కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment