Public school
-
డిసెంబరు 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ ఫెస్టివల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇండియా, యూరప్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు చెందిన బ్యాండ్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్ తెగకు చెందిన అలస్కాన్ నేటివ్, ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్స్ట్రోమ్తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి; పోర్చ్‌గీస్ ఆర్టిస్ట్ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. -
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సరికొత్త ప్ర‘యోగం’!
విశాఖ విద్య: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ ప్రయోగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు (డీఎస్వో), ఎస్సీఈఆర్టీ, యునిసెఫ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, సమగ్ర శిక్ష విభాగాలకు చెందిన నోడల్ అధికారులతో కూడిన బృందాన్ని మహారాష్ట్రలోని పుణే సమీపాన పాబల్ అనే గ్రామంలో ఉన్న విజ్ఞాన ఆశ్రమానికి పంపించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న విజ్ఞాన ఆశ్రమంలోని సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన ఫ్యాబ్ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక వర్క్‌షాప్‌లో ఈ బృందం పాల్గొన్నది. నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో నిపుణుల అనుభవాలు, సూచనలు తెలుసుకోవడంతోపాటు ఫ్యాబ్ ల్యాబ్‌లో స్థానికంగా లభించే ముడిసరుకుతో విద్యార్థులు వినూత్న పరికరాలను ఎలా తయారు చేయాలి... అవి స్థానిక ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి... అనే అంశాలపై జిల్లా సైన్స్ అధికారులు అధ్యయనం చేయనున్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారుల నేతృత్వంలో అన్ని జిల్లాల్లోనూ డివిజన్, మండలాల వారీగా పాఠశాలల్లో సదస్సులు ఏర్పాటుచేసి ఫ్యాబ్ ల్యాబ్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ నమూనాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు ఇతర రాష్ట్రాలకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని ఉమ్మడి విశాఖ, కృష్ణా జిల్లాల సైన్సు అధికారులు కప్పాల ప్రసాద్, మైనం హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ల్యాబ్‌లలో ఉత్తమ ఫలితాలు రాష్ట్రంలోని 713 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యాన ఇప్పటికే అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణితం వంటి అంశాల్లో విద్యార్థులను వినూత్న ఆలోచనలవైపు మళ్లించేలా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ ల్యాబ్‌ల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి ‘నాడు–నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా ఇంగ్లిష్ మీడియం చదువుతోపాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులు రాణించేలా పాఠశాలల్లోని ల్యాబ్‌లు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను విజిట్ చేసిన హీరో నాగార్జున
-
మూసీనది ఆక్రమణలతోనే వరదలు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఆక్రమణలకు గురికావడం వల్లే హైదరాబాద్‌లో వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి చాలా ముఖ్యమైనదని, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని అన్నారు. నదుల ఆక్రమణలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని కొనియాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కృషితోనే మంచి భవిష్యత్ సాధ్యమని విద్యార్థులకు సూచించారు. వ్యాయామం అవసరం శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని వెంకయ్యనాయుడు సూచించారు. యోగా అనేది మోదీది కాదని, వ్యాయామానికి కులమతాల భేదాలు లేవని అన్నారు. సంగీతం, సాహిత్యం రోజువారీ జీవితంలో భాగం కావాలని, ప్రకృతిని, సంస్కృతిని ఆరాధిస్తూ జీవితాన్ని సాఫీగా గడపాలన్నారు. చదువు కోసం చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, అనంతరం దేశం కోసం పనిచేయడానికి తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహారెడ్డి, హెచ్పీసీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు. -
‘సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అభినందనీయం’
కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
9 మందిని బదిలీ చేస్తే చదువెట్లా?
జన్నారం (ఖానాపూర్): అసలే ఉపాధ్యాయుల కొరత ఉన్న తరుణంలో ఒకేసారి తొమ్మిదిమందిని బదిలీచేస్తే తామెలా చదువుకునేదంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. పాఠశాల నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వచ్చి మందపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరికి గ్రామ మాజీ సర్పంచ్ సీదర్ల రమేశ్, ఎన్ఎస్యూఐ మండల నాయకులు సోహెల్, అజ్మత్‌ఖాన్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గాజుల మల్లేశ్ తదితరులు మద్దతుగా కూర్చున్నారు. విద్యార్థులు మహేందర్, నిక్షిత మాట్లాడుతూ పాఠశాలలో 650 మంది విద్యార్థులకు 28 ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా.. 17 మంది మాత్రమే ఉన్నారని, వీరిలో ఇప్పుడు తొమ్మిదిమందిని బదిలీ చేశారని తెలిపారు. బదిలీ అయి న వారి స్థానంలో ఆరుగురే రానున్నారన్నారు. మరో మూడు నెలల్లో పరీక్షలున్నాయని, ఉపాధ్యాయుల్లేకుండా ఎలా చదువుకోవాల ని ప్రశ్నించారు. విషయాన్ని ఇదివరకే కలెక్ట ర్, జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. డీఈవో వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఎస్సై మధుసుదన్‌రావు, మండల విద్యాధికారి విజయ్‌కుమార్ ఎంత చెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే పాఠశాల దుస్థితిని అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేసిన విద్యార్థులకు ఎంఈవో నచ్చజెప్పడంతో చివరికి సాయంత్రం 5.20కి ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందో ళనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. -
పాఠాలు.. ప్రాక్టికల్‌గా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకు మరింత పదును పెట్టేందుకు విద్యా శాఖ నడుం బిగిస్తోంది. అర్థమయ్యే బోధనా విధానాలే కాకుండా, ఏమాత్రం కష్టం లేని పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు ఈ విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సరికొత్త విద్యా విధానంపై కసరత్తు మొదలు పెట్టింది. కరోనా కారణంగా పాఠశాలల్లో బోధన, పరీక్ష విధానాలను మార్చుకోవడం అనివార్యమైంది. గడిచిన రెండేళ్లుగా సిలబస్‌ను కుదించడం, ఐచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించడం తప్పని సరైంది. నిజానికి ఈ తరహా బోధన పద్ధతులను సీబీఎస్సీ ఇప్పటికే అమలు చేస్తోంది. తరగతి పాఠాల కన్నా, సృజనాత్మకత పెంచే ప్రాజెక్టులను చేపట్టింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు గుర్తించారు. ముందున్న సవాళ్లు ఎన్నో.. రాష్ట్రంలో ఆధునిక బోధన విధానం ప్రస్తుతం అమల్లో ఉన్నా, ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి పాఠశాల విద్యలో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనే విద్యార్థి సృజనాత్మకతను అంచనా వేస్తారు. ప్రాజెక్టు వర్క్, రాత పని విధానం, ఏ కోణంలో ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. ప్రతి పాఠ్యాంశం ముగిసిన తర్వాత ప్రాజెక్టు వర్క్ ఇస్తారు. దీన్నే కీలకం చేయాలని కేంద్ర విద్యా విధానం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అరకొర మౌలిక వసతులు దీనికి అడ్డంకిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు 6వ తరగతిలో సంఖ్యా విధానం బోధిస్తారు. దీన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకునేందుకు విద్యార్థులు గ్రామ పంచాయతీకి వెళ్లి, అక్కడ మ్యాప్ ద్వారా ఏ గ్రామానికి ఎంత దూరం ఉందనేది లెక్కించాలి. ఈ పని కోసం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వాహనం కావాలి. ఒక రోజంతా ఉపాధ్యాయుడు వెచ్చించాలి. పాఠశాల విద్యలో సైన్స్ సబ్జెక్టులో భూసార పరీక్ష గురించి ఉపాధ్యాయుడు బోధిస్తాడు. భూసార పరీక్ష లేబొరేటరీకి వెళ్లి పరీక్ష విధానాన్ని స్వయంగా విద్యార్థులు పరిశీలించాలని, దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. పరిష్కారం ఏమిటి? సృజనాత్మక విద్యా విధానం అమలుకు సాంకేతికతను జోడించడమే సరైన మార్గమని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గ్రామాల మధ్య దూరం తెలుసుకోవడానికి పంచాయతీ దాకా వెళ్లే బదులు స్కూల్లోనే ఇంటర్నెట్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌తో పరిశీలించే విధానం ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఇది సాధ్యపడాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోణంలోనూ ఆలోచన చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా క్షేత్రం స్థాయిలో నేర్చుకునే సృజనాత్మకతనే పరీక్షగా భావించి, దానికే ఎక్కువ మార్కులు ఉండేలా చూడాలని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలో ఎక్కువ నేర్చుకుని, పాఠ్యాంశాలు తక్కువగా ఉన్నప్పుడు పరీక్షల్లో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం మంచిదని పేర్కొంటున్నారు. స్కూళ్లకు నిధులివ్వాలి నేటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమే. ఇప్పటికే మన పాఠ్య ప్రణాళిక ప్రొగ్రెసివ్‌గానే ఉంది. కార్యాచరణలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు స్కూళ్లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక విద్యా బోధన, ఆన్లైన్ విధానాలను తీసుకురావాలి. రాజా భానుచందర్ ప్రకాశ్, రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
నన్ను కొట్టాడు సార్... !.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు
జూలూరుపాడు: ‘ఆడుకుంటుం టే నన్ను అనవసరంగా కొట్టా డు సార్’అంటూ ఓపదేళ్ల బాలు డు ధైర్యంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని న్యూకాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన 14ఏళ్ల కుర్రాడు అతని తలపై కొట్టాడు. దీంతో రవిబాబు ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. అనంతరం హోంగార్డును పంపించి బాలుడిని కొట్టిన కుర్రాడికి సర్దిచెప్పారు. (చదవండి: చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా? ) -
స్వల్పంగా పెరిగిన విద్యార్థుల హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమైన రెండోరోజు గురువారం విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ పాఠాలకే మొగ్గు చూపాయి. ఆన్లైన్ పాఠాలకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులు దీన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువగా హాజరవుతుండటం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం ప్రభుత్వ స్కూళ్ళలో 38.82 శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 21.74 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 15.04 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి సగటు హాజరు శాతం 25.2గా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. బుధవారం సగటున 21.77 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 52,22,174 మంది కాగా గురువారం 14,76,874 మంది హాజరయ్యారు. హాజరు క్రమంగా పెరిగే అవకాశం! పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీజనల్ జ్వరాలు, ఇతరత్రా అస్వస్థతతో ఉన్న వాళ్ళను మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేశారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. టీచర్‌కి కరోనా.. పాఠశాల మూసివేత ►వారం రోజులు సెలవులు ప్రకటించిన ఎంఈవో పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపు రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణైంది. బుధవారం విధులకు హాజరై న ఆమెకు గురువారం నలతగా ఉం డటంతో పరీక్ష చేయించుకున్నారు. అం దులో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజులు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలిపారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. -
నోటీసులపై స్పందించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో అధికారులు గురువారం స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అవకతవకలు జరిగాయని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జూబ్లీహిల్స్ పబ్లిక్, గీతాంజలి స్కూళ్లకు నోటిసులు పంపించారు. పూర్తి రికార్డులు సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్కూళ్ల యాజమాన్యాలు డీఈవోకు రికార్డులు సమర్పించారు. స్కూళ్ల యజమాన్యాలు ఇప్పటికే జీవో నెంబర్ 46ను ఉల్లంఘించాయని అధికారులు తెలుసుకున్నారు. వీటితో పాటు మెరిడియన్, నీరబ్ పబ్లిక్ స్కూళ్లల్లో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. చదవండి: ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ దొరికిపోయింది! -
‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ దొరికిపోయింది!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్ ముందు యాజమాన్యం నిఘా పెట్టింది. స్కూల్ గురించి మీడియా, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు యాజమాన్యం కెమెరాలలో రికార్డ్ చేసుకుంటోంది. స్కూల్ ఆవరణంలో ముగ్గురు మనుషులతో నిఘా పెట్టగా, వారిలో ఇద్దరు కెమెరాలతో రికార్డు చేస్తుంటే మరొకరు వాకీటాకీలతో అక్కడ జరుగుతున్న సమాచారాన్ని స్కూల్ యాజమాన్యానికి చేరవేస్తున్నారు. మీడియా స్కూల్ పేరెంట్స్‌తో మాట్లాడిస్తున్న సందర్భంలో వారి కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విద్యాశాఖ అధికారుల విచారణ) -
క్లాస్మేట్స్.. స్నేహ హస్తాలు
లక్ష్మిస్ నాయక్ పదహారేళ్ల కుర్రాడు. బెంగళూరు, రాజాజీ నగర్‌లోని ఈస్ట్–వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లోపదవ తరగతి చదువుతున్నాడు.ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లక్ష్మిస్ నాయక్ మాత్రంఆ స్కూల్‌కి ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే... పదేళ్లుగా ఒక అందమైన దృశ్యానికి ఆ స్కూల్ ప్రత్యక్షసాక్షిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతోపాటే మనసును తాకే ఆ దృశ్యం కూడా కనుమరుగు కాబోతోంది. ఒక స్నేహబృందం చెల్లాచెదురు అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత పిల్లలు ఎవరికి ఇష్టమైన కోర్సుల్లో వాళ్లు చేరతారు. లక్ష్మిస్ నాయక్ స్నేహబృందంలోని కుర్రాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్‌లో చేరిపోతారు’’ అంటూ.. ఆ స్కూలుకే ప్రత్యేకమైన లక్ష్మిస్ నాయక్ గురించి స్కూల్ టీచర్ గ్రేస్ సీతారామన్ తెలిపారు. అంతా టెన్త్‌కి వచ్చేశారు లక్ష్మిస్ నాయక్‌ను ఇప్పటివరకు స్నేహితుల హస్తాలే నడిపించాయి. నాయక్ ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. తనకై తాను నడవలేడు. మొదట్లో వాళ్ల అమ్మానాన్న రోజూ స్కూల్లో దించేవాళ్లు. ఆ తర్వాత నాయక్ స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. అందరూ చిన్న పిల్లలే. కానీ అందరిదీ పెద్ద మనసు. ఏడెనిమిది మంది పిల్లలు రోజూ నాయక్‌ను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళ్తారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి స్కూలు ఆవరణంతా తిప్పుతారు. చేతులతో ఎత్తి పై అంతస్థులోని క్లాస్ రూమ్‌కు తీసుకెళ్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు వాళ్లంతా పదవ తరగతికి వచ్చారు. పరీక్షలైపోగానే విడిపోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పై అంతస్తులోని తరగతి గది నుంచి లక్ష్మిస్ నాయక్‌ను కిందికి తీసుకొస్తున్న స్నేహితుడు వాడిని వదిలేసి వెళ్లలేం ఓ రోజు ఓ టీచర్ ఆ పిల్లల్ని ‘‘రోజూ ఇలా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం కష్టంగా అనిపించడం లేదా’’ అని అడిగారు. అప్పుడు ఆ కుర్రాళ్లు చెప్పిన మాట ‘‘అందరం షేర్ చేసుకుంటాం. కాబట్టి బరువు అని కానీ, కష్టం అని కానీ అనిపించదు. వాడిని తీసుకెళ్లకుండా మేము ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా వాడే గుర్తుకు వస్తుంటాడు’’ అన్నాడు ఆ స్నేహబృందంలోని సిద్ధార్థ. మరో స్టూడెంట్ మయూర్ అయితే... ‘‘మేము వాడిని మోసుకు పోవడమే కనిపిస్తుంది. వాడు మాకు ఎన్ని సబ్జెక్టుల్లో సహాయం చేస్తాడో తెలుసా? క్లాస్‌లో మాకు అర్థం కాని సందేహాలను వాడు చక్కగా క్లియర్ చేస్తాడు. నాయక్ కామర్స్ చదవాలనుకుంటున్నాడు. నేను ఏదైనా డిప్లమో కోర్సులకు వెళ్లాలనుకుంటున్నాను. వేరే వేరే కాలేజీలకు వెళ్లక తప్పదు’’ అని ఆవేదన చెందాడు. ‘నాకూ దిగులేస్తోంది’ ‘‘నాయక్ ఫిజికల్లీ చాలెంజ్డ్ అని బయటి వాళ్లు అనుకోవాల్సిందే తప్ప మాకు అలా అనిపించదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మా అందరితోపాటు నాయక్ కూడా ఉంటాడు’’ అన్నారు కుర్రాళ్లందరూ ముక్తకంఠంతో. నాయక్ మాత్రం ‘‘ఇప్పటి వరకు నన్ను చేతుల్లో పెట్టుకుని చూసుకున్న నా స్నేహితులకు దూరం కావాల్సి వస్తోంది. ఒకరి సహాయం లేకుండా కృత్రిమ సాధనాల సహాయంతో నడవడానికి నేను సిద్ధమే. కానీ పదవ తరగతి పరీక్షల తర్వాత ఎదురయ్యే ఒంటరితనం ఇప్పటి నుంచే గుర్తుకొస్తోంది’’ అని దిగులుగా అంటున్నాడు.– మంజీర -
గందరగోళంగా విద్యార్థుల లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గిపోతున్నారో.. ఎంత మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో పెరుగుతున్నారో, ప్రభుత్వ గురుకులాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది డ్రాపవుట్ అవుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ వేస్తున్న ఒక లెక్కతో మరో లెక్కకు పొంతన కుదరడం లేదు. 2016–17 విద్యా సంవత్సరంతో 2017–18 విద్యా ఏడాది లెక్కలను పోల్చి తే 1.34 లక్షల మంది విద్యార్థులు ఒక్క జిల్లా పరిషత్, మండల పరిషత్ మేనేజ్మెంట్ పాఠశాలల్లోనే తగ్గిపోయారు. అదే ప్రైవేటులో 85,565 మంది విద్యార్థులు పెరిగారు. అధికారిక లెక్కల ప్రకారం 2017–18లో ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తంగా 5.69% విద్యార్థులు డ్రాపవుట్స్ ఉన్నారు. అంటే 1,58,982 మంది విద్యార్థులు బడి మానేసినట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. 2017– 18 విద్యా ఏడాదిలో కొత్తగా ఏర్పాటుచేసిన 470 గురుకులాల్లో 1,50,400 మంది విద్యార్థులు చేరినట్లు సంక్షేమ శాఖలు లెక్కలు వేశాయి. అయితే బడి మానేసిన వారంతా గురుకులాల్లో చేరారా? అదే నిజమైతే ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 86,565 మంది విద్యార్థులు ఎలా వచ్చారన్నది అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. 2016–17లో ప్రభుత్వ స్కూళ్ల లో 6,74,748 మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య 2017–18 విద్యా ఏడాదిలో 7,58,132కు పెరిగినట్లు లెక్కలు వేసింది. అంటే 83,384 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగినట్లు తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కలిపితే పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలకు చేరుకుంది. అందు లో జెడ్పీ స్కూళ్లలో తగ్గిపోయిన 1.34 లక్షల మందిని తీసేసినా మిగతా 36 వేల మంది విద్యార్థులు ఎక్కడినుంచి వచ్చారన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్షకు..
తుర్కయంజాల్: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు. ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది. -
వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. -
ఫర్నిచర్‌లోనూ ‘ఫలహారం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు వంటి ఫర్నిచర్ కొనుగోలులో కూడా కమీషన్లు మింగేస్తున్నారు. విద్యార్థుల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు దాదాపు రూ.20 కోట్లతో బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు సరఫరా చేసిన బెంచీలు, కుర్చీలు, టేబుళ్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండడంతో అవి నాలుగు రోజులకే మూలకు చేరాయి. ఈ ఫర్నిచర్ కొనుగోలుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) రూ.10 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) రూ.10 కోట్లు భరించాల్సి ఉంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే సగానికి పైగా నిధులు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు విడుదల చేయలేదు. నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. పాత ఫర్నిచర్ స్థానంలో నాణ్యమైన ఫర్నీచర్‌ను సర ఫరా చేయాలని ఎస్ఎస్ఏ పేర్కొంది. అప్పటివరకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఈలోగా ఉన్నతాధికారులు ఆర్ఎం ఎస్ఏ నుంచి రూ.10 కోట్ల నిధులను విడుదల చేయించారు. మరో రూ.20 కోట్లకు ఎసరు! గతంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నిచర్ వృథాగా పడి ఉండగా, మళ్లీ 630 హైస్కూళ్లకు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20.88 కోట్లతో ఈ ఫర్నీచర్ కొనాలని నిర్ణయించారు. ఎస్ఎస్ ఇంజనీర్స్, సాయి డేటా క్రియేషన్, లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజెస్, శ్రీ సిద్ధివినాయక ఇండస్ట్రీస్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల ద్వారా ఈ ఫర్నిచర్ కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు. డెమో టేబుళ్లు, స్లాటెడ్ యాంగిల్ రాక్స్, స్టీల్ టూల్స్, టీచర్లకు ఛైర్లు, టేబుళ్లు, డ్యూయెల్ డెస్కులు, అల్మరాలు, కంప్యూటర్ టేబుళ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,800 కోట్లతో పూర్తిస్థాయిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, కంప్యూటర్లు, తరగతి గదులు, మంచినీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అయినా మళ్లీ కొత్తగా రూ.20.88 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు వెనుక లోగుట్టు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సర్దుబాటుకు ససేమిరా !
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నివారించేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయులను అవస్థల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో సెటిలైన వారిని ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉన్నఫళంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు నూతన బాధ్యతల్లో చేరగా.. మిగిలిన వారు చేరేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా నివారించాలని ప్రభుత్వం, విద్యాశాఖ తలచింది. ఈ నేపథ్యంలో పని సర్దుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నేటి వరకు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మరికొన్ని రోజుల వ్యవధి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఈవో పూల్‌లో 20 మంది మిగులు ఉపాధ్యాయులున్నా వారిని ఇతర స్థానాలకు సర్దుబాటు చేయకుండా అలానే ఉంచారు. డీఈవోపై ఒత్తిడి... జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 73 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రం అతికష్టం మీద సర్దుబాటు చేసినట్లు సమాచారం. మిగిలిన 33 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్దుబాటుకు సుముఖంగా లేని ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో డీఈఓ సైతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో తప్పకుండా చేరాలని, చేరని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యల భయంతో వెనకడుగు... ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అయ్యవార్లకు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి అనంతరమే బదిలీలు ఉంటాయి. అలా కాదని తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరితే అందుకు అనుమతించరు. అలాంటి తరుణంలో ప్రభుత్వం, విద్యాశాఖకు ఇష్టమైనప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతికి తెర తీయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ తాత్కాలికమే అని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వివిధ పాఠశాలలకు సర్దుబాటు అయ్యే ఉపాధ్యాయులు 2018–19 విద్యా సంవత్సరం ముగిసేవరకు మాత్రమే ఆయా పాఠశాలల్లో కొనసాగుతారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తిరిగి గత పాఠశాలలకు వచ్చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించినా.. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలకు ఎంపిక చేయాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. తర్వాత కొద్ది కాలానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాటుకు వెళ్లిన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా కొనసాగాల్సి అవసరం ఉంది. రవాణా ఖర్చులు సైతం తడిసి మోపెడు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే చార్జీల రూపంలో అదనపు ఖర్చులు తప్పవు. ఈ కారణాల దృష్ట్యా సర్దుబాటుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తే పూర్వ స్కూల్‌కే... ఒక వేళ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మధ్యలోనే వారు పనిచేసిన పూర్వ పాఠశాలలకు వచ్చేయాల్సి ఉంటుంది. లేదా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తే సర్దుబాటు ప్రక్రియ ద్వారా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన జారీ చేస్తే జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం ఉపాధ్యాయ కొలువులను పదోన్నతుల ద్వారా కల్పిస్తారు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు అమలయ్యే సూచనలు ఇప్పట్లో అగుపించడం లేదు. ప్రశ్నార్థకంగా యూపీ పాఠశాలలు... విద్యార్థికి క్షేత్ర స్థాయిలో మెరుగైన విద్య అందితే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తే యూపీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఉపాధ్యాలను నియమించడం కాకుండా ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలన్న డిమాండ్ నెలకొంది. దీని ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఉపక్రమించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యా వలంటీర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల బదిలీలతో ఏర్పడిన ఖాళీల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను ఆదేశించారు. దీనికి త్వరితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 20లోపు యాజమాన్యాల వారీగా విద్యావలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీల వల్ల ఖాళీ అయిన చోట కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. -
లవ్ లెటర్ చించేశాడని పెట్రోల్ పోసి నిప్పంటించాడు
అర్ధవీడు(గిద్దలూరు): ఓ యువతికి ఇచ్చిరమ్మన్న లవ్ లెటర్‌ను చించేశాడనే కోపంతో పాఠశాల విద్యార్థిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం శనివారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం అంకభూపాలేనికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత స్కూలులో నిరుపయోగంగా ఉండే గదిలోంచి రవితేజ పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలుతున్న రవితేజ ఒంటిపై దుప్పటి కప్పి నీళ్లు చల్లి మంటలార్పారు. అనంతరం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఘటనపై అనుమానాలెన్నో... గాయపడిన రవితేజ కంభం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను మూత్ర విసర్జన కోసం పాఠశాల బయటకి రాగా రంజిత్ అనే ఇంటర్ విద్యార్థి తనకు ఒక చీటీ (లవ్‌లెటర్)ఇచ్చాడని, స్కూలు ప్రాంగణంలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఓ యువతికి ఇచ్చిరమ్మన్నాడని చెప్పాడు. తాను ఆ కాగితాన్ని చించి వేయడంతో రంజిత్ తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను తనపై పోసి, నిప్పంటించాడని తెలిపాడు. ఇదిలా ఉండగా రవితేజ ఇంటి నుంచే పెట్రోలు తెచ్చుకున్నాడని, తనే కాల్చుకొని ఉండొచ్చని స్కూలు హెచ్ఎం వెంకటేశ్వర్లు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలను బాధితుడి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమారుడికి ఏదైనా జరిగితే టీచర్లే బాధ్యత వహించాలని చెప్పారు. నిందితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్న మాదార్సు రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. సీఐ భీమానాయక్ నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెట్రోల్ రంజిత్ పోశాడా.. రవితేజ తెచ్చాడా..? లేదా ఆ యువతిపై పోసేందుకు రంజితే తెచ్చాడా..? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. -
ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం నుంచి 3 రోజులపాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజులపాటు 5 వేదికలపైన ఆరు ప్లీనరీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. తొలిరోజు ఉదయం ‘కన్నడ సాహిత్యం అప్పుడు– ఇప్పుడు’ అనే అంశంపై ప్రముఖ రచయిత్రి ప్రతి భానందకుమార్ ప్రధాన ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం ‘లైఫ్ ఇన్ ఏ డ్యాన్స్’పై ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతారు. 27న ‘సిటిజన్’ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’పై ప్రసంగించనున్నారు. బాలీవుడ్ నటుడు శశికపూర్ కూతురు సంజనా కపూర్ నాటక రంగం, థియేటర్ ఆర్ట్ తదితర అంశాలపై తన అనుభవాలను వివరిస్తారు. 28న ‘మీడియా టుడే’ పై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడతారు. సాయంత్రం జరిగే ప్లీనరీలో సమా చార హక్కు చట్టం కార్యకర్త అరుణారాయ్ ప్రసం గించనున్నారు. వీటితోపాటు విభిన్న సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలు, కళలపై మరో 30కిపైగా సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రతి బింబించే కళారూపాలనూ ప్రదర్శించనున్నారు. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా నగరంలో సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నా రు. ఈసారి స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసర వల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’, శశికపూర్ ‘షేక్సిపీరియానా’, ‘టామాల్టన్’ సినిమాలు ప్రదర్శిస్తారు. వంట చేస్తూ చెప్పే ఉ.సరస్వతి రామాయణం కథ, ‘నన్న నుక్కడ్’ (చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితాసమ్మేళనం, ‘బాంబే బైరాగ్’, వికలాంగుడైన కళాకారుడు బందే నవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముస్తాబవుతున్న వేదికలు పబ్లిక్ స్కూల్లోని ‘తెలంగాణ టూరిజం పెవిలియర్’ వేదికపై 6 ప్లీనరీలు, కార్వే క్యానోసీ, టాటా, గోథె గ్యాలరీల్లో పలు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలకు స్పెయిన్ అతిథిగా హాజరుకానుంది. సాహిత్యోత్సవాలకు ఆ దేశ మేధావులు, రచయితలు, కళాకారులు, అమె రికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. ఉత్సవాలకు ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ కంబారా హాజరుకానున్నారు. బెంగ ళూర్‌లో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతి నాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త ఉ.సరస్వతి, దివంగత పాత్రికేయు రాలు గౌరీ లంకేష్ స్నేహితురాలు, ఆర్టిస్టు పుష్పమేలా పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ దిగ్గజం శశికపూర్, మరో నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌లను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. -
సర్కారీ బడుల్లో దాహం.. దాహం
బండరాళ్లు, మురికి నీళ్ల మధ్య ప్లేట్లు కడుక్కుంటున్న వీరంతా స్కూలు పిల్లలు. బడిలో 1,350 మంది చదువుతున్నా ఉన్నది ఒకే ఒక్క బోరు. అందులోంచి సరిపడ నీళ్లు రావడం లేదు. దీంతో స్కూలు ప్రహరీ గోడ దూకి పక్కనే ఉన్న పబ్లిక్ కుళాయి వద్దకు వెళ్లి ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఇక్కడ బాలురు, బాలికలు, ప్రాథమికోన్నత పాఠశాల.. మూడు ఒకే ఆవరణలో కొనసాగుతున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు! – సాక్షి, హైదరాబాద్ అన్ని బడుల్లో ఇదే దుస్థితి రాష్ట్రంలో అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. స్కూళ్ల సమస్యలపై తక్షణమే స్పందించాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. రక్షిత తాగునీటి కోసం విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నా కదలడం లేదు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్. అందులో మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ.3 వేల కోట్లు. అయినా విద్యార్థులకు రక్షిత తాగునీటి సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించలేకపోతోంది. రాష్ట్రంలో 25 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 10,768 స్కూళ్లకే నీటి సదుపాయం ఉంది. 14,763 పాఠశాలలకు నీటి సదుపాయం లేకపోవడంతో పిల్లలకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు ప్రతిరోజు ఇంటి నుంచి తాగునీటి బాటిళ్లను తీసుకెళ్లాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్లలో చేతిపంపులు ఉన్నా వాటిల్లో వచ్చే నీటిని విద్యార్థులు తాగలేని పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల మురికిగా ఉంటున్నా ఆ నీళ్లనే తాగుతుండటంతో అనారోగ్యం పాలవుతున్నారు. భద్రాద్రిలో అత్యధికం ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు కాదు కదా కనీసం విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి నీరు లేని స్కూళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. ఆ జిల్లాలో 1,047 పాఠశాలలు ఉండగా 824 పాఠశాలల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సదుపాయం లేదు. ఈ కోవలో తర్వాతి స్థానంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 786, సంగారెడ్డి జిల్లాలో 769 స్కూళ్లున్నాయి. తాగునీటి కష్టాలు.. మచ్చుకు కొన్ని.. ♦ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని మాధ్వార్ ప్రాథమిక పాఠశాలలో 210 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ మూడు నెలల కిందట బోరు పాడైనా ఇప్పటికీ బాగు చేయకపోవడంతో విద్యార్థులు తంటాలు పడాల్సి వస్తోంది. ఎలిగండ్ల, కన్మనూర్ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ♦ పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలోని కేజీబీవీలో వాటర్ ఫిల్టర్ రెండు నెలలుగా మొరాయించటంతో విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. దీంతో పాఠశాల ప్రిన్సిçపల్ బయట ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. ♦ జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు రక్షిత తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం అన్ని స్కూళ్లకు జలమణి ప్లాంట్లు అందించింది. అయితే ఇవి ఎక్కడా పనిచేయడం లేదు. మరమ్మతు చేయకపోవడంతో మూలన పడేశారు. ♦ నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఇటిక్యాలలోని ప్రాథమిక పాఠశాలలో నీటివసతి లేక విద్యార్థులు ఇంటి నుంచే నీళ్లను తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ♦ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో మాచవరం, శ్రీనివాసపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో రక్షిత తాగు నీటి పథకాలు లేవు. చేతిపంపు నీటిని తాగాల్సి వస్తోంది. దీంతో పిల్లలు అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నారు. మూడుసార్లు బాటిళ్లు నింపుకొస్తాం పాఠశాలలో తాగునీరు లేక ఇంటి నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటాం. రోజూ ఉదయం, ఇంటర్వెల్తోపాటు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాటిళ్లలో నీళ్లు నింపుకొని వస్తున్నాం. నీళ్లకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సునీత, ఆరో తరగతి, బండగొండ, మహబూబ్‌నగర్ జిల్లా బోరునీళ్లు చిలుము వాసన వస్తున్నాయి మా స్కూల్లోని బోరులో నీళ్లు తుప్పు వాసన వస్తున్నాయి. వాటిని తాగలేకపోతున్నాం. ఇంటి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతోంది. – బి.నాగేశ్వరి, ఐదో తరగతి, యూపీఎస్ శ్రీనివాసపురం, హుజూర్నగర్ మండలం, నల్లగొండ జిల్లా నీటి సమస్య తీర్చాలి మా పాఠశాలలో బోరుబావి ఎండిపోయింది. మధ్యాహ్న భోజనం సమయంలో తాగేందుకు నీళ్లను ఇంటినుంచే తెచ్చుకుంటున్నాం – రవి, పదోతరగతి, బొమ్మెన, కథలాపూర్ మండలం, జగిత్యాల -
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
గీసుకొండ(పరకాల): అనారోగ్య సమస్యలతో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి గ్రేటర్ వరంగల్ పరిధిలోని 3వ డివిజన్ కీర్తినగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం కొంపాక ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు గోలి భవానీదేవి(53) తన భర్త, పిల్లలతో కలిసి కీర్తినగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో నివాసముంటోంది. కాగా ఆమె కొంతకాలంగా థైరాయిడ్, కడుపు నొప్పి తదితర సమస్యలతో బాధపడుతోంది. ఆ బాధను భరించలేక జీవితంపై విరక్తి చెందిన భవానీదేవి.. తన ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఆర్చి కర్టెన్ రాడ్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున నిద్రలేచిన బంధువులు.. ఆమెను కిందకు దింపి చూడడంతో అప్పటికే ఆమె మృతిచెంది ఉంది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కాగా భవానీదేవి.. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతికి ఎవరూ కారణం కాదని, తనను క్షమించండి అని సూసైడ్ నోట్ రాసిందని బంధువులు తెలిపారు. కాగా డీఈఓ నారాయణరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు భవానీదేవి మృతదేహాన్ని సందర్శించి బంధువులను పరామర్శించారు. -
బడుగుల గుడి.. సర్కారీ బడి
► 11.86 లక్షల మంది ఓసీల్లో 1.86 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ► 28.72 లక్షల మంది బీసీల్లో 15.15 లక్షల మంది చదువులు ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్సీ విద్యార్థులు 6,60,000 ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్టీ విద్యార్థులు 4,75,000 సాక్షి, హైదరాబాద్: దుర్భరమైన ఆర్థిక పరిస్థితులతో నిరుపేద కుటుంబాలు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివిస్తుంటే.. కొంత మేరకు ఆప్పు చేసే స్తోమత కలిగిన కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీల్లో 61.68%, ఎస్టీల్లో 72.99% విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుండగా, 15.68 శాతం నిరుపేద ఓసీ (జనరల్) కుటుంబాలకు చెందిన పిల్లలు సర్కారు బడికే వెళ్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారిలో ఎక్కువ శాతం ఓసీ విద్యార్థులుండగా, తక్కువ శాతం మంది ఎస్సీ, ఎస్టీల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఇక 47% మంది బీసీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా 53 శాతం బీసీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ సేకరించిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇపుడు మరోసారి 2017–18 విద్యా సంవత్సరం లెక్కల సేకరణపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా వివరాలను సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బీసీ కమిషన్ ఆదేశాలతో.. రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, వారి కులాలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా కావాలని ఇటీవల రాష్ట్ర బీసీ కమిషన్ విద్యాశాఖను కోరింది. దీంతో ఆ వివరాల సేకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సామాజిక వివరాలను కూడా అందజేయాలని ఆదేశించింది. ఏటా సెప్టెంబర్‌లో జిల్లాల వారీగా విద్యార్థుల సమగ్ర వివరాలను (యు–డైస్) విద్యాశాఖ సేకరిస్తోంది. అయితే ఇప్పటివరకు సామాజిక వర్గాలను జనరల్, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలుగానే పేర్కొనేది. కానీ ఈనెలలో ప్రారంభించనున్న వివరాల సేకరణలో సదరు విద్యార్థి ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అన్న వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 40,091 పాఠశాలల్లో (అన్ని రకాల మేనేజ్మెంట్లలో) 65,00,128 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 29,20,683 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో 35,79,445 మంది చదువుతున్నారు. ఇప్పుడు వారందరి వివరాలను సేకరించనున్నారు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల శాతం మేనేజ్మెంట్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ప్రభుత్వ 15.68 68.61 72.99 47.23 29.24 ప్రైవేటు 84.32 31.39 27.01 52.77 70.76 ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది? రాష్ట్రంలోని 28,829 ప్రభుత్వ పాఠశాలల్లో 1,86,064 మంది ఓసీ విద్యార్థులు చదువుతుం డగా, ఎస్సీ విద్యార్థులు 6,60,277 మంది చదువుతున్నారు. ఇక ఎస్టీ విద్యార్థులు 4,75,932 మంది చదువుతుండగా, బీసీ విద్యార్థులు 13,56,630 మంది చదువుతున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 2,41,780 మంది ఉన్నారు. ‘ప్రైవేటు’లో సామాజిక వర్గాల వారీగా రాష్ట్రంలోని 11,262 ప్రైవేటు స్కూళ్లలో ఓసీ విద్యార్థులు 9,99,999 మంది ఉండగా, ఎస్సీ విద్యార్థులు 3,02,214 మంది చదువుకుంటున్నారు. ఎస్టీ విద్యార్థులు 1,76,189 మంది మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుతుండగా, బీసీలు 15,15,715 మంది వాటిల్లో చదువుకుంటున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 5,85,328 మంది ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు. బీసీ–‘ఏ’కేటగిరీలో అనాథ పిల్లలు అనాథ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీగా పేర్కొం టూ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనాథ బాలల కోసం ఏర్పాటు చేస్తున్న 31 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించే క్రమంలో ఈ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీ రిజర్వేషన్ కింద పేర్కొనాలని విద్యాశాఖ ఆదేశించింది. -
ప్రభుత్వ బడుల్లోనే ఆడపిల్లలు
♦ పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య ♦ సమాన అవకాశాలు నామమాత్రమే నిజామాబాద్‌అర్బన్: ఆడపిల్లల సంఖ్య నానాటికి పెరుగుతుంది. విద్యాబోధనలో వీరికి అవకాశాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1015 ప్రభుత్వ పాఠశాలలు, 545 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 2,55,245 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. ఇందులో బాలురలు–13,0947 ఉండగా బాలికలు–124298 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు బాలికలు 50,433 ఉండగా, బాలికలు–52,674 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి నుండి బాలురు –75003 మంది ఉండగా, బాలికలు–60,953 మంది ఉన్నారు. జిల్లా జనాభా 2011 సంవత్సరం ప్రకారం 15,71,022 ఉన్నారు. ఇందులో మగవారు–76,8477 ఉండగా మహిళలు–802545 మంది ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి వెయ్యి మందికిగాను 1044 గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 1,69,621 మంది ఉండగా ఇందులో మగవారు–86,867, ఆడపిల్లలు–82,754 ఉన్నారు. అక్షరాస్యత శాతం పరిశీలిస్తే చదువుకున్న మగవారు–5,04,933 ఉండగా ఆడవారు–3,95,503 మంది ఉన్నారు. నిరక్షరాస్యులను పరిశీలిస్తే మగవారి శాతం 74.08 , ఆడవారు 54.95 శాతం నమోదు ఉన్నారు. నిజామాబాద్‌అర్బన్ పరిధిలో..... మొత్తం జనాభా –464750 ఉన్నారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 53587 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ అర్బన్ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 150 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 42 వేల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మురికివాడల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉర్ధూ మీడియం పాఠశాలల్లో సుమారు 40 శాతం బాలికల కంటే బాలురలే పాఠశాలలకు వస్తున్నారు. ధర్మపురిహిల్స్, పూలాంగ్, కోటగల్లి, చంద్రశేఖర్‌కాలనీ,కోజాకాలనీ, మాలపల్లి, వినాయక్‌నగర్, పాములబస్తీ పాఠశాలల్లో బాలురలే ఎక్కువగా ఉన్నారు. -
14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం
- జిల్లాల కేటగిరీలో ఖమ్మం, నల్లగొండకు అవార్డులు - ఢిల్లీలో జాతీయ అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: నీరు, పరిశుభ్రత వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించే ప్రభుత్వ పాఠశాలలకు కేంద్రం జాతీయ స్థాయిలో ఇచ్చే ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కార్ కింద రాష్ట్రానికి చెందిన 14 స్కూళ్లు అవార్డులు అందుకున్నాయి. రాష్ట్రాల కేటగిరీలో 2016–17కి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాష్ట్రాలు, జిల్లాలు, పాఠశాలల కేటగిరీల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు రాష్ట్రాలు, 11 జిల్లాలు, 172 పాఠశాలలకు ఈ అవార్డులు అందజేశారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, ఏపీలోని పశ్చిమ గోదావరి... జిల్లాల కేటగిరీలో అవార్డులు అందుకున్నాయి. పురస్కారాలు దక్కిన పాఠశాలలకు రూ. 50 వేల నగదు అందజేశారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలలకు పురస్కారాలు అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు. పురస్కారాలు అందుకున్న పాఠశాలలు ఇవీ.. తెలంగాణ నుంచి మొత్తం 14 పాఠశాలలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పుర స్కారాలు అందుకున్నాయి. అం దులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంపీయూపీఎస్ బండల్ నాగ పూర్, టీఎస్ఎస్డబ్ల్యూఎస్ బాలు ర పాఠశాల–బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాకు చెందిన అంబారీపేట జడ్పీహెచ్ఎస్, గంగాధర టీఎస్ ఎంఎస్, కొత్తపల్లి(పీఎన్) ఎంపీ యూపీఎస్, మెదక్ జిల్లాలోని ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపూర్, రంగారెడ్డి జిల్లా నుంచి ఎంపీపీఎస్ బుద్దారం, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎంపీపీఎస్ చౌటగడ్డ తండ, నల్లగొండ జిల్లా నుంచి జడ్పీహెచ్ఎస్ అనంతారం, వరంగల్ నుంచి జడ్పీహెచ్ఎస్ తిమ్మాపేట్, ఖమ్మం నుంచి టీఎస్ఎంఎస్ కారేపల్లి, ఎంపీపీఎస్ మల్లారం, టీఎస్ఎస్డబ్ల్యూఈఐఎస్ సింగారెడ్డిపాలెం, ఎంపీయూపీఎస్ గండగలపాడు ఈ పురస్కారాలు అందుకున్నాయి. కాగా, ఏపీ నుంచి మొత్తం 21 పాఠశాలలు పురస్కారాలు అందుకున్నాయి. -
ప్రభుత్వ పాఠశాలలో బెల్ట్‌షాపు వేలం!
- నిర్వహించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు - రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్న వ్యాపారి సాక్షి, నాగర్‌కర్నూల్: అది పవిత్రమైన ప్రభుత్వ పాఠశాల. చదువులమ్మ ఒడిలో అన్నీ తెలిసిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా బెల్ట్‌షాపునకు వేలంపాట నిర్వహించి పాఠశాల పవిత్రతను, ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతిష్టను మంటగలిపారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులూ అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా వ్యవహరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలకపల్లి మండలం ఆలేరు గ్రామమది. ఆ గ్రామంలో మద్యం అమ్మకాల కోసం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల అధ్యక్షతన ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామ ప్రజల సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెల్ట్‌షాపులో మద్యం అమ్మకాల కోసం వేలంపాట నిర్వహించాడు. సుమారు ఈ వేలంపాటకు 200 మందికి పైగానే హాజరు కాగా, అందులో 13 మంది వేలంపాటలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.5 వేలు డిపాజిట్ చేసి వేలం పాడగా, వారిలో ఒకరు రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్నారు. కాగా, ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. నిత్యం పిల్లలకు విద్యాబుద్ధులు బోధించాల్సిన ఉపాధ్యాయుడే వేలంపాట కార్యక్రమాన్నిముందుండి నడిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ జనాభా 3,500 ఉంటుంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 15 బెల్ట్ షాపుల ద్వారా ప్రతిరోజూ రూ.50 వేలకు పైగా అక్రమంగా మద్యం వ్యాపారం జరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా తాగి తందనాలు ఆడుతుండటంతో మహిళలు వారిని వారించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఆలేరులో పాఠశాలలో వేలం నిర్వహించినట్లుగా వాట్సాప్‌లో ఫిర్యాదులు అందాయని, వేలం నిర్వహించిన వారిపైనా.. గ్రామంలో అక్రమంగా మద్యం దుకాణాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
సర్కారు బడి.. అమెరికా చదువు
అమెరికా విద్యావిధానం తరహాలో యాప్, టీవీ ఆన్ వీల్స్‌కు రూపకల్పన ► సర్కారీ బడి.. గవర్నమెంటు స్కూలా అంటూ తేలికైన భావం.. అక్కడ విరిగిన కుర్చీలు.. ఒరిగిన బెంచీలు.. పగిలిన పైకప్పులు.. ఇక పిల్లల చదువుల సంగతి చెప్పనక్కర్లేదు.. దాదాపుగా ఎవరికైనా ఇదే ఒపీనియన్.. ► ఓసారి గండి మైసమ్మ దుండిగల్ మండలం మల్లంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చూడండి.. అక్కడ విద్యార్థులు టీవీల్లో పాఠాలు వింటుంటారు.. ట్యాబ్‌లు చేతపట్టుకుని.. యాప్‌ల సాయంతో పాఠాలను అభ్యసిస్తూ ఉంటారు.. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఓ ఎన్నారై కల ఇక్కడ సాకారమవుతోంది.. నగరంలోని ప్రగతినగర్‌కు చెందిన దుబ్బాక నిఖిల్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. అక్కడే స్థిరపడ్డారు. భారత్‌తో పోలిస్తే అమెరికాలో విద్యాబోధన ఎంతో మెరుగ్గా ఉంటుందనేది నిఖిల్ అభిప్రాయం. అక్కడ బట్టీ విధానం ఉండదు. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను అక్కడే ప్రాక్టికల్స్లా చేసేస్తుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని గుర్తించిన నిఖిల్... చిరు ప్రయత్నంగా అమెరికా విధానాన్ని ఇక్కడ కూడా ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం రెండేళ్లు శ్రమించారు. దాంతోపాటు ట్యాబ్‌ల్లో ఆఫ్‌లైన్‌లో వీడియోలు చూసుకొనేలా పాఠ్యాంశాల యాప్‌లు రూపొందించారు. ముఖ్యంగా మ్యాథ్స్‌లో ఫార్ములాలు, హిందీ, ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీ, సైన్స్, సోషల్ సబ్జెక్టుల అంశాలతో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా తన సొంత ఖర్చుతో యాప్‌లు రూపొందించారు. దీనికితోడు... బ్లూటూత్ కనెక్షన్‌తో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లను అనుసంధానం చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పేలా టీవీ ఆన్ వీల్స్‌ను తయారు చేశారు. అలాగే.. ప్రగతినగర్‌లోని పీపుల్స్ ప్రాజెక్ట్ ట్రస్ట్, గుమ్మడిదలలోని ఓ ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులకూ ట్యాబ్‌లను అందజేశారు. – హైదరాబాద్ భవిష్యత్తులో మరిన్ని అమెరికాలో చదువుకు మన దేశంలో చదువులకు ఎంతో తేడా ఉంది. ఇక్కడ ఎక్కువగా పిల్లలతో బట్టీ పట్టిస్తారు. దాని వల్ల వారికి ఉపయోగం ఉండదు. పాఠ్యాంశాలు వంటబట్టవు. ముఖ్యంగా కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం టీవీ ఆన్ వీల్స్, యాప్‌లను రూపొందించా. దాతలు సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తా. – నిఖిల్‌రెడ్డి -
మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
టీచర్లు లేక.. వలంటీర్లు రాక బడులకు తాళం టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు.. విద్యార్థులున్న చోట టీచర్లు కరువు! ఇదీ అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి అల్లాదుర్గం(మెదక్): నాణ్యమైన విద్య, సకల సదుపాయాలతో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెప్పే మాటలు.. ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులు ఉన్న పాఠశాలలో టీచర్లు లేకపోవడం.. అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు అల్లాదుర్గం మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 22, జెడ్పీ పాఠశాలలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు 6 ఉన్నాయి. మండలంలో 10 పాఠశాలలకు టీచర్లే లేరు. విద్యా వలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. 10 పాఠశాలల్లో 6 పాఠశాలల్లో మాత్రమే ఒక్కో వలంటీర్ విధుల్లో చేరారు. సీతానగర్ తండా, అప్పాజిపల్లి తండా, చౌటాక్తండా, నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలకు వలంటీర్ పోస్టులు మంజూరైనా ఎవరూ జాయిన్ కాలేదు. దీంతో ఆయా పాఠశాలలు మూతపడ్డాయి. ఏడుగురు విద్యావలంటీర్లు జాయిన్ కాలేదు. మండల పరిధిలోని పల్లెగడ్డ పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతిలో 1, మూడో తరగతిలో 1 విద్యార్థి ఉన్నారు. బుధవారం ఇద్దరు విద్యార్థులు రాకపోవడంతో ఉపాధ్యాయుడు మాత్రమే విధులకు హాజరయ్యారు. నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదు. రెడ్డిపల్లిలో ప్రస్తుతం 20 మందే.. రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల క్రితం 200 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లతో కళకళలాడింది. నేడు ఒక విద్యావలంటీర్, 20 మంది విద్యార్థులతో అధ్వానంగా మారింది. సీతానగర్ పాఠశాలలో 50 మందిపైగా విద్యార్థులు ఉండగా ఒక్క టీచర్ కూడా లేరు. ఒక వలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికైన ప్రభుత్వ పాఠశాలల్లో అమసరం మేరకు టీచర్లు, విద్యావలంటీర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
►మోగిన బడిగంట.. సర్కారు బడిలో సమస్యల స్వాగతం ►పిల్లలతోనే గదుల శుభ్రం ►పలు స్కూళ్లలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ►సమాచారం లేక వెనుదిరిగిన విద్యార్థులు సిటీబ్యూరో: సుధీర్ఘ వేసవి సెలవుల అనంతరం సోమవారం బడిగంట మోగింది. నిన్నమొన్నటి వరకు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తాజాగా పుస్తకాలను భుజాన వేసుకొని బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగే దుమ్ముపట్టిన బెంచీలు..కుర్చీలు, బూజు పట్టిన గదులు స్వాగతం పలుకాయి. వారే గదులను శుభ్రం చేసుకున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లు ‘వెల్కమ్.. బ్యాక్ టు స్కూల్’ బోర్డులతో ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు ఘనస్వాగతం పలికాయి. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సులు, ఆటోలతో పాటు తల్లిదండ్రులు సొంత వాహనాలతో రోడ్డెక్కడంతో రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. ఈదిబజార్, జీజీహెచ్ఎస్ ఫలక్‌నుమా, జీహెచ్ఎస్ కోట్ల అలిజా, జీహెచ్ఎస్ చాంద్రాయణగుట్ట, మైసారం, వహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల, బోరబండ నాట్కో పాఠశాల, ఎన్బీటీ నగర్, ఎర్రమంజిల్ హైస్కూల్స్, వనస్థలిపురం, సాహెబ్‌నగర్ తదితర పాఠశాలల్లో ఉదయం టెన్త్ సప్లిమెంటర్ పరీక్షలు జరిగాయి. ఈ విషయం తెలియక ఉదయమే స్కూలుకు చేరు కున్న విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. సమస్యల స్వాగతం.. ఎంసీహెచ్ క్వార్టర్స్‌లోని బౌలి గులాబ్‌సింగ్ హైస్కూల్ వరండా పూర్తిగా చెత్తాచెదారం, బీరు బాటిళ్లతో నిండిపోయింది. తరగతి గదులలో వర్షపునీరు చేరింది. టేబుళ్లు, కుర్చీలు దుమ్ముపట్టి దర్శనిమిచ్చాయి. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా, తొలి రోజు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. డోర్బస్తీలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ మరాఠి మీడియం పాఠశాలలో బాత్రూమ్లు శిధిలావస్థకు చేరాయి. పైకప్పు నుంచి వర్షపునీరు కారుతోంది.పాతబస్తీలోని రియాసత్‌నగర్ డివిజన్లోని దర్గా బర్హానే షా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గదులను విద్యార్థులతో కడిగించారు. ఉదయాన్నే పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు చీపుర్లు, నీటి డబ్బాలు, డస్టర్లు ఇచ్చి పనిచెప్పారు. గౌలిపురా అయోధ్యనగర్‌లోని జీబీహెచ్‌ఎస్ శాలిబండ పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చుకున్నారు.పురానాపూల్‌లోని ప్రభుత్వ హిందీ పాఠశాల గేటు తాళాలు ఉదయం 9 గంటల వరకు తీయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షంలో తడవాల్సి వచ్చింది.గొల్లకిడికిలోని గ్యాబ్రిల్ చారిటబుల్ స్కూల్లో అనేక మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. సరైన సౌకర్యం లేకపోవడంతో మెట్లపైన కూర్చోవాల్సి వచ్చింది.వనస్థలిపురం కమలానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో రికార్డు ప్రకారం 40 మంది విద్యార్థులు ఉండగా.. ఉదయం 9.30 వరకు ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. ఎల్బీనగర్లోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడే గంట కొట్టారు.నేరేడ్మెట్ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులకుగాను సుమారు 30 మంది, వాజ్‌పేయినగర్‌లో 130 మందికి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు.మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో తొలిరోజు ఉదయం ప్రార్థన (8.45) సమయానికి ఉపాధ్యాయుల్లో చాలా మంది హాజరు కాలేదు. ఆసిఫ్‌నగర్ మండలం గోల్కొండ జోన్ పరిధిలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు. -
సెలవుల్లోౖనైనా.. చక్కదిద్దేరా ?
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో పేద విద్యార్థుల చదువుకు అసౌకర్యాలు ప్రతిబంధంకంగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు కల్పించడంలో విద్యాశాఖ విఫలమవుతూనే ఉంది. సరిపడా గదులు లేక చెట్ల కింద, వరండాల్లో చదువులు చెప్పాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరికొన్ని చోట్ల ఉన్నప్పటికీ విద్యార్థులకు అవసరమైన మేర లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే ఫర్నిచర్ కొరత, శిథిలమైన గదులు వంటి సమస్యలు తీరని సమస్యగానే వేధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకులు, విద్యాశాఖ అధికారుల మాటలకు దిక్కు లేకుండాపోతోంది. ప్రతి ఏడాది సర్వశిక్షాఅభియాన్ ఇంజినీరింగ్ శాఖ, విద్యాశాఖ సర్వేలు చేయించి అసౌకర్యాల నివేదికలను తెప్పించుకుంటున్నారు తప్ప వాటిని పరిష్కరించే పనులను మాత్రం చేపట్టడం లేదు. ప్రస్తుతం సర్కారు బడులకు వేసవి సెలవులు కావడంతో స్కూళ్ల ప్రారంభానికి ముందు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తే అడ్మిషన్ల సంఖ్య పెరగడమే కాకుండా విద్యార్థుల చదువుకు ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుంది. జిల్లావ్యాప్తంగా సర్కారుబడుల పరిస్థితులు.. జిల్లాలో సర్కారు బడుల్లోని విద్యార్థులను సమస్యలు కలవరపెడుతున్నాయి. ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేక వరండాలు, ఆరుబయటే చదువులు కొనసాగిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి కొరతతో మెజారిటీ పాఠశాలల్లో బాలురు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా బాలికల పరిస్థితి మరింత దారుణం. గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఎస్డీఎఫ్ నిధులతో డెస్క్‌లను ఏర్పాటు చేసేలా నిధులు విడుదల చేశారు. అయితే ఆయన బదిలీ కావడంతో ఆ డెస్క్‌ల సంగతి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా పలు మండలాల్లో విరిగిన బెంచీలు, మరికొన్ని చోట్ల నేలబారు చదువులే దిక్కువుతున్నాయి. సర్వశిక్షా ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. చాలా పాఠశాలల్లో తరగతి గదులకు మరమ్మతులు చేయక పాఠశాలల భవనాలు, తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపడుతున్నాయి. అలాంటి పాఠశాలలన్నింటినీ కూల్చివేయాలని గత ఏడాదే సర్వశిక్షా అభియాన్ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. భవనాల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు గదుల కోసం నిర్మాణాలు చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో తాగునీటి వసతి వేధిస్తోంది. విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక కంప్యూటర్లు, ప్రయోగశాలల పరికరాలు దుమ్ముపట్టిపోతున్నాయి. గత ఏడాది కంప్యూటరు క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో పలుచోట్ల అవి చోరీకి, మరమ్మతులకు గురై మూలనపడిపోయాయి. ఈ అసౌకర్యాల మధ్య కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. సర్వేలో వెల్లడైన సమస్యలు.. జిల్లాలోని ప్రతి పాఠశాలలోనూ నెలకొన్న అసౌకర్యాలపై విద్యాశాఖ అధికారులు సర్వే చేయించారు. కానీ ఇప్పటికీ వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 180 అదనపు తరగతి గదులు అవసరం కాగా, 250 పాఠశాలలకు మేజర్ మరమ్మతులు అవసరమని గుర్తించారు. ఉన్నత పాఠశాలల్లో 70 అదనపు తరగతి గదులు అవసరమని గుర్తించారు. ప్రాథమిక పాఠశాలలో బాలురు 60, బాలికలు 51, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలురు 14, బాలికలు 5, ఉన్నత పాఠశాలల్లో బాలురు 43, బాలికలు 31 ఉన్నచోట్ల మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని వెల్లడైంది. మొత్తం పాఠశాలల్లో బాలురకు 20, బాలికలకు 80 మరుగుదొడ్ల కొరత ఉన్నట్లు తెలిసింది. వాటర్ సౌకర్యం లేని మరుగుదొడ్లు ప్రాథమిక పాఠశాలల్లో 450, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 240, ఉన్నత పాఠశాలల్లో 320 వరకు ఉన్నాయని తేలింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 9,500 డ్యూయల్ డెస్క్‌ల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
మండుటెండల్లో బాల‘శిక్ష’
- ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో యథాతథంగా క్లాసులు ∙ - గాలికి కొట్టుకుపోయిన ‘వేసవి కార్యాచరణ’ - ఎండలు భగ్గుమంటున్నా కొనసాగుతున్న పాఠశాలలు ∙ - లక్షలాది మంది విద్యార్థులకు అవస్థలు సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు.. తొమ్మిది దాటితే చాలు ఎండ సుర్రు మంటోంది.. ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. వేడి తీవ్ర తకు తట్టుకోలేక పెద్దలే ఇంటిపట్టున ఉండిపోతున్నారు.. పిల్లలు మాత్రం ఇంతటి ఎండల్లోనూ స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది! లక్షలాది మంది విద్యార్థులు విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే నాథుడే లేడు!! సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తరహాలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి క్లాసులు కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యాశాఖ బోధనను కొనసాగిస్తోంది. వేసవి కార్యాచరణలో చెప్పినా.. ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉం టే ఉదయం 11 గంటలలోపు పాఠశాలల్లో బోధన పూర్తి చేసి విద్యార్థులను ఇళ్లకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికలో స్పష్టంగా పేర్కొంది. వారంపాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినా విద్యాశాఖకు పట్టడం లేదు. సాధారణ పాఠశాలల్లో ఉదయం 7:43 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బోధనను కొనసాగిస్తోంది. చివరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి జరుగుతున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్ష కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలుకానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంగీకరిస్తున్నా.. బడుల కొనసాగింపును నిలిపివేయాలని గట్టిగా అడగలేకపోతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అలాంటపుడు తామెలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబితే స్కూళ్లలో బోధనను నిలిపివేస్తామని పేర్కొంటున్నారు. అయినా ఈ నెల 23వ తేదీ వరకే కదా.. ఏముందీలే అంటూ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
‘బడి’కి నోటిఫికేషన్!
-
‘బడి’కి నోటిఫికేషన్!
రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాలల్లో ప్రవేశాలకు షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దానిని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 20న ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వ స్కూళ్ల తరహాలో ఈనెల 21వ తేదీనుంచే కొత్త విద్యా సంవత్సరాన్ని (పైతరగతుల బోధన) ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీగా చేపట్టాల్సిన చర్యలనూ వివరించింది. డ్రాపౌట్లు ఉండకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో వంద శాతం పైతరగతుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి 13 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈసారి ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం కోసం డిమాండ్ ఉంటే.. బోధనకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు టీచర్లు, తల్లిదండ్రులు ముందుకు వస్తే.. ‘బడిబాట’కార్యక్రమంలోనే నిర్ణయం తీసుకుని, (ఒకటో తరగతిలో) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే 90 శాతం పాఠ్య పుస్తకాలను జిల్లాలకు చేర్చింది. ఈనెల 21న స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులందరికి పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. వేసవిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సర కార్యక్రమాలు ► ఈనెల 21 నుంచి పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం. పిల్లలకు పైతరగతుల బోధన. పాఠ్య పుస్తకాల పంపిణీ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహణ. తల్లిదండ్రులతో సమావేశం, డ్రాపౌట్స్‌ను తిరిగి పాఠశాలల్లో చేర్చేలా చర్యలు, విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేషన్. ► 22న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రాల ను సందర్శించి అక్కడి పిల్లల జాబితాను సేకరించడం. పైతరగతులకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం. ప్రత్యామ్నా య బోధనకు ప్రణాళికల రూపకల్పన. ► 23న అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించడం. అక్షరాభ్యాసం కార్యక్రమం. 24వ తేదీ నుంచి..: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధన ప్రారంభం. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం. ► 25 నుంచి ఏప్రిల్ 15 వరకు: పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం. ప్రీప్రైమరీ కోసం 5,318 స్కూళ్ల దరఖాస్తులు గతేడాది హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రీప్రైమరీ విద్యార్థి లిఫ్టులో పడి మరణించడంతో.. ప్రీప్రైౖమరీ స్కూళ్ల నియంత్రణ, వాటి గుర్తింపు అంశం తెరపైకి వచ్చింది. అంతకుముందు ప్రీప్రైమరీ స్కూళ్ల గుర్తింపును ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఘటనతో ప్రీప్రైమరీకి కూడా తప్పనిసరిగా గుర్తింపు పొందేలా, నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రీప్రైమరీ గుర్తింపు కోసం ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,318 ప్రైవేటు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో పాత స్కూళ్లు 4,773 ఉండగా.. కొత్త గా ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు 545 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 3 వేల వరకు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇదీ ప్రవేశాల షెడ్యూల్ ► ఈ నెల 20న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల ► 20 నుంచి 24 దాకా ప్రారంభ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ► 25 న ఎంపిక జాబితాల ప్రకటన ► 27 నుంచి ప్రారంభ తరగతిలో చేరిన వారికి తరగతుల బోధన ప్రారంభం ► ఏప్రిల్ 15 లోగా ఆయా విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు ► జూలై 30 వరకు ఇతర తరగతుల్లో సాధారణ ప్రవేశాల గడువు. ► సెప్టెంబర్ 24 వరకు ప్రవేశాలకు అవకాశం. ► విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏ పాఠశాల కూడా విద్యార్థులకు ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదు. ► పాఠశాలల్లో ఆలస్యంగా చేరిన వారికి ప్రత్యేక బోధన చేపట్టాలి. -
ఆధార్ ఉంటేనే భోజనం
⇒మధ్యాహ్న భోజన పథకం అమలులో పారదర్శకత ⇒పాఠశాలలకు త్వరలోనే నోటిఫికేషన్ ⇒వంట చేసే కార్మికులూ వివరాలు ఇవ్వాల్సిందే.. ⇒కార్డులు లేని వారికి జూన్ 30వరకు గడువు ⇒జిల్లాలో 45,521 మంది విద్యార్థులు, 1,209 మంది కార్మికులు వరంగల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కేంద్రప్రభుత్వం కొత్త నిబంధన చేర్చనుంది. ఈ పథకంలో భాగంగా భోజనం చేసే విద్యార్థులే కాకుండా వంట చేసే కార్మికుల ఆధార్ కార్డు వివరాలు సేకరించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ శాఖ ఆధీనంలోని ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ’ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే పాఠశాలలకు పంపించనుంది. నిధుల వినియోగంలో పారదర్శకత పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండొద్దన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్నేళ్లుగా అమలుచేస్తున్నాయి. అయితే, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు, బియ్యాన్ని అందజేస్తాయి. ఈ మేరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తప్పుగా చూపిస్తూ నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకం నిర్వహణలో పారదర్శకత కోసం విద్యార్థులు, వంట కార్మికుల ఆధార్ కార్డుల నంబర్లు సేకరించాలని నిర్ణయించింది. విద్యార్థులు భోజనం చేస్తున్నందున.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నందున కార్మికుల నంబర్లు కూడా సేకరించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆధార్ కార్డులు లేని వారు జూన్ నెల 30వ తేదీలోగా పొందేందుకు గడువు ఇస్తారు. జిల్లాలో 45,521మంది విద్యార్థులు వరంగల్ రూరల్ జిల్లాలోని 15 మండలాలకు చెందిన 694 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతోంది. ఇందులో 472 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 141 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 45,521 మంది విద్యార్థులు ఉండగా, 1,209 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. వంట చేసే వర్కర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా మొత్తం రూ.1,20,900 చెల్లిస్తున్నారు. అలాగే, విద్యార్థుల ఆహారానికి సంబంధించి రోజుకు రూ.3,25,021, నెలకు రూ.78,00,507 ఖర్చు అవుతోంది. -
మార్చి 21 నుంచి పైతరగతులు!
ఏప్రిల్ 24 వరకు నిర్వహణ.. పాఠశాల విద్య అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసిన విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ ఆమోదానికి ఫైలు.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18)లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో పాఠశాల విద్యా శాఖ అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసింది. దీనిపై త్వరలోనే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని, అవసరమైతే పలు మార్పులు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా 2017–18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21వ తేదీ నుంచే ప్రారంభించాలని అకడమిక్ కేలండర్లో వెల్లడించింది. ఇందులో భాగంగా పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి చేపట్టి ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనుంది. తిరిగి జూన్ 12వ తేదీ నుంచి తరగతుల నిర్వహణను కొనసాగించాలని పేర్కొంది. అలాగే దసరా సెలవులను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 2017 డిసెంబర్ 23వ తేదీ నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనుంది. సంక్రాంతి సెలవులు 2018 జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఉండేలా చర్యలు చేపట్టింది. ఇక బడిబాట కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 21 నుంచి 28వ తేదీ వరకు ఒక దఫా, జూన్ 1వ తేదీ నుంచి 9 వరకు రెండో దఫా నిర్వహించాలని పేర్కొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరిలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించింది. అకడమిక్ కేలండర్లోని ప్రధానాంశాలు పాఠశాలల వేళలు ► ఉన్నత పాఠశాలలు (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఏడున్నర గంటలు) కొనసాగుతాయి. ► ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు (7.15 గంటలు) ఉంటాయి. ► ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (7 గంటలపాటు) కొనసాగుతాయి. పరీక్షల సమయం ► జూలై 15వ తేదీలోగా ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్–2 పరీక్షలు సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలి. సమ్మేటివ్–1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు ఉంటాయి. ఫార్మేటివ్–3 పరీక్షలు నవంబర్ 30లోగా పూర్తి చేయాలి. ఫార్మేటివ్–4 పరీక్షలు 2018 జనవరి 31లోగా పూర్తి చేయాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్–2 పరీక్షలు 2018 మార్చి 7వ తేదీ నుంచి 14వ తేదీలోగా పూర్తి చేయాలి. ► పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీలోగా పూర్తి చేయాలి (టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటే). ఒకవేళ టెన్త్ వార్షిక పరీక్షలు 2018 మార్చి మూడో వారంలో ఉంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తేదీలోగా పూర్తి చేయాలి. 2018 జనవరి 31వ తేదీలోగా టెన్త్ సిలబస్‌ను మొత్తం పూర్తి చేయాలి. ఆ తరువాత వెనువెంటనే సిలబస్ రివిజన్ చేపట్టాలి. -
‘ఉపాధి’ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు
11 వేల వంటగదులు, 7 వేల మరుగుదొడ్ల నిర్మాణం: నీతూ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. 30 జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) ప్రభుత్వ పాఠశాలన్నింటిలో 11,080 వంట గదులు, 7,080 మరుగుదొడ్లు అవసరమన్న ప్రతిపాద నలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వెల్లడించారు. వీటితో పాటు నీటి వసతి కోసం బోరు, మోటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలను నెలలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణా భివృద్ధి శాఖలో సిబ్బంది కొరత ఉందని పలువురు తెలుపగా, దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటానన్నారు. -
కలగా కంప్యూటర్ విద్య
నాలుగేళ్లుగా నిలిచిన బోధన ఇన్స్ట్రక్టర్లు లేక ఇబ్బందులు మూలనపడ్డ కంప్యూటర్లు చెన్నూర్ రూరల్ : ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యనందిస్తామన్న ఆశయం నెరవేరడం లేదు. పలు పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించి చేతులు దులుపుకోవడంతో కంప్యూటర్ విద్య మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందనిద్రాక్షగా మారింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి మూలనపడ్డాయి. జిల్లాలో 108 ఉన్నత పాఠశాలలు, 93 ప్రాథమికోన్నత, 477 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 55 ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేశారు. 2008లో ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, ఒక్కో జనరేటర్, ప్రింటర్లను అందించారు. కంప్యూటర్లు అమర్చేందుకు ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో 30 ఉన్నత పాఠశాలలకు గాను 15 పాఠశాలలకు కంçప్యూటర్లు అందజేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 33 హైస్కూళ్లకు గాను 13 పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చారు. బెల్లంపల్లి నియోజవర్గంలో 31 ఉన్నత పాఠశాలలు ఉండగా 18 పాఠశాలలకు కంçప్యూటర్లను అందజేశారు. వీటి నిర్వహణను ఎడ్యుకామ్ అనే ప్రయివేట్ సంస్ధకు అప్పగించారు. వీరికి ఐదేళ్లు అంటే 2013 వరకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ సంస్థ నిర్వాహకులు కంప్యూటర్ బోధించేందుకు ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమించారు. వీరికి ఒక్కరికి నెలకు రూ.2476 చొప్పున వేతనం చెల్లించేవారు. మూడేళ్లపాటు కంప్యూటర్ విద్య సాఫీగానే కొనసాగింది. 2012లో వేతనాలు పెంచాలంటూ జిల్లా వ్యాప్తంగా ఇన్స్ర్‌క్టర్లు ఆందోళన చేపట్టారు. ఎడ్యుకామ్ సంస్థ పట్టించుకోకపోవడంతో ఇన్స్ట్రక్టర్లు తిరగి విధుల్లో చేరలేదు. దీంతో 2013 సెప్టెంబర్ నుంచి కంప్యూటర్ బోధన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పాఠశాలల్లో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. కంప్యూటర్ విద్య కోసం విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలలను ఆశ్రయించక తప్పడంలేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నాలుగేళ్లుగా మూలన పడటంతో పనికి రాకుండా పోతున్నాయి. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య కలగానే మిగిలింది. అధికారులు స్పందించి కంప్యూటర్ బోధకులను నియమించి విద్యార్ధులకు కంప్యూటర్ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కుట్టుకోవాల్సిందే..!
పాఠశాలలకు చేరిన గుడ్డ దుస్తులకు బదులు వస్త్రాల పంపిణీ ఏడునెలల తర్వాత సరఫరా జతకు కుట్టుకూలీగా రూ.40 నిర్ణయించిన ప్రభుత్వం ముందుకురాని దర్జీలు కథలాపూర్ (వేములవాడ) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు రెడీ అంటూ ప్రగల్భాలు పలికారు. తీరా బడులు ప్రారంభమై ఏడు నెలలు గడిచాక కుట్టు వస్త్రాలు కాకుండా కేవలం గుడ్డ సరఫరా చేయడంతో విద్యార్థులు, పాఠశాలల బాధ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో డ్రెస్సుకు రూ.40 కుట్టుకూలీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులపైన ఆర్థికభారం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పునరాలోచించి కుట్టుకూలీ పెంచాలని, విద్యార్థులకు త్వరగా డ్రెస్సులు అందించాలని పలువురు కోరుతున్నారు. ఆప్కో నుంచి చేనేతకు మార్పు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 506, ప్రాథమికోన్నత 87, హైస్కూళ్లు 187 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 73 వేల మంది చదువుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం డ్రెస్సులు అందిస్తోంది. వీరు సుమారు 55 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్సులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరికి గత విద్యాసంవత్సరం వరకు డ్రెస్సులు పంపిణీ చేయగా.. అవి సరిపోకపోవడం, చిరగడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి బట్టను సరఫరా చేసినట్లు సమాచారం. గతంలో బట్టలు ఆప్కో ద్వారా పాఠశాలకు సరఫరా చేసేవారు. ఈసారి చేనేత సహకార సంఘం ద్వారా సరఫరా చేసింది. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసి ఒక్కో డ్రెస్సుకు కుట్టుకూలీగా రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఇది గిట్టుబాటు కాదని దర్జీలు అంటున్నారు. ప్రభుత్వ ధరకు అదనంగా విద్యార్థులు కొంత మొత్తం చెల్లిస్తేనే డ్రెస్సులు కుట్టేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. కుట్టుకూలీ ఏ నిధుల నుంచో..? విద్యార్థుల డ్రెస్సుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ నిధులు ఎక్కడినుంచి చెల్లిస్తారనేది ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. పాఠశాలల ఎస్ఎస్ఎ నిధుల్లోంచి గతంలో చెల్లించేవారు. ఈ ఏడాది పాఠశాల ఖాతాలో ఉన్న ఆ నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిధులను ఇతర శాఖలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల డ్రెస్సుల కుట్టుకూలీకి నిధులు వస్తాయో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి త్వరగా డ్రెస్సులు అందేలా చూడాలని విద్యార్థిసంఘాల నేతలు కోరుతున్నారు. జాప్యం దారుణం డ్రెస్సులు అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు చూస్తే విద్యాసంవత్సరం ముగిసేవరకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కుట్టుకూలీని పెంచి ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎనిమిదేళ్ల నాటి నిబంధనలు అమలు చేసి నెలల తరబడి జాప్యం చేయడం దారుణం. – ఆరెల్లి సాగర్, ఏబీవీపీ మండల కోకన్వీనర్ -
‘లిటిల్ లీడర్.. లిటిల్ టీచర్’ షురూ..
మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ బాల్‌రాజ్‌గౌడ్ కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంచడానికి జిల్లా విద్యాశాఖ సహకారంతో తమ సంస్థ లిటిల్ లీడర్, లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ సి.బాల్‌రాజ్‌గౌడ్ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలతో విద్యాశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత మూడేళ్లుగా తమ సంస్థ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే అంశాలు అందరు వి ద్యార్థులకు అర్థం కాకపోవచ్చని, కొందరికి కొంత మేర, మరికొందరికి మరికొంత మేర అర్థమవుతాయని, అ యితే విద్యార్థులను గ్రూపులుగా చేసి ఒకరి కొకరు చెప్పుకునే విధానాన్ని చేపట్టామన్నారు. నేర్చుకోవడం, నేర్పించడం విధానం ద్వారా విద్యార్థులందరూ చదువులో ముందుంటారన్నారు. వచ్చే వేసవిలో 40రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి డప్పువాయిద్యం, డ్యాన్స్, డ్రాయింగ్ వంటి కళల్లో శిక్షణ ఇస్తామన్నారు. తాను వ్యాపారరంగంలో అనుభవాన్ని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపయోగిస్తానన్నారు. ఈ సమావేశంలో సంస్థ సిబ్బంది శశి, తదితరులు పాల్గొన్నారు. -
దర్జీల పేరిట దగా!
‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఇవ్వనున్న యూనిఫాం వస్త్రం పక్కదారి.. స్థానిక టైలర్లను కాదని దళారులకు అవకాశం ‘టెస్కో’కు బదులుగా నాసిరకం బట్టతో దుస్తులు పర్వతగిరి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్‌కు దీటుగా ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులు అందజేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వమే దుస్తులు సిద్ధం చేయించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేసేది. ఇలా చేయడం ద్వారా సైజుల్లో తేడా వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు ‘టెస్కో’ ద్వారా నాణ్యమైన బట్ట సరఫరా చేస్తూ స్థానిక దర్జీలకు ఉపాధి కల్పించేందుకు వారితో విద్యార్థులకు బట్టలు కుట్టించాలని నిర్ణయించారు. దీంతో దళారులు రంగప్రవేశం చేసి ఎస్ఎంసీ తీర్మానాలు లేకుండా.. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని టెస్కో ద్వారా వస్త్రం తెచ్చుకుంటున్నారు. ఆ వస్త్రం తో కూడా విద్యార్థులు దుస్తులు తయారు చేయకుండా బయట అమ్ముకుని.. నాసిరకంతో వస్త్రంలో తయారైన దుస్తులు రూపొందించి విద్యార్థులకు అందజేస్తున్నారు. రెండు జతల చొప్పున.. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులను పంపిణీ చేస్తుంది. టెస్కో(ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో) ద్వారా ప్రతీ పాఠశాలకు వస్త్రం పంపిణీ చేస్తుండగా.. స్థానిక దర్జీలతో దుస్తులు సిద్ధం చేయించాలి. ఈసారి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ఎనిమిది నెలలకు దుస్తులు పంపిణీ చేసేదుకు రంగం సిద్ధం కాగా.. కొందరు దళారులు అక్రమాలకు తెర లేపారు. ఇందులో కొందరు ఎంఈఓలతో కుమ్మకై పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ రాయించుకుని సరిపడా వస్త్రంతో స్థానికులను కాదని బయటి దర్జీలతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నారు. మిగిలిన బట్టను మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇక కొందరు టెస్కో నుంచి మొత్తం బట్టను బయట అమ్మేసి నాసిరకం బట్టతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెస్కో నుంచి వచ్చే వస్త్రం మీటర్ రూ.120 వరకు ఉండగా.. బయట రూ.60కి దొరికే వస్త్రం ఉపయోగిస్తుండడంతో పెద్దమొత్తంలో దళారులకు లాభం చేకూరుతోంది. శ్రమ దోపిడీ... కొందరు దళారులు మొత్తం వస్త్రాలను బయట సిద్ధం చేయిస్తుండగా మరికొందరు స్థానికుల అతి తక్కువ ధర చెల్లించి కుట్టిస్తున్నారు. డ్రెస్‌కు కావాల్సిన దారం, గుండీలు తదితర సామాన్లను దర్జీలకు అందిస్తారు. ఒక్కో డ్రెస్‌కు రూ.5 చొప్పున సామగ్రి అవసరం కాగా, కుట్టినందుకు డ్రెస్‌కు రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.15లో డ్రెస్ సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం నుంచి మాత్రం దళారులు రూ.40 చొప్పున పొందుతున్నారు. ఇలా డ్రెస్‌కు రూ.25 వరకు దళారుల జేబుల్లో చేరుతోంది. ఇంత తక్కువ ధరకు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు చెబుతుండగా.. మొత్తమే ఉపాధి కరువవుతోంది. ఇలా వెలుగులోకి.. పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేస్తామని కొందరు దళారులు 20 రోజులుగా ఎంఈఓ, హెచ్‌ం, ఎస్ఎంసీ చైర్మన్ వెంట పడుతున్నారు. స్థానిక దర్జీలు 10 మందికే అవకాశం కల్పిస్తామని ఎస్ఎంసీ చైర్మన్ చెప్పడమే కాకుండా హెచ్ఎంకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఎంఈఓ, హెచ్ఎంలు టెస్కో వద్ద వస్త్రం తెచ్చుకోవాలని దర్జీలను వరంగల్ పంపించారు. అక్కట టెస్కో గోదాంకు వెళ్లగా పర్వతగిరి విద్యార్థుల వస్త్రాన్ని హెచ్ఎం తీసుకున్నట్లు సంతకాన్ని వారు చూపించారు. దీంతో నివ్వెరపోయిన దర్జీలు ఆరా తీయగా.. స్థానిక దర్జీలు వస్తారని భావించి ముందుగానే మండలాన్ని యూనిట్‌గా దళారులు ఏజెంట్ ద్వారా బట్ట తీసుకువెళ్లినట్లు తేలింది. -
గురువులను ఎన్నటికీ మర్చిపోలేం
• జీవిత పాఠాలు నేర్పేది ప్రభుత్వ పాఠశాలలే • పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎన్ఆర్ఐ బెల్లం మధు కొక్కిరేణి(తిరుమలాయపాలెం): తమకు విద్యతో పాటు జీవిత లక్ష్యాలను నేర్పించి ఉన్నతికి పాటుపడిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేమని ఎన్ఆర్ఐ బెల్లం మధు అన్నారు. మండలంలోని కొక్కిరేణి జిల్లా పరిషత్ పాఠశాలలో 1990–91 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కొక్కిరేణి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇతర దేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచే స్తున్నానని, ఆనాటి ఉపాధ్యాయులు నేర్పిన విద్య, వారు చూపిన మార్గాలను నెమరవేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమకు విద్య నేర్పిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో కంప్యూటర్ విద్య బోధించే టీచర్ జీతభత్యాలను భరిస్తూ పాఠశాల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. సర్పంచ్ బెల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి మంచి పౌరులను అందించే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని, తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు జీవిత పాఠాలు నేర్పిస్తారని గుర్తుచేసుకున్నారు. నేడు విద్యా ప్రైవేటీకరణ జరుగుతున్నప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఉన్నతులుగా ఎదిగిన పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధికి చేయూతను అందించాలని ఆకాం క్షించారు. ఈ సందర్భంగా విద్యనేర్పిన ఉపాధ్యాయులు శివాజీ, వెంకటేశ్వరమ్మ, సరస్వతి, వీరభద్రరావు, జ్ఞానేశ్వర్, సుధాశన్లను పూర్వ విద్యార్థులు సన్మానించి, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వేరు వేరు ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ కలుసుకుని అప్పటి పాఠశాల జ్ఞాపకాలను, కుటుంబ యోగక్షేమాలను ఒకరికొకరు గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయులు కూడా అప్పటి పాఠశాల ఆవరణ తరగతి గదులను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు ఊడుగు కొండల్రావు, పూర్వ విద్యార్థులు హరిగోపాల్, ఎస్.కె మియా, ఎస్.ఉపేందర్, వీరస్వామి, శ్రీలత, కిషోర్, సురేష్, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్యాంశాలకు డిజిటల్ బ్రేక్
ప్రొజెక్టర్‌తో రెగ్యులర్ క్లాసులు ► 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు ► కామన్ టైంటేబుల్తో కొంచెం మేలు నేరడిగొండ : ‘ముందచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి’ అన్న చందంగా డిజిటల్ తరగతులు మారారుు. దీంతో రెగ్యూలర్ పాఠ్యాంశాలు పెండింగ్‌లో పడిపోతాయా? ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ప్రక్రియతో ఉపాధ్యాయులు డిజిటల్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పాడింది. గతనెల 16వ తేదిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా చదవడం, చూడగలగడం (రీడ్ ఓన్లీ టర్మినల్)తో పాటు హార్డ్ డిస్క్ ద్వారా బోధన అందిస్తుంది. అరుుతే ఈ విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యా శాఖ ప్రణాళిక ప్రకారం రోజువారిగా పాఠశాలల్లో ఉదయం రెండు, సాయంత్రం రెండు తరగతులను 20 నిమిషాల పాటు ఈ రెండు ప్రక్రియల ద్వారా విద్యాబోధనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పది రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియతోతో ప్రభుత్వ పాఠశాలల సమయపాలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొజెక్టర్ విద్యా విధానానికి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. పాత విద్యా ప్రణాళికకు స్వస్తీ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పాటు విద్య ప్రణాళికను ఇదివరకే రూపొందించుకొని బోధన కొనసాగిస్తున్నారు. ఇంతలో ప్రొజెక్టర్ విధానం ద్వారా విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన నూతన ప్రక్రియ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారిందని పలువురు వాపోతున్నారు. వార్షిక పరీక్షలు ఓవైపు, సిలబస్ పూర్తికాకపోవడంతో మరోవైపు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. క్రమం తప్పకుండా సిలబస్ పూర్తి చేసుకునేందుకు తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఇంతలో ఈ డిజిటల్ విద్యా విధానంతో పది రోజులుగా సిలబస్ ముందుకు సాగడం లేదు. సామాన్య, గణితం, ఆంగ్ల పాఠాలు ఉన్న సమయంలోనే ఈ ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల సిలబస్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నారుు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరు ఉంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తయ్యే వరకు వారికి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధనపై పక్కా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కామన్ టైమ్‌టేబుల్ రూపొందించాలి.. పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు మేలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం అయ్యే ఆర్‌ఓటీ ద్వారా అందించే విద్యా బోధనకు పాఠశాలల సమయ పాలనకు కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నారుు. దీంతో ఉపాధ్యాయుల నుంచి సిలబస్ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
పాఠశాలలకు విద్యుత్ కష్టాలు..
► బిల్లులు చెల్లించడానికి నిధులు ఇవ్వని ప్రభుత్వం ► కనెక్షన్లు కట్ చేస్తున్న అధికారులు చీపురుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. నీరు, మరుగుదొడ్లు, యూనిఫాంలు, కరెంట్, టేబుళ్లు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అరుుతే ప్రభుత్వాల వైఫల్యాల వల్ల చాలా సౌకర్యాలకు విద్యార్థులు దూరమవుతున్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సరఫరా ఉండాలంటే దాని కోసం ప్రతి నెలా నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పైగా విద్యుత్ సరఫరా అనుమతులు తెచ్చేందుకు ఖర్చులు అవుతారుు. కాని ప్రభుత్వం మాత్రం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు కోసం ఒక్క రూపారుు కూడా వెచ్చించకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే నానా తంటాలు పడుతున్నారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు విషయంలో ఉపాధ్యాయులే ఏవో బాధలు ఎదుర్కొని ఏర్పాటు చేసుకుంటుంటే నెలవారీ బిల్లులకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోంది. బిల్లులు చెల్లించలేకపోవడంతో నియోజకవర్గంలని నాలుగు మండలాల్లో 52 పాఠశాలలకు సరఫరా నిలిపివేసినట్లు ఆర్ఈసీఎస్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. మిగిలిన పాఠశాలల్లో కూడా నెలవారీ బిల్లులు చెల్లించేందుకు ఉపాధ్యాయులు అవస్థలు పడాల్సి వస్తోంది. నిధుల లేమి.. నియోజకవర్గంలోని చీపురుపల్లి మండలంలో 55 మండల పరిషత్ ప్రాథమిక, ఆరు ప్రాథమికోన్నత, ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నారుు. అలాగే గరివిడి మండలంలో 40 మండల పరిషత్ ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మెరకముడిదాం మండలంలో 38 ప్రాథమిక, 11 ప్రాథమికోన్నత, 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. గుర్ల మండలంలో 8 ప్రాథమికోన్నత, 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నారుు. అరుుతే వీటిలో 52 పాఠశాలలకు విద్యుత సరఫరా కట్ చేశారు. ఇంకా చాలా పాఠశాలలు కూడా బిల్లులు చెల్లించేలని దుస్థితిలో ఉన్నారుు. దీంతో ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాఠశాలకు వచ్చే ఇతర నిధుల్లో కొంత మిగిల్చడంతో పాటు దాతల సహకారంతో బిల్లులు చెల్లిస్తున్నారు. ఎంతో అవసరం.... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సరఫరా అవసరం ఎంతో ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి కోసం ఏర్పాటు చేసే బోరు పని చేయాలన్నా, తరగతి గదుల్లో ఫ్యాన్లు ఉండాలన్నా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ బోధన జరగాలన్నా, పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నా కచ్ఛితంగా విద్యుత్ సరఫరా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ విద్యుత్ నిర్వహణకు నిధులు ఎందుకు కేటారుుంచడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటకై నా ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులు చెల్లించుందుకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. -
కక్కుర్తి..
• బస్తాకు సుమారు మూడు నుంచి ఐదు కిలోలు మాయం • మూడు జిల్లాల్లో నెలకు సగటున 280 క్వింటాళ్లు హాంఫట్ • నెలకు సుమారు రూ.11.24 లక్షల దుర్వినియోగం • పలు స్కూళ్లలో సన్నాలకు బదులు దొడ్డు బియ్యం సరఫరా • సన్న బియ్యం సరఫరాపై కొరవడిన అధికారుల నిఘా • సర్కారు విద్యార్థులకు తప్పని ఆకలి బాధలు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యం బస్తా బరువు 50.7 కిలోలు. కానీ.. పలు చోట్ల ఒక్కో బస్తాకు సుమారు 4 నుంచి 5 కిలోలు తక్కువగా వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో తిప్పర్తి మండల కేంద్రంతోపాటు మామిడాల ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. నిజమేనని తేలింది. తిప్పర్తి హైస్కూల్‌కు సరఫరా అయిన బియ్యం బస్తా 45.7 కిలోలే ఉంది. ఈ రెండు పాఠశాలల్లో కలిపి నెలకు 60 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే ఉపాధ్యాయులు తెలిపారు. బస్తాకు 4 కిలోలు తక్కువొస్తున్నాయి.. కనగల్ పాఠశాలలో 400 మంది విద్యార్థులున్నారు. రోజుకు 350 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. నెలకు సగటున 11 బస్తాల బియ్యం వినియోగిస్తున్నాం. ఒక్కో బస్తాలో మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున తూకం తక్కువ వస్తోంది. నెలకు సుమారు 44 కిలోల బియ్యం కోత పడుతోంది. ఇక్కడికి చాలాసార్లు దొడ్డు బియ్యం బస్తాలే వచ్చాయి. తూకం తక్కువగా ఉండడంతో విద్యార్థులకు అప్పడప్పుడు అన్నం సరిపోని పరిస్థితి ఉంటోంది. బియ్యం దిగుమతి చేసే సమయంలోనే తూకం వేయక పోవడంతో ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. - జాఫర్, కనగల్ హైస్కూల్, ‘మధ్యాహ్న’ పర్యవేక్షకుడు నల్లగొండ : దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించని చందంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల పరిస్థితి తయూరైంది. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందించాలనే మహోన్నత లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. సర్కారు పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా అవుతోన్న ఒక్కో బియ్యం బస్తా నుంచి రెండు నుంచి మూడు కిలోల వరకు పక్కదారి పడుతున్నాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడంలేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో సగటున నెలకు 280 క్వింటాళ్ల బియ్యం అక్రమార్కులు పాలవుతున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.11.24 లక్షల చొప్పున ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ.కోటి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే.. ప్రభుత్వం మిల్లర్ల ద్వారా సేకరించిన బియ్యాన్ని సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాంల్లో నిల్వ ఉంచి ప్రతి నెలా డిమాండ్ ఆధారంగా మండల స్థాయి నిల్వ(ఎంఎల్ఎస్) కేంద్రాలకు పంపుతోంది. ఈ గోదాంలు పౌరసరఫరాల సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి స్టేజ్-2 గుత్తేదారు ద్వారా పాఠశాలలు, వసతి గృహాలకు పంపిస్తున్నారు. ఎస్‌డబ్ల్యూసీ ,సీడబ్ల్యూసీ గోదాముల నుంచి తూకం వేశాకే ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యాన్ని పంపే సమయంలో తూకం విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలకు తెరలేచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్ఎస్ పారుుంట్ల నుంచి వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం చేరే సమయంలోనే రెండు నుంచి మూడు కిలోల బియ్యూన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పాఠశాలలకు పంపిణీ చేస్తోన్న బియ్యం బస్తాల పరిమాణం తక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. మధ్యాహ్న భోజనం 2.82 లక్షల మందికి... మూడు జిల్లాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,276 ఉన్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో 2,82,853 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కోసం ప్రభుత్వం రోజూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వంద గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు 150 గ్రాములు చొప్పున సరఫరా చేస్తోంది. బియ్యంతో పాటు రోజూ ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.4.60, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.6.38 చొప్పున చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతి బస్తాలో రెండు నుంచి మూడు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అసలు సమస్య ఎదురవుతోంది. నెలకు 37 వేల కిలోలు పక్కదారి.... మూడు జిల్లాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల వాస్తవ లెక్క ప్రకారం సగటున రోజూ 28,440 కిలోల బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అంటే రోజుకు 568 బస్తాలు బియ్యాన్ని వాడుతున్నారన్న మాట. బస్తాకు సగటున మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఈ లెక్కన 568 బస్తాలకు 1706 కిలోల బియ్యం పక్కదారి పడుతున్నాయి. సాధారణంగా నెలకు 22 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. అంటే నెలకు 37,532 కిలోల బియ్యాన్ని దోచేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ.35 పైగానే పలుకుతున్నాయి. ఈ బియ్యాన్ని కనీసం రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని భావించినా నెలకు రూ.11,25,960 అవుతోంది. ఇంత భారీగా ఆదా యం ఉండడం, కిలో, రెండు కిలోలే కదా అంటూ ఎవరూ పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షణ లోపం... బస్తాకు రెండు, మూడు కిలోలు బియ్యం తక్కువగా వస్తుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోత పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరు కావడం, మరికొంత మంది విద్యార్థులు ఇంటికెళ్లి తిని రావడం చేస్తున్నారు. ఈ విద్యార్థుల లెక్కలను సర్ధుబాటు చేసుకుని మిగిలిన విద్యార్థులకు భోజనం వండిపెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే ఉపాధ్యాయులు ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లి బియ్యం తీసుకురావాలి. అక్కడ వారు తూకం వేయించుకోవాలి. దీని వల్ల ఎక్కువ సమయ ం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు తూకం లేకుండానే బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది బస్తాకు 50 కిలోల చొప్పున ఎన్ని బస్తాలు వస్తే అన్ని కిలో లు వచ్చినట్లు రాసుకుంటున్నారు. వాటిని తూకం వేసి చూస్తేగానీ అసలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. ఒకవేళ తూకం వేసినా బస్తాకు రెండు, మూడు కిలోలే కదా అని తేలికగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా బియ్యం తీసుకునేటప్పుడు మీరే చూసుకోవాలని చెప్పడంతో తమకెందుకుని మిన్నకుండిపోతున్నారు. తిరుమలగిరి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వీరికోసం రోజూ 50 కిలోల నుంచి 60 కిలోల వరకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. నెల రోజులకు 11 క్వింటాళ్ల నుంచి 13 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతున్నాయి. అయితే.. ప్రతి నెల 20 కేజీల నుంచి 40 కేజీల వరకు బియ్యం తేడా వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తిలో ఉన్న గోదాం పాయింట్ వరకు, అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు ఎగుమతి, దిగుమతులు చేస్తుండటంతో బస్తాలు దెబ్బతిని చినిగి పోవడంతో తేడా వస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
సులభతర బోధన కోసమే డిజిటల్ విధానం
- దీనికి, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు - వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను డిజిటలైజేషన్ చేస్తాం - బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్ ప్రారంభించిన కడియం - రెండేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సులభంగా బోధించడం కోసమే డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చాం. దీనికి, ఉపా ధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు. టీచర్ల సంఖ్యను తగ్గిస్తామనే ఆందోళన వద్దు’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నా రు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8 లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 5,415 ఉన్నత పాఠశాలలున్నారుు. వీటిలో ప్రస్తుతం 3,352 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల్ని ప్రారంభించాం. దేశంలో ఇంతపెద్ద సంఖ్యలో డిజిటల్ తరగతుల బోధన చేపట్టింది మన రాష్ట్రమే. వచ్చే ఏడాది మిగతా అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని తీసుకొస్తాం. మనటీవీ ద్వారా ప్రసారాలు అందిస్తున్నాం. ఇందులో రెండు సౌకర్యాలున్నారుు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఆన్లైన్ పద్ధతిలో, లేనప్పుడు ఆఫ్‌లైన్ పద్ధతిలో పెన్‌డ్రైవ్ వినియోగించి పాఠ్యాంశ బోధన చేపట్టవచ్చు’’అన్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన ఆయన.. ఎనిమిదో తరగతిలో జీర్ణవ్యవస్థ, దంత వ్యవస్థకు సంబంధించిన పాఠాన్ని విద్యార్థులతో కలసి విన్నారు. పేదలకు మెరుగైన విద్య కోసం: కేటీఆర్ పేద, మధ్యతరగతి విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి మెరుగైన విద్య అందించేందుకు డిజిటల్ క్లాస్‌లను అందుబాటులోకి తెచ్చామని ఐటీశాఖ మంత్రి కె.తారకరామా రావు పేర్కొ న్నారు. బుధవారం ఉదయం మనటీవీ కార్యాలయంలో డిజిటల్ క్లాస్ ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియంతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ‘‘వచ్చే రెండే ళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం. రాష్ట్రంలో కోటి మందిని డిజిటల్ అక్షరా స్యులుగా తీర్చి దిద్దుతాం’’అని అన్నారు. మనటీవీ ద్వారా రాష్ట్రంలో 250 గంటల పాటు ఐదున్నర లక్షల మందికి గ్రూప్-2 పాఠాలను ప్రసా రం చేశామని, మనటీవీ సేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచా లకులు కిషన్, గురుకుల ఆశ్రమ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ డీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్! డిజిటల్ తరగతుల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,352 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ తరగతులకు తోడు విద్యార్థుల సందేహాల నివృత్తికి సబ్జెక్టు నిపుణులతో ఫోన్‌ఇన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం 6 నుంచి 9వ తరగతి వరకు సామాన్య, సాంఘిక, గణిత శాస్త్రాల్లో డిజిటల్ పాఠాలను రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతికి డిజిటల్ పాఠాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ పాఠాలను 3 మార్గాల్లో (మన టీవీ, కేయాన్, హార్డ్ డిస్క్) అందిస్తోంది. ముందుగా రికార్డు చేసిన పాఠాలను వీటి ద్వారా విద్యార్థులకు బోధించేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో లైవ్ పాఠాలను అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది. విద్యార్థులకు ఏదైనా సందేహం తలెత్తితే ఆయా నంబర్లకు మెసేజ్ పంపించి నివృత్తి చేసుకునే ఏర్పాట్లు చేస్తోంది. తరగతి గదిలో బోధించిన పాఠాలను యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి అందులో డిజిటల్ పాఠాలను పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో త్రీడీ యానిమేషన్ రూపంలోనూ పాఠాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. -
నేటి నుంచి డిజిటల్ బోధన
నిజామాబాద్ అర్బన్ : నేటి నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వారం రోజులుగా ఆర్మూర్‌లో డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మొదట 241 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా సౌకర్యాల ఏర్పాటులో ఆలస్యం కావడంతో ప్రస్తుతం 141 పాఠశాలల్లో బోధించనున్నారు. గతంలోనే డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కావల్సి ఉండేది. జిల్లాల పునర్ విభజన ప్రక్రియతో ఆటంకం ఏర్పడింది. అనంతరం మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సర్కారు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లాలో కూడా 111 పాఠశాలల్లో డిజిటల్ విద్యా ప్రారంభం కానుంది. 141 పాఠశాలలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 283 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. ఇందులో 141 పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రొజెెక్టర్లు, కంప్యూటర్ ఏర్పాటు, హార్డ్‌డిస్క్‌లు, ఎల్ఈడీలను విద్యాశాఖ ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. ఉన్నత పాఠశాలల్లో ఈ డిజిటల్ విద్యాబోధనను ఏర్పాటు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మన టీవీ ద్వారా ప్రసారమయ్యే విద్యాబోధనను చేపట్టనున్నారు. ఆయా పాఠశాలల్లో ప్రొజెక్టర్, హార్డ్డెస్క్లను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా మన టీవి కార్యక్రమం రోజూ ఏ సమయంలోనైతే పాఠాలు ప్రసారమవుతాయో దానికి సంబంధించి సమయానికి ముందుగానే తెలియజేస్తారు. ఆ సమయంలో సంబంధిత ఉపాధ్యాయుడు పాఠాలను బోధించనున్నారు. తరగతుల వారిగా షెడ్యుల్‌ను కేటారుుంచనున్నారు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం లేదు. నెట్వర్క్ సమస్యలు వంటి తలెత్తనున్నారుు. ఆ సమయంలో ప్రసారం అయ్యే విద్యాబోధన మళ్లీ అందుబాటులో ఉండదు. తదనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏలా బోధిస్తాడన్నది అధికారులు పేర్కొనలేదు. మరో వైపు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. సంబంధిత పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోరుుంది. ఇదివరకే పాఠశాలల్లో కంప్యూటర్లు, వంట సామగ్రిని దొంగలించడం తరచుగా జరుగుతుంది. ప్రస్తుతం విలువైన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోవడం ఉపాధ్యాయకులకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కూడా ఉన్నతాధికారులు రక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, డీఈవో రాజేశ్‌ను అడగగా.. నేటి నుంచి డిజిటల్ విద్య ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
చిన్నారికి ఎంత కష్టమో..
-
చిన్నారికి ఎంత కష్టమో..
తమ్ముడిని వెంట బెట్టుకుని బడికి.. తల్లి కూలికి.. అలంపూర్ రూరల్: చిన్నారి వయస్సు నాలుగేళ్లు.. ఒళ్లో తమ్ముడు.. చేతిలో పలకాబలపం.. అప్పుడప్పుడు పాలు పడుతూ ఏడిస్తే అమ్మపాట పాడుతుంది. ‘అమ్మ పనికి వెళ్లింది.. వస్తుంది’ అంటూ సముదాయిస్తుంది. అసలు విషయానికి వస్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన లక్ష్మన్న, సుశీల దంపతులు. లక్ష్మన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 11 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రూతు(10), మౌనిక(4), 10 నెలల వయసు గల ఆనంద్ వారి సంతానం. అతని మరణానంతరం పిల్లలను పోషించేందుకు సుశీల కూలిబాట పట్టింది. పెద్దకూతురు రూతును గట్టులోని ప్రభుత్వ హాస్టల్లో 5వ తరగతిలో చేర్పించింది. 4 ఏళ్ల వయసు గల మౌనికను, 11 నెలల వయసు గల పసిబిడ్డను స్థానికంగా ఉన్న న్యూ ప్లాట్స్ ప్రభుత్వ పాఠశాలలో వదిలి కూలికి వెళుతోంది. దీంతో ఆ 10 నెలల తమ్ముడి ఆలనాపాలనా చూసే భారం మౌనికపై పడింది. పిల్లాడు ఏడ్చిన ప్రతిసారీ.. మౌనిక సముదాయించలేక.. మరోవైపు అక్షరాలు దిద్దుకోలేక కన్నీటి పర్యంతమవుతోంది. పాపం ఆ చిన్నారి డ్రాపవుట్ అయ్యే ప్రమాదముందని హెచ్ఎం శ్రీలత, ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనికది కూడా చిన్న వయసు అని, ఆ చిన్నారే తల్లిచేత గోరు ముద్దలు తినాల్సిన పసి వయసులో 10 నెలల తన తమ్ముడి ఆలనాపాలనా చూసుకోలేక పడుతున్న కష్టం చూసి ఉపాధ్యాయులే ఓదార్పునిస్తున్నారు. -
విద్యను వ్యాపారంగా మార్చేశాయి
కార్పొరేట్ కళాశాలలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య సాక్షి, గుంటూరు: కార్పొరేట్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని, ఫలితంగా మట్టిలో మాణిక్యాల్లాంటి ఎందరో పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని, ఇది దురదృష్టకర పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మాతృభాషను, గ్రామీణ క్రీడలను, సంప్రదాయాలను విస్మరించకూడదని హితవు పలికారు. గతంతో పోలిస్తే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు పెరిగాయని, అదే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. వారు పాఠశాలలకు సమయం కేటాయించకుండా ఇతర పనుల్లో ఉండటమే కారణమన్నారు. -
రాంనగర్ ప్రభుత్వ పాఠశాల ధీనావస్థ
-
వసతుల లేమిపై అఫిడవిట్ దాఖలు చేయండి
- ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశం - ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కొరతపై పిటిషన్ల విచారణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమికి సంబంధించి పలు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉపాధ్యాయుల జవాబుదారీతనంపై గతంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ దీపక్ మిశ్రా నే తృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా కడప తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల లేమిపై అమికస్ క్యూరీ అశోక్ గుప్తా నేతృత్వంలోని కమిటీ సీల్డ్ కవర్లో ఒక నివేదికను ధర్మాసనం ముందుంచింది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ప్రభుత్వ కార్యాలయాలను నూతన రాజధానికి తరలిస్తున్న నేపథ్యంలో నాలుగు వారాల గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది అభ్యర్థించగా ధర్మాసనం సమ్మతించింది. తెలంగాణలో టీచర్లు వెనక్కి వెళ్లారా? తెలంగాణలో ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న అధ్యాపక సిబ్బందిని వెనక్కి పంపిం చారా? అని కోర్టు ప్రశ్నించింది. వెనక్కి పంపినట్లు అమికస్ క్యూరీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించిందని, వలస వెళ్లే కుటుంబాల పిల్లలకు వసతి గృహాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది కె.శ్రావణ్‌కుమార్ విన్నవించారు. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథ్ శెట్టి స్పందిస్తూ ఈ విషయంలో కోర్టు గానీ, అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ గానీ మార్గదర్శనం చేయాలని కోరారు. 4 వారాల్లోగా వసతి గృహాల ఏర్పాటుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితో పాటు పర్యవేక్షణ లోపం కూడా ఉందని శ్రావణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షకు పైగా తగ్గుతోందని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నారని వివరించారు. దీనిపై తెలంగాణ న్యాయవాది మాట్లాడుతూ కారణాలను ప్రభుత్వం గుర్తించిందని, తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు. దీంతో కార్యాచరణపై అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీతో పాటు, పిటిషనర్ అభిప్రాయాలను తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. -
అక్టోబర్ 27 నుంచి ఎస్ఏ-1 పరీక్షలు
- 29వ తేదీ నాటి పరీక్ష 31న నిర్వహణ - ఎస్ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతులకు 11 పేపర్లు - పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వచ్చే నెల 27 నుంచి నవంబర్ 3 వరకు సంగ్రహణాత్మక మూల్యాంక నం (ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 29 న నరక చతుర్దశి (ఐచ్ఛిక సెలవు) అయినందున 29న నిర్వహించాల్సిన పరీక్షను 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. మారిన షెడ్యూల్ ప్రకా రం పరీక్షలు నిర్వహించాలని డీఈవోలను ఆదేశించారు. 5వ తేదీన కచ్చితంగా ఫలితాలను విద్యార్థులకు వెల్లడించాలని చెప్పారు. అదేరోజు తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను (క్యుములేటివ్ రికార్డులు) అందజేయాలని సూచించారు. విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులపై సంతకాలు తీసుకొని 7లోగా టీచర్లు లేదా ప్రధానోపాధ్యాయులకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6,7,8 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని వివరించారు. ఒకటి నుంచి 7వ తరగతి వారికి మొదటి రోజు ప్రథమ భాషతో పరీక్షలు ప్రారంభించాలని, 8, 9, 10 తరగతుల వారికి గణితంతో పరీక్షలు ప్రారంభించాలని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో(సీసీఈ) భాగంగా ఎస్ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతుల విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
ఎంత కష్టమో!
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అని పెద్దలు చెబుతుంటారు. కానీ తమకు ఇష్టమైన చదువు కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోందని ఆదివాసీ బాలలు అంటున్నారు. బడికి వెళ్లేందుకు వారు పడే ఇబ్బందులు చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఒడిశా రాష్ట్రం కొందమాల్ జిల్లా దరింగబడి సమితి అసురబొందా గ్రామంలో 150 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో వారు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలోని గజలబడి గ్రామానికి వెళ్లాలి. అసురబొందా, గజలబడి గ్రామాల మధ్య ఒక ఏరు ఉంది. ఎండాకాలంలో వారు కాలువలో దిగి నడుచుకుని వెళతారు. వర్షాకాలం వస్తే మాత్రం నానాపాట్లు పడాల్సిందే. దీంతో కాలువకు ఈ ఒడ్డున, ఆ ఒడ్డున గల చెట్లకు రెండు తాళ్లు కట్టారు. చెట్టుపైకి ఎక్కి దాని మీద నుంచి ఒక తాడుపై నడుస్తూ పైనున్న తాడును పట్టుకుని ఆ ఒడ్డుకు వెళతారు. పిల్లలు తాడుపై వెళుతుంటే ఒడ్డున ఉన్న తల్లిదండ్రులు ఆందోళనతో చూస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అసురబొందా గ్రామ విద్యార్థుల కోసం ఏదో ఒక పథకం కింద ఇక్కడ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
ఆంగ్లానికి ఆదరణ
ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పెరిగిన ప్రవేశాలు ఒకటో తరగతిలో కొత్తగా చేరిన 12 వేల మంది విద్యార్థులు మోడల్స్కూళ్లలో ఐదు నుంచి తొమ్మిదో క్లాస్ వరకు సీట్లు ఫుల్ పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేరేందుకు అనాసక్తి మారుమూల ప్రాంతాల్లోనే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు నామమాత్రం నల్లగొండ ; ప్రభుత్వ పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లిష్ మీడియానికి అంకురార్పణ చేసిన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యాసంవత్సరం నుంచి మోడల్ స్కూళ్లలో సీట్ల సంఖ్యను పెంచారు. దీంతో పాఠశాలల్లో కూడా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సీట్లన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పదో తరగతి, ఇంట ర్మీడియట్‌లో మాత్రమే ఆశించిన స్థాయిలో ప్రవేశాలు జరగడం లేదు. మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలక ఆంగ్లానికి ఆదరణ చెందిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపక సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. బాలికలకు హాస్టల్ వసతి కల్పించి బాలురకు ఆ అవకాశం ఇవ్వకపోవడం తో ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా 12 వేల మంది.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 724 పాఠశాలలు బోధిస్తామని తీర్మానం చేశాయి. ఈ క్రమంలో కొత్తగా సుమారు 12,171 మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమంలో ప్రవేశం పొందారు. మోడల్ స్కూళ్లలోనూ సీట్లు పెంచింది. మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఈ ఏడాది ఎక్కువ మందే పోటీ పడ్డారు. పోటాపోటీగా ప్రవేశాలు... మోడల్ స్కూళ్లలో అన్ని రకాల వసతులు ఉండటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం, బోధన సిబ్బంది కొరత లేకపోవడం వంటి అంశాలు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడ్డాయి. ఆంగ్ల మాధ్యమానికి పెరుగుతున్న ఆదరణను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరానికి గాను ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతిలో 20 సీట్ల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు 80 సీట్లు ఉన్న తరగతిలో వాటి సంఖ్య వందకు చేరింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 80 నుంచి 160 సీట్లకు పెంచగా.. విద్యార్థుల ప్రవేశాలు పెరిగా యి. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 30 పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఒక్కో పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదు వందల చొప్పున 30 పాఠశాలల్లో 15 వేల సీట్లకుగాను 13,559 సీట్లు భర్తీ అయ్యాయి. 1,441 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నా యి. ఆరో తరగతిలో 205, ఏడో తరగతిలో 122, ఎనిమిదిలో 157 ఖాళీలు ఉండగా.. తొమ్మిదో తరగతిలో 326, పదో తరగతిలో 631 ఖాళీలు ఉన్నా యి. 36 పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులకు సం బంధించి సీట్లన్నీ భర్తీ అయ్యా యి. 16 పాఠశాల ల్లో ఎనిమిది, ఏడు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి సీట్లన్నీ భర్తీ కాగా.. టెన్తలో మాత్రం నిడమనూరు స్కూల్ మినహా మిగిలిన వాటిల్లో సీట్లు మిగి లాయి. ఇంటర్ అడ్మిషన్లు పరిశీలిస్తే.. 160 సీట్లు చొప్పున 30 పాఠశాలల్లో ఫస్టియర్‌లో 4,800 సీ ట్లకు 2,426 భర్తీ కాగా.. 2,374 మిగిలాయి. సెకం డియర్‌లో 4,800 సీట్లకు గాను 1,099 సీట్లు మా త్రమే భర్తీ అయ్యాయి. చందంపేట, తిప్పర్తి, ప ో చంపల్లి, మఠంపల్లి, వేములపల్లి, నడిగూడెం వం టి మారుమూల ప్రాంతాలు, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. -
తరగతులు 8.. టీచర్లు ముగ్గురే!
రెండేళ్లుగా ధర్నాలు, తరగతులు బహిష్కరించినా ఫలితం శూన్యం జిల్లా అధికారులకు, సీఎం పేషీకి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం ఇదీ రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి అల్లాదుర్గం: ప్రభుత్వ పాఠశాలలను ప్రై వేట్‌కు దీటుగా నడుపుతున్నట్లు మంత్రులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చేసినా అధికారులలో స్పందన లేదు. రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఒక్కో తరగతిలో మూడు తరగతులను నిర్వహిస్తుండడంతో విద్యార్థులు పాఠాలు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చకపోగా విద్యావలంటర్లనైనా నియమించడం లేదు. రాంపూర్ పాఠశాలలోని ఎనిమిది తరగతుల్లో 137 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కేవలం ముగ్గురు టీచర్లే పాఠాలు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ 8 తరగతి కొనసాగుతోంది. ఉపాధ్యాయులను నియమించాలని అధికారులకు ఎన్నోమార్లు మొర పెట్టుకుని ఆందోళనలు చేపట్టినా స్పందన లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6, 7 తరగతులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబితే విద్యార్థులకు ఏం అర్థమవుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం కంప్యూటర్లను సరఫరా చేసినా అవి మూలనపడ్డాయి. ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి పాఠశాలలో టీచర్లు నియమించాలని, లేకుంటే విద్యార్థులను ఎంఈఓ కార్యాలయంలో ఉంచుతామని హెచ్చరించినా అధికారుల్లో స్పందన లేదు. వారం రోజుల్లో స్పందించకుంటే... రాంపూర్ పాఠశాలపై అధికారులు వారం రోజుల్లో స్పందించకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తాం. పాఠశాలకు తాళం వేసి ఎంఈఓ కార్యాలయం వద్దనే విద్యార్థులను కూర్చోబెడతాం. పాఠశాల సమస్యపై సీఎం పేషీకి సోమవారం ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అయినా స్పందన లేదు. - వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ రాంపూర్ ఇద్దరు వలంటీర్లను నియమించాలి ఎనిమిది తరగతులకు ముగ్గురే టీచర్లు ఉన్నారు. ఇద్దరు వలంటీర్లను ప్రభుత్వం నియమిస్తే, ఒక వలంటీర్‌ను మేం నియమించుకుంటాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని రాంపూర్ పాఠశాలను కాపాడాలి. -గోపాల్, విద్యా కమిటీ చైర్మన్ పాఠాలు అర్థం కావడం లేదు ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహించడంతో ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థం కావడం లేదు. కింది తరగతులకు అప్పుడప్పుడు విద్యార్థులే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి. - మోహన్, విద్యార్థి. -
సర్కారు బడికి పంపకుంటే జరిమానా
ప్రభుత్వ పాఠశాలను రక్షించేందుకు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పొరకలపల్లి గ్రామస్తులు నడుంకట్టారు. మంగళవారం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, వార్డుసభ్యులు, చైతన్యయూత్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమం కూడా ఉండడంతో గ్రామంలోని బడిఈడు పిల్లలందరినీ సర్కారు బడిలోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని, ఉల్లంఘించినవారికి రూ.5వేల జరిమానా విధించాలని సమష్టి నిర్లయం తీసుకోవడమే కాకుండా అగ్రిమెంటు పత్రం రాసుకొని దానిపై అందరూ సంతకాలు చేశారు. -
ఉపాధ్యాయులు లేని చోట విద్యా వలంటీర్లు
696 మంది అవసరమని జిల్లా విద్యా శాఖ ప్రతిపాదనలు ఎందరిని నియమిస్తారన్న అంశంపై రెండు రోజుల్లో స్పష్టత పాతవారి కొనసాగింపుపై వెల్లడికాని నిర్ణయం విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ విద్యా వలంటీర్ల నియూమకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సీఎం కేసీఆర్ పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట విద్యా వలంటీర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. జిల్లాకలెక్టర్ అనుమతితో జిల్లా విద్యాశాఖాధికారి విద్యా వలంటీర్లను నియమిస్తారు. అందుకుసంబంధించిన మార్గదర్శకాలు వచ్చాక ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 696 మంది విద్యా వలంటీర్ల అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ కొద్దిరోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదించారు. ప్రధానంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. మరికొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉండి ఎస్జీటీలు ఎక్కువ ఉన్నారు. ఏ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందో ముందుగా అక్కడ వర్క్‌అడ్జస్ట్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నారు. ఇంకా తక్కువపడితే విద్యా వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 696 మంది వలంటీర్లనే నియమిస్తారా లేదా ఇంకా కొంత సంఖ్య పెంచుతా రా అనేది వేచి చూడాలి. జిల్లాలో ఎం త మంది విద్యావలంటీర్లు నియూమ కం కానున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది. జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 300 మందికిపైగా విద్యా వలంటీర్ల ను కొనసాగించా రు. వారిని మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్
మద్దూరు: గ్రామంలో ఎవరైనా ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే.. వారి ఇంటికి నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చూడాలని వరంగల్ జిల్లా మద్దూరు మండలం లింగాపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం కోసం స్వచ్ఛందంగా ఏడాదికి రూ.3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్ సందిటి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌మీడియం లేనందున పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామని, ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏడాదికి రూ. 3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని, ఆ మొత్తంతో ఇంగ్లిష్ మీడియం బోధనకు విద్యావలంటీర్‌ను నియమించాలని తీర్మానించారు. -
ఆదర్శ నేతలు
తమ పిల్లలను సర్కారు స్కూలుకు పంపిస్తున్న ప్రజాప్రతినిధులు సాధారణంగా సర్కారు బడంటేనే చిన్నచూపు.. కూలీ పనికి వెళ్లేవారు కూడా తమ పిల్లలను సర్కారు బడికి బదులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.. ఇటువంటి రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిపై ఈవారం సండేస్పెషల్ వారు ప్రజాప్రతినిధులు.. ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి కలిగినవారే.. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత ఉన్నవారే.. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తిరిగి, విద్యార్థులను సర్కారు బడులకే పంపాలని ప్రచారం చేశారు. తామే ఆదర్శంగా ఉండేందుకు పలువురు ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న నేతలపై సండే స్పెషల్.. బీర్కూర్ : తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు బీర్కూర్ ఎంపీపీ మీనా హన్మంతు. ఈనెల 9న గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం కోసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎంపీపీ మీనాహన్మంతు దంపతులు మాట్లాడారు. ఒకటో తరగతిలో తమ కుమారుడు శ్రీహర్షను చేర్పించడానికి అంగీకారం తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం రోజు గ్రామంలోని గడివద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. 13న సర్కారు బడిలో అక్షరాభ్యాసం చేయించారు. శనివారం పాఠశాలలో విద్యారుథలకు పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తమ కుమారుడిని క్రమం తప్పకుండా సర్కారు బడికి పంపిస్తున్నామన్నారు. తన కుమారుడు అందిరితోపాటే క్యూలో వచ్చి పాఠ్యపుస్తకాలు తీసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని, సర్కారు బడులు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. మొదటినుంచీ.. నాగిరెడ్డిపేట : పోచారం సర్పంచ్ గోపాల్‌గౌడ్ తన కూతురు సాయిభవానిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సాయిభవాని ఐదో తరగతి చదువుతోంది. తన కూతురును ఒకటో తరగతినుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని గోపాల్‌గౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే.. సర్కారు బడి బాగుపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఐదేళ్లుగా... సిరికొండ : తూంపల్లి సర్పంచ్ బూస దేవరాజ్ తన కూతురు హేమవర్షికను సర్కారు బడిలో చదివిస్తున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హేమవర్షిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుమారుడు రిషివర్ధన్‌కు మూడేళ్లు. తన కూతురును ఒకటో తరగతినుంచి సర్కారు బడిలోనే చదివిస్తున్నానని దేవరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై గ్రామస్తులందరికీ నమ్మకం ఉండాలనే తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానన్నారు. నమ్మకం పెంచేందుకే.. మాచారెడ్డి : ఘన్పూర్ (ఎం) ఎంపీటీసీ సభ్యుడు ఎడపల్లి శ్రీనివాస్ తమ ఇద్దరు పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆయన కూతురు మేఘనను చుక్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కుమారుడు కార్తీక్‌ను గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలల్లో చేర్చాలంటున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నానన్నారు. సర్పంచ్ కూతురు.. నిజాంసాగర్ : బూర్గుల్ సర్పంచ్ దుడ్డె అనితా సురేందర్ తన కూతురు షర్మిలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. షర్మిల మూడో తరగతి చదువుతోంది. సర్పంచ్ తన కూతురును ప్రభుత్వ పాఠశాలకు పంపుతుండడంతో గ్రామస్తులూ సర్కారు బడిని ఆదరిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తెలిపారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
నర్సంపేట రూరల్: మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్, ఎంపీటీ సభ్యురాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి తమ గ్రామం నుంచి నర్సంపేటకు విద్యార్థులను తీసుకెళుతున్న ప్రైవేట్ పాఠశాలల బస్సును సోమవారం నిలిపివేశారు. విద్యార్థులను దింపి, వారందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మండ మహేందర్, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి లావణ్యరాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని, చిన్నారులను ఈ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజ లు సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ‘చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించమని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భోజనానికి బియ్యం లేవ్ !
♦ అరువు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న వైనం ♦ వండిపెట్టేందుకు ఏజెన్సీల విముఖత ♦ ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యాచారం: యాచారం మండల పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ నానికి బియ్యం కొరత ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో గత ఏడాది మిగిలిన బియ్యం తో సరిపెడుతుండగా మరికొన్ని పాఠశాలల్లో అవికూడా లేకపోవడంతో కిరాణషాపులు, రేషన్ డీలర్ల వద్ద అరువపై బియ్యం తెచ్చి విద్యార్థులకు వండిపెడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజ నానికి సంబంధించి బియ్యం సరఫరా చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువుతున్నాయి. మండల పరిధిలో 20 ఉన్నత, 37 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ ఉంది. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,771 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 120 లోపే విద్యార్థులు ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 200 పైగానే ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం పథకం కింద ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 150 గ్రాములు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున బియ్యం వండిపెడుతున్నారు. మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 3 క్వింటాళ్ల బియ్యం బియ్యం అవసరమవుతాయి. ఏజెన్సీలను నిర్వహించలేం.. రెండు రోజుల్లో బియ్యం పంపిణీ చేకపోతే మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేస్తామని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికే నెల రోజుల బిల్లు పెండింగ్‌లో ఉందని, ఈ నేపథ్యంలో కూరగాయలతో పాటు బియ్యం కూడా అప్పు తెచ్చి భోజనం పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. మూడు రోజుల్లో బియ్యం సరఫరా చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. బియ్యం నిల్వల కోసం డీఈఓకు నివేదిక పంపించాం. రెండు, మూడు రోజుల్లో బియ్యం సరఫరా అవుతాయి. కొన్ని పాఠశాలల్లో వేసవి భోజనానికి సంబంధించిన బియ్యం ఉన్నాయి. అవి కూడా లేని చోట ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బియ్యం తెచ్చి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నాం. - వినోద్‌కుమార్, ఎంఈఓ, యాచారం -
యూ‘నో’ఫాం!
♦ ఇచ్చుడు వచ్చినప్పుడే.. ♦ అతీగతీ లేని యూనిఫాం క్లాత్ ♦ ఈ విద్యాసంవత్సరం ఆలస్యమే.. ♦ సకాలంలో ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు విద్య.. పాఠ్యపుస్తకాలు.. స్కూల్ డ్రస్.. మధ్యాహ్న భోజనం.. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సౌకర్యాలు. బడులు తెరిచే నాటికి దుస్తులు పిల్లలకు పంపిణీ చేస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి అంటూ బడిబాటలో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుల పరిస్థితి దుస్తుల జాడ లేకపోవడంతో కక్కలేక మింగలేకుండా ఉంది. యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు గత విద్యాసంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యం చేస్తారా.. అసలు దుస్తులు వస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు యూనిఫాం విషయమై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి. అధికారులు మాత్రం ఇండెంట్ పెట్టాం.. ఎప్పుడొస్తే అప్పుడే పాఠశాలలకు పంపిస్తామని చెప్పడం గమనార్హం. - ఖమ్మం ఇండెంట్ పంపించాం.. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఇండెంట్ పంపించాం. ఈ విద్యాసంవత్సరం 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే 1,57,364 మంది విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయాల్సి ఉంది. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి క్లాత్ వచ్చిన వెంటనే యూనిఫాంలు త్వరగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. - రవికుమార్, ఎస్ఎస్ఏ పీఓ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య తారతమ్య భావన లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందిస్తోంది. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల చొప్పున అందించేందుకు రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉచితంగా క్లాత్ సరఫరా చేస్తోంది. గతంలో ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తే.. ఎమ్మార్సీల ద్వారా దానిని పాఠశాలలకు పంపించడం.. అక్కడ వాటిని కుట్టించి విద్యార్థులకు సరఫరా చేసేవారు. అయితే ఇలా చేయడం వల్ల జాప్యం జరుగుతుందని, నాణ్యత లోపిస్తుందని భావించిన ఎస్ఎస్ఏ(సర్వశిక్ష అభియాన్) అధికారులు దుస్తుల క్లాత్‌కు జతకు రూ.160, కుట్టుకూలి రూ.40 చొప్పున.. జతకు రూ.200.. రెండు జతలకు రూ.400 చొప్పున హెచ్ఎం అకౌంట్లలో వేసేవారు. కొన్ని ప్రాం తాల్లో ఇవి సక్రమంగా పంపిణీ కావడం లేదని, పలువురు డబ్బులు కాజేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో క్లాత్‌ను నేరుగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కుట్టించి ఇచ్చేవారు. అయితే గత విద్యాసంవత్సరం ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. పంద్రాగస్టుకు కొత్త బట్టలు వేసుకుందామని భావించిన విద్యార్థులకు.. జవవరి 26 వరకు కూడా అందుబాటులోకి రాలేదనే విమర్శలు వచ్చాయి. ఈ‘సారీ’ ఆలస్యమే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నానా తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు దుస్తులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. దుస్తులు ఎక్కడ కొనుగోలు చేయాలి.. ఎవరికి అప్పగించాలి.. అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా దుస్తుల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అన్నీ ఉచితమే అని ఉపాధ్యాయులు చెప్పడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నామని, అయితే దుస్తులు ఇవ్వడం ఆలస్యం కావడంతో కొత్త బట్టలు కుట్టించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు వందలకు వందలు పెట్టి బట్టలు ఎలా కుట్టించాలని వాపోతున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి సరఫరా చేస్తే ఈ బాధ ఉండేది కాదని అంటున్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, దుస్తులు అందిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం. -
పదేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
శివాజీనగర్(దుగ్గొండి) : దేవాలయాల్లాంటి ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి ఊరి ప్రజలంతా ఒక్కటయ్యారు. దశాబ్దం క్రితం మూతపడిన పాఠశాల దుమ్ముదులిపి ఈ నెల 13న తెరిపించారు. శుక్రవారం మంచిరోజు కావడంతో గ్రామంలో ప్రతి విద్యార్థిని మండల అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఊరిబడిలో చేర్పించారు. మొదటి తరగతి గదిని తహసీల్దార్ రమాదేవి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు అధికారులు పలకలు, పుస్తకాలతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కుక్కముడి సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు సుకినె రజిత, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఎంఈఓ ప్రశాంత్, ఈఓపీఆర్డీ ఖాజామైనొద్దిన్, సర్పంచ్ మంద లక్ష్మి, సుకినె రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఊరి బడి దేవాలయం : ఏజేసీ తిరుపతిరావు ఊరి బడి గ్రామస్తులందరికి అక్షర దేవాలయమని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. దానిని పవిత్రంగా భావించి విద్యార్థులందరిని ఊరిబడికే పంపాలన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. చిన్నారులందరితో స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. తమ పిల్లలను ఊరిబడికి పంపిస్తున్న తల్లిదండ్రులను శాలువాలు, పూలమాలలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంఓ మనోజ్‌కుమార్, హెచ్ఎం గట్టు జీవన్‌కుమార్, సర్పంచ్ బొమ్మెన లక్ష్మీశోభన్, సీఆర్పీ రమేష్‌బాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ బాటలో సర్కారు బడి!
- ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుకు సర్కారు చర్యలు - ఎల్కేజీ, యూకేజీ ఏర్పాటుకు ‘వయసు’ నిబంధన అడ్డు - ఈ ఏడాది ఒకటో తరగతిలో మాత్రమే.. ఏటా ఒక్కో తరగతి పెంపు - త్వరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించేందుకు సర్కారు చర్యలు చేపడుతోంది. ఎల్కేజీ(ప్రీపైమరీ) నుంచే ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా.. పిల్లల్ని బడిలో చేర్చుకునే వయసు నిబంధన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ఒకేసారి ఇం గ్లిషు మీడియం ప్రవేశపెట్టకుండా.. ఈ ఏడాది ఒకటో తరగతిలోనే ప్రారంభించనుంది. వచ్చే ఏడాది రెండో తరగతిలో, ఆ తర్వాత మూడో తరగతిలో ఇలా ఏటా పెంచుకుం టూ అమలు చేయనుంది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం బోధన కోసం మూడు దశల్లో తీర్మానం చేసి పంపితేనే ప్రారంభిస్తామన్న విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు చర్యలు చేపట్టారు. ‘సాక్షి’ జిల్లాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం... 3 వేలకు పైగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని డీఈవోలు లెక్కించారు. తల్లిదండ్రుల్లో నిరాశ: ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం తల్లిదండ్రుల్లో నిరాశ నింపుతోంది. ఇంగ్లిష్ మీడియంను ఎల్కేజీ నుంచే (మూడేళ్ల వయసు నుంచే) ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ‘బడి బాట’ సందర్భంగా క్షేత్రస్థాయిలో టీచర్లు అదే హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని బడిబాట కార్యక్రమంలో టీచర్లు హామీలు ఇచ్చారు. ఈ మేరకే వారు, తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తీర్మానాలు చేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. తీర్మానాల మేరకే..: ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే తాము బోధిస్తామని టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు... తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తామని తల్లిదండ్రులు.. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధంగా ఉన్నామని, తగిన వనరులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తీర్మానం చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని మూడు దశల్లో తీర్మానం చేయాలని, ఆ ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా వస్తేనే... ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తామని నిబంధన విధించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకు పైగా పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్లు, కమిటీలు తీర్మానాలు చేశారు. డీఈవోలు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రతిపాదనలను పాఠశాల విద్యా డెరైక్టర్ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం వచ్చాకే ఆయా పాఠశాలల్లో అధికారికంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైనట్లు లెక్క. కొన్ని చోట్ల ఇతర తరగతుల్లోనూ.. కొన్ని చోట్ల ఒకటో తరగతిలో కాకుండా ఇతర తరగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల 6వ తరగతిలో, మరికొన్ని చోట్ల 7వ తరగతిలో ఇంగ్లిష్ మీడియం కోసం చర్యలు చేపట్టారు. అయితే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు డెరైక్టరేట్‌కు అందలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. గతంలోనూ విద్యాశాఖకు తెలియకుండా ఇంగ్లిష్ మీడియం బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రారంభించారు. దీంతో టీచర్ల సమస్య తలెత్తింది. ఈసారి ఏం చేస్తారన్నది త్వరలోనే తేలనుంది. ప్రీప్రైమరీ సిలబస్‌పై దృష్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రీప్రైమరీ విద్య ఉన్నందున ఆ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే ప్రీప్రైమరీలో ఉపాధ్యాయ విద్యా కోర్సు ప్రారంభం, దాని సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 263 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రీప్రైమరీ కోసం విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఏటా ఒక్కో తరగతిలో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఒకేసారి అన్ని తరగతుల్లో కాకుండా ఏటా ఒక్కో తరగతిలో ప్రారంభిస్తూ వెళ్లాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది 2వ తరగతిలో, ఆపై మూడో తరగతిలో.. క్రమంగా ఇంగ్లిష్ మీడి యంను అన్ని తరగతులకు వర్తింపజేయాలని భావిస్తోంది. తల్లిదండ్రులు డిమాం డ్ చేస్తున్న ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు పాఠశాలల తరహాలో మూడేళ్ల వయసులోనే పిల్లలను స్కూల్లో చేర్చుకునేలా ఎల్కేజీ, యూకేజీ నుంచే కావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ ప్రారంభించాలంటే.. పిల్లలను బడిలో చేర్చుకునే వయసు నిబంధనను మార్పు చేయాలని, అది ఇప్పటికిప్పుడు సాధ్యం కానందునే ఒకటో తరగతి నుంచి ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
708 పాఠశాలల్లో బయోమెట్రిక్
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు సర్వశిక్షా అభియూన్ ద్వారా నిధులు {పతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుచేయబోతున్నారు. దీని ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతూనే ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి నాణ్యమైన విద్య అందించాలనే అభిప్రాయం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, తండాల్లోని పాఠశాలల్లో వంతులవారీగా ఉపాధ్యాయులు తమ విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలున్నా యి. అలాగే, కొందరు తాము పనిచేసేచోట కా కుండా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచి రైళ్లు, బస్సుల్లో వంద కిలోమీటర్లకు పైగా రాకపోకలు సాగిస్తుండడంతో సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం సడలిందనే అభిప్రాయం ఉంది. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో 86 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. వందలాది పాఠశాలల్లో 20నుంచి 30మందిలోపే విద్యార్థు లు ఉండడం గమనార్హం. ప్రభుత్వ ఆమోదం.. ఈ విద్యా సంవత్సరంలో రాష్ర్ట్రంలో 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్లతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయంపై చర్చించారు. నిధులపై జిల్లా కలెక్టర్ల ప్రతిపాదన ల మేరకు బయోమోట్రిక్ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఈ వి ద్యాసంవత్సరం సుమారు 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని వి ద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అం దుకు సంబంధించిన పరికరాలు జూన్ నెలాఖ రుకల్లా ఎంపిక చేసిన పాఠశాలల్లో అమర్చనున్నారని తెలుస్తోంది. అందుకు నిధులు సర్వశిక్షాఅభియాన్ నుంచి కలెక్టర్లకు విడుదల చేయబోతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాలో ప్రా థమిక పాఠశాలలు 2049 ఉండగా. యూపీఎస్ లు 360, హైస్కూళ్లు 510 ఉన్నాయి. మొత్తంగా 13,896 ఉపాధ్యాయ పోస్టులుండగా ప్రస్తుతం 12,068మంది పనిచేస్తున్నారు. ఇక.. జిల్లాలో 2015-2016 విద్యాసంవత్సరంలో 1నుంచి 5వ తరగతి వరకు లక్షా 26వేల 878 మంది విద్యార్థులు, 6నుంచి 8తరగతుల్లో 86,765 మంది వి ద్యార్థులు ఉన్నారని, 9, 10 తరగతుల్లో 59,637 మంది విద్యార్థులు ఉన్నట్లు డైస్ లెక్కల్లో ఉంది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేశారు. ప్రవేశాల సమయంలో ఆ ధార్ నంబర్ నమోదు చేస్తారు. గత ఏడాది పా ఠశాలల్లో చేరిన పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం చేసే చైల్డ్ ఇన్ఫో ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎందరు విద్యార్థులు ఉన్నారనేది తేటతెల్లం కా బోతుంది. డైస్ లెక్కల ప్రకారం చూపిన విద్యార్థుల సంఖ్యలో ఆధార్ అనుసంధానంతో 60వేలకు పైగా విద్యార్థులు త గ్గారనేది ప్రాథమిక అంచనా. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశముం ది. ఈ విద్యా సంవత్సరం బడి బాట కార్యక్ర మం కూడా కొనసాగుతుండగా.. ప్రతీ పాఠశాల లో కనీసం ఐదు శాతం అధికంగా సంఖ్య పెం చాలని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ రోవైపు ఈ విద్యాసంవత్సరం 476 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు శాతంపెరిగి తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్న అభిప్రాయం ఉంది. అంతేగాకుండా బయోమెట్రిక్ ద్వారా ప్రతీరోజు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం ఎంద రికి ఉపయోగపడుతుందనే కూడా తెలిసిపో తుంది. అయితే బయోమెట్రిక్ అమలు చేయబోతున్నారని తెలిసి ఉపాధ్యాయుల్లో మాత్రం అది ‘భయో’మెట్రిక్ అనే చర్చ జరుగుతోంది. -
మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతాం..
♦ వెంటనే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించండి.. ♦ తడ్కపల్లి గ్రామస్తుల తీర్మానం సిద్దిపేట రూరల్: ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపిస్తామని మండలంలోని తడ్కపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. సోమవారం బడిబాటలో భాగంగా గ్రామానికి వెళ్లిన డిప్యూటీ ఈఓ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎంఈఓ ప్రసూనాదేవికి సర్పంచ్ గడ్డం బాల్‌నర్సయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తడ్కపల్లి గ్రామం నుంచి 5 నుంచి 10సంవత్సరాలోపు సుమారుగా 150మంది విద్యార్థులకు పైగా ఉన్నారన్నారు. వీరంతా ప్రతి రోజూ సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారన్నారు. ఒక్కో విద్యార్థికి వేలల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బోధిస్తే గ్రామంలోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, విద్యా కమిటీ చైర్మన్ ఆగంరెడ్డి, గ్రామ నాయకులు శ్రీనివాస్, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
హాజరు శాతం పెంచడమే లక్ష్యం
♦ కలెక్టర్ రోనాల్డ్ రోస్ ♦ కోత్లాపూర్‌లో బడిబాట ప్రారంభం సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడమే ఆచార్య జయశంకర్ బాడిబాట ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కోత్లాపూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఐదు నుంచి పదిహేనేళ్ల వయసులోపు పిల్లలను పనుల్లో పెట్టుకోరాదని సూచించారు. పిల్లలు పా ఠశాలల్లో ఉండేలా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బడి బయట పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన క ల్పించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలు తరచూ సమావేశాలను నిర్వహించి బడిబాట కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి యాస్మిన్ బాషా, తహసీల్దార్ గోవర్దన్, ఆర్ఐ కార్తీక్, ఎంపీటీసీ కళావతి వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సర్కారు టీచర్.. ప్రైవేట్‌కు ప్రచారం
- సొంత పాఠశాల ఫ్లెక్సీలు కడుతూ దొరికిన సారు - బడిబాట ప్రారంభం రోజే నిర్వాకం సిరిసిల్ల రూరల్: ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని కోరాల్సింది పోయి తనకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదీ కూడా ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ముష్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ భగవాన్‌కు సిరిసిల్లలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉంది. తన భార్యను కరస్పాం డెంట్‌గా పేర్కొంటూ మొత్తం వ్యవహారాన్ని తానే నడిపిస్తుంటాడు. ముష్టిపల్లి, రాజీవ్‌నగర్‌లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు రావాలని శనివారం ప్రచారం నిర్వహి స్తూ గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా గ్రామస్తులు సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దీంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. కృష్ణభగవాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సర్పంచ్ గొల్లపల్లి బాలగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు బుర్ర మల్లికార్జున్, విద్యా కమిటీ చైర్పర్సన్ లావణ్య తది తరులు ఎంఈవో రామచందర్‌రావుకు ఫొటోలను జతపరిచి ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయునికి ఎంఈవో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉపాధ్యాయుని తీరుపై నివేదిక అందించాలని డీఈవో ఆదేశించారు. ఈ విషయంపై కృష్ణభగవాన్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, తాను ప్రచారం నిర్వహించలేదని, వార్తా రాయొద్దని కోరడం కొసమెరుపు. -
బడిని బతికిద్దాం..
♦ ఈ ఏడాది నుంచే స్కూళ్లలో బయోమెట్రిక్ ♦ 25 శాతం పాఠశాలలకు వర్తింపు ♦ బడిబాటలో ఐదు శాతం విద్యార్థుల నమోదు పెరగాలి ♦ ఆ తర్వాత రేషనలైజేషన్‌పై నిర్ణయం డిప్యూటీ సీఎం ప్రకటన అంపశయ్యపై ఉన్న ప్రభుత్వ బడు లకు ఊపిరిలూదేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడికి ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ యేడు 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం రాత్రి కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఈ యేడు బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చే శారు. - పాపన్నపేట పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యాప్రమాణాలే కాదు విద్యార్థుల సంఖ్యా తగ్గిపోతోందని, ఫలితంగా పాఠశాలలు మూతబడుతున్నాయంటూ ఇటీవల తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరఫున సాగర్‌రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో గత నెల 30న జిల్లాలోని సిద్దిపేట, నంగునూర్ మండలాల్లో మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలను సుప్రీం కోర్టు బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా బాగా పనిచేసే టీచర్లను నియమించి, బడులను మళ్లీ తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు శాతాన్ని, సమయపాలనను క్రమబద్ధం చేసి, పర్యవేక్షణను మెరుగు పరిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం శ ుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యక్తమైంది. బయోమెట్రిక్‌తో జవాబుదారీతనం... బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, సమయపాలన మెరుగుపడుతుందని నిజామాబాద్, వరంగల్ కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్‌కు రూ.7,500నుంచి రూ.8వేల వర కు ఖర్చు వస్తుందన్నారు. మొదటివిడతగా 25 శాతం బడుల్లో ఈ యేడు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తామని కడియం ప్రకటించారు. పీఎస్, యూపీఎస్‌లకు సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ రకంగా జిల్లాలో సుమారు 600 పాఠశాలల్లో బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. 5 శాతం అదనపు నమోదు లక్ష్యం... శుక్రవారం నుంచి ప్రారంభమైన బడిబాటలో కనీసం 5 శాతం విద్యార్థుల సంఖ్యను అదనంగా నమోదు చేయాలని డిప్యూటీ సీఎం శ్రీహరి సూచించారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులను, ఎస్ఎంసీలను, స్వచ్ఛంద సంస్థలను, ఎమ్మెల్యేలను, అవసరమై తే మంత్రులను భాగప్వాములను చేయాలని సూచిం చారు. బడిబాట కార్యాచరణను ఖరారు చేసే అధికా రం కలెక్టర్లకు అప్పగించారు. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను, జిల్లా డెవలప్మెంట్ ప్లాన్ ను జిల్లా అధికారులు రూపొందించాలని ఆదేశించారు. బడిబాట తర్వాత రేషనలైజేషన్... పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్ అంశాన్ని మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రస్తావించగా, బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు శాతంపై అవగాహన వస్తుందని, ఆ తర్వాతే రేషనలైజేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. అలాగే ప్రాథమిక స్థాయిలో స్నేహబాల పథకాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. సకాలంలో వీవీల నియామకం ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు త్వరలో విద్యా వలంటీర్లను నియమిస్తామని కడియం తెలిపారు. ఎక్కడైనా సింగిల్ టీచర్ సెలవుపై వెళ్తే సదరు పాఠశాల మూతబడకుండా వెంటనే వీవీలను అక్కడకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరి నియామకంపై కలెక్టర్లకు అధికారాలిస్తామన్నారు. -
ఇంగ్లిష్ నేర్పిస్తాం!
♦ జిల్లాలో 317 స్కూళ్లు ఆంగ్ల మాధ్యమానికి అంగీకారం ♦ ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 స్కూళ్లలో అమలు ♦ హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు ♦ తీర్మానాలు చేసి విద్యాశాఖకు పంపిన ♦ గ్రామాల్లోని మూడు కమిటీలు పుస్తకాల పంపిణీ ♦ ఇతర సౌకర్యాలపై ప్రభుత్వం నుంచి లేని స్పష్టత ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంగ్లిష్‌లో విద్యాబోధన చేసేందుకు పలు స్కూళ్ల ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారు. మేం నేర్పిస్తామంటూ స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్న పాఠశాలల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 317 స్కూళ్లు ఆంగ్ల మాధ్యమానికి అంగీకరిస్తూ తీర్మానం చేశాయి. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఇంగ్లిష్ బోధనకు అంగీకరించారు. అయితే అందుకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. పరిగి: ఈ విద్యాసంవత్సరం నుంచే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం నుంచి తప్పనిసరి నిబంధన లేకున్నా.. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా చొరవ తీసుకుని ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలంటే ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ, గ్రామ పంచాయతీలు వేర్వేరుగా మూ డు తీర్మానాలు చేసి విద్యా శాఖకు పంపాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 317 పాఠశాలలకు సంబంధించిన తీర్మానాలు విద్యాశాఖకు అందాయి. అయితే ఈ ఏడాది 1వ తరగతితో ఇంగ్లిష్‌లో విద్యాబోధన ప్రారంభం కానుంది. వీరు పై తరగతులుకు వెళ్తున్నాకొద్ది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకుంటూ వెళ్తుంటారు. ఇలా ప్రాథమిక పాఠశాల ఐదేళ్లలో పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా తయారవుతుంది. ఈ సారికి స్వచ్ఛందంగానే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఇప్పటికే ‘సక్సెస్’ పేరుతో ఆంగ్లంలో బోధన కొనసాగుతోంది. ఐదేళ్లలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా అన్ని తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి తీసుకొస్తే.. ఇక ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారనున్నాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుత ఆంగ్ల బోధన అధికారికంగా మాత్రం కాదు. కేవలం ఆ పాఠశాల, ఆ పాఠశాల పరిధి గ్రామస్తులు, ఎస్ఎంసీ కమిటీల కోరిక మేరకే స్వచ్ఛందంగా మొదటి తరగతిలో ఈ ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. గతంలో అధికారికంగా ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన సక్సెస్ స్కూళ్లు అంతగా సక్సెస్ కాలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో పూర్తిస్థాయి అధికారిక ఆంగ్లమాధ్యమానికి ప్రభుత్వం వెనకాడుతోందన్న అనుమానాలున్నాయి. స్వచ్ఛంద ఆంగ్ల బోధన ఫలితాలనిస్తే.. వచ్చే ఏడాది నుంచి అధికారిక అమలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరి పుస్తకాలు..? జిల్లాలో 317 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు ఆయా పాఠశాలలు ముందుకు వచ్చినప్పటికీ ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు విద్యా శాఖ పంపిణీపై స్పష్టత లేదు. ఇప్పటికైతే పుస్తకాలు లేవు.. వీలును బట్టి సరఫరా చేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ప్రాథమిక పాఠశాలల్లోని మొదటి తరగతిలోనే ఆంగ్ల మాధ్యమాన్ని ఈ సారి పరిచయం చేస్తున్నారు. ఒకటో తరగతికి ఉండేది తెలుగు, ఆంగ్లం. మొత్తం రెండు పుస్తకాలు మాత్రమే. తెలుగు ఎలాగూ తెలుగులోనే కాబట్టి ఒక్క గణితం పుస్తకం మాత్రమే ఆంగ్లంలో ఉంటే సరిపోతుంది. ఈ నేఫథ్యంలో ఈ సిలబస్‌నే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకుని ఈ సంవత్సరానికి కానివ్వాలని విద్యాశాఖ పేర్కొంటోంది. ఏదిఏమైనా ఆంగ్ల మాధ్యమం లేనందునే విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడంలేదని ఉపాధ్యాయులు చేస్తున్న వాదనను వారు సమర్థించుకోవాలంటే ఈ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను సక్సెస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిగి నియోజకవర్గంలోనే అధికం.. పరిగి నియోజకవర్గంలో 54 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి ప్రవేశించనున్నాయి. మొదటి తరగతిలో చేరే వారికే ఈ ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉండనుంది. ఆ తరగతిలో చేరే విద్యార్థులు అప్‌గ్రేడ్ అవుతూ పోతే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ పాఠశాలలన్నీ పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమ స్కూళ్లుగా అవతరిస్తాయి. ఇవి సక్సెస్ అయితేనే.. ఈ సారి పరిగి నియోజకవర్గంలో 54 పాఠశాలల ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇందులో పరిగి మండలంలో 11, దోమలో 11, కుల్కచర్లలో 11, గ ండేడ్లో 10, పూడూరులో 11 పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ పాఠశాలలు సమాజానికి, తల్లిదండ్రులకు నమ్మకం కల్గించగలిగితే వీటికి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మరో మారు నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ప్రత్యేక చొరవ తీసుకుని సక్సెస్ చేయాలి. తల్లిదండ్రులు, జీపీలు, ఎస్ఎంసీ కమిటీల భాగస్వామ్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ అవసరం. - హరిశ్చందర్, డిప్యూటీ ఈఓ -
నిర్లక్ష్యం
గత విద్యాసంవత్సరం చివరలో యూనిఫాం పంపిణీ కుట్టుకూలి బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం ఎంఈవో కార్యాలయం చుట్టూ డ్వాక్రా మహిళల ప్రదక్షిణలు ఫైలు సిద్ధం చేస్తున్నామంటున్న డీఈవో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీచేసే యూనిఫాం విషయంలో విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన దుస్తులను మార్చి, ఏప్రిల్ నెలల్లో పంపిణీచేశారు. అయితే ఆ దుస్తులు కుట్టిన డ్వాక్రా మహిళలకు నేటికీ బిల్లులు చెల్లించలేదు. మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం విషయంలో అడుగడుగునా జాప్యం జరుగుతోంది. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచిన వెంటనే యూనిఫాం పంపిణీచేయాలి. అయితే విద్యాసంవత్సరం చివరిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో యూనిఫాం అందజేశారు. దుస్తులు కుట్టించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఎవరితో దుస్తులు కుట్టించాలనే అంశంపై తొలుత తర్జనభర్జన పడిన అధికారులు ఎట్టకేలకు ఆ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా 1.91,467 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం చొప్పున కుట్టించి అందజేశారు. దుస్తులు కుట్టినందుకు ఒక్కొక్క జతకు రూ.40 చొప్పున కుట్టుకూలిగా నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రూ.1.53 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుస్తులు కుట్టి అధికారులకు అప్పగించినా నేటి వరకూ కుట్టుకూలి రాలేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం డ్వాక్రా మహిళలు ఎంఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం కనిపించడంలేదు. సర్వశిక్షా అభియాన్‌లో నగదు నిల్వలు ఉన్నా ఏ కారణంతో బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. తొలి నుంచీ జాప్యమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందజేయడంలో తొలి నుంచీ నిర్లక్ష్యం కనబడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి యూనిఫాం అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలు మూసివేసే నాటికి అందజేశారు. విద్యార్థుల యూనిఫామ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను గత ఏడాది డిసెంబర్ నాటికి కూడా ఆప్కో ద్వారా సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెటీరియల్ అందజేస్తే మార్చి, ఏప్రిల్ నాటికి దుస్తులు కుట్టి విద్యార్థులకు పంపిణీచేశారు. కొన్ని చోట్ల డ్వాక్రా మహిళలు యూనిఫాం కుట్టారు. మరికొన్ని చోట్ల స్థానికంగా ఉన్న దర్జీలే డ్వాక్రా సంఘాల పేరుతో యూనిఫాం కుట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమ వారికే ఈ కుట్టుపనిని అప్పగించాలని ఒత్తిళ్లు తెచ్చారు. పాఠశాల స్థాయి విద్యార్థులు ఎదిగే వయసులో ఉంటారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో యూనిఫాం కోసం కొలతల తీసుకుని ముగిసే నాటికి యూనిఫాంలను అందజేయడంతో కొంత మంది పిల్లలకు ఇచ్చిన దుస్తులు కొలతలు సరిపోని పరిస్థితి నెలకొంది. ఫైలు సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1.91,467 మంది విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ నెలలో యూనిఫాం అందజేశాం. డ్వాక్రా సంఘాల ద్వారానే యూనిఫాం దుస్తులు కుట్టించాం. డ్వాక్రా మహిళలకు నగదు ఇచ్చేందుకు ఫైలు సిద్ధం చేస్తున్నాం. - డీఈవో, ఎ. సుబ్బారెడ్డి -
ప్రశాంతంగా టెట్
- పేపర్-1కు 87.10 శాతం,పేపర్-2కు 91.83 శాతం హాజరు - నిజామాబాద్ జిల్లాలో అత్యధికం,రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు - నేడు ‘కీ’ విడుదల చేయనున్న విద్యా శాఖ - {పశ్నలు తేలిగ్గా ఉన్నాయంటున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. పేపర్-1పరీక్షకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 2,74,339 మందికి గాను 2,51,924 మంది(91.83 శాతం) హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక హాజరు శాతం, రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అరగంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పిన అధికారులు ముందుగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి కూడా అనుమతించలేదు. దీంతో మండుటెండలో పరీక్ష కేంద్రం బయటే నిల్చోవాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు, వారి వెంట వచ్చిన వారు వాపోయారు. ప్రైవేటు పాఠశాలల బంద్ కారణంగా టెట్‌ను వాయిదా వేసిన విద్యా శాఖ ఈసారి పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దూరంగా కేటాయించడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించడంతో ఆయా కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందుల వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటున్నారు. అలాగే, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సారి ప్రశ్నలు చాలా తేలిగ్గా వచ్చాయని, ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని పరీక్షలు రాసి వచ్చిన అభ్యర్థులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ప్రశ్నపత్రం కీని విద్యా శాఖ విడుదల చేయనుంది. -
నేటి నుంచే భోజనం
♦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు ♦ 1.48 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ♦ వలసల నివారణకు చర్యలు ♦ రోజూ విద్యార్థుల సంఖ్యను పేర్కొనాలని ఆదేశాలు పాపన్నపేట: కరువు వేళ విద్యార్థుల ఆకలి తీర్చి.. వలసలు నివారించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆహార భద్రత చట్టం అమలు చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింప చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. లక్షన్నర మందికి లబ్ధి జిల్లాలోని 46 మండలాల్లో 2,358 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,324 మంది విద్యార్థులకు భోజనాన్ని ఇవ్వనున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. 10.30 వరకు విద్యార్థులకు బేసిక్స్‌తో పాటు ఆటపాటలు, సాంస్క ృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ మేరకు అన్ని మండలాల్లో ఎంఈఓలు ప్రధానోపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించే చర్యలు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథక అమలు గురించి గ్రామాల్లో దండోరా వేయించారు. రోజు భోజనం కాగానే విద్యార్థు ల సంఖ్యను ఎస్ఎంఎస్ల రూపంలో ఎంఈఓ కార్యాలయాలకు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2009లోనూ ఇలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవుల్లో కొనసాగించారు. -
రెండంచెల వ్యవస్థ రెడీ
ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే.. 2015 ఏప్రిల్ ఆధార్ లింక్‌తో రేషనలైజేషన్ 25న జీవో విడుదల! ఉపాధ్యాయ నేతల ఆందోళన మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు కన్నెర్ర చేస్తోంది. ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2015 ఏప్రిల్ నాటికి విద్యార్థుల ఆధార్ అనుసంధానాన్ని బట్టి పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియను అమలుచేయనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్య డెరైక్టర్ ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేశారు. వీటిని ఆయా జిల్లాల విద్యాశాధికారులకు పంపారు. డెరైక్టర్ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 25న రేషనలైజేషన్ అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇవి అమలైతే జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మాత్రమే కొనసాగుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు దాదాపు మూతపడే అవకాశం మెండుగా ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. అన్ని స్కూళ్లపై ప్రభావం జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2606, ప్రాథమికోన్నత పాఠశాలలు 907, ఉన్నత పాఠశాలలు 929 మొత్తం 4442 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,09,387, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98,767, ఉన్నత పాఠశాలల్లో 2,92,517 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విడుదల చేసిన విధివిధానాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7తరగతుల్లో 35 మంది లోపు, 6, 7, 8 తరగతుల్లో 50 మంది లోపు, ఉన్నత పాఠశాలల్లో 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత పాఠశాలను మూసివేయాలని నిర్ణయించారు. 2015 విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో 2014 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్‌ను అమలు చేశారు. 2015 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్ అమలు చేయనున్నారు. 2015లో ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేసిన సమయంలో రైల్వేట్రాక్‌లు, పెద్దకాలువలు, జాతీయ రహదారులను దాటి వేరే ప్రాంతానికి విద్యార్థులు వెళ్లాల్సి ఉంటే మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు. ఈ విధివిధానాలను తయారుచేసి గత నెల చివరి వారంలో ఉపాధ్యాయ సంఘ నాయకుల సమావేశం నిర్వహించి పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ విషయంపై కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయడమే తప్ప ఉపాధ్యాయ సంఘం నాయకుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పకనే చెప్పారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పదో తరగతి మూల్యాంకనం పూర్తయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలుకు రంగం సిద్ధమైనట్లేనని ఉపాధ్యాయులు అంటున్నారు. సక్సెస్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పైగా ఇంగ్లిషు మీడియం చదువుతుంటే ఆ పాఠశాలలను ఇంగ్లిషు మీడియం పాఠశాలగా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా అదే పాఠశాలలో తెలుగు మీడియం చదివే విద్యార్థులను వేరే పాఠశాలలో కలిపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇబ్బందులు ఇవీ ప్రభుత్వం ముందూవెనుక ఆలోచించకుండా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాయటమేననే వాదన వినిపిస్తోంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలను మూసివేస్తే కిలోమీటరు దూరంలోని మరో ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదివే విద్యార్థులు గ్రామాన్ని విడిచి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు ఎలా వెళ్లివస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉంది. 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత ఉన్నత పాఠశాలను మూసివేస్తే 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు ఐదు కిలోమీటర్లు ఎలా వెళ్లి వస్తారనే ప్రశ్నను వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా గ్రామం నుంచి పాఠశాలను పూర్తిగా తొలగిస్తే ఆ ప్రభావం స్థానికంగా పడుతుందని, కనీసం ఐదు నుంచి ఏడు శాతం వరకు చిన్నారులు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. పాఠశాలను మూసివేసి ఉపాధ్యాయులను ఎక్కడికి బదిలీ చేస్తారనేది అర్ధం కాని పరిస్థితి. ఇప్పటికే కొంత మంది ఉపాధ్యాయులను వయోజన విద్యా విభాగానికి కేటాయించారు. ఉపాధ్యాయ సంఘ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వారికి ఆర్డర్లు ఇవ్వకుండా తొక్కిపట్టారు. రేషనలైజేషన్ అమలు చేస్తే మరికొంత మంది ఉపాధ్యాయులు మిగులుబాటుగా ఉండే అవకాశం ఉంది. వీరిని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపయోగించుకుంటారనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటం దుర్మార్గపు చర్యగానే పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై విద్యాశాఖ త్వరలో జీవో జారీ చేయనుండటంతో జిల్లాలో ఎన్ని పాఠశాలలు మూతపడతాయో వేచి చూడాలి. -
హేతుబద్ధీకరణతోనే మేలు
♦ విద్యా విధానంపై చర్చలో కడియం ♦ గ్రామ పంచాయతీకి ఒకే ప్రాథమిక పాఠశాల ♦ చుట్టు పక్కల స్కూళ్లను అందులో విలీనం చేస్తాం ♦ విద్యార్థుల రవాణా బాధ్యత ప్రభుత్వానిదే.. ♦ త్వరలో డీఎస్సీ ప్రకటన.. ♦ వర్సిటీల్లో వీసీలు, చాన్స్లర్లను నియమిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతోనే ఉపయోగమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. ‘‘అసలే విద్యార్థులు లేనివి, 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీలోని గ్రామాలు, జన ఆవాసాలు, తండాల్లో 4,5,10 వరకు ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఈ బడులన్నింటినీ ఒకే ప్రాథమిక పాఠశాల లో విలీనం చేస్తాం. పరిపాలన సౌలభ్యంతో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు ఉంటారు. బడులను మూసివేసే ప్రయత్నం కాదు.. బడుల సంరక్షణకే ఈ ఆలోచన. చుట్టు పక్కల తండాలు, గ్రామాల నుంచి విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకు చేర్చే బాధ్యతలను అవసరమైతే ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్టీసీతో మాట్లాడి పాఠశాలల వేళల్లో విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుం డానే హేతుబద్ధీకరణ జరుగుతుంది’’ అని ఆయన ప్రకటించారు. విద్యా విధానంపై బుధవారం అసెం బ్లీలో జరిగిన చర్చలో అధికార, విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు కడియం సమాధానమిచ్చారు. త్వ రలో డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. ఒక ప్రాథమిక పా ఠశాలలో 100 మంది విద్యార్థులు, ఐదారు మంది ఉపాధ్యాయులు ఉంటేనే బాగుంటుందన్నారు. 6,7వ తరగతులను బోధించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు లేక ఆ పాఠశాలల పరిస్థి తి నిరాశజనకంగా మారిందన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7 తరగతులను వేరు చేసి ఉన్నత పాఠశాలలకు బదిలీచేసే ఆలోచన ఉందన్నారు. మూడు నెలల్లో నివేదిక నూతన విద్యావిధానంపై నిపుణులతో కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుంటామని కడియం చెప్పారు. విద్యా రంగానికి నిధుల కొరత ఉండదని, అవసరమైతే ప్రత్యేక నిధి నుంచి నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణను పరిశీలిస్తామని వివరిం చారు. కొత్త ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు. 2,753 అధ్యాపకుల పోస్టుల్లో 1,149 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఉస్మానియా వర్సిటీలోని 80 శాతం ప్రొఫెసర్లు 2018 నాటికి పదవీ విరమణ చేస్తారని, ఆలోగా నియామకాలు చేయకపోతే వర్సిటీ న్యాక్ గుర్తింపును సైతం కోల్పోయే ప్రమాదముందన్నారు. త్వరలోనే వర్సిటీల్లో చాన్స్లర్లు, వైస్ చాన్స్లర్లను నియమిస్తామని చెప్పారు. 2016-17 బడ్జెట్ కేటాయింపుల్లో ప్రణాళిక రంగానికి కేటాయించిన రూ.1,600 కోట్లను ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకే వినియోగిస్తామని కడియం చెప్పారు. -
పాత పుస్తకం.. కొత్త పాఠం!
♦ ఈ విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కొత్త తరగతులు ♦ పుస్తకాలు సమకూర్చడంపై విద్యాశాఖ మల్లగుల్లాలు ♦ ప్రస్తుతం ముద్రణ షురూ, పంపిణీకి మరింత సమయం ♦ పాతపుస్తకాల సేకరణకు సిద్ధమవుతున్న అధికారులు ♦ జిల్లాలో అవసరమైన పుస్తకాలు: 20,62,012 ♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి: 43,954 ♦ మార్చి 21లోపు అందాల్సినవి: 20,18,058 ♦ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానం ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయంలో పడేసింది. సాధారణంగా జూన్ రెండో వారంలో విద్యాసంవత్సరం మొదలయ్యేది. కానీ ప్రస్తుతం మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని స్పష్టం చేసింది. మార్చి 15లోపు పరీక్షలు పూర్తిచేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని ఆదేశించింది. ఈక్రమంలో అటు వార్షిక పరీక్షల నిర్వహణతోపాటు కొత్త విద్యాసంవత్సర ప్రారంభానికి పాఠశాల యాజమాన్యాలు సమాయత్తమవుతున్నాయి. అయితే కొత్త తరగతిని ప్రారంభించేలోపు విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే ఈ ఏడాది తరగతులు పూర్తి చేసుకున్న వారి పుస్తకాలను కింది తరగతి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలిస్తుందో లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 3.45 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి సంవత్సరం సగటున 20.62 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ వద్ద కేవలం 43,954 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యేటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. మూడో వారం నాటికి విద్యార్థుల చేతిలో కొత్తపుస్తకాలు కనిపించేవి. ఈ ఏడాది విద్యాసంవత్సరం మూడు నెలల ముందుకు జరగడంతో పాఠ్యపుస్తకాల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. మరో పక్షం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సాధారణంగా పుస్తకాల స్టాకు జిల్లా గోదాములకు చేరితే వాటిని కనిష్టంగా పక్షం రోజుల్లో మండలాలకు చేర్చవచ్చు. ప్రస్తుతం పాఠపుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. ముద్రణ పూర్తయి.. జిల్లా గోదాములకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి నూతన పాఠ్య పుస్తకాలు అందడం కష్టమే. పాత పుస్తకాలే దిక్కు.. ఈనెల 15వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు పాఠ్యపుస్తకాలు అందడం కష్టమని భావించిన విద్యాశాఖ పాతపుస్తకాల సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈమేరకు మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ముగించుకున్న విద్యార్థుల నుంచి పాఠ్యపుస్తకాలు సేకరించి.. వాటిని కొత్త తరగతిలో అడుగుపెట్టే వారికి అందజేయాలని ఆయన సూచించారు. దీంతో కొత్త విద్యాసంవత్సరం పాత పుస్తకాలతోనే ప్రారంభం కానున్నట్లు అవగతమవుతోంది. -
అడ్రెస్ గల్లంతు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందని యూనిఫాం 1.93 లక్షల మంది ఎదురుచూపులు విద్యాసంవత్సరం ముగుస్తున్నా స్పందన లేదు పట్టించుకోని అధికారులు మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ గజిబిజిగా మారింది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందజేయాలి. సర్వశిక్షాభియాన్ ద్వారా జనవరిలో కొన్ని మండలాలకు ఆప్కో ద్వారా క్లాత్ అందజేశారు. మరికొన్ని మండలాలకు ఇంకా చేరలేదు. ఆప్కో నుంచి వచ్చిన క్లాత్ మండల కేంద్రానికి చేరితే అక్కడ్నుంచి ఎంఈవోల ద్వారా ఆయా పాఠశాలలకు అందజేయాలి. స్కూళ్ల యాజమాన్య కమిటీల ద్వారా ఈ దుస్తులు కుట్టే పనిని స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. ఒక్కొక్క జతకు కుట్టుకూలిగా రూ. 40 చెల్లిస్తామని ప్రకటించారు. కొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉండడంతో గిట్టుబాటు కాదనే సాకుతో డ్వాక్రా సంఘాల సభ్యులు దుస్తులు కుట్టే పనిని చేపట్టలేదు. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే బాలలు 1.93 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ దుస్తులు ఎప్పుడు కుట్టి అందజేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏప్రిల్ 23తో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటికైనా యూనిఫాం అందజేస్తారా.. లేదా అనేది అర్థం కావడం లేదు. కొన్ని పాఠశాలలకు దుస్తులు వచ్చినా వాటిని హెచ్ఎంలు ఇవ్వని పరిస్థితి ఉంది. మగ పిల్లలకు నిక్కరు, చొక్కా, ఆడపిల్లలకు స్కర్ట్, చొక్కా రెండేసి జతలు అందజేయాల్సి ఉంది. అధికారుల ఏకపక్ష నిర్ణయం పాఠశాల యాజమాన్య కమిటీల నేతృత్వంలో యూనిఫాం కుట్టించాల్సి ఉన్నా అధికారులు ఓ అడుగు ముందుకేసి జిల్లాలోని 225కుపైగా పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే పనిని ఓ ఏజెన్సీకి అప్పగించారు. ఆగస్టులోనే విద్యార్థులకు సంబంధించి దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనవరిలో ఆప్కో నుంచి క్లాత్ విడుదలైంది. 2015 జూన్‌లో క్లాత్ పంపిణీ చేయాల్సిఉండగా 2016 జనవరి వరకు ఈ క్లాత్‌ను అందజేశారు. ఒకే ఏజెన్సీకి 225 మందికి పైగా విద్యార్థులకు దుస్తులు కుట్టే పని అప్పగించడంతో ఆ ఏజెన్సీ పేరున కుట్టుకూలి ఇచ్చే అవకాశం లేదని విజయవాడ డీవైఈవో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలల కమిటీలను ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనించదగిన అంశం. జనవరిలోనే క్లాత్ ఇచ్చారని, పాఠశాలలకు సెలవులు ప్రకటించే నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దుస్తులు ఉపయోగపడేనా! ఆగస్టులో విద్యార్థుల నుంచి కొలతలు తీసుకుని.. జనవరిలో క్లాత్ పంపిణీ చేసి, ఏప్రిల్‌లో యూనిఫాం లను అందజేస్తే అవి ఎంత మేర విద్యార్థులకు సరిపోతాయనే అనుమానాలున్నాయి. పిల్లలు ఏడాదికి రెండు, మూడంగుళాలు పెరుగుతారని, ఏప్రిల్‌లో ఇచ్చిన దుస్తులు మళ్లీ పాఠశాల పునఃప్రారంభం నాటికే పనికొస్తాయని తల్లిదండ్రులు అంటున్నారు. రెండేళ్లుగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై డీఈవో ఎ.సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యూనిఫాం కుట్టే పని వేగంగా జరుగుతోందని, మార్చి నెలలో విద్యార్థులందరికీ అందజేస్తామని చెప్పారు. -
బాలిక ప్రసవం కేసులో దర్యాప్తు ముమ్మరం
పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల ధర్నా ఎంఈఓ బసవలింగం సస్పెన్షన్ మాదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవం కేసు దర్యాప్తును మాదాపూర్ పోలీసులు ముమ్మరం చేశారు. సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక అక్క అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న సెల్‌ఫోన్ కాల్‌డాటా ఆధారంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఎంఈఓ బసవలింగంను సస్పెండ్ చేసి, స్కూల్ టీచర్లకు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. కాగా ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. బాలల హక్కులను కాపాడాలని, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు శరత్ చంద్ర, ప్రసాద్, శివ, సతీష్, సాయిరాం, సందీప్, సునీల్ తదితరులు కోరారు. శిశు విహార్‌కు పసికందు రాయదుర్గం: మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసవించిన విద్యార్థినిని మంగళవారం రెస్క్యూ హోంకు తరలించారు. అలాగే పసికందును శిశువిహార్ సిబ్బందికి అప్పగించారు. మొదట ఉప్పల్‌లో పోలీసులు తల్లి, పసికందును అదుపులోకి తీసుకొని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి ఐసీడీఎస్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ ఫీజు మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వాలని, తల్లిదండ్రుల వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఈ చర్యలు చే పట్టాలని పీఆర్టీయూ-టీఎస్ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రవీందర్, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వెంకట్‌రెడ్డి కలసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పూర్తిగా పరీక్ష ఫీజు మినహాయిస్తే పాఠశాలల్లో నమోదు పెరుగుతుందన్నారు. -
కనుమరుగు
ఉండీ ఉపయోగం లేని మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయినా తాళాలు తీయరు నీటి వసతి అంతంతమాత్రమే ఇక్కట్లపాలవుతున్న విద్యార్థినులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు మరుగు దొడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, సర్వశిక్షాఅభియాన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించినా వాటికి తాళాలు వేసి ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. ఇంకొన్నిచోట్ల పైప్‌లైన్ ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోతే మరమ్మతులు చేయించని పరిస్థితి నెలకొంది. పలు ఉన్నత పాఠశాలలను ‘సాక్షి’ బృందం పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మచిలీపట్నం : సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. స్వచ్ఛ భారత్ పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేయడం తప్ప అక్కడి ఆడపిల్లలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొల్పుతోంది. సర్వశిక్షా భియాన్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జిల్లాలోని 3,224 పాఠశాలల్లో 1,105 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లాలో 458 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 70 వేల మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. గెయిల్, బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బెల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి తాళాలు వేసి హెచ్ఎంలకు అప్పగించారు. అయితే వాటిని ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. సర్వశిక్షాభియాన్ లెక్కల ప్రకారం 40 మంది పిల్లలకు ఒక మరుగుదొడ్డి, ఒక బాత్రూమ్ ఉండాలి. ఇప్పటి వరకు 1,105 మరుగుదొడ్లు నిర్మించగా, మరో 130 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో గుండుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వరంగ సంస్థ ఇటీవల ఆడపిల్లల కోసం మరుగుదొడ్లను నిర్మించింది. వీటిని ప్రారంభిం చకుండా తాళం వేసి ఉంచారు. చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లు చుట్టూ వర్షపునీరు, వృధా నీరు చేరి తటాకాన్ని తలపిస్తోంది. తిరువూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి వసతి లేదు. నీటి కుండీ పనిచేయడం లేదు. ఎ.కొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నీటి వసతి సక్రమంగా లేదు. కంకిపాడు మండలంలోని పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 261 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడ కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. కాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు మరుగుదొడ్లను ఓఎన్జీసీ సంస్థ నిర్మించింది. వీటికి తాళాలు వేసి ఉంచారు. తోట్లవల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 250 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉండగా వీటిలో ఒకటి పాడైంది. పామర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 341 మంది విద్యార్థినులు ఉన్నారు. మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. నీటి సదుపాయం సరిగా లేదు. మోపిదేవి మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లకు వెళ్లే దారి వెంబడి పిచ్చిమొక్కలు మొలిచి విషసర్పాలు సంచరిస్తున్నాయి. గుడివాడ పట్టణంలోని ఏకేసీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 410 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఎనిమిది మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి తలుపులు లేవు. నీటి వసతి లేదు. బాత్రూమ్కు వెళ్లాలంటే విద్యార్థినులు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జగ్గయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించినా అవి ఇరుకుగా ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. పెనుగంచిప్రోలు మండలం అనిగళ్లపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
బాలల ఆరోగ్య పరిరక్షణేదీ
మునుగోడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశ పెట్టిన జవహర్ బాల ఆరోగ్య పథకం అటకెక్కింది. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచి నెల రోజులుదాటినా ఇంతవరకు కనీసం బాల ఆరోగ్య రక్ష కార్డులు ఇవ్వలేదు.జిలాల్లో మొత్తం 3781 పాఠశాలలు ఉండగా అందులో 2861 ప్రాథమిక, 310 ప్రాథమికోన్నత, 610 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 4 లక్షల 14 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించాలని గత ప్రభుత్వాలు బాల ఆరోగ్యరక్ష కార్డులు అందించేవి. ఆ కార్డులు కలిగిన వారికి ప్రతి మూడు నెలలకు ఒక రోజు పాఠశాలకు వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్ పరీక్షలు జరిపి అవసరమైనవారికి చికిత్సలు నిర్వహించేవారు. చిన్నచిన్న వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీచేసేవారు. అలాగే విద్యార్థి ఎత్తు, బరువుల తదితర వివరాలను కార్డులో పొందుపర్చేవారు. ఎవరికైనా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటే వారిని పెద్ద ఆసుపత్రులకు పంపించేవారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు కనీసం కార్డులు కూడా అందించలేదు. అనారోగ్యాల బారిన పేద విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా పేద కుటుంబాలకు చెందిన వారు విద్యను అభ్యసిస్తున్నారు. వీరి తల్లితండ్రులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని చూసుకోని పరిస్థితి నెలకొని ఉంటుంది. వారితో పాటు, వారి పిల్లలకు చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే వైద్యుల వద్దకు వెళ్లి చూయించుకునే స్థోమత లేక అలాగే ఉండిపోతారు. దీంతో కొందరు చిన్నారులు పెద్ద పెద్ద అనారోగ్యాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అవసరమైన బాల ఆరోగ్యరక్ష కార్డులతో పాటు వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై నియంత్రణ ఏదీ ?
- జెడ్పీ స్థాయి సంఘ - సమావేశంలో ప్రశ్నించిన - జెడ్పీటీసీ సభ్యుడు - కోరం లేక వాయిదా పడిన 3,6 స్టాండింగ్ కమిటీ సమావేశాలు చిత్తూరు(ఎడ్యుకేషన్) : ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గుర్రంకొండ జెడ్పీటీసీ సభ్యుడు కురబలకోట రెడ్డిరాజ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ మీటింగ్‌హాలులో గురువారం 1,7 మినహా మిగిలిన స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. జెడ్పీ ఉపాధ్యక్షులు సుందరరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన నాలుగో స్థాయి సంఘ సమావేశంలో జెడ్పీసీటీ సభ్యుడు రెడ్డిరాజ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్కేజీ చదువుకు రూ.20నుంచి 30వేలు వసూలు చేస్తున్నా విద్యాశాఖ చూస్తూ ఊరుకోంటోందని విమర్శించారు. ప్రతిస్కూల్ నోటీసు బోర్డులోనూ కమి టీ నిర్దేశించిన ఫీజుల వివరాలను పొందుపరచాల్సి ఉన్నా ఏ ఒక్క పాఠశాల కూడా పాటించలేదని తెలిపారు. తమ స్కూళ్లలోనే పుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం దుస్తులు, షూలు కొనాలని ప్రైవేటు స్కూళ్లు నిర్బంధ వ్యాపారాలను చేపడుతున్నా చర్యలు శూన్యమన్నారు. గుర్తింపు లేని పాఠశాలలు కోకొల్లాలుగా నడుస్తున్నా చర్యలేవైనా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులు చాలా చోట్ల వ్యాపారాల్లో నిమగ్నమై స్కూళ్లకు సక్రమంగా వెళ్లడం లేదన్నారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఆయన కోరారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారా..? రాజకీయ కమిటీలకే పరిమితమవుతా రా అని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యు డు ధర్మయ్య ప్రశ్నించారు. కేవీబీపురంలో పాత పీహెచ్సీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యు లు వాణి డీఎంహెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిధులు గ్రా మ స్థాయిలో దుర్వినియోగమవుతున్నాయని జెడ్పీ ఉపాధ్యక్షుడు సుందరరామిరెడ్డి చెప్పారు. సత్యవేడు మండ లం మదనంబేడు హైస్కూల్లో మ ధ్యాహ్నభోజనం చేసే రెండు గ్రూపుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయని, వాటిని పరిష్కరించాలని డీఈవోకు విన్నవించారు. పొలకల గ్రామంలో బ్యాంకు రుణాలను కట్టి రెండేళ్లు గడిచినా బ్యాంకు మేనేజర్ 59 గ్రూపులకు కొత్తగా రుణాలివ్వలేదని, ఇటీవల ఆందోళన చేసిన బాధిత మహిళలపై మేనేజర్ కేసులు బనాయించారని జెడ్పీటీసీ సభ్యురాలు లత తెలిపారు. సాక్షర భారత్ కేంద్రాలు జిల్లాలో ఎక్కడా సక్రమంగా నడపటంలేదని, వారిపై ఏమైనా చర్యలు తీసుకు న్నారా అని ఆమె సాక్షరభారత్ డీడీ ఉ మాదేవిని ప్రశ్నించారు. ఐదవ స్థాయి సంఘ సమావేశం కార్వేటినగరం జెడ్పీటీసీ సభ్యురాలు గీతయాదవ్ అధ్యక్షతన జరిగింది. 3, 6 స్థాయి సంఘాల సమావేశాలు కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. -
ఇంత అధ్వానమా!
‘నేల’బారు చదువులు! మన ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుల తీరుకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. వసతుల మాట దేవుడెరుగు. అక్షరాలు దిద్దుదామంటే పలకలు కూడా లేని దయనీయ పరిస్థితి. దీంతో పిల్లలు నేలపైనే అక్షరాలు రాస్తూ... తమ భవిష్యత్తును వాటిలో చూసుకుంటున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ దృశ్యం కనిపించింది. - ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువు - పరిస్థితులు చూసి అవాక్కయిన సీపీఎం నేత తమ్మినేని ముషీరాబాద్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటున్నారు..అసలు ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గురువారం ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సందర్భంగా పిల్లలకు పలకలు లేక నేలపైనే ఏబీసీడీలను టీచర్ దిద్దిస్తున్న సంఘటన చూసి ఆయన అవాక్కయ్యారు. ప్రభుత్వం చాక్‌పీస్‌లు కూడా ఇవ్వకపోవడంతో తామే తీసుకువచ్చి విద్యాభ్యాసం చేయిస్తున్నట్లు టీచర్లు తెలిపారు. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలలు చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. కొన్ని తరగతి గదులు మట్టికొట్టుకుపోయి కూర్చోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఒక బ్లాక్ బోర్డు పై 2013 సంవత్సరం వేసి ఉన్న తేదీని చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ తరగతులు జరగడం లేదా అని ప్రశ్నించారు. అనంతరం అదే పాఠశాల ఆవరణలో ఉన్న డిప్యూటీ ఐఓఎస్ ఇంద్రజిత్, డిప్యూటీ ఈవో చిరంజీవిల కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు. ఒక అధికారి కార్యాలయంలో పావురాలు గుడ్లు పెట్టి ఉండటాన్ని చూసి కార్యాలయాలే ఇలా ఉంటే పాఠశాలల పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం కేజీ టూ పీజీ అంటూ ఆర్భాటాలు చేయకుండా ముందు పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని తమ్మినేని ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. నాణ్యమైన విద్యను అందరికీ అందించాలని, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కోరారు. పాఠశాలల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని పేర్కొన్నారు. తమ్మినేని వెంట సీపీఎం సెక్రటేరియట్ సభ్యులు డీజీ నర్సింహారావు, సెంట్రల్ సిటీ సెక్రెటరీ ఎం.శ్రీనివాస్, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి దశరథ్, ఎస్ఎఫ్ఐ నాయకులు నాగేశ్వర్రావు, జావేద్, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు మహా కోత
- విద్యశ్రీ పథకం కింద అర్హత పాయింట్ల పెంపు - తక్కువ మందికి పరిమితమైన పథకం - కలవరపడుతున్న పేద విద్యార్థులు విశాఖపట్నం సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన పేదింటి విద్యార్థులకిచ్చే ప్రోత్సాహానికి జీవీఎంసీ కోత విధిస్తోంది. కాసుల భారమంటూ ఈ పథకాన్ని కుదించేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాఠశాలల్లో చదివిన విద్యార్ధులను ఉన్నత చదువులకు ప్రోత్సహించేందుకు విద్యశ్రీ పథకాన్ని అయిదేళ్ల క్రితం ప్రారంభించింది. ఇందుకోసం జీవీఎంసీలో ఓ ప్రత్యేక విభాగం వుంది. ఈ పథకంలో లబ్ధికి ఏటా వందలాది మంది విద్యార్ధులు ఎంపికవుతున్నారు. వీరికి కార్పొరేట్ కాలేజీల్లో విద్యతో బాటు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారు. దీంతో ప్రభు త్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావించి ఆ మేరకు నిర్ణయాన్ని అమలు చేస్తోంది. టెన్తులో 500మార్కులు దాటినవారు దీనికి అర్హత పొందేవారు. జీపీఎ విధానమొచ్చాక గతేడాది పదోతరగతిలో 7.5 గ్రేడ్ పాయిం ట్లు సాధించిన విద్యార్ధులను కార్పోరేట్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించారు. 327 మందికి రూ. 37 లక్షలు జీవీఎంసీ విద్యశ్రీ కింద చెల్లించింది. అయితే అర్హుల సంఖ్య పెరిగిపోతోందని భావించిన జీవీఎంసీ ఇప్పుడు భారీగా కోత పెట్టేందుకు సమాయత్తమయ్యింది. 2015 ఫలితాల్లో 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు మాత్రమే అర్హులని ప్రకటించేయడంతో పేద, మధ్య తరగతి విద్యార్దులంతా నిరాశకు గురయ్యారు. 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు అంటే జీవీఎంసీ పాఠశాలల్లో చదివే అతి కొద్ది మందికే సాధ్యం. చాలీచాలనీ కూలీతో పిల్లలను బడికి పంపడమే తమ కుటుంబాల్లో తక్కువని అలాంటి వారికి అన్ని గ్రేడ్ పాయింట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. భీమిలి, అనకాపల్లితో కలిపి జీవీఎంసీ పరిధిలో 27 పాఠశాలల్లో చదివిన వారిలో 9 గ్రేడ్పాయింట్లకు పైగా మార్కులు సాధించిన వారు 50 మంది వరకూ ఉన్నారు. అందులో పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కోర్సులకు పోయేవారు ఎక్కువగానే ఉంటారు. ఇంటర్మీడియట్ చదివే వారు అరుదుగా వుంటారని అందుకే కనీసం 8 గ్రేడ్‌పాయింట్ల కైనా అర్హత మార్కులను కుదించాలని కోరుతున్నారు. -
పాఠ్య పుస్తకాలేవీ?
జిల్లాకు రాని పుస్తకాలు 15,60,090 అవసరం ఇప్పటివరకు రాని వైనం గతేడాది ఇదే సమయూనికి 70 శాతం చేరిక విద్యారణ్యపురి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది తొందరగా వచ్చినా.. ఏటా పాఠ్యపుస్తకాలు అందడం ఆలస్యం అవుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటారుు. అంటే జూన్ మాసంలో పుస్తకాలు విద్యార్థులకు అందించాలి. కానీ, ఇప్పటివరకు జిల్లాకే చేరుకోలేదు. కనీసం ముద్రణ కూడా కాలేదని సమాచారం. విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వ గోదాముల నుంచి జిల్లా అధికారులకు, ఈ అధికారుల నుంచి మండల గోడౌన్లకు.. అక్కడి నుంచి ఉపాధ్యాయులకు.. వీరు విద్యార్థులకు పంపిణీ చేయూలి. ఇదంతా జరగాలంటే మార్చిలోనే పుస్తకాలు జిల్లాకు చేరుకుని ఉండాలి. కానీ, రాలేదు. పుస్తకాలు అందడం అనుమానమే.. కాగా, జిల్లాలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 183 టైటిల్ పుస్తకాలు, 17,16,099 పాఠ్యపుస్తకాలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 15,60,090 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి, మిగితావి అమ్మకాల కోసం ప్రతిపాదించారు. గతేడాది 26 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రతిపాదించగా.. ఇందులో గత ఏప్రిల్ 1 వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నారుు. ఏప్రిల్ 23 తేదీ వరకు విద్యార్థులకు పంపిణీ అయ్యూరుు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 వచ్చినా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోలేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపలేదని సమాచారం. 2014 సెప్టంబర్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. గతేడాది జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాల్లో వివిధ టైటిల్స్ కలిపి 2 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ డిపోలోనే మిగిలి ఉన్నారుు. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పేరిట ఉన్నారుు. ఈ పుస్తకాలు కూడా పనికిరావు. జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేటు విద్యార్థులకు కూడా శాపం జిల్లాలో 1,637 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి అందు లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 3,19,250 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు మార్కెట్లోకి వస్తేనే ఆయా విద్యార్థులు కూడా పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యానికి కారణాలు.. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సిలబస్‌ను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలలో తెలంగాణ గురించి, మహనీయుల చరిత్ర అంశాలను చేర్చాలని చూస్తోంది. తెలంగాణ రాష్ర్టం పేరిట పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. మార్పుల కోసం సంబంధిత కమిటీ నివేదిక అందజేసినా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. ఆమోదం తర్వాతే ముద్రణ ప్రారంభమవుతుంది. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
తిరుచానూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనీ.. తద్వారా మన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్త మ గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు శనివారం వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసభకు ముఖ్యఅతిథిగా భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలను చెవిరెడ్డి అందజేయడం అభినందనీయమని తెలిపారు. చదువుతో పాటు పరిసర గ్రామాల ప్రాముఖ్యత, గ్రామం పేరు వెనుక చరిత్ర, ఆ గ్రామాల్లోని మహోన్నత వ్యక్తుల చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు దినచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, తులసీరాం, చెంచులాదేవిలను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేలందరికీ చెవిరెడ్డి ఆదర్శం నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యేలందరికీ ఆదర్శప్రాయులని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. మిట్టమీదకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రతిభా పురస్కారం ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత డబ్బులతో చెవిరెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని తెలిపారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి ఈ స్థాయిలో ఉన్నామని, ఎందరో మహనీయులు, మేధావులు, ప్రతిభావంతుల విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగాయని తెలిపారు. అనంతరం 2014 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు జగన్నాధరెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌నాయుడు, పాతూరు సర్పంచ్ శివలింగారెడ్డి, బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ పద్మవేణుగోపాల్, తిరుచానూరు ఎంపీటీసీలు బుజ్జిరెడ్డి, నరేష్‌రెడ్డి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మిట్టపాళెం జయచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శివారెడ్డి, యోగానందరెడ్డి, విడుదల మాధవరెడ్డి, చిన్నియాదవ్, దామినేటి కేశవులు, తిరుమలయ్య, రాజేంద్ర, యశోద, నగీనమ్మ, తిరుచానూరు పంచాయతీ ఈవో ఎం.జనార్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉష, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నరకయాతన
మరుగుదొడ్లు లేక విద్యార్థులకు ఇక్కట్లు ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన మౌలిక సదుపాయాలు చోడవరంలో 800 మందికి మూడే రన్నింగ్‌వాటర్ లేక నిరుపయోగం మరుగుదొడ్లు సదుపాయం లేక ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. వందలాది మంది ఉండే సర్కారు బడుల్లోనూ రెండు మూడే ఉంటున్నాయి. బాలురు బహిరంగ ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. కౌమారదశలోని విద్యార్థినులు సిగ్గువిడిచి చెట్లు, పుట్టలను ఆశ్రయిస్తుండగా కోందరు బయటకు వెళ్లలేక గంటల తరబడి ఉగ్గపట్టుకుని ఉండి గర్భకోశవ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కొరవడుతున్నాయి. మరుగు సమస్య పట్టి పీడిస్తోంది. వందలాది మంది ఉన్న పాఠశాలల్లోనూ రెండుమూడు మరుగుదొడ్లు ఉండటంతో విద్యార్థులు నరకయాతనకు గురవుతున్నారు. కౌమారదశలోని విద్యార్థినుల ఇబ్బందులు అలవికానివిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు ఉన్నా.. రన్నింగ్ వాటర్ సదుపాయం లేక నిరుపయోగం గా ఉంటున్నాయి. బాలికల అవస్థలు పడుతున్నాం మరుగుదొడ్లులేక నానా అవస్థలు పడుతున్నాం. ఒక్కోసారి కడుపునొప్పి వచ్చి ఇళ్లకు వెళ్లిపోతున్నాం. ఉన్న రెండు మూడు వందలాది మందికి సరిపోవడం లేదు. పాఠశాలల్లో మరిన్ని నిర్మించాలి. -కె.జ్యోతిర్మయి, ప్రభుత్వ ఉన్నతపాఠశాల, చోడవరం. పాఠశాల్లో విద్యార్థినుల అవస్థలు అన్నీఇన్నీకావు. కొన్ని పాఠశాలలకు ఇటీవల కొత్తగా భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. పాలకుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. చోడవరం నియోజకవర్గంలో 227ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సగం వాటికి మరుగుదొడ్లు లేవు. 33 ఉన్నతపాఠశాలల్లో ఏడింటికి మాత్రమే ఒకటి రెండు అన్నట్టు మరుగుదొడ్లున్నాయి. 50శాతం ప్రాథమిక పాఠశాలకు ఒక్కటి కూడా లేదు. చోడవరం మెయిన్ హైస్కూల్లో 800మంది విద్యార్థులకు కేవలం మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎంఎస్ఎ గ్రాంటుతో మరో 16మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు. నిధుల కొరతతో అవి అర్ధంతరంగా ఆగిపోయాయి. లక్కవరం, పీఎస్‌పేట, గోవాడ, జుత్తాడ, వడ్డాది, దిబ్బిడి, తట్టబంద, రోలుగుంట, గవరవరం, జన్నవరం ైెహ స్కూళ్లలోనూ ఇదే దుస్థితి. బాల,బాలికలు ఉండే పాఠశాలల్లో అయితే బాలురు ఆరుబయటకు పోతున్నారు. బాలికలు సిగ్గుతో ఉగ్గపట్టుకుని గంటల తరబడి తరగతి గదుల్లో ఉండిపోతున్నారు. బంగారుమెట్ట, సింగవరం, సీతయ్యపేట, మల్లాం, రాజాం, తులకలపూడి,ఎం.భూపతిపాలెం, నీలకంఠపురం, గంథవరం, నర్సాపురం, చాకిపల్లి ,లక్కవరం, జి.స్ట్రీట్‌తోపాటు అనేక పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ లేదు. కొన్ని చోట్ల బోర్లు లేక మరికొన్ని చోట్ల ట్యాంక్‌లు, పైపులైన్ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు బకెట్లతో నీరు తెచ్చుకొని మరుగుకు వెళుతున్నారు. -
టెన్షన్ వద్దు
vip రిపోర్టర్ కాగిత శామ్యూల్ ఇన్చార్జి డీఈవో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇన్చార్జి డీఈవో శామ్యూల్ ‘సాక్షి’ విఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పలు సూచనలు ఇచ్చారు. ఇన్చార్జి విద్యాశాఖాధికారి కాగిత శామ్యూల్ జిల్లాలోని సర్కారు బడుల పనితీరు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకోవాలన్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం తెలుసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. విషయం రాబట్టాలంటే రొటీన్‌కు భిన్నంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిపోయారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పదో తరగతి పరీక్షల్లో మెరుగైనా ఫలితాల కోసం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలో గడిపారు. పర్యటనలో ఆయన జరిపిన సంభాషణలు.. ప్రజెంటేషన్ : చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ పదో తరగతి తరగతి గది: ఇన్చార్జి డీఈవో : మీ పాఠశాలలో పదో తరగతి సిలబస్ పూర్తయ్యిందా? విద్యార్థిని(గాయత్రి): అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తి చేశారు. టీచర్లు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : మీ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు? విద్యార్థిని : 52 మంది ఉన్నారు సార్ ఇన్చార్జి డీఈవో: టీచర్లు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా చెప్పారా? విద్యార్థిని(లక్ష్మి) : చెప్పారు సార్, ప్రతి రోజూ స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : నీకు ఏ సబ్జెక్టు ఇష్టం? విద్యార్థిని (వాణి ప్రసన్న) : బయాలజీ సార్ ఇన్చార్జి డీఈవో : కష్టమైన సబ్జెక్టు ఏది? విద్యార్థిని : ఫిజిక్స్ సార్ ఇన్చార్జి డీఈవో : ఎందుకు కష్టం? మీసార్లు సరిగా చెప్పడం లేదా ? అర్థం కావడం లేదా? విద్యార్థి(అరవింద్): ఫిజిక్స్‌లో ఫార్ములాలు ఉంటాయి సార్ ఇన్చార్జి డీఈవో: కష్టమైనా ఇష్టంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సరే.. నీవు స్కూలుకు ఎన్ని గంటలకు వస్తావు? విద్యార్థి(అరవింద్) : ఉదయం 6 గంటలకు వచ్చి 7.30 వరకు స్టడీ అవర్స్, మళ్లీ ఇంటికి వెళ్లి 8.30కు వచ్చి సాయంత్రం 7.30 వరకు ఉంటాం. ఇన్చార్జి డీఈవో : ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలులో ఉంటే బోర్ కొట్టదా? విద్యార్థిని(నందిని): ఇంటికి వెళ్లి కొంతసేపు రిలాక్స్ అవుతాం? ఇన్చార్జి డీఈవో : ఇంటికి వెళ్లి టీవీలో సినిమాలు, సీరియల్స్ చూస్తారా? విద్యార్థిని(నందిని) : కొద్దిసేపు చూస్తాం. ఇన్చార్జి డీఈవో : నీవు టీవీలో ఏం చూస్తావు? విద్యార్థిని(భువనేశ్వరి) : న్యూస్ చూస్తాను సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఏం చూస్తావమ్మా? విద్యార్థిని(జోత్స్న): మ్యూజిక్ చానల్లో పాటలు చూస్తాను. ఇన్చార్జి డీఈవో : ఎందుకు చూస్తావు? విద్యార్థిని: రిలాక్స్ కావడానికి మ్యూజిక్ అవసరం సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఎంత సేపు టీవీ చూస్తావు? విద్యార్థి (సునీల్‌కుమార్) : గంటసేపు చ ూస్తాన్ సార్. ఇన్చార్జి డీఈవో : అంతసేపు చూడటం వల్ల పాఠాలపై శ్రద్ధ పోతుంది. కొద్దిసేపు చూసిన తర్వాత పాఠాలు చదవాలి. సీరియల్స్, సినిమాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి.రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో, ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకుంటే మంచి మార్కులు వస్తాయి. పరీక్షలు రాబోతున్నాయి కదా మీకు భయం లేదా? విద్యార్థి (అరవింద్) : భయంగా ఉంది. మొదటిసారి రాస్తున్నాం కదా సార్. ఇన్చార్జి డీఈవో : అందుకోసమే ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు పెట్టాం. ఇప్పటి నుంచి ఇష్టంగా చదివి బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇంతకీ ఇన్స్పైర్ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందా? విద్యార్థిని (దుర్గ) : ఉపయోగపడింది సార్. ఇన్చార్జి డీఈవో : ఇన్‌స్పైర్‌కు ఎవరైనా ఎంపికయ్యారా? హెచ్ఎం (శ్రీనివాసులు) : మా విద్యార్థి అరవింద్ జిల్లాలో మొదటి స్థానం వచ్చారు. ఇన్చార్జి డీఈవో : వెరీగుడ్, బాగా చదవాలి. (అంటూ మెమెంటోను విద్యార్థికి అందజేశారు) రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఇష్టపడి చదవండి. మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్..! ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం ఇన్చార్జి డీఈవో : పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి? హెచ్ఎం (శ్రీనివాసులు) : ఉపాధ్యాయులందరూ కలిసి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. సబెక్టుల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఈసారి మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కష్టపడాలి. పదో తరగతి విద్యార్థిని తండ్రికి ఫోన్ చేసి.. ‘‘హలో.. నేను డీఈవోను మాట్లాడుతున్నా.. మీ పాప చదివే పాఠశాలలో ఉన్నా. మీ పాప ఎలా చదువుతుందో కనుక్కుంటున్నా.. మీ పాపను బాగా చదివించండి.. టీవీ సీరియల్స్‌ను చూపించకండి.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతంలో మదనపల్లె డివిజన్లో మాత్రమే ఇన్స్పైర్ కార్యక్రమం అమలవుతుండగా ఈ ఏడాది జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఉత్తమ మార్కులు సాధించిన దాదాపు 800 మంది విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం’’ డీఈవోతో ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్.. వెంకటరమణ (ఎస్ఎంసీ చైర్మన్) : సార్ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అసరానికి సరిపడా లేవు. కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే విద్యార్థులకు అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. క్రీడా మైదానం అవసరం. ప్రతియేటా పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇన్చార్జి డీఈవో: తప్పకుండా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాను. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలన ఇన్చార్జి డీఈవో : ఏమ్మా.. ఈ రోజు అన్నం, కూరలు ఏం చేస్తున్నావు? వంట ఏజెన్సీ నిర్వాహకురాలు(భూదేవి) : సార్ అన్నం, బీన్సు సాంబార్ చేస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఎంతమంది విద్యార్థులకు వండుతున్నావు? ఏజెన్సీ నిర్వాహకురాలు : 1,200 మంది విద్యార్థులకు సార్ ఇన్చార్జి డీఈవో : వారంలో కోడిగుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఏజెన్సీ నిర్వాహకులు : రెండుసార్లు సార్ ఇన్చార్జి డీఈవో: రెండుసార్లు తప్పకుండా ఇవ్వాలి. అన్నం ఇంకా బాగా ఉడకాలి (అన్నం రుచి చూస్తూ).. సాంబారులో ఎంత పప్పు వేశావమ్మ? ఏజెన్సీ నిర్వాహకులు : 7 కేజీలు సార్ ఇన్చార్జి డీఈవో : పప్పు తక్కువ వేశారు. నాణ్యమైన కూరలు ఇవ్వాలి. ఏజెన్సీ నిర్వాహకులు :అలాగే సార్ ఇన్చార్జి డీఈవో : మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నాణ్యత లేకుంటే క్షమించే ప్రసక్తే లేదు. మజ్జిగ ఇస్తున్నారా? ఏజెన్సీ నిర్వాహకులు : ఇవ్వలేదు సార్. ఇన్చార్జి డీఈవో : వంట చేసేందుకు డబ్బులు అందాయా? ఏజెన్సీ నిర్వాహకులు : లేదు సార్. ఇన్చార్జి డీఈవో : త్వరలో బడ్జెట్ వస్తుంది. అందేలా చర్యలు తీసుకుంటాం. మెను ప్రకారం భోజనం అందించాలి. శుచితో పాటు శుభ్రత పాటించాలి. డీఈవో హామీలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక నాణ్యతతో కూడిన విద్యే లక్ష్యం తగిన తరగతి గదుల నిర్మాణం -
విద్యాబోధకులు హుళక్కే!
ప్రతిపాదించిన ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్య 591 ఇప్పటికీ మంజూరు చేయని ప్రభుత్వం సర్కారు బడుల్లో కుంటుపడుతున్న చదువులు ఆందోళనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సంకటంలో పడింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు పూర్తయినా పలు తరగతుల్లో బోధన అంతంతమాత్రంగానే సాగింది. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం.. కనీసం ఖాళీ స్థానాల్లో విద్యా బోధకుల (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్లు)ను సైతం నియమించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం జిల్లాలో 1,150 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల సింగిల్ టీచర్లు, కొన్నిచోట్ల టీచర్లు లేని పాఠశాలుండడంతో అక్కడ బోధన ప్రశ్నార్థకంగా మారింది. కనీసం కాంట్రాక్టు పద్ధతిలోనైనా విద్యాబోధకులను సైతం నియమించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 2,316 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,639 ప్రాథమిక, 259 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 3.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరువందల ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల సమస్య నెలకొంది. ఆయా పాఠశాలల్లో 22,507 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా 493 తెలుగుమీడియం ప్రాథమిక పాఠశాలలు, 41 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సింగిల్ టీచర్లున్నారు. మిగతా 66 పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ డిప్యూటేషన్లతో కొంతమంది టీచర్లను.. సమస్యాత్మక పాఠశాలల్లో నియమించినప్పటికీ.. పాఠ్యాంశాలబోధనలో మాత్రం ఆశించిన పురోగతి లేకుండాపోయింది. బోధకులు లేనట్లే.. సాధారణంగా టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో ప్రభుత్వం విద్యాబోధకులను కొనసాగించేది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధకుల నియమించకూడదు. కానీ టీచర్ల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆయా ఖాళీల్లో విద్యాబోధకులను నియమిస్తే పాఠ్యాంశాల బోధన సమయానుసారం జరిగేది. ఇందులో భాగంగా జిల్లాకు 591 మంది బోధకులు అవసరమని సర్వశిక్షా అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ మరో మూడు మాసాల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం విద్యాబోధకుల ఊసే ఎత్తడం లేదు. ఈపాటికే పాఠ్యాంశాల బోధన పూర్తికావాల్సి ఉండగా.. టీచర్ల సమస్యతో జిల్లాలో మెజారిటీ పాఠశాలల్లో బోధన నత్తనడకన సాగుతోంది. -
సర్కారీ బడులకు 25 వేల బెంచీలు
ఒకేరోజు అందించనున్న రోటరీ క్లబ్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అవకాశం హైదరాబాద్: 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకేరోజు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల బెంచీలు పంపిణీ చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోబోతున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (3150) మల్లాది వాసుదేవ్ తెలిపారు. ఆయన ఆది వారం ఫిలించాంబర్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ స్నేహం ద్వారా సేవ అన్న నినాదంతో తాము రోటరీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 65 వేల బెంచీలు సరఫరా చేశామన్నారు. రోటరీ క్లబ్‌లు కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు మంచినీటిని అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, షూస్ కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ శేషసాయి కుమార్, కమల్ కన్నన్, రాజేష్మింది పాల్గొన్నారు. -
పంతుళ్లూ..పైలమయో!
నిర్లక్ష్యంపై విద్యాశాఖ కొరడా ప్రభుత్వ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ ఒకరి సస్పెన్షన్, ముగ్గురికి మెమోలు సిద్దిపేట జోన్: ‘‘ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా సంబంధిత టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం.. అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనకాడబోం’’ రెండు నెలల క్రితం టీచర్లకు డీఈఓ జారీ చేసిన హెచ్చరిక. కట్ చేస్తే.. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలను శుక్రవారం డీఈఓ రాజేశ్వర్‌రావు అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనలో విఫలమయ్యారనే కారణంతో ఇందిరానగర్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ముగ్గురికి మెమోలు జారీ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన డీఈఓ రాజేశ్వర్‌రావు ముందుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని స్కూల్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని, వెనక భాగంలో ఉన్న పురాతన భవనాన్ని పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ నిర్మాణం కోసం సంబంధిత పాఠశాల స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులను వివిధ పాఠ్యాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సంబంధిత పేపర్లను తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన పదో తరగతి త్రైమాసిక పరీక్ష ప్రశ్నాపత్రాలను, పాఠశాల విద్యార్థుల మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరానగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న డీఈఓ, పాఠశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హెచ్ఎం వకులాదేవికి సూచించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉందన్న కారణంతో అదే పాఠశాలకు చెందిన కొండల్‌రెడ్డి, శ్రీవిద్యలతో పాటు గైర్హాజరైన నీలం రెడ్డికి మెమోలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన ఉపాధ్యాయుల రెండు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని హెచ్చరించారు. మీరు మారండి.. విద్యార్థుల రాత మార్చండి... ప్రతి నెల వేల రూపాయల వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాబోధనలోనూ మార్పు తెచ్చి విద్యార్థుల రాతను మార్చాలని డీఈఓ రాజేశ్వర్‌రావు సూచించారు. అందుకోసం ముందుగా ఉపాధ్యాయుల్లోనే మార్పు రావాలన్నారు. తనిఖీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతోప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం మరింత పెంచాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముఖ్యంగా సీఎం జిల్లాలో విద్యా ఫలితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట ఉప విద్యాధికారి మోహన్, జిల్లా విద్యాశాఖ సిబ్బంది సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలదేనని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ - స్వచ్ఛ విద్యాలయాలు కార్యక్రమంపై ఎంఈఓలు, హెచ్ఎంలు, డిప్యూటీ డీఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంఈఓలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లాలో ఎక్కడా బడి వయస్సు పిల్లలు బడి బయట కనిపించరాదన్నారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాలని, అదేవిధంగా విద్యార్థుల హాజరుపైన దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ఎంఈఓల జాబ్ చార్టును పరిశీలించాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థుల హాజరు, డ్రాప్‌అవుట్స్, ఉపాధ్యాయుల హాజరు, సిలబస్ తదితర వివరాలు సేకరించాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతను పెంపొందించడం స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల ఏర్పాటు, నీటి వసతి, పరిశుభ్రతలను పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డీఈఓ నాగేశ్వరరావు, ఎస్ఎస్ఏ పీఓ మురళీధర్, డీపీఓ శోభస్వరూపరాణి, జవహర్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్ హేమలత, డిప్యూటీ డీఈఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడో..!
ఒక్క పాఠశాలకూ అందని యూనిఫాం జిల్లాకు రూ. 6 కోట్లు కేటాయింపు మూడు కోట్లు ఆప్కోకు విడుదల 20 మండలాలకు సిద్ధం చేస్తున్న మెప్మా మహిళలు మరో 30 మండలాల విద్యార్థులకు ఎప్పుడో సాక్షి, కడప : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో మూడు నెలల వరకూ యూనిఫాం అందే అవకాశం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మొత్తం యూనిఫాం పూర్తికావాలంటే మరొక మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,684 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం(ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాలి. ఈ దుస్తులకు సంబంధించి వస్త్రాలను పంపిణీ చేసే బాధ్యతను ఆప్కో సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీని కోసం ఆ సంస్థకు ఇప్పటి వరకు రూ. 3 కోట్లు అందజేసినట్లు తెలుస్తోంది. దుస్తుల కోసం రెండు నెలల క్రితం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు స్కూలు మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించారు. వీటిని కేవలం మెప్మా వారి ద్వారానే కుట్టించుకోవాలని మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కుట్టే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు 4 లక్షల దుస్తులు ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ‘సారీ’ ఇదే వరుస... విద్యార్థుల యూనిఫాం విషయంలో ప్రభుత్వాలు ప్రతిసారీ ఇదే విధానం అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినా విధానాల్లో మార్పులు రావడం లేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభ సమయంలో విద్యార్థుల సంక్షేమం పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. యూనిఫాం జనవరి నాటికి ఇచ్చినా మరో నాలుగు నెలలు మాత్రమే విద్యార్థులు వాడుకునే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్మాసంలోనే అందజేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశీలకు అంటున్నారు. స్కూల్ కమిటీలకు అందజేశాం జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఇంతవరకు యూనిఫాం అందని విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆర్వీఎం ఇన్‌ఛార్జి పీఓ ప్రతిభా భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆప్కో ద్వారా వస్త్రాలను అన్ని స్కూలు కమిటీలకు అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మండలాలకు మెప్మా మహిళలతో యూనిఫాం కుట్టించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మిగతా మండలాల వారికి కూడా ఒకట్రెండు రోజుల్లో యూనిఫాంను కుట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరలోనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతేప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
ఉపాధ్యాయ సంఘాలు అనంతపురం అర్బన్: ఉపాధ్యాయుల, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ఉపాధ్యాయ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణపై బుధవారం కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఫ్ఏపీటీఓ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘురామరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల పరిరక్షణనను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రైవేటు రంగానికి ఊతం ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు మూతపడేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికి 54 శాతం ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో మరుగుదొడ్లు లేని దుస్ధితి ఉందన్నారు. 20 శాతం పైగా పాఠశాలల్లో తాగునీరు, ప్రహారీలు లేవన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులుకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. పీఆర్సీ అమలు చేయడానికి వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల పనివేళలను పునసమీక్షించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు సంబంధించి 16 డిమాండ్లు, పాఠశాలలకు సంబంధించి 9 డిమాండ్లుతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు అందజేశారు. ఏపీటీఎఫ్ నాయకులు నరసింహులు, రామచంద్ర, ప్రభాకర్, వెంకటేష్, వీటీఎఫ్ నాయకులు జిలాన్, నాగేంద్ర, కోటేశ్వరప్ప, ఎస్టీయూ నాయకులు రామన్న, గోవిందు, సూరిడు, సూర్యనారాయణగౌడ్, ఏపీటీఎఫ్ (1938) నాయకులు వెంకటసుబ్బయ్య, జయరాంనాయక్, హెచ్ఎంఏ నాయకులు చలపతి రమణారెడ్డి, ఆర్‌యూపీపీ నాయకులు ఎర్రిస్వామి, తులసిరెడ్డి, సంజీవకుమార్, నాగరాజు, ఎస్సీఎస్టీయూఎస్ నాయకులు పెద్దన్న, డీటీఎఫ్ నాయకులు జార్జీ, సుబహాన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
పటాన్చెరు రూరల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ సహిత మరుగుదొడ్లు నిర్మిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలి పారు. మంగళవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఇస్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో, గీతం విశ్వవిద్యాలయం సహకారంతో రుద్రారం గ్రామంలో నిర్మించిన పర్యావరణ సహిత మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం 70 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవనీ, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్ల రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతోనే నిర్మించే పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. పర్యావరణ సహిత మరుగుదొడ్ల నిర్మాణంలో గీతం విద్యార్థులు చేస్తున్న పరిశోధనలను అభినందించారు. మంత్రి వెంట ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారి వేణుగోపాలాచారి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, ఈఈ చెన్నారెడ్డి, డిప్యూటీ ఈఈ రామకష్ణ, ఏఈ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ అనంతరెడ్డి, ఇస్నాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, రుద్రారం సర్పంచ్ నవసుకుమారి, గీతం విశ్వవిద్యాలయం డెరైక్టర్ వర్మ ఉన్నారు. -
1,416 టీచర్ పోస్టులు ఖాళీ
నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,416 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పోస్టులు భర్తీ కావొచ్చన్నారు. మాల్తుమ్మెద ఉన్నత పాఠశాలలో మంగళవారం పలు పాఠశాలల హెచ్ఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పనితీరుకు సంబంధించి సూచనలిచ్చేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనతీరు, బోధనోపకరణాల వినియోగం, పరీక్షల నిర్వహణపై ప్రత్యేకమైన ఫార్మాట్‌ను రూపొందించామని, దీనిని ఉపాధ్యాయులే పూరించి ప్రధానోపాధ్యాయుడికి సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఫార్మాట్‌ను హెచ్ఎం తనిఖీచేసి మండల విద్యావనరులకేంద్రానికి పంపుతారన్నారు. అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఆయా మండల కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ తెలిపారు. 1, 2తరగతులకు సంబంధించి తెలుగు, గణితం సబ్జెక్టులపై, 3, 4, 5 తరగతులకు సంబంధించి ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టుపై మూడు రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో గతేడాది పదో తరగతి పరీక్షల్లో 89.31 శాతం ఉత్తీర్ణులయ్యారని, ఈసారి వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో సాగుతున్నామని డీఈఓ తెలిపారు. జిల్లాలో 566 పాఠశాలల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరగవచ్చన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేస్తామన్నారు. అనంతరం ఆయన గోపాల్పేట ఉన్నత పాఠశాలను, మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, మాల్తుమ్మెద, గోపాల్పేట, ఆత్మకూర్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రతాప్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, అరుణజ్యోతి ఉన్నారు. -
నేనూ ‘గ్రామీణ’ విద్యార్థినే..
తాండూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో చదివానని, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తనకు తెలుసని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్వీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘విద్యాహక్కు చట్టం అమలు - ఎస్ఎంసీ చైర్మన్ పాత్రపై’ నిర్వహించిన సదస్సులో ఆయన మట్లాడుతూ కర్నాకట సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు, బషీరాబాద్, బంట్వారం మండలాల పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. ఇక్కడి పాఠశాలలో వసతులు లేవని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు. జిల్లాలో 334 పాఠశాల్లో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజు పాఠశాలలకు పంపించాలన్నారు. ఎస్ఎంసీ చైర్మన్లు పాఠశాల్లో ప్రతి రెండు నెలలకోసారి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మధ్యహ్న భోజనం తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎస్ఎంసీలపైనే ఉందన్నారు. పిల్లల భవిష్యత్‌ను మీరే తీర్చిదీద్దాలన్నారు. పాఠశాలలు అభివృద్ధి కావాలంటే గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను వారానికి రెండుసార్లు ఎస్ఎంసీ చైర్మన్లు తనిఖీ చే సి, పరిస్థితులను స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్ధికి ఒక రోజు రూ.6 ఖర్చు చేస్తోందని, ప్రాథమిక పాఠశాల విద్యార్ధికి రూ.4 ఖర్చు చేస్తోందని చెప్పారు. త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు.. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు త్వరలో ఆర్వీఎం నుంచి నిధులు విడుదలవుతాయని డీఈఓ రమేష్ చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో నిధులు లేవని చెప్పారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఉన్నత పాఠశాల్లో రూ.50 వేలు మౌలిక సదుపాయాల కోసం ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలను అభివృద్ధి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల్లో మార్పు వచ్చింది.. జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయుల తీరు మారిందని డీఈఓ చెప్పారు. ఉపాధ్యాయుల స్వభావం మరాలన్నారు. 70 శాతం ఉపాధ్యాయుల్లో మార్పు వస్తోందన్నారు. మిగతా 30 శాతం మంది విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని మొదట సముదాయిస్తామని, ఆ తర్వాత నోటీసులు ఇస్తామని, వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈఓకు సమస్యలు విన్నవించిన ఎస్ఎంసీ చైర్మన్లు.. విద్యాహక్కు చట్టం అమలు కార్యక్రమానికి వచ్చిన డీఈఓ రమేష్‌కు తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి వచ్చిన ఎస్ఎంసీ చైర్మన్లు పలు సమస్యలు విన్నవించారు. బషీరాబాద్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల తీరులో మార్పు తేవాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగ తి గదుల కొరత ఉందని విన్నవించారు. టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, బాలల హక్కుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ సుదర్శన్, రిటైర్డ్ టీచర్స్ ఫోరం కన్వీననర్ జానార్దన్, ఎంఈఓ శివకుమార్‌తోపాటు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు
మెదక్: కార్పొరేట్ విద్య కాలకూట విషమని, ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు వేస్తాయని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో జరిగిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య.. పాలబుగ్గల చిన్నారుల మెదడుపై మోయలేని భారాన్ని మోపుతోందన్నారు. విద్యార్థికి పాఠశాల, ఇల్లు తప్ప మరేవీ తెలియని పరిస్థితి నెలకొంటోందన్నారు. రాన్రాను విద్యార్థి ఆట పాటలకు.. ప్రాపంచిక జ్ఞానానికి...పల్లె వాతావరణాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని రోజులైతే గేదెలను సైతం జూకెళ్లి చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికే మార్గదర్శకులన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలను పులకింపజేశాయన్నారు. ఇన్‌స్పైర్‌లో వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు శాస్త్రవేత్తలనే అబ్బురపరిచేవిగా ఉన్నాయన్నారు. మెతుకుసీమ బిడ్డలు మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ డీఈఓ రాజేశ్వర్‌రావు ఇంతకాలం ఆంధ్రాలో పనిచేశారని, ఆయన మెతుకుసీమకు బదిలీపై రావడంతో ఈరోజు ఇన్‌స్పైర్‌ను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇన్‌స్పైర్‌లో విజేతలైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. సైన్స్‌ఫెయిర్‌ను తిలకించేందుకు 124 పాఠశాలకు చెందిన విద్యార్థులు రావడం గమనార్హమన్నారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ గత మూడు ఇన్స్పైర్ ప్రోగ్రాంలలో 4,046 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ సురేందర్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో ఇన్‌స్పైర్‌ను మెదక్‌లో నిర్వహిస్తే లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. విజేతలైన 75 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగిఅశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, కౌన్సిలర్లు మాయ మల్లేశం, డిప్యూటీ ఈఓలు శోభ, పోమ్లా నాయక్, మోహన్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, ఎంఈఓలు నరేష్, నీలకంఠం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మెదక్ రూరల్: ఇన్స్పైర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. విద్యార్థులు చేసిన వివిధ నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిద్దార్థ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీనిజ చేసిన భరతనాట్యం మంత్రముగ్దుల్ని చేసింది. నెత్తిన బోనాలు పెట్టి, పల్లెంపై నిలబడి, రెండు చేతుల్లో జ్యోతులను వెలిగించి ఆమె చేసిన నృత్యం ఔరా అనిపించింది. పాపన్నపేటకు చెందిన తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాడిన పాటపై చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. -
మూత‘బడి’
ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతృప్తి పర్చడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో నిబంధనల ప్రకారం రేషనలైజేషన్ ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలకు మూసివేత గండం తప్పడం లేదు. ఇలా సంవత్సరాల తరబడి చరిత్ర ఉన్న పాఠశాలలు ఎత్తివేసే ప్రమాదం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులే చెపుతున్నారు. పొంచి ఉన్న రేషనలైజేషన్ గండం... తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పాఠశాల నిర్వహించడం ఎందుకు ? అందుకోసం ఉపాధ్యాయులను, నిధులను కేటాయించి ప్రయోజనం ఏమిటి..? అని ప్రభుత్వం ఆలోచించింది. దీంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల జాబితాను తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2013-14 విద్యాసంవత్సరంలో విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 9, 1 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలు 4, 21నుంచి 40 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత పాఠశాలలు 37 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 12 ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం ఇటీవల సూచన ప్రాయంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లను మూసివేయనున్నట్లు తెలిసింది. ఇదే అమలైతే జిల్లాలో సుమారు 600 ప్రభుత్వ పాఠశాలకు మూసివేత గండం ఉండే ప్రమాదం నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఆందోళన... రేషనలైజేషన్ గండంతో జిల్లాలో పలు పాఠశాలలు మూసివేతకు దగ్గరలో ఉండటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర వంటి పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు అయా ప్రాంతాలకు హెచ్ఆర్ఏ ఉండటం, రవాణా ఇబ్బందులు లేకపోవడంతో సాధ్యమైనంత వరకు ఆ పాఠశాలల్లోనే ఉండాలని పలువురు ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు. అయితే పలు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బదిలీ తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొద్దొగొప్పో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను బతిమిలాడి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు స్థానిక అధికారుల సహకారంతో రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా మరో 800 ఉపాధ్యాయుల పోస్టులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి: డీఈవో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోబోమని డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం డైస్ ప్రకారం జాబితాను తయారు చేశామని, ప్రస్తుత పరిస్థితి చూసి విద్యార్థుల సంఖ్యలో తప్పులుంటే సరిదిద్ది పంపాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
బాలలకు ‘ఆరోగ్యరక్ష’ పరీక్షలు
నేటినుంచి 45 రోజులపాటు ప్రత్యేక క్యాంపులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోమవారం నుంచి జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3200 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వైద్యబృందాలు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిలుకూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చికిత్సలు అందిం చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందడుగు వేసింది. ‘జవహర్బాలల ఆరోగ్య రక్ష’ పథకంలో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు 45 రోజుల పాటు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలల్లోనే పరీక్షలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3200 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ఆయా పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందు కోసం జిల్లాలోని 132 మంది వైద్యాధికారులతో పాటు కామినేని వైద్యకళాశాల నుంచి 60మంది వైద్యులను వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది షెడ్యూల్ ప్రకారం తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి వైద్య పరీక్షలు చేయనున్నారు. రోజుకు ఒక్కో వైద్యుడు 120 మంది విద్యార్థులకు పరీక్ష లు చేయాల్సి ఉంటుంది. కాగా విద్యార్థులకు సాధారణ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా మందులు పంపిణీ చేస్తారు. పరీక్షలకు సంబంధించిన వివరాలు ఆరోగ్య రక్ష కార్డులలో నమోదు చేస్తారు. -
బడిదొంగల ఆటకట్టు !
ఖమ్మం : నెలనెలా వేతనాలు తీసుకుంటూ పాఠశాలలకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల భరతం పట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదని తరచూ ఫిర్యాదులు రావడం, దీనిపై స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఉపాధ్యాయుల హాజరుపై అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారని సమాచారం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన విద్యాశాఖ... ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాలలు అంటే చులకనేమీ కాదు.. ఇక్కడ కూడా అర్హత గల ఉపాధ్యాయులే ఉన్నారు.. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’ అని కలెక్టర్ ఇలంబరితి ఇటీవల విద్యాశాఖ అధికారుల సమావేశంలో, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రస్తావించారు. సెలవులో ఉంటే హాజరుపట్టికలో ఉదయమే సీఎల్ పెట్టాలని, సాయంత్రం వరకు సెలవు పత్రాన్ని చూపిస్తూ ఉంచడం నేరమని హెచ్చరించారు. దీంతోపాటు ఇటీవల డీఈవోతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక శ్రద ్ధ పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ అధికారులు.. బడికి వెళ్లకుండా హాజరు వేయించుకుంటున్న ఉపాధ్యాయుల గుట్టు రట్టు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఆన్‌లైనల్‌లో హాజరు నమోదు... ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు సేకరించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్‌లకు హాజరు నమోదు వివరాలు చేరవేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మండల విద్యాశాఖ, ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సాయంత్రానికి హాజరు వివరాలు వస్తాయి. దీనిపై నిజనిర్ధారణ చేసేందుకు కూడా కట్టుదిట్టమైన ప్రణాళికతో విద్యాశాఖ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు సేకరించిన హాజరు పట్టికతోపాటు, ప్రతినెలా ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి.. ఉపాధ్యాయుల హాజరు వివరాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల ద్వారా సేకరించిన వివరాలతో సరిచూస్తారు. దీంతో పాఠశాలకు రాకుండా హాజరు వేయించుకున్న ఉపాధ్యాయుడు, అందుకు సహకరించిన ఇతర ఉపాధ్యాయుల గుట్ట రట్టు అయ్యే అవకాశం ఉంది. స్కూల్ విజిట్ రిపోర్టులో హాజరుకు ప్రత్యేక కాలం... స్కూల్ కాంప్లెక్స్ అధికారి, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవోలతోపాటు, సర్వశిక్ష అభియాన్ అధికారులు తరుచూ చేసే స్కూల్ విజిట్‌లో కూడా ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఇతర సిబ్బంది ద్వారా వివరాలు సేకరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వకరు పాఠశాల సందర్శన సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, బడి బయట ఉన్నవారి సంఖ్య, పాఠశాలకు మంజూరైన నిధుల వినియోగం, టాయిలెట్స్, తాగునీటి వసతి, కంప్యూటర్ల పనితీరు, విద్యుత్ సౌకర్యం, బోధనోపకరణాల వినియోగం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిన తీరుపై పరిశీలించేవారు. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, వారిలో క్రమం తప్పకుండా హాజరయ్యే ఉపాధ్యాయులు, తరుచూ సెలవు పెట్టే ఉపాధ్యాయుల వివరాలను సేకరించేలా ఫార్మాట్ తయారు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు చెపుతున్నారు. -
క్రమబద్ధీకరణ కలవరం!
సాక్షి, కరీంనగర్ : ఏటా విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జరుగుతున్న ఉపాధ్యాయ పోస్టుల క్రమబద్ధీకరణ నిరుద్యోగ అభ్యర్థులపై నీళ్లు చల్లుతోంది. విద్యార్థులు లేక స్కూళ్లు మూతబడుతుంటే.. విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు తరలిస్తోంది. గత విద్యా సంవత్సరం జిల్లా విద్యాశాఖ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను క్ర మబద్ధీకరించింది. ఆ సమయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 540 ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య తగ్గి.. వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు పనిలేకుండా ఉన్నారు. దీంతో డీఈవో లింగయ్య అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో సర్దుబాటు చే శారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈయేడు జిల్లావ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో 30వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాక్షాత్తూ విద్యాశాఖ గణాంకాలే చెప్తున్నాయి. వెంటాడుతున్న గుబులు ‘దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ఉంటుంది. ఆ తర్వాతే డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ఈ నెల 2న సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ మళ్లీ క్రమబద్ధీకరణ చేపడితే.. ప్రస్తుతం జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 120 స్కూళ్లలో వందలాది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గత విద్యా సంవత్సరం 540 మందిని సర్దుబాటు చేసిన అధికారులు వీరి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క తర్వాత ప్రకటించే డీఎస్సీలోనూ పోస్టులు తగ్గుతాయి. దీంతో కొత్త రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువులొస్తాయనే కోటి ఆశతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జిల్లాలో వేలాది మంది బీఎడ్, డీఎడ్, ఇతర కోర్సులు పూర్తి చేశారు. ఇప్పటికే వేలాది మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. పేరున్న కేంద్రాల్లో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. పరిణామాల దారెటో..? విద్యార్థుల సంఖ్య తగ్గిందే తడవుగా పాఠశాలలకు తాళం.. ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాల గురించి ఆలోచించడం లేదనిపిస్తోంది. ఒక్క సారి స్కూలుకు తాళం వేస్తే.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మళ్లీ పాఠశాల ఏర్పాటు అసాధ్యమని తెలిసినా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధిక స్థోమత లేని, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుపేద విద్యార్థులు సర్కారు స్కూళ్లనే నమ్ముకుని ఉన్నారు. నేడు మూతబడ్డ పాఠశాలల పరిధిలో భవిష్యత్తులో విద్యార్థులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఆ ప్రాంతంలో విద్యార్థు పరిస్థితి ఏమిటో వారికే తెలియాలి. పాఠశాలలు మూతబడితే.. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్ల సంఖ్య కూడా అదే తీరుగా పెరిగే అవకాశాలున్నాయి. సర్కారు స్కూళ్లపై ప్రజల విశ్వాసం సడలడంతోనే విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తున్నారు. విషయం తెలిసినా.. ప్రభుత్వం మాత్రం పాఠశాలలను బలోపేతం చేసి వారి విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగులకు అన్యాయం ఎం.ప్రతాపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ పోస్టుల క్రమబ్ధ్దకరణ నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతున్న మాట వాస్తవమే. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశాలుండవు. స్కూళ్లు మూతబడవు. పోస్టులూ తరలించే అవకాశముండదు. -
ఎన్నాళ్లీ ఇన్చార్జి ఎంఈవో వ్యవస్థ
నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరును, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చే మండల విద్యాధికారుల నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గాడి తప్పుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 52 మండలాలకు గానూ కేవలం మూడు మండలాల్లోనే రెగ్యులర్ విద్యాధికారులు ఉన్నారు. దీంతో మిగతా 49 మండలాల్లో ఇన్‌చార్జీలే విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే సీనియర్ ప్రధానోపాధ్యాయులైన పీజీ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎంఈవోల నియామకంపై దృష్టి సారించకపోవడంతో ప్రాథమిక విద్య అటకెక్కింది. 49 ఇన్‌చార్జీలే. కెరమెరి, బెజ్జూర్, తిర్యాణి మినహా 49 మండలాలకు ఇన్‌చార్జీలే ఎంఈవోలుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో విద్యా పథకాల అమలు, పాఠశాలల పర్యవేక్షణ జరుగుతోంది. సీనియర్ ఉపాధ్యాయులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పనిభారంతో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు పాఠశాలలపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాఠశాలలో బోధన సక్రమంగా జరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడే పాఠశాలల్లోని విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్చార్జి ఎంఈవోల పాలనను ఆసరాగా చేసుకొని కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తూ ముందు వెళ్లిపోవడం జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారైతే ఆసలు పాఠశాలలకే వెళ్లడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం ఇన్చార్జి ఎంఈవోల వ్యవస్థను ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫీజుల వివరాలు తెలిపే పట్టికను పాఠశాలల్లో ప్రదర్శించడం లేదు. జిల్లాలోని అనేక పాఠశాలకు అనుమతులు కూడా లేవనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్నింటిలో కనీస వసతలు, ఆట స్థలాలు, తదితర నిబంధనలు పాటించకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్న ఇన్చార్జి ఎంఈవోలు చూసీ చూడనట్లు ‘మామూలు’గా వ్యవహరిస్తూనే విమర్శలున్నాయి. -
సర్కారు బడులకు విద్యుత్ గుదిబండ?
ఘట్కేసర్ టౌన్: వాణిజ్య కేటగిరి కింద బిల్లులు రావడంతో సర్కారు బడులకు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా మారాయి. పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వమిచ్చే నిధుల్లో కోతలు విధించడంతో ఏమి చేయాలో తోచక ప్రధానోపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. మన టీవి, కంప్యూటర్ల ద్వారా సాంకేతిక విద్య, మీనా కార్యక్రమంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రేడియో ద్వారా విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను అమలు చేయడానికి పాఠశాలల్లో విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి. గతంలో సర్కారు బడుల విద్యుత్ బిల్లులన్నీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించేది. కొంత కాలంగా రాజీవ్ విద్యామిషన్ విడుదల చేస్తున్న నిధుల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంయుక్త బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలుండగా జిల్లాలో 2500లకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సర్కారు చదువు వాణిజ్యమా? పాఠశాలల నిర్వహణ కు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించే అరకొర నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని, సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లును వేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఉందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నిర్వహణకు రూ. 5 వేలు, గ్రాంట్స్ రూపేణా గదుల సంఖ్యను బట్టి రూ.7 వేలు , అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఉన్నత పాఠశాలల నిర్వహణకు రూ.10 వేలు, గ్రాంట్స్ రూపేణా రూ. 7 వేల నిధులను ఏటా అందిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు, రేడియో, టీవీ, కంప్యూటర్ల వినియోగం ఎక్కువ కావడంతో చెల్లింపులు ఇబ్బందిగా మారింది. సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లులు రావడంతో నెలకు సరాసరి రూ. 1000లకు పైగా బిల్లు రావడంతో వచ్చిన నిధులన్నీ విద్యుత్ బిల్లుల చెల్లింపులకే సరిపోతున్నాయంటున్నారు. పేదలు చదివే ప్రభుత్వ బడులకు వాణిజ్య కేటగిరిగా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గృహ కేటగిరి, వాణిజ్య కేటగిరి మధ్యన చాలా వ్యత్యాసం ఉందని గుర్తు చేస్తున్నారు. తక్షణమే సర్కారు బడుల కనెక్షన్లను గృహ విభాగంలోకి మార్చి ప్రభుత్వమే బిల్లులు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్య కమిటీలు కోరుతున్నాయి. -
బ్లాక్ మార్కెట్లో ‘క్షీరభాగ్య’
తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు సాక్షి, బళ్లారి : నగర శివార్లలోని గుగ్గరహట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి క్షీరభాగ్య పాల ప్యాకెట్లును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం క్షీర భాగ్య పథకం కింద పాలు పొడి ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. అయితే వాటిని కొందరు హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుగ్గరహట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు జరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి భర్త బుధవారం 50 కిలోల పాలపొడిని బైక్‌లో తీసుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పాఠశాల హెడ్మాస్టర్ ఈ సంచిని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలని ఆదేశించడంతో తాను తీసుకెళ్తున్నానని, అందులో ఏముందో తనకు తెలీదని పోలీసులకు ఆయన తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ నుంచి జారుకున్నారు. నిజానిజాలు తేల్చడానికి బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాల పొడిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక నవ నిర్మాణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. -
పాఠశాలల్లో మళ్లీ తనిఖీలు
కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ హెచ్ఎంకు మెమో.. ఇద్దరు టీచర్ల ఇంక్రిమెంట్లో కోత విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల క్రితం ఈ తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేసిన అధికారులు మళ్లీ తనిఖీలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ శుక్రవారం జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని జెడ్పీఎస్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. వ్యక్తిగత పనిపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఓడీ! కంచనపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో డీఈఓ తనిఖీ చేసిన సమయంలో హెచ్ఎం డి.సమ్మయ్య సెలవులో ఉన్నారు. అయితే, హాజరుపట్టికను పరిశీలిస్తే హెచ్ఎం ఎక్కువగా ఓడీలు కూడా వేసుకుంటున్నట్లు తేలింది. మరో ఉపాధ్యాయుడు పవన్‌కుమార్ తన వ్యక్తిగత పనిపై వెళ్లగా అతనికి కూడా హాజరుపట్టికలో ఆన్ డ్యూటీ(ఓడీ) వేశారు. దీంతో హెచ్ఎం పనితీరు సంతృప్తికరంగా లేదని గుర్తించిన డీఈఓ ఆయనకు మెమో జారీ చేశారు. ఇక పవన్‌కుమార్ వ్యక్తిగత పనిపై వెళ్తూ ఓడీ పెట్టినట్లు గుర్తించిన డీఈఓ ఆయన ఒక రోజు వేతనంలో కోత విధించారు. ఆ తర్వాత డీఈఓ విజయ్‌కుమార్ పదో తరగతి విద్యార్థుల ఇంగ్లిష్, సోషల్ స్టడీస్‌లో విద్యా సామర్థ్యాన్ని పరిశీలించగా, వారు చిన్నచిన్న ప్రశ్నలకు సైతం జవాబులు చెప్పలేకపోయారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఆర్.అశోక్, పి.సంపత్‌కు రాబోయే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా తెలుగు, హిందీలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించగా సంతృప్తికరంగా ఉండడంతో ఆయా ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. కాగా, మండలాల్లో ఎంఈఓలు పాఠశాలలను సరిగ్గా తనిఖీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇక నుంచి వరుసగా పాఠశాలల తనిఖీలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విజయ్‌కుమార్ వెల్లడించారు. -
‘సుప్రీం’ త్రిసభ్య కమిటీ రాక
నేడు జిల్లాలో పర్యటించనున్న బృంద సభ్యులు పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనే ధ్యేయం అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు సిరిపురం (విశాఖపట్నం): విద్యాహక్కు చట్టం ప్రకా రం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవన్న ఫిర్యాదు మేరకు అశోక్‌గుప్తా, టి.వి.రత్నం, గున్నం వెంకటేశ్వర్రావులతో కూడిన సుప్రీం కోర్టు న్యాయవాదుల త్రిసభ్య కమిటీ గురువారం నగరానికి చేరుకుంది. జిల్లాలో చాలా పాఠశాలలకు మరుగుదొడ్లు లేవన్న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదిక నేపథ్యంలో శుక్రవారం పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులను కమిటీ పరిశీలించనుంది. అయితే కమిటీ ఏ ఏ పాఠశాలలను పరిశీలి స్తుందనే విషయం గోప్యంగా ఉంచినప్పటికీ సర్వశిక్షా అభియాన్ అధికారులు మాత్రం మూడు రూట్లను సిద్ధం చేశారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్లను మాత్రం శుభ్రం చేసేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనల ప్రకారం 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలి. జిల్లాలో పదిమంది కన్నా తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలు ఉన్నాయి. 200మంది కన్నా ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయం పక్కనపెట్టి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు 3,375 పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లు లేవు అన్న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదిక నేపథ్యంలో ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పూర్తిగా టా యిలెట్లు లేని 1034 పాఠశాలలకు 1738 టాయిలెట్ యూనిట్లు జనవరిలో మంజూరుచేశారు. వీటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా చేస్తే మంచిదే పట్టణాల్లో టాయిలెట్స్ నిర్వహణ బాధ్యతను జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది చూసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావు అన్ని పట్టణాల పురపాలక, నగరపాలక కమిషనర్లకు, డీఈఓలకు, ఎస్ఎస్ఏ పీఓలకు 12175/జి1/2014 మోమో జారీ చేయడంతో టాయిలెట్ల నిర్వహణ మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మెమోను అమలు చేయాలని సుప్రీంకోర్టు కమిటీని కోరనున్నారు. దీంతోపాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత స్కూల్ మోనటరింగ్ కమిటీలు లేదా డ్వాక్రా సంఘాలకు అప్పగించేలా చర్యలు చేపడితే బాగుంటుందన్న ఆలోచనలో విద్యాశాఖాధికారులున్నట్టు తెలుస్తోంది. మూడు రూట్లు సిద్ధం జిల్లాకు రానున్న సుప్రీంకోర్టు బృందాన్ని తీసుకెళ్లేందు కు ఎస్ఎస్ఏ అధికారులు మూడు రూట్లు సిద్ధం చేశా రు. విశాఖ నుంచి ఎన్ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం మీదుగా పెందుర్తి, చోడవరం, సబ్బవరం, పాడేరు వెళ్లే మార్గం ఒకటి... విశాఖ నుంచి ఎన్ఏడీ, గాజువాక మీదుగా అగనంపూడి, అనకాపల్లి, నర్సీపట్నం, అచ్చుతాపురం, రోలుగుంట, రావికమతం, మీదుగా మరొకటి... విశాఖ నుంచి కంచరపాలెం, మద్దిలపాలెం, సాగర్‌నగర్ మీదుగా భీమిలి, ఆనందపురం ఒకటి. అయితే కమిటీ సభ్యులు వీరు సిద్ధం చేసిన రూట్లలో వెళతారా లేక వారు ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకొని వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. -
పాఠాలకు టాటా..
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. టీచర్లే విధులను విస్మరిస్తున్నారు. వారి ఇష్టారాజ్యం కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన టీచర్లే గైర్హాజరవుతున్నారు. విధులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యాయు లు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎల్ఐసీ పాలసీలు, ఫైనాన్స్ తదితర సొంత వ్యాపకాలపైనే దృష్టి పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలతో తలమునకలవుతున్న వారు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానిక విద్యాధికారులను మచ్చిక చేసుకొని తమ పనులు కానిచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోధన్ డిప్యూటీ డీఈఓ జుక్కల్ మండలంలోని బాబుల్‌గావ్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఒక టీచర్ నెలల తరబడి గైర్హాజరు కావటం బయటపడింది. జుక్కల్, మద్నూరు ప్రాంతాల్లో చాలా మంది టీచర్లు ఈ దారిలోనే నడుస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలకు డుమ్మా కొట్టి ఇటీవల పలువుర్లు టీచర్లు పేకాటలో పట్టుబడం చర్చనీయాంశంగా మారింది. గైర్హాజరైతే చర్యలు తప్పవు : డీఈఓ శ్రీనివాసచారి పాఠశాలలకు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరయితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం, విద్యాబోధన సమయంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవు. -
నేటి నుంచి కొత్త బడి గంటలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల పనివేళల పెంపు అంశంపై కొద్దిరోజులుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల మేరకు సవరించిన పనివేళలను శనివారం నుంచి పాటించాలని ప్రధానోపాధ్యాయులకు తాజాగా విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటల పెంపు ప్రతిపాదన విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఉంది. ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించకపోవడంతో అమలులో జాప్యం జరిగింది. తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు సవరించిన సమయాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని, ప్రధానోపాధ్యాయులు పాటించాలని విద్యాశాఖ అధికారి జి.కృష్ణారావు శుక్రవారం ఆదేశించారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్ని పాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడిచి పెట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడిచి పెట్టాలి. ఈ పనివేళలను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీ య విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల,జిల్లాపరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. టీచరు-బోధన కాలం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1,000 గంటలు కేటాయించాలని చట్టం పేర్కొంది. స్టడీ మెటీరియల్, గైడ్లకు గుడ్‌బై పాఠశాలల్లో గైడ్లు, మెటీరియల్‌కు స్వస్తి చెప్పాలని విద్యాహక్కు చట్టం చెబుతున్న నేపథ్యంలోనే నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం పాఠశాల పనివేళలు పెంచుతున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు తమకు అర్ధంకాని అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కళావిద్య, నైతిక విద్య, పనివిద్య, ఆటపాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది పీరియడ్ల స్థానంలో మరో పీరియడ్ ఆదనంగా చేరుతుంది. ఉన్నత పాఠశాల స్థాయిలో వారానికి ఉన్న 48 పీరియడ్లు కాస్త 54కు పెరిగాయి. -
విద్యాభివృద్ధికి కృషి చేయాలి...
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఇలంబరితి డీఈఓను ఆదేశించారు. విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలపై సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సకాలంలో, సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిధులు సక్రమంగా ఖర్చు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను వినియోగించాలని, మధ్యాహ్న భోజన బియ్యాన్ని తనిఖీ చేస్తుండాలని డీఎస్వో గౌరీశంకర్‌ను ఆదేశించారు. బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలును పర్యవేక్షించాలని, కంప్యూటర్ విద్యను నేర్చుకునేలా బోధన ఉండాలని అన్నారు. బాలికా విద్యకు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కస్తూర్బా గాంధీ, బాలికల పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణంలో అలసత్వం చూపే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారిని తొలగించాలని అన్నారు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ప్రతి పాఠశాలకు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఏజెన్సీతో పాటు ఇతరప్రాంతాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నియామకాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆర్వీఎం పీఓను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఏజెన్సీడీఈఓ రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, రాములు, డైట్ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సక్సెస్ అంతంతే!
మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. జిల్లాలో 468 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 272 పాఠశాలల్లో 2008 సంవత్సరంలో సక్సెస్ పేరిట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించింది. ప్రత్యేకంగా ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులు కాకుండా ఆరు నుంచి పదో తరగతి తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులతోనే బోధన ప్రారంభించింది. అధికారులు మొదటి ఏడాది సీబీఎస్ఈ సిలబస్‌ను ఎంపిక చేశారు. సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెప్పడంతో రెండో సంవత్సరం రాష్ట్ర సిలబస్‌కు పరిమితం చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన ఇంగ్లిషు మీడియంలో అంతంత మాత్రమే ఉండటం, మరికొన్ని పాఠశాలల్లో అత్తెసరు ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ప్రైవేటును ఆశ్రయించగా, మరికొందరు తెలుగు మీడియంకు బదిలీ అయ్యారు. దీంతో సక్సెస్ పాఠశాలల సంఖ్య 100 లోపుకు పడిపోయింది. ‘ఫీజుల’ భారం తట్టుకోలేక.. పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియం విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది. ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించి, ఫీజుల భారం తట్టుకోలేక ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఒక్క మంచిర్యాల మండలంలోనే పదో తరగతి 91 మంది విద్యార్థులు మాత్రమే చదివారు. ఇందులో 47 మంది బాలికలే కావడం విశేషం. కాగా, 1998 డీఎస్సీ తర్వాత నియామకమైన ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు. వీరితోపాటు ఉపాధ్యాయ శిక్షణలో ఇంగ్లిషు మెథడాలజీ తీసుకున్నవారు కూడా ఉన్నారు. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిని ఉన్నత పాఠశాలల్లో నియమిస్తే కొంత మేరకు విద్యార్థులకు న్యాయం జరిగేది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కూడా 1998కి ముందు నియామకమై పదోన్నతి పొందినవారే ఉన్నారు. వీరితోనే ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు ప్రస్తుతం తరగతులు చెప్పిస్తున్నారు. దీంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైన ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నా విజన్ నాదే
(సాక్షి ప్రతినిధి, ఖమ్మం): ‘పేద కుటుంబం నుంచి వచ్చాను.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.. ఐఏఎస్ అయ్యాను. పేదరికం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. మనం పని మనం బాగా చేస్తే రేపు ఏంటనేది దేవుడు నిర్ణయిస్తాడు. బ్యాడ్మింటన్, ఫొటోగ్రఫీ నా అభిరుచులు. సినిమాలు బాగా చూస్తాను. రజనీకాంత్ నా అభిమాన హీరో. పరిపాలనపరంగా నా విజన్ నాది. ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. నేనేంటో నెలరోజుల్లో సమాధానం వస్తుంది. 19న జరిగే సమగ్ర సర్వే చాలా ముఖ్యమైంది. ప్రజలందరూ దీనికి సహకరించాలి’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి కోరారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి వారమే అయినా తన మార్కుతో ముందుకెళ్తున్న ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సర్వే చాలా ముఖ్యమైనది ఈనెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వే చాలా ముఖ్యమైనది. జిల్లాలో ఒక్క ఇల్లూ వదిలిపెట్టం. ఇల్లున్నా.. లేకపోయినా ప్లాట్‌ఫామ్‌ల మీద ఉన్న వారినీ సర్వే చేస్తాం. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటినీ గుర్తించి లిస్టు చేశాం. యజమానుల పేర్లు కూడా తీసుకున్నాం. జిల్లావ్యాప్తంగా 8,89,530 ఇళ్లను సర్వే చేస్తున్నాం. ఇందుకోసం 29,651 మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటాం. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాల వివరాలు సేకరిస్తారు. ప్రభుత్వ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటున్నాం. ముందస్తు ప్రక్రియలో భాగంగా గుర్తించిన ఇళ్లన్నింటికీ 11వ తేదీ నుంచి 15 వరకు స్టిక్కర్లు పంపిణీ చేస్తాం. గ్రామపంచాయతీ స్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. సర్వే చేసే సమయంలో ప్రతి ఒక్కరూ రేషన్, ఆధార్‌కార్డులు, ఇంటిపన్ను రశీదు, భూమి పట్టా కాగితం, కరెంటు బిల్లు చూపించాలి. సామాజిక లేదా ఉద్యోగ పింఛన్లు తీసుకునే వారు ఆ వివరాలు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు గుర్తింపు కార్డు చూపాలి. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్టు చూపించాలి. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉంటే మంచిది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. తర్వాత సర్వేలో అదనపు వివరాలు చేర్చవచ్చు... అవసరమైతే తొలగించుకోవచ్చు. ప్రభుత్వం అధికారికంగా మూడు కేటగిరీలకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. ఎన్యూమరేటర్లుగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది... ఆసుపత్రులలో ఉన్నవారు, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు సర్వే సమయంలో లేకపోయినా వారి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఈ జిల్లాలో ఉంటే వారి స్వగ్రామానికైనా వెళ్లవచ్చు. లేదా ఇక్కడే నమోదు చేయించుకోవచ్చు. మేం మాత్రం ఖమ్మం జిల్లా భౌగోళిక స్వరూపంలో ఉన్న ప్రతి మనిషి వివరాలు తీసుకుంటాం. ఈ సర్వే గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు. రేషన్‌కార్డులు పోతాయని, పింఛన్లు తీసేస్తారని అనుకోవద్దు. ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదని నా అభిప్రాయం. జేసీ పర్యవేక్షణలో భూసమస్యల పరిష్కార టీం జిల్లాలో భూమికి సంబంధించిన సమస్యలు చాలా మా దృష్టికి వస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 19 తర్వాత మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. అక్కడే ప్రజల ఫిర్యాదులు తీసుకుంటాం. మ్యుటేషన్, ఆర్ఓఆర్, సర్వే సమస్యలు, కబ్జాలు... సమస్య ఏదైనా ఫిర్యాదు తీసుకుని దాన్ని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం జేసీ పర్యవేక్షణలో ఓ టీంను ఏర్పాటు చేస్తా. భూ పంపిణీ... ఆర ంభం మాత్ర మే భూమిలేని నిరుపేద ఎస్సీలకు భూ పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక ఇవ్వరేమో అనే భయం అవసరం లేదు. ఎంత మందికి ఇచ్చామన్నది ముఖ్యం కాదు..ఇచ్చిన వారికి సక్రమంగా ఇవ్వాలి. అందుకే మొదటి దశలో కేవలం నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు గ్రామాల్లో మాత్రమే అమలు చేస్తున్నాం. ఇచ్చిన భూమిని సాగుకు ఉపయోగపడేలా చూసి నెలవారీగా భూపంపిణీ ప్రక్రియను అమలు చేస్తాం. ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి, గిరిజన సంక్షేమం బాధ్యతలు అక్కడి ప్రాజెక్టు అధికారికే ఇస్తున్నాం. పీవో దివ్య యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మా నుంచి ఏదైనా సహకారం కావాలంటే తప్పకుండా అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో విద్యు, వైద్య, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం. వైద్యులు లేకుండా ఆసుపత్రులు ఎందుకు? జిల్లాలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తా. వైద్యులు లేకుండా ఆస్పత్రులు ఎందుకు? ఈ విషయమై డీసీహెచ్ఎస్, డీఎంహెచ్వోలతో సమీక్ష చేశా. ముందుగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తా. ఇప్పటికే 17 మంది డాక్టర్ల నియామకానికి ఉత్తర్వులిచ్చాం. 33 మంది ఏఎన్ఎంల నియామకాలు పెండింగ్‌లో ఉంటే వాటిని క్లియర్ చేశా. ఇంకా మిగిలిన డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం పోస్టులను కూడా భర్తీ చేసి వైద్య విభాగం బాగా పనిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి పెట్టా. నాణ్యమైన విద్య కావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు మంచి సంస్థల్లో ప్రవేశాలు పొందాలి. అప్పుడే గవర్నమెంట్ పాఠశాలలకు సార్థకత. ఆ దిశలో జిల్లాలోని పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తా. బాగా పనిచేసి పాఠాలు చెప్పే టీచర్లు, హెచ్ఎంలను గుర్తిస్తాం. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిప్పిస్తాం. ఇంకా ఏం చేయాలన్నది మున్ముందు నిర్ణయించుకుంటాం. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలపై కూడా ప్రత్యేక విజన్ ఉంది. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పెంచాలి. ఈ విధంగా ప్లాన్ చేయమని చెప్పా. రోజుకు రెండు, మూడు గంటలు ఇవ్వడం కాదు... టార్గెట్ పెద్దదే పెట్టుకోవాలి. అందుకే 24 గంటల నీటి సరఫరా ప్రణాళిక తయారు చేయమని అధికారులకు చెప్పా. ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. లీకులను అరికట్టాలి. స్టోరేజి సామర్థ్యం పెంచాలి. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే విధంగా చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాం. గ్రామీణ నీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రజలకు కూడా రక్షిత నీటి సరఫరా ఉండాలి. దీనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. చిన్న చిన్న ప్రాజెక్టులు (రెండు, మూడు గ్రామాలకు నీరిచ్చేవి) ఎలా ఉన్నాయో వివరాలు పంపమని చెప్పా. వారంరోజుల్లో ఆ వివరాలు వస్తాయి. వివరాలందిన తర్వా త ప్రణాళిక రూపొందించుకుంటాం. జిల్లాలోని మూడు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా, ఎత్తిపోతల పథకాలపై సమీక్షలు చేసి ప్రణాళిక రూపొందించుకుంటా. తెలంగాణ వచ్చాక తొలి పంద్రాగస్టు.. త్వరలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఫ్లేవర్ ఉండాలని అధికారులకు చెప్పా. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పంద్రాగస్టు ఇది. ఎక్కువగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ముఖ్యంగా ఖమ్మం ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగులకు సమయ పాలన చాలా ముఖ్యం ప్రజల సమస్యలు, ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించడం ఉద్యోగుల బాధ్యత. ప్రజలకు జవాబుదారీగా ఉండే బాధ్యత ఉద్యోగులది. కచ్చితంగా సమయానికి కార్యాలయానికి రావాల్సిందే. సమసయం అయిపోయేంతవరకు ఉండాల్సిందే. ఇదే విషయాన్ని అన్ని శాఖాధిపతులకు చెప్పాను. వారిని తనిఖీ చేయమన్నా. నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. ఈనెల 19 తర్వాత అన్ని మండలాలను విరివిగా తనిఖీ చేస్తా. తనిఖీకి వెళ్లినప్పుడు ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి వెళ్తా. ఇక, పాలనా వ్యవహారాల్లో నేను వచ్చిన తర్వాత ఇప్పటికైతే రాజకీయ జోక్యం ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అలాంటిది ఏైదె నా ఉంటే... రూల్స్ ప్రకారమే నడుచుకుంటా. ఈ పని అవుతుంది... ఈ పని కాదు అని చెప్పేస్తా.... రూల్స్‌కు అతీతంగా వెళ్లలేం కదా...! జిల్లాలో ఉన్న లాంగ్ స్టాండింగ్ సిబ్బంది సమస్య నా దృష్టికి వచ్చింది. వారు చాలా కాలంగా ఉన్నారు కదా అని బదిలీ చేయాల్సిన పనిలేదు. వారి పనితీరేంటో తెలుసుకుంటా. అప్పుడు నిర్ణయం తీసుకుంటా. నా విజన్ నాదే. ఏదైనా పాలన విషయంలో నేనేంటో నెలరోజుల్లో సమాధానం వస్తుంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా... మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పేరు కుంజితపాదం, అమ్మ పేరు ఇందిర. మాది తమిళనాడులోని నాగపట్నం జిల్లా ఆయకారన్పురం అనే గ్రామం. నేను ప్రభుత్వ పాఠ శాలలోనే చదువుకున్నా. పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పేదరికం గురించి నాకు బాగా తెలుసు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఉన్న భారత పభ్రుత్వ పశు పరిశోధన సంస్థలో పీజీ డాక్టర్ కోర్సు చదివిన తర్వాత ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యా. రెండో ప్రయత్నంలోనే సాధించా. భార్య డాక్టర్ టి.ఆర్. కన్నకి, ఆమె నా క్లాస్మేట్. ఇప్పుడు శాస్త్రవేత్త. నాకు ఇద్దరు కూతుర్లు. పెద్ద పాప సంజీవని, చిన్న కుమార్తె లాయషిణి. నా సోదరుడు, ఆయన భార్య ఇద్దరూ డాక్టర్లే. నెలరోజుల తర్వాత రాకెట్ పట్టుకుంటా స్వతహాగా నేను బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని. బ్యాడ్మింటన్, ఫొటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజూ రెండు గంటలు బ్యాడ్మింటన్ ఆడతా. ప్రస్తుతానికి ఇక్కడ మొదలుపెట్టలేదు. అంతా కుదురుకున్నాక నెలరోజుల్లో బ్యాడ్మింటన్ ఆడటం స్టార్ట్ చేస్తా. సినిమాలు బాగా చూస్తా... రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. పూజిస్తే మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.. నాకు దైవభక్తి ఎక్కువే. రోజూ రెండుసార్లు పూజ చేస్తా. దేవుడంటే మంచితనం..ఆయనను పూజిస్తే మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. జిల్లా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మనిషి జీవితంలో స్నేహం, సోదరభావం చాలా ముఖ్యం. ఏ రోజు పని ఆరోజే.. నాలాంటి పేదవాడు, కింద నుంచి వచ్చిన వారు కూడా కలెక్టర్ అయ్యేలా రాజ్యాంగం రాసిన వారికి కృతజ్ఞతలు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు, రాజ్యాంగం రాసిన వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. నాకు ప్రత్యేక కోరికలేమీ లేవు. ఏ రోజు పని ఆరోజు బాగా చేయడమే నా సూత్రం. ఇప్పటివరకు అదే చేస్తున్నా. రేపు అనేది దేవుడిష్టం. -
సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య
మంచిర్యాల సిటీ : జిల్లాలో ఇంటర్ విద్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేయడానికి 1990 సంవత్సరానికి ముందు ప్రభుత్వం 46 కళాశాలలు మంజూరు చేసింది. మొదటి విడతగా మంజూరైన 15 కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు దశలవారీగా 30 కళాశాలలు మంజూరయ్యాయి. వీటిలోని 13 కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించడం గమనార్హం. 14 ఏళ్లుగా అరకొర సౌకర్యాలతో 30 కళాశాలలు నెట్టుకొస్తున్నాయి. వీటిలో 15 కళాశాలలకు నిధులు మంజూరై పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని కళాశాలల్లో వసతులు లేకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులే బోధించడం, పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. జిల్లాలోని రె బ్బెన, కౌటాల కళాశాలల్లోనే 300కు పైగా అడ్మిషన్లు అవుతున్నాయి. మిగతా కళాశాలలు 100 నుంచి 150అడ్మిషన్లకు పరిమితమవుతున్నాయి. ఒక్కో కళాశాలకు ఖర్చు ఏడాదికి రూ.2.50 కోట్లు ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏడాదికి వే తనాలు, ఇతరత్రా అవసరాలకు కలిపి రూ.2.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 46 కళాశాలలకు ఏడాదికి రూ.115 కోట్ల ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఒక ఇంటర్ మీడియట్ విద్యార్థికి ఏడాదికి సగటున రూ.33 వేలు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఇంటర్ విద్య సుడిగుండంలో చిక్కుకొని ఉండటం శోచనీయం. పక్కా భవనాలు.. ఆదిలాబాద్(బాలురు), ఆదిలాబాద్(బాలిక లు), ముథోల్, ఉట్నూర్, మంచిర్యాల, భైంసా, నిర్మల్(బాలురు), నిర్మల్(బాలికలు), కాగ జ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి(బాలురు), బోథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. భవనాలు లేనివి.. కుభీర్, సారంగాపూర్, దిలావార్పూర్, సిర్పూర్(టి), లోకేశ్వరం, కాసిపేట, బెల్లంపల్లి(బాలిక లు), జన్నారం, దండేపల్లి, తలమడుగు, రెబ్బె న, దహెగాం, ఇచ్చోడ కళాశాలలకు భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. కౌటాల కళాశాల అటవీ శాఖ భవనంలో కొనసాగుతోంది. తానూర్ మం డలానికి ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. తరగతులు ఎక్కడ నిర్వహించాలో అధికారలకే తెలియాలి. పాక్షికంగా ఉన్నవి.. కెరమెరి, మందమర్రి, బెజ్జూరు, తిర్యాణి, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మామడ, తాంసి, బేల, నూర్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, వాంకిడి, జైపూర్ కళాశాలలకు భవనాలు పాక్షికంగా తయారు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కడెం కళాశాల భవనం కూడా పాక్షికంగా తయారైంది. ఈ కళాశాలో మూడు గదులే పూర్తి కావడంతో ప్రథమ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం తరగతులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలు ఆలస్యం భవన నిర్మాణాలకు అధికారుల సహకారం, కాం ట్రాక్టర్లు మందుకు రాకపోవడం, నిధుల మం జూరులో ఆలస్యం, వచ్చిన నిధులకు వెంటనే ప నులు ప్రారంభించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఆసిఫాబాద్, రె బ్బెన, మామడ, కౌటాల మండలాల కళాశాలల కు రూ.65లక్షలు మంజూరైనప్పటికీ పనులు ప్రా రంభం కాలేదు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఒ ప్పందం పక్కాగా లేకపోవడంతో పనులు ఆల స్యం అవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సిర్పూర్(టి) కళాశాలకు ఏడాదిన్నరకు అధికారులు స్థలం మంజూరు చేశారంటే ఇంటర్ విద్యపై జిల్లా ఉన్నతాధికారులకు ఉన్న పట్టింపుకు తార్కాణం. సిబ్బంది లేక ఇబ్బంది ప్రతి ప్రభుత్వ కళాశాలకు సరిపడేంత అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందిలో ముగ్గురు అ టెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక జూని యర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు అవసరం. జిల్లాలోని చాలా కళాశాలలకు బోధనేతర సిబ్బంది లేరు. 80 శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైన తానూర్ కళాశాలకు కనీసం ప్రిన్సిపాల్ పోస్టును కూడా అధికారులు మంజూరు చేయలేదంటే అధికారుల చిత్తశుద్ధి ఇంటర్ విద్యపై ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యార్థులు.. బోధన రుసుం.. ప్రతి ప్రభుత్వ కళాశాలలో హెచ్ఈసీ, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ నాలుగు గ్రూపులు ఉన్నాయి. ప్ర తి గ్రూపునకు 55 సీట్ల చొప్పున 45 కళాశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి ఒక సంవత్సరం కో ర్సుకు 9,900సీట్లు ఉంటాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో ఆర్ట్స్గ్రూప్లో 3,000, సైన్స్గ్రూ ప్లో 1,500మంది విద్యార్థులు చేరుతున్నారు. ప్రథమ సంవత్సరంలో అనుత్తీర్ణులు కావడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 3,500 చేరుకుంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో 7వేల మంది విద్యార్థులకు సగటున రూ. 400చొప్పున రూ.32లక్షలు చెల్లించడం విశేషం. ప్రైవేటు విద్యార్థులు.. బోధన రుసుము.. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 40 వేల మంది చదువుతున్నారు. ఆర్ట్స్‌లో 24 వేలు, సైన్స్‌లో 16 వేల మంది వి ద్యార్థులు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 1,600, సైన్స్ విద్యార్థులకు రూ.1,980 చొప్పున ఒక్కొక్కరికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్ట్స్ విద్యార్థులకు రూ.3.84 కోట్లు, సైన్స్ విద్యార్థులకు రూ.3.16 కోట్లు చెల్లిస్తోంది. జిల్లాలో ప్రైవేటు విద్యార్థులకు ఏడాదికి రూ.7 కోట్లు ప్రభుత్వం చెల్లించడం విశేషం. కొసమెరుపు.. జిల్లాకు ఒక ఆర్ఐవో ఉంటారు. ఆర్ఐవో కేవ లం పరీక్షల నిర్వహణ, ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ, అనుమతి వరకే పనిచేస్తారు. ప్రభుత్వ కళాశాలల పర్యవేక్షణ చేయాల్సింది డీవీఈవో. ఇతను కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభు త్వ కళాశాలలను పర్యవేక్షణ చేయాలి. డీవీఈవో కు ఇటీవలనే తెలంగాణ ఆర్జేడీగా అదనపు బా ద్యతలు అప్పగించారు. తెలంగాణలోని 385 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెండు జిల్లాల అధికారిగా తన పనితీరులో న్యాయం చేయని అధికారి తెలంగాణలోని 385కళాశాలలకు ఏమేరకు తన పనితీరును చూపిస్తారో రాష్ట్ర ఉన్నతాధికారులకే తెలియాలి. -
తాళం.. ఘోరం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్యను పెంచాల్సింది పోయి.. తక్కువ ఉన్నారనే నెపంతో స్కూళ్లకు తాళం వేస్తుండడం ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. ఇలాగైతే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన మన జిల్లాలో ఎక్కువ మంది గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. చదువుపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఒకటి, రెండు కాదు ఏకంగా 177 స్కూళ్లు జిల్లాలో మూతపడ్డాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది. బోధన సరిగా లేదని.. పేద వర్గాల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళాహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వందలాది స్కూళ్లు పిల్లలు లేని కారణంగా మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 ప్రకారం జిల్లాలో 177 స్కూళ్లు విద్యార్థులు లేక, 10 మందిలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న కారణంగా క్లోజ్ చేశారు. బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థీ లేనికారణంగా క్లోజ్ చేశారు. మూతపడిన ప్రాథమిక పాఠశాలలివే : అగళి మండలం గొల్లహట్టి, లక్ష్మీపురం, బీరనపల్లి, ఎంకె గొల్ల హట్టి, హుళికెరదేవరహ ళ్లి, ఎంఎం పాల్యం. అమడగూరు మండలం బావిచెరువుపల్లి, సీతిరెడ్డిపల్లి, దుడరగుట్టపల్లి, అమరాపురం మండలం కదతడహళి,్ల అనంతపురం మండలం జంగాలపల్లి, ఆత్మకూరు మండలం దొద్దెకొట్టాల, బత్తలపల్లి మండలం చీమలనాగేపల్లి, రామాంజుంపల్లి, కళ్యాణదుర్గం మండలం పింజరికొట్టాల, కూడేరు మండలం మరుట్ల, కనగానపల్లి మండలం కొండ్రెడ్డిపల్లి, బెళుగుప్ప మండలం వీరాంజినేయ కొట్టాల, బ్రహ్మసముద్రం మండలం విఎన్ హళ్లి, గుమ్మగట్ట మండలం మారెమ్మపల్లి తాండ, పామిడి మండలం పామిడి ఆర్ఎస్, యల్లనూరు మండలం పిఎం కొండాపురం, బుక్కపట్నం మండలం నాయనవారిపల్లి, నల్లగుట్టపల్లి, బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లి, రామగిరి మండలం ఆకుతోట్ల, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి పాఠశాలలు మూతపడ్డాయి. చిలమత్తూరు మండలంలో 6, ధర్మవరం మండ లంలో 10, గాండ్లపెంటలో 4, గార్లదిన్నెలో 2, గోరంట్లలో 7, గుడిబండలో 2, గుంతకల్లులో 2, కదిరిలో 3, కొత్త చెరువులో 4, కుందిర్పిలో 4, లేపాక్షి మండలం శిరివరం, మడకశిరలో 8, ముదిగుబ్బలో 10, నల్లచెరువులో 4, నల్లమాడలో 2, నంబులపూలకుంటలో 5, నార్పలలో 2, ఓబులదేవచెరువులో 7, పరిగిలో 2, పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లి, పెనుకొండ లో 5, రొద్దంలో 5, రొళ్లలో 10, శెట్టూరులో 3, శింగనమలలో 2, సోమందేపల్లిలో 5, తాడిపత్రిలో 2, తలుపులలో 11, యాడికిలో 4, తనకల్లు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. -
తరగతి గది కూలి 40 మందికి గాయాలు
భివండీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలపై ఇది వరకే ప్రజల్లో చిన్నచూపు ఉంది. అక్కడ సౌకర్యాలు, అధ్యాపకుల కొరత ఎక్కువని, టీచర్లున్నా సరిగా బోధించరన్న అపవాదు ఉంది. అయినప్పటికీ కొందరు తల్లిడండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే చాలా స్కూలు భవనాలు పాతకాలం నాటికి కావడంతో కుప్పకూలుతున్నాయి. భివండీలోని మహానగర్ పాలిక పద్మనగర్ తెలుగు మాధ్యమిక పాఠశాలలోని 8వ తరగతి గది మంగళవారం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో 40 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కావడంతో ఇందిరాగాంధీ ఆస్పత్రికి తరలించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్కూల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు నడుస్తుండేవి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎనిమిదేళ్ల కిందట మరో భవనాన్ని నిర్మించి తరగతులను ఇందులోకి మార్చారు. అయితే అప్పటి వరకు ఉన్న స్కూలు పాత భవనాలను ప్రభాగ్ సమితి-3 కార్యాలయంగా వినియోగించారు. ఆ తరువాత సమితి కార్యాలయానికి కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ పాత భవనాలకు మరమ్మతులు చేయకుండానే ఉదయం మాధ్యమిక పాఠశాలను, మధ్యాహ్నం హిందీ, మరాఠీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు సుమారు 800 మంది చదువుతున్నారు. మంగళవారం ఉదయం 9.15 గంటలకు 8వ తరగతిలో సుమారు 80 మంది పిల్లలు ఉండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలింది. దీనికి బిగించిన సీలింగ్ ఫ్యాన్ కూడా పిల్లలపై పడిపోయింది. దీంతో భీతిల్లిన విద్యార్థులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. క్లాస్‌రూమ్‌లో ఉన్న సామల అరుణ, ఉపాధ్యాయురాలితో పాటు కొంత మంది విద్యార్థుల తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు చెప్పినా.... అయితే కార్పొరేషన్ ప్రభాగ్ సమితి సిటీ ఇంజనీర్ వాసిం షేక్ సోమవారమే తరగతి గదులను పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసేవరకు తరగతులు నిర్వహించవద్దని ప్రధానోపాధ్యాయురాలు సోనాలిని ఆదేశించారు.అయినప్పటికీ మంగళవారం యథావిధిగా తరగతులు నిర్వహించారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల కూలడం గమనించిన ప్రభాగ్ సమితి కార్యాలయ సిబ్బంది వచ్చి బాధితులను ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలుగు విద్యార్థులు వేముల రవళి, చిలుక రాహుల్, వైట్ల శ్రావణి, వడ్లకొండ శివరామ్, బూర లావణ్య, ఉబ్బాస్ చంద్రశేఖర్, సూరం వినయ్, భైరి అక్షయ, చిదురాల ఉపేందర్, చేర్యాల మనోజ్, బేతి వినిత్, జొన్ను విక్రమ్, కుందారపు సువర్ణ, మదిరాల సుకన్య, కోనం దేవి, జొన్ను భూలక్ష్మీ, జల్జె శంకర్, పోరండ్ల విజయ, గాజంగి సంధ్య, వేల్ల శ్రావణ్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన కమిషనర్ జీవన్ సోనవాణే, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ విజయ్ కంఠే, ఇతర అధికారులను.. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు నిలదీశారు. పిల్లకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. స్కూల్లో అన్నీ అసౌకర్యాలే.... తెలుగు ప్రజలు అత్యధికంగా నివాసముండే పద్మనగర్ ప్రాంతంలోని ఈ స్కూల్లో మరమగ్గాల కార్మికుల పిల్లలే ఎక్కువ. ‘కేవలం ఐదుగురు టీచర్లతోనే స్కూలు నడుస్తున్నా సర్దుకుపోతున్నాం. ఇప్పుడు మా పిల్లల ప్రాణాలకే ముప్పు వచ్చింది. దీనికి బాద్యులు ఎవరు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉదయం దుర్ఘటన సంభవించాక డిప్యూటి మేయర్ మనోజ్ కాటేకర్, కార్పొరేటర్ మురళి మచ్చ, మహేశ్ చౌగులే, నిత్యానంద్ నాడార్ , సమాజ్ సేవకుడు సచ్చిన్ పాటిల్ వచ్చి విద్యార్థులను పరామర్శించారు. -
డ్రాపవుట్స్‌పై సర్కారు దృష్టి!
* బడి మానేస్తున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ * కేజీ టు పీజీ పథకంలో అధిక ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల(డ్రాపవుట్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కేజీ నుంచి పీజీ పథకం అమలులో భాగంగా ఈ డ్రాపవుట్స్ తగ్గింపునకు ప్రాధాన్యమిచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలోనే డ్రాపవుట్ రేట్ ఎక్కువగా ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉంటోంది. అలాంటి వారిని స్కూళ్లకు రప్పించేందుకు కేజీ-పీజీ పథకంలో ప్రాధాన్యమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఓ కార్యాచరణను రూపొందించనుంది. దీనిపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేక, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కుదరక తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు దూరం చేస్తున్నారని సర్కారు భావిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం... ప్రాథమిక పాఠశాల(ఒకటో తరగతిలో చేరిన వారు ఐదో తరగతికి వచ్చే సరికి) స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బడి మానేస్తున్న వారు 22.32 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఇది 3.20 శాతం మాత్రమే ఉంది. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు 8వ తరగతికి వచ్చే సరికి తెలంగాణలో 32.56 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తుంటే.. ఏపీలో 19.16 శాతం మంది బడికి దూరమవుతున్నారు. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు పదో తరగతికి వచ్చే సరికి తెలంగాణ జిల్లాల్లో డ్రాపవుట్ రేటు 38.21 శాతంగా ఉండగా, ఏపీలో మానేస్తున్న వారు 26.83 శాతమే. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 53.21 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఎస్సీల్లో 40.32 శాతం, ఎస్టీల్లో 62.81 శాతం డ్రాపవుట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే ఎస్సీల్లో 34.99 శాతం, ఎస్టీల్లో 60.37 శాతం డ్రాపవుట్స్ రేటు నమోదైంది. -
నిధులకు గాలం.. పనులకు తాళం!
ఒక నిర్మాణాన్ని మొదలు పెట్టేముందు.. అందుకు సంబంధించి ముడిసరుకు, పని, వ్యయం తదితర అంచనాలు వేసి ఆ తర్వాత పని ప్రారంభిస్తాం. సాధారణంగా అందరూ ఇదే తరహా ప్రణాళికతో రంగంలోకి దిగుతారు. కానీ మన పంచాయతీరాజ్ ఇంజినీర్ల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముందుగా పనులు మొదలుపెట్టి.. కొంత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత అంచనాలు వేశారు. నిర్మాణానికి కేటాయించిన మొత్తం చాలడం లేదంటూ చేతులెత్తేశారు. మరిన్ని నిధులిస్తేనే పనులు చేస్తామని మెలిక పెట్టి నిధులను అట్టిపెట్టుకోవడం గమనార్హం. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తయారీకిగానూ కిచెన్ షెడ్ల ఏర్పాటుకు సర్కారు సిద్ధ్దమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 1,147 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. ఈ తంతు జరిగి మూడేళ్ళు కావస్తున్నా.. పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ మూడేళ్ల కాలంలో కేవలం 56 కిచెన్‌షెడ్లను పూర్తి చేసి ఇంజనీర్లు మమ అనిపించడం గమనార్హం. ఎందుకీ జాప్యం.. ఒక్కో కిచెన్ షెడ్డుకు రూ.75వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టవచ్చని ప్రభుత్వం భావించి ఈమేరకు నిధులు విడుదల చేసింది. అయితే జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు మాత్రం ఈ నిధులు చాలడం లేదట. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా రూ.75వేలకో కిచెన్ షెడ్డు నిర్మించడం సాధ్యం కాదని ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో పనులు గ్రౌండ్ చేసిన 205 నిర్మాణాలను ఎక్కడికక్కడ వదిలేశారు. నిర్మాణ వ్యయం రూ.25 వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఇంజనీర్లు.. ఆ మొత్తాన్ని ఇస్తేనే పనులు చేస్తామంటూ స్పష్టం చేయడంతో యంత్రాంగం తలపట్టుకుంది. సర్దుకు పోరట.. నిధులు విడుదల చేసి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై ఇటీవల కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిధుల పెంపు అంశాన్ని ఇంజినీర్లు ప్రస్తావించారు. నిధులు పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున కొంత సర్దుబాటు చేసి పనులు చేస్తే సరిపోతుందని విద్యాశాఖ సలహా ఇచ్చింది. పాఠశాలలో ఇప్పటికే నిర్మించి ఉన్న ప్రహరీ సపోర్టు తీసుకొని.. స్లాబుకు బదులుగా రేకులు వేసి నిర్మాణాలు పూర్తి చేస్తే మేలు జరుగుతుందని సూచించింది. అయితే ఈ సూచన పంచాయతీరాజ్ ఇంజనీర్లకు రుచించలేదు. దీంతో అలా సర్దుకుపోబోమని స్పష్టం చేసిన ఇంజనీర్లు.. తమ మాటే నెగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నిర్మాణాలు నిలిచిపోగా మూడేళ్ల పాటు ఖజానాలో రూ.కోట్లు మురుగుతుండడం కొసమెరుపు. -
విద్యా ప్రమాణాలు పెంచండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం ద్వారా ఉన్నతస్థాయిలో మంచి ఫలితాలు సాధ్యపడతాయన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణతాశాతం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, మంచినీరు, శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. కస్తూర్బా పాఠశాల భవనాలు, మోడల్ పాఠశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులపై సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఆర్వీఎం పీఓ కిషన్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ, వయోజన విద్య ఉపసంచాలకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్ధంగానే... చక్రం తిప్పుతున్న ఎంఈవోలు మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు కళలు, చేతివృత్తుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సర్వశిక్షా అభియాన్ ద్వారా పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకం జరుగుతోంది. ఈ నియామకాల్లో నిబంధనలను పక్కనపెట్టి ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆరోగ్య విద్య, కుట్లు, అల్లికలు, నృత్యం, నైతిక విద్య తదితరాలను విద్యార్థులకు నేర్పేందుకు జిల్లావ్యాప్తంగా 230 మంది ఇనస్ట్రక్టర్లను నియమించేందుకు అనుమతులొచ్చాయి. ఆర్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో 99, పీఈటీలు 19 మంది, వర్క్ ఎడ్యుకేషన్ 112 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీరు 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వీరి నియామకం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 230 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరంలో గుర్తించి అక్కడ పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను సర్వశిక్షా అభియాన్ విడుదల చేసింది. ఎంపికైన ఇనస్ట్రక్టర్లకు నెలకు రూ. 6వేల వేతనం చెల్లిస్తారు. నిబంధనలు ఉల్లంఘన... వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలున్న ప్రాంతం నుంచే ఈ ఇనస్ట్రక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ బాధ్యతలను పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ తీసుకుంటుంది. మండల పరిధిలో ఉన్న పాఠశాలల్లో పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక పర్యవేక్షణా బాధ్యతలను ఎంఈవోలకు అప్పగించారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకున్న ఎంఈవోలు స్కూలు కాంప్లెక్స్ చైర్మన్, హెచ్ఎం, పాఠశాల యాజమాన్య కమిటీలను పక్కనపెట్టి తమ చిత్తానుసారం తమను ప్రసన్నం చేసుకున్న వారికి ఈ పోస్టులను కేటాయిస్తున్నారనే రోపణలు వస్తున్నాయి. పూర్తయిన జాబితాలను కలెక్టర్, డీఈవో, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారికి సమర్పించాల్సి ఉంది. వారు ఈ జాబితాలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తారు. అయితే పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల ఎంపికలో ఎంఈవోలకు కేవలం పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించినప్పటికీ వారే అన్నీ తామై వ్యవహరిస్తూ జిల్లాలోని అధిక మండలాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతిభావంతులైన అభ్యర్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చక్కని చదువుకు పంచ సూత్రాలు
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు 12న తెరుచుకోనున్న 3,350 పాఠశాలలు 5 నుంచి విజయభేరి యాత్ర ‘సాక్షి’తో డీఈవో దేవానందరెడ్డి మాటామంతీ చక్కని చదువుల కోసం ఈసారి జిల్లాలో ఐదు సూత్రాలు అమలు చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో డీఈవోను ‘సాక్షి’ సోమవారం పలకరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పంచ సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు డీఈవో దేవానందరెడ్డి స్పష్టం చేశారు. కీలకమైన ఐదు అంశాలకు ప్రతి పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈవో), మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) రోజుకు పదేసి పాఠశాలలు చొప్పున తనిఖీ చేసి తనకు రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు తెరుస్తున్నందున అదేరోజు ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు అందినదీ లేనిదీ పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు యూనిఫాం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలలు తెరిచేసరికి ఆయా విద్యాలయాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థి పైతరగతికి ప్రమోట్ అయ్యాడా లేదా అనే విషయాన్ని పరిశీలించేలా జూన్ 12 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పర్యవేక్షణ తీసుకుంటామన్నారు. ఈ ఐదు అంశాల పరిశీలన సమయంలో సమయానికి ఉపాధ్యాయులు బడికి వస్తున్నారా? విద్యాబోధన ఎలా ఉంది? విద్యార్థుల హాజరు ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ప్రత్యేకంగా పరిశీలన చేస్తామన్నారు. జిల్లాలో ఐదేళ్లు నిండిన బాలబాలికలు సుమారు 65 వేల మంది ఉన్నారని డీఈవో చెప్పారు. వారి వివరాలను ఎంఈవోలు, అంగన్వాడీలతో సేకరిస్తామన్నారు. వారిలో ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు వస్తున్నారు... జిల్లాలో ఈసారి కొత్తగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు వచ్చే అవకాశం ఉందని, విద్యా వాలంటీర్ల నియామకం ఉండకపోవచ్చని డీఈవో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఇంకా సుమారు 1200 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 6, 7, 8 తరగతులకు పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ వంటి విభాగాల్లో పార్ట్‌టైం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరిపే విషయం పరిశీలనలో ఉందని తెలిపారు. 20.06 లక్షల పుస్తకాల పంపిణీ... జిల్లాలో ఈసారి 20.06 లక్షల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్టు డీఈవో చెప్పారు. గతేడాది లక్ష పాఠ్యపుస్తకాలు మిగిలాయని, వాటికి తోడు 19.06 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న 7 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తిచేసినట్టు చెప్పారు. పాఠశాలలు తెరవగానే ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తామని తెలిపారు. సిలబస్ మారడంతో ఈసారి బట్టీ పట్టే విధానం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పద్ధతిలో విద్యాబోధన ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీల్లో చదవడం, రాయడం, లెక్కల్లో బేసిక్స్ నేర్చుకోవడం వంటి పద్ధతులను అవలంబించడంలో ఉపాధ్యాయులే విద్యార్థులకు గైడ్‌గా ఉపయోగపడాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ పాఠశాలలు తెరిచేనాటికే సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల బోధనకు యాన్యువల్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉండాలని డీఈవో సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు డీఈవో చెప్పారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు. జిల్లాలో ప్రతి పాఠశాలలోను బాలికలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. సుమారు 20 పాఠశాలలకు స్థల సమస్య కారణంగా సొంత భవనాలు లేవన్నారు. జిల్లాలో 800 బడులకు ప్రహరీ గోడలు లేవని, పట్టణ ప్రాంతాల్లోని 300 పాఠశాలలకు ఆట స్థలాల కొరత ఉందని తెలిపారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు. 200 హైస్కూళ్ల పరిధిలో విజయభేరి... జిల్లాలో ఈ నెల 5 నుంచి 15 వరకు విజయభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఈవో చెప్పారు. పదోతరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు. ప్రత్యేకంగా ప్రచారం రథం ఏర్పాటు చేసి పది రోజులపాటు జిల్లాలోని సుమారు 200 ఉన్నత పాఠశాలల పరిధిలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉత్తీర్ణత శాతాలు, విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రచార రథం వెళ్లే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించి పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా బోధనపై సమాచారాన్ని తెలుసుకుని లోపాలు చక్కదిద్దుతామన్నారు. విద్య గొప్పతనాన్ని వివరిస్తూ మానవహారాలు, ర్యాలీలు చేపడతామని డీఈవో వివరించారు. -
పది ‘పరీక్ష’
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల సమయం సమీపించింది. చదువుకుందామని తెల్లవారుజామున లేస్తే చీకటి స్వాగతం పలుకుతుంది. పది పరీక్షలు ఈనెల 27వతేదీ నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు జరగనున్నాయి. పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమాడ నుంచి 30మంది విద్యార్థులు, దేవనబండ 21, హోసూరు 78, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 170, బాలికోన్నత పాఠశాల 140, గురుకులం బాలుర, బాలికల పాఠశాలల్లో 210మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారు సుమారు 300 మంది వరకు పది పరీక్ష రాయనున్నారు.ఉపాధ్యాయులు ఎలాగోలా విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. పలు పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల పున శ్చరణ తరగతులు మొక్కుబడిగా ముగిశాయి. విద్యార్థులందరిలోనూ ఒకటే టెన్షన్. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలంటే వారిని కరెంటు కోతలు వేధిస్తున్నాయి. దీంతో పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయోన నే భయం విద్యార్థులను తల్లిదండ్రులను పట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రారంభానికి ముందు, ముగింపు తరువాత ఒక్కో గంట ప్రకారం అదనంగా (పునశ్చరణ) తరగతులు నిర్వహించాలని మూడు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే అనేక పాఠశాలల్లో ఇవి మొక్కుబడిగానే ముగిశాయి. డిసెంబర్ 31వతేదీ లోపలే సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ చేయాల్సి ఉండగా ఇప్పటికీ పలు చోట్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని మారుమూల ప్రాంత పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిపరేషన్ పరీక్ష : కరెంటు కోతల కారణంగా విద్యార్థులకు ప్రిపరేషన్ ‘పరీక్ష’గా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా విధిస్తున్న నిరవధిక కోతలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారికంగా ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పత్తికొండలో కోతలు విధిస్తుండగా పల్లెల్లో 12గంటల వరకు కోతలు అమలవుతున్నాయి. ఇక అనధికారిక కోతలకు లెక్కేలేదు. విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతుండటంతో రాత్రింబవళ్లు చదువుదామనుకుంటే కరెంటు కోతలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. -
సజావుగా ‘పరీక్ష’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మెటివ్-2 (అర్ధసంవత్సర) పరీక్షల ప్రశ్నపత్రాల కొరతపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ నెల రెండున పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజే ప్రశ్నపత్రాల కొరత ఏర్పడటం, దీనివల్ల గందరగోళం నెలకొనడాన్ని ‘ఇదేం పరీక్ష’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు లోపాలను సరిదిద్ది, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సమైక్య ఉద్యమం కారణంగా సిలబస్ పూర్తికాక, అక్టోబర్‌లో జరగాల్సిన సమ్మెటివ్-2 పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు ఈ ఏడాది ప్రశ్నపత్రాలను హైదరాబాద్ నుంచి పంపించడం, అవీ అరకొరగానే ఇవ్వడంతో సమస్య వచ్చింది. 9, 10 తరతగతులకు ప్రశ్నపత్రాలు సక్రమంగానే అందాయి. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 6 నుంచి 8వ తరగతి చదివే 2 లక్షల 74 వేల 115 మంది విద్యార్థుల్లో చాలామంది ప్రశ్నపత్రాల కొరత, పరీక్షలు ఆలస్యం కావడం వంటి సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి గత రెండు రోజుల్లో ప్రశ్నపత్రాల కొరత ఎక్కడెక్కడ ఉందో గుర్తించారు. ప్రతి పాఠశాలకు ఉండే సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుంచి అవసరమైతే ప్రశ్నపత్రాలు జిరాక్స్ (ఫొటోస్టాట్) తీయించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో తెలుగు పరీక్ష రోజున వచ్చిన ఇబ్బంది శుక్రవారం జరిగిన హిందీ పరీక్షకు కొంత తీరింది. శనివారం జిల్లాలో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు ప్రశ్నపత్రాల కొరత లేకుండా రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ప్రాజెక్టు అధికారిణి బి.పద్మావతి చర్యలు చేపట్టారు. మిగిలిన పరీక్షలన్నీ సజావుగా జరిగేలా అవసరమైన ప్రశ్నపత్రాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠాలు
అది ఏకోపాధ్యాయ పాఠశాల. అంటే ఒకే ఒక్క టీచర్ ఉంటారన్నమాట. ఉన్న ఆ ఒక్కరూ ఏళ్ల తరబడి గైర్హాజరైతే పరిస్థితి ఏమిటి?.. జలుమూరు మండలం పాఠశాలను చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడి ఉపాధ్యాయురాలు రాజకీయ పలుకుబడి ఉందని హుంకరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. తన స్థానంలో పదో తరగతి చదివిన యువతిని రూ.2 వేలకు పాఠాలు చెప్పే పని అప్పగించారు. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. అక్టోబర్‌లో పాఠశాల వైపు కన్నెత్తి చూడని ఆమె.. నవంబర్‌లో నాలుగంటే నాలుగు రోజులే ముఖం చూపించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను మాన్పించేసి.. వేరే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత పిల్లలందరినీ బడి మాన్పించేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. గొలియాపుట్టి ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయినిగా పీవీ మాధవి సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఉంటూ ఇక్కడకు రాకపోకలు చేస్తున్న ఈమె ఏ రోజు కూడా సక్రమంగా పాఠశాలకు రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతోనే ఇంతగా బరి తెగుస్తున్నట్టు తెలిసింది. ఈమె ధైర్యం ఎంతవరకూ వచ్చిందంటే పదో తరగతి చదివిన ఓ యువతికి జీతం చెల్లించి టీచర్‌గా మార్చేసి పాఠాలు బోధించే స్థాయికి చేరింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల తరువాత జూన్‌లో పాఠశాల తెరుచుకున్నప్పుడు ఓసారి వచ్చిన ఉపాధ్యాయిని మాధవి ఆ తరువాత నామమాత్రంగా వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అక్టోబర్‌లో ఒక్కరోజు కూడా బడిముఖం ఈమె చూడలేదు. నవంబర్ నెలలో కేవలం నాలుగు రోజులే వచ్చినట్టు హాజరు పట్టీ రుజువు చేస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉండడంతోపాటు, విద్యాశాఖా మంత్రి తెలుసంటూ ఇక్కడ విద్యాశాఖాధికారును భయపెట్టిన సందర్భాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈమె స్థానంలో నెలకు రెండు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ఒప్పందంతో గ్రామంలోని 10 వతరగతి చదివిన మహిళ అనాధికారికంగా ఇక్కడ ఉపాధ్యాయినిగా చెలామణి అవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న మాధవి దీర్ఘకాలిక సెలవు కూడా పూర్తయి రెండు నెలలు దాటింది. నవంబర్‌లో కేవలం నాలుగు రోజలులే పని చేసిందని విద్యాశాఖాధికారి పి.సింహచలం తెలిపారు. వాస్తవంగా విద్యాహక్కు చట్టం ప్రకారం సంవత్సారానికి ప్రభుత్వ పాఠశాలలు 220 రోజలు పని చేయాలి. అలాగే 165 నుంచి 170 వరకు పీరియడ్స్ జరగాలి. ఇవేమి ఇక్కడ జరగలేదు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయలు 10 రోజులు సెలవు మించితే రెగ్యులర్‌గా డిప్యూటేషన్‌పై మరొకరిని నియమించాలి. కానీ పాఠశాల ప్రారంభం నుంచే మాధవి గైర్హాజరవుతున్నా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 22 మంది విద్యార్థులు ఉండేవారు. ఉపాధ్యాయిని రాకపోవడంతో ఎనిమిది మంది సమీపంలో ప్రైవేటు పాఠశాలలో చేరిపోయారు. మరో ముగ్గురు టీసీలు తీసుకొని తమ్మయ్యపేట పాఠశాలకు వెళ్లిపోయారు. ప్రసు ్తతం 13 మందే మిగిలారు. వీరిని కూడా సంక్రాం తి పండుగ తరువాత ప్రైవేటు పాఠశాలలో చేర్చేస్తామని తల్లిదండ్రులు నేతింటి సూరమ్మ, నేతింటి లక్ష్మి,రోహిణి తదితరులు తెలిపారు. పాఠశాల భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చామని, అయితే నేడు తమ పిల్లలకు చదువు చెప్పేవారు లేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు. ఎంఈవో సింహచలం మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని మాధవి దీర్గకాలిక సెలవు పూర్తయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే పోస్టల్ ద్వారా అనారోగ్యంగా ఉన్నట్టు లెటర్ పంపించారన్నారు. ఈమె విషయాన్ని డీఈవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వెలిసోద గ్రామ పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై టీచర్‌ను పంపిస్తామన్నారు. -
ఒకటో తరగతి నుంచే ఏబీసీడీ....
= కన్నడ రాజ్యోత్సవంలో సీఎం వెల్లడి .. = ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిషు తప్పనిసరి = ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆ భాషకు ప్రాధాన్యత = అంతమాత్రాన ఆంగ్లమే సర్వస్వం కాదు = ఇంగ్లిషులోనే మాట్లాడాలని విద్యార్థులపై ఒత్తిడి తేవడం సరికాదు = కన్నడ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది = ఆ మాధ్యమం పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసేయం = ఇక్కడున్న రాష్ట్రేతరులూ కన్నడ నేర్చుకోవాలి సాక్షి, బెంగళూరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పని సరైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇక్కడి కంఠీరవ స్టేడియంలో శుక్రవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో పాటు ఉపాధి అవకాశాల దృష్ట్యా ఇంగ్లిషుకు ప్రాధాన్యత కల్పించడం తప్పనిసరి అన్నారు. అందువల్లే విద్యార్థులకు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషును బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. అంతమాత్రాన ఇంగ్లిషు భాషే సర్వస్వం అనుకోవడానికి లేదన్నారు. ఆ భాషను ఎంతవరకూ నేర్చుకోవాలి, ఏ సమయంలో ఉపయోగించుకోవాలనే విషయం అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలన్నారు. కన్నడ మీడియంలో చదివితే పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోలేరనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ఆలోచన వల్లే వారు తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చేర్పించడమే కాకుండా ఆ భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు. మాతృభాషను నేర్చుకోవడం, మాట్లాడటంలో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన భాషలపై పట్టు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కన్నడ భాష అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువనో, ఉపాధ్యాయుల కొరత ఉందనో రాష్ట్రంలోని కన్నడ మాధ్యమం పాఠశాలలను మూసేయబోమని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ పిల్లలతో పాటు తామూ కన్నడంను నేర్చుకోవాలని ఉద్బోధించారు. ఇక్కడి సదుపాయాలను అనుభవిస్తూ స్థానిక భాషను నేర్చుకోమంటే ఎలాగని ఆయన నిలదీశారు. -
చిన్నారిని మింగిన సంప్ ప్రభుత్వ స్కూలులో దుర్ఘటన
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తెరిచి ఉన్న సంపు మూడేళ్ల చిన్నారిని మింగేసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన చింతకుట్ల మరియాదాస్, అన్నమ్మ దంపతులు మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి, ఖానామెట్ ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు దీక్షిత, రాబర్ట్ (3) ఉన్నారు. భర్త నోవాటెల్‌లో లాండ్రీ పనులు చేస్తుండగా, భార్య హైటెక్స్‌లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు. బుధవారం తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా, దీక్షిత ఇంటి పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో అక్కతో పాటే రోజూ స్కూలుకు వెళ్లే రాబర్ట్ బుధవారం కూడా వెళ్లాడు. మధ్యాహ్నం 12కి భోజనానికి ఇంటికి వచ్చారు. అయితే, మూత్ర విసర్జన కోసం బటయకు వెళ్లిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి పాఠశాల ఆవరణలోని సంపులో పడి చనిపోయాడు. గంట తర్వాత చూసిన స్థానికులు బయటకు తీసి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కొత్తగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలి పారు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలోని సంపుపై మూత ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించారు. కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్సీపీ శేరిలింగంపల్లి కన్వీనర్ ఓ. శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేతలు నర్సింహ యాదవ్, వార్డు కమిటీ సభ్యుడు రాధాకృష్ణ యాదవ్ బాధితులను పరామర్శించారు.