వాస్తవానికి డైరీలోని వివరాలను ప్రభుత్వం ఇప్పటిదాకా బయటపెట్టలేదు. బ్రహ్మ పదార్థంలా మారిన ఈ డైరీ ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నేతల్లోనూ గుబులు రేపుతోంది. నయీమ్ నేర సామ్రాజ్య విస్తరణలో, డబ్బుల సంపాదన దందాలో అతడికి కీలక అనుచరులుగా ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు పోలీసుల విచారణలో సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని సమాచారం. ఇందులో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులతోపాటు ప్రస్తుతం టీఆర్ఎస్లో వివిధ పదవుల్లో ఉన్న వారి బాగోతాలూ బయట పడ్డాయంటున్నారు. ‘‘నయీమ్‌తో లింకులు ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా, చివరకు టీఆర్ఎస్ నేతలైనా ఉపేక్షించొద్దు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పోలీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న సమాచారంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఏదో ఒక రూపంలో నయీమ్‌తో సంబంధాలు నెరిపిన కొందరు టీఆర్ఎస్ నేతలు హడలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభావం అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రెండేళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పదవులు భర్తీ అయినా.. అవి ఎమ్మెల్యేలకే ఎక్కువగా దక్కాయి. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత పార్టీ పదవులు, అధికార పదవుల భర్తీ ఉంటుంద నుకుంటున్న సమయంలో.. నయీమ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అతడితో నెరపిన సంబంధాల కారణగా తమకు అవకాశం దక్కదన్న శంక వీరిని పట్టి పీడిస్తోంది. నయీమ్‌తో ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ ఒకరికి ఇలాగే అవకాశం చేజారిందన్న ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో చీఫ్ విప్, ఇద్దరు విప్ల పదవుల నియామకాన్ని ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసింది. వాస్తవానికి ఒక ఎమ్మెల్సీ మండలి విప్ పదవి కోసం అధినేత వద్ద ఎంతగానో ప్రయత్నించారు. ఒక దశలో ఆయనకు చీఫ్ విప్ పదవి కూడా లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ప్రచారం జరగడం, పోలీసులకు కొన్ని ఆధారాలూ లభించడంతో అవకాశం దక్కలేదని చెబుతున్నారు. దీంతో మరో ఎమ్మెల్సీకి అనూహ్యంగా మండలి విప్ పదవి లభించింది. ఇలాగే వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు నామినేటెడ్ పదవికి పోటీలో ఉన్నారు. ఆయనకు దాదాపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో సదరు ఎమ్మెల్యే సోదరుడికీ నయీమ్‌తో లింకులు ఉన్నాయని తెలియడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. మంత్రి పదవి ఆశిస్తున్న ఓ మహిళా ఎమ్మెల్యే భర్తకూ నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుకుంటుండడంతో ఆమెకు దార్లు మూసుకుపోయిన ట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి అధికార పదవులను అటుంచితే, కనీసం పార్టీలోనూ గుర్తింపు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. రాజీనామాలు.. సస్పెన్షన్లు? నయీమ్‌తో ఏళ్లుగా అంటకాగిన వారిపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి లింకులకు పోలీసులు ఆధారాలు సైతం చూపడంతో వారిపై చర్యలు తప్పవన్న సంకేతాలను సీఎం ఇచ్చినట్లు సమాచారం. పదవుల్లో ఉన్న నేత లను వారి పదవులకు రాజీనామాలు చేయిస్తారని అంటున్నారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలన్న చర్చ జరిగిందని తెలిసింది. ఈ నెలాఖరు నాటికి చర్యలు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీ అనురాగ్ శర్మ ఇప్పటికే సీఎంకు ఇచ్చిన మధ్యంతర నివేదికలో టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయన్న నేపథ్యంలో.. మున్ముందు చోటు చేసుకోబోయే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. కృష్ణయ్యపై చర్య తప్పదా? నయీమ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు చిక్కులు తప్పేలా లేవు. నయీమ్‌తో తనకు సుదీర్ఘకాలంగా సంబంధం ఉందని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫోన్లో మాట్లాడినట్లు స్వయంగా ఆయన మీడియాకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తనను సీఎంగా చూడాలని నయీమ్ భావించాడంటూ పేర్కొన్నాడు. ఎన్కౌంటర్ జరగడానికి రెండు నెలల ముందు సైతం చర్చలు జరిపినట్లు వెల్లడించారు. నయీమ్ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులకు కొందరు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆధారాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో వారికి సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) లేదా సీఆర్పీసీ సెక్షన్ 41 (నిందితుడు)గా పరిగణించి నోటీసులు జారీ చేయాలని సిట్ భావిస్తోంది. ఇంతలోనే ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఒక నేరస్తుడితో మాట్లాడటం, అతడి వివరాలు తెలిసుండి పోలీసులకు చెప్పకపోవడం కూడా నేరం కిందకు వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కృష్ణయ్యే స్వయంగా నయీమ్‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టినందున ఆయన్ను పిలిచి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. నయీమ్ భూ దందా కోణంలో కృష్ణయ్యను విచారించే అవకాశం ఉంది. -
సీఎం ఒక్కరోజు హాస్టల్లో గడపాలి
దోమలగూడ : పెరిగిన ధరలకనుగుణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద హాస్టళ్ల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల మెస్ చార్జీలను పెంచక పోవడం శోచనీయమన్నారు. నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతోందన్నారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఒక రోజు హాస్టల్లో గడిపితే వారి బాధలు తెలుస్తాయని, ఆతర్వాత వారి సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, 530 కళాశాల విధ్యార్థుల హాస్టళ్లు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు, కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. సచివాలయంలో 9 భవనాలలో ఏడు కొత్తవే అయినా.. వాటిని కూలగొట్టి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వం భావి స్తోందని, వాటికి బదులుగా హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజకృష్ణ, ర్యాగరమేష్, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేష్, విక్రంగౌడ్, కృష్ణయాదవ్, రాంబాబు, విష్ణు, నవనీత్, అంజియాదవ్, గజేంద ర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం కాదు.. అగ్రకులాల స్వామ్యం
నిజామాబాద్ నాగారం, వినాయక్‌నగర్ : దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఓట్ల కోసం వాడుకొని ప్రజాస్వామ్యాన్ని అగ్రకులాల స్వామ్యంగా మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సాంస్కృతిక విప్లవం రావాలని, బీసీలు రాజ్యాధికార స్థాపన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో శుక్రవారం బీసీ కుల సంఘాల జిల్లా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అర, ఒక్క శాతం ఉన్న అగ్రకులాల వారు బీసీలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా సుమారు 70 దశాబ్దాలు పాలించారని అన్నారు. బీసీల ఓట్లతో అధికారం చేపట్టి బీసీల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. క్షేత్రస్థాయి నుంచి బీసీలంతా ఏకమై ఉద్యమాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇ. శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌లు పాల్గొన్నారు. బడ్జెట్లో రూ. 150 కోట్లు కేటాయిస్తే బీసీలకు సరిపోతాయా.. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చిన ప్రకారం రూ.18 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, 500 గురుకుల పాఠశాలలు నిర్మించాలన్నారు. -
ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం
సందర్భం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గురువారం నాటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి ఏ విధంగా అణచివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఉద్యమాల కేసీఆర్ అణచివేత కేసీఆర్‌గా ఎంత త్వరగా మారిపోయారో చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటి గడ్డ. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టినిల్లు. సంక్షేమ హాస్టళ్ల ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం, క్యాపిటేషన్ ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీల డొనేషన్ల వ్యతిరేకత ఉద్యమం, బీసీ విద్యార్థుల ఉద్యమం, స్కాలర్ షిప్‌ల పెంపు ఉద్యమం – ఇలా ఏ ఉద్యమం జరిగినా ఉస్మా నియా యూనివర్సిటీ కేంద్రం. అనేకమంది నాయకులను తయారు చేసింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. కానీ నిన్నటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అణ చివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. బయటనుంచి చీమ కూడా వర్సిటీలోకి దూరకుండా జల్లెడపట్టారు. నాయకు లను కూడా అడ్డుకున్నారు. పోలీసు నిర్భంధంలో, ఉక్కు పిడికిలిలో యూని వర్సిటీని బంధించారు. అసలు విద్యార్థులు జన జాతర ఎందుకు పెట్టారు? 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయ మని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే దీని లక్ష్యం. కానీ కేసీఆర్‌కి ఇది నచ్చడం లేదు. ఏ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించామో! ఏ ఉద్యమం ద్వారా తాను సీఎం అయ్యారో అది మరిచిపోయారు. ప్రజా స్వామ్య విలువలను వదిలేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గాడి తప్పు తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆశ్రితపక్ష పాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం హద్దులు దాటింది. ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదు. అసెంబ్లీ ఆమో దించిన విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టాలి. కానీ తనకు తోచినట్లుగా ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ విధంగా స్కీములు ప్రకటించి బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడింది. కానీ అడ్డగోలుగా.. అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణగా మార్చారు. మొదటి ఏడాది 10 వేలకోట్లు, రెండవ సంవత్సరం 15 వేలు, ఈ సంవత్సరం 25 వేలకు అప్పులు తెస్తున్నారు. ప్రాధాన్యత లేని వాటర్ గ్రిడ్ కోసం ఆక్సిస్ బ్యాంకు, హడ్కో, నాబార్డ్ ఇతర బ్యాంకుల నుంచి 40 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ‘‘తాగునీరు కాదు సాగునీరు’’ కావాలని రైతులు అడుగు తుంటే ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధంగా అవినీతి వాటర్ గ్రిడ్ పథకానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ‘‘నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకొని తాగుతాం కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి’’ అని తల్లిదండ్రులు అడుగుతుంటే దానిని పట్టించుకోకుండా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే మరలా వచ్చే ఎన్నికలలో ‘‘ఓట్లు అడగమని’’ గోబె ల్స్‌ను తలదన్నేలా ఎదురు ప్రచారం చేస్తున్నారు. ఇంకొకవైపు ప్రభుత్వ ఆస్తులు – భూములు వేలం వేస్తూ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు. డబుల్ బెడ్రూంలతో ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేస్తూ ప్రభుత్వ భూములను వేల కోట్లకు అమ్మడంలో ఏమైనా ఔచిత్యం ఉందా! ముందుచూపు లేకుండా ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుంది? ప్రభుత్వ భవనాలు, పాఠశా లలు, హాస్పిటల్స్, హాస్టళ్లు ఎలా నిర్మిస్తారు? కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి? పోలీసుల్ని ఉసిగొల్పి ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నిరుద్యోగుల ఉద్యమ సంద ర్భంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ఏసీపీ, సీఐ స్థాయి పోలీస్ అధికారులు కోచింగ్ సెంటర్లకు, లైబ్రరీలకు, హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలో పాల్గొనరాదని, పాల్గొంటే కేసులు అవు తాయి, ఉద్యోగాలు రావని బెదిరించారంటే ఎంతగా దిగజారారో అర్థమ వుతుంది. ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చిందో మరిచిపోయారు. పోలీసులు ఇప్పుడు ఉద్యమాలకు, బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. నక్సల్స్‌పై ఎదురుకాల్పులు ఉండవన్నారు. కానీ ఎదురు కాల్పులు కాదు కదా, పట్టుకు పోయి దొంగ కాల్పులతో చంపుతున్నారు. పత్రికలను, టీవీ చానల్స్‌ను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఉద్యమ వార్తలు రాకుండా చేస్తున్నారు. ముఖ్య మంత్రి కార్యాలయంలో నలుగురు అధికారులతో ఒక ‘‘మానిటరింగ్ కమిటీ’’ ఏర్పాటు చేసి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ఉద్యమ వార్తలు రాకుండా పత్రికలపై, టీవీ చానల్స్‌పై ఒత్తిడి చేస్తున్నారు. వినక పోతే అడ్వర్టైజ్మెంట్స్ జారీ చేయకుండా ఆపుతామని బెదిరిస్తున్నారు. పత్రికలను, టీవీ చానల్స్‌ను బెదిరించి వాటిని లొంగ దీసుకుంటున్నారు. ప్రజాసమస్యలు, ఉద్యమ వార్తలు రాయొద్దని బెదిరి స్తున్నారు. ఈ వార్తలపై ప్రచ్ఛన్న నిషేధం విధించారు. తెలంగాణ ఉద్య మంలో సాంస్కృతిక విప్లవం సృష్టించిన కళాకారులను నోరు మూయించ డానికి 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నోటికి సంకెళ్లు వేశారు. ప్రజల గొంతుకై నిలిచే కళాకారులు ప్రభుత్వ నిర్బంధంలో చిక్కుకుపోయారు. కళాకారులు బయట ఉంటే ప్రజలను చైతన్యం చేస్తారనే కుట్రతో వారిని కాంట్రాక్టు ఉద్యోగాలలో బంధించారు. అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా ప్రవర్తిస్తూ పాలిస్తున్నారు. ప్రజలను, ప్రజా సంఘాలను, నాయకులను చివరకు శాసనసభ్యులను కూడా కలవడం లేదు. ఇంటర్వూ్యలు లేవు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిరంకుశంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజూ ఒక గంట ప్రజ లకు ధర్మదర్శనం ఇచ్చేవారు. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో ఇంటర్వూ్యలు లేవు. సెక్రటేరియట్‌కు రారు. రాష్ట్ర సీఎం ప్రజ లను కలవకుండా వ్యవసాయ క్షేత్రంలో ఉండటం దేనికి చిహ్నం? తెలంగాణ కోసం ప్రజలు పోరాడింది ముఖ్యంగా నిధులు, నియా మకాలు, నీళ్ల కోసమే.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఎంత సేపూ వేల కోట్ల కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, ఇరిగేషన్ కాంట్రాక్టుల మీద ధ్యాసే తప్ప మరేమీ లేదు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరు ద్యోగులు గత ఒక సంవత్సర కాలంగా ఉద్యమాలు చేయగా, రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 15 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇప్పటికే మూడవ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఒక్క పాఠశాల కూడా ప్రారంభం కాలేదు. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే టీచర్లను నియమించలేదు. ఇక కేజీ నుండి పీజీ గగన కుసుమమేనా! ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. ఏ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తాను తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యారో ఆ ప్రక్రియను గౌరవించి, కొనసా గించాలి. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని కాపాడాలి. కేసీఆర్ ఆ దిశగా మారతారని, సుపరిపాలన అందిస్తారని ఆశిద్దాం. వ్యాసకర్,త జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు :ఆర్. కృష్ణయ్య మొబైల్ : 90000 09164 -
'చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి'
జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరుతూ ఈనెల 13న బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. రూ.50 వేల కోట్లతో కేంద్రం, రూ.10 వేల కోట్లతో రాష్ట్రం బీసీలకు ఉప ప్రణాళికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. -
స్వర్ణకారుల దుకాణాల బంద్
బంగారం వృత్తి వ్యాపారంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా జోగిపేటలో స్వర్ణకారుల దుకాణాలు మూసివేశారు. బంగారంపై సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కిష్టయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాలను మూసివేత కొనసాగించనున్నట్లు తెలిపారు. -
మిగిలింది ముగ్గురే..!
జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం ఆపరేషన్ ఆకర్ష్‌కు విలవిల పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య దూరం జిల్లా రాజకీయాలకు దేవేందర్ రాంరాం ఎంపీ మల్లారెడ్డే పెద్దదిక్కు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ఒకప్పుడు బలంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు నాయకులే కరువయ్యారు. ఒకరివెంట ఒకరు గులాబీ గూటికి చేరువయ్యారు. కొందరు పార్టీలో ఉన్నా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు పార్టీ గురించి పట్టించుకుంటున్నా కార్యకర్తలు కూడా వారిని వదిలి వెళ్తుండడంతో ఏం చేయాలో తోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీకి నేడు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిస్తే అందులో సగం సీట్లు రంగారెడ్డి జిల్లాలోవే. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో రాజకీయ సమీకరణలే మారిపోయాయి. అధికారపార్టీ సాగించిన అపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మేహ శ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫిరాయింపుతో మొదలైన వలసల పర్వం...శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీతో పూర్తయింది. మొత్తం ఏడుగురిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరిపోయారు. తీగల ఫిరాయింపు సమయంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన శాసనసభ్యులే.. ఆఖరుకు తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని లేఖను సమర్పించడం కొసమెరుపు. టీటీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థనకు సానకూలంగా స్పందించి స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. కాగా, మెజార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో ఇక ఆ పార్టీకి జిల్లాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యే పెద్ద దిక్కుగా మారారు. అయితే, ఆయన కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బీసీల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీలో నంబర్ 2గా వెలిగిన రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకోవడం లేదు. కేవలం హస్తిన రాజకీయాలు, పార్లమెంటులో జరిగే చర్చల్లోనే కనిపిస్తున్న గౌడ్సాబ్ జిల్లా రాజకీయాల్లో జోక్యం కూడా చేసుకోవడంలేదు. మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి గత ఎన్నికల వేళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ వ్యతిరేక పవనాల్లోను విజయం సాధించి పార్లమెంటులో అడుగిడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, పార్టీ శ్రేణులు, దిగువశ్రేణి నాయకత్వమంతా పక్కపార్టీలకు పలాయనం చిత్తగించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. దీంతో దాదాపుగా ఐసీయూలో చేరిన టీడీపీని బతికించడం దేవుడి కూడా కష్టమేనని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. -
వికలాంగులను విస్మరించడం తగదు
హైదరాబాద్: వికలాంగ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం తగదని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న వికలాంగ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా వికలాంగులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వికలాంగుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రేపటి కల్లా ఈ సమస్యపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పదివేల మంది వికలాంగ విద్యార్థులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌లు కృష్ణయ్యతో కలసి వికలాంగుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అందె రాంబాబు, చెరుకు నాగభూషణం, నారా నాగేశ్వరరావు, పద్మప్రియ, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'ఖాళీలు లక్షల్లో.. నియామకాలు వందల్లోనా'
అంబర్‌పేట: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో చర్యలకు పొంతనే లేదని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే వందల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. గురువారం అంబర్ పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఖాళీ పోస్టుల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3500 పెంచాలని కోరారు. 1200 గ్రూప్-1, 8000 గ్రూప్-3, 36000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్, రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 9000 జూనియర్ లెక్చర్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. టీచర్ పోస్టులను 15600 నుంచి 39 వేలకు పెంచాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. పోలీసు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని ఆయన కోరారు. ఉద్యోగ నియామకాలను వెంటనేచేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'కాపులకు మరిన్ని నిధులు కేటాయిస్తే చాలు'
కోటగుమ్మం(రాజమండ్రి): కాపుల్లోని పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లకు తోడుగా మరిన్ని నిధులు కేటాయిస్తే సరిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. 1993లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కాపులను బీసీల్లో చేర్చగా హైకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న ఛలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 14 నుంచి 16 వరకూ వేలాది మందితో పార్లమెంట్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, ఇతర రాజకీయ రంగాల వివరాలు సేకరిస్తే బీసీల ప్రాతినిధ్యం 12 శాతం దాటలేదన్నారు. 68 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు 12 శాతం ప్రాతినిధ్యం దాటకపోవడమే రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకతను తెలియచేస్తోందన్నారు. -
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
► బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ ►ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు ►భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు ►ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య (ఎల్బీనగర్ నియోజకవర్గం) నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు... ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఏపీలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గ్రూప్1, 2,3, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బాబు వస్తే ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో తొలగించిన 125 మంది కాంట్రక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బకాయిలు చెల్లించే వరకూ వదలం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వ తీరుపై ఆర్.కృష్ణయ్య ధ్వజం హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, విద్యార్థులు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ఫీజు బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. గత ఏడాది రూ.1800 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివారన్నారు. ఉస్మానియా వర్సిటీ హాస్టళ్ల ఏడు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదని అన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లను, మెస్ ఛార్జీలను, పాకెట్ మనీ పెంచాలని, కళాశాల హాస్టళ్లకు స్వంత భవనాలు కట్టించి వసతులు కల్పించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.