నరకయాతన
మరుగుదొడ్లు లేక విద్యార్థులకు ఇక్కట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన మౌలిక సదుపాయాలు
చోడవరంలో 800 మందికి మూడే
రన్నింగ్‌వాటర్ లేక నిరుపయోగం
మరుగుదొడ్లు సదుపాయం లేక ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. వందలాది మంది ఉండే సర్కారు బడుల్లోనూ రెండు మూడే ఉంటున్నాయి. బాలురు బహిరంగ ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. కౌమారదశలోని విద్యార్థినులు సిగ్గువిడిచి చెట్లు, పుట్టలను ఆశ్రయిస్తుండగా కోందరు బయటకు వెళ్లలేక గంటల తరబడి ఉగ్గపట్టుకుని ఉండి గర్భకోశవ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
చోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కొరవడుతున్నాయి. మరుగు సమస్య పట్టి పీడిస్తోంది. వందలాది మంది ఉన్న పాఠశాలల్లోనూ రెండుమూడు మరుగుదొడ్లు ఉండటంతో విద్యార్థులు నరకయాతనకు గురవుతున్నారు. కౌమారదశలోని విద్యార్థినుల ఇబ్బందులు అలవికానివిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు ఉన్నా.. రన్నింగ్ వాటర్ సదుపాయం లేక నిరుపయోగం గా ఉంటున్నాయి. బాలికల
అవస్థలు పడుతున్నాం
మరుగుదొడ్లులేక నానా అవస్థలు పడుతున్నాం. ఒక్కోసారి కడుపునొప్పి వచ్చి ఇళ్లకు వెళ్లిపోతున్నాం. ఉన్న రెండు మూడు వందలాది మందికి సరిపోవడం లేదు. పాఠశాలల్లో మరిన్ని నిర్మించాలి. -కె.జ్యోతిర్మయి,
ప్రభుత్వ ఉన్నతపాఠశాల, చోడవరం. పాఠశాల్లో విద్యార్థినుల అవస్థలు అన్నీఇన్నీకావు. కొన్ని పాఠశాలలకు ఇటీవల కొత్తగా భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. పాలకుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. చోడవరం నియోజకవర్గంలో 227ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సగం వాటికి మరుగుదొడ్లు లేవు. 33 ఉన్నతపాఠశాలల్లో ఏడింటికి మాత్రమే ఒకటి రెండు అన్నట్టు మరుగుదొడ్లున్నాయి. 50శాతం ప్రాథమిక పాఠశాలకు ఒక్కటి కూడా లేదు. చోడవరం మెయిన్ హైస్కూల్‌లో 800మంది విద్యార్థులకు కేవలం మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇక్కడ ఆర్‌ఎంఎస్‌ఎ గ్రాంటుతో మరో 16మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు. నిధుల కొరతతో అవి అర్ధంతరంగా ఆగిపోయాయి. లక్కవరం, పీఎస్‌పేట, గోవాడ, జుత్తాడ, వడ్డాది, దిబ్బిడి, తట్టబంద, రోలుగుంట, గవరవరం, జన్నవరం ైెహ స్కూళ్లలోనూ ఇదే దుస్థితి. బాల,బాలికలు ఉండే పాఠశాలల్లో అయితే బాలురు ఆరుబయటకు పోతున్నారు. బాలికలు సిగ్గుతో ఉగ్గపట్టుకుని గంటల తరబడి తరగతి గదుల్లో ఉండిపోతున్నారు. బంగారుమెట్ట, సింగవరం, సీతయ్యపేట, మల్లాం, రాజాం, తులకలపూడి,ఎం.భూపతిపాలెం, నీలకంఠపురం, గంథవరం, నర్సాపురం, చాకిపల్లి ,లక్కవరం, జి.స్ట్రీట్‌తోపాటు అనేక పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ లేదు. కొన్ని చోట్ల బోర్లు లేక మరికొన్ని చోట్ల ట్యాంక్‌లు, పైపులైన్ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు బకెట్లతో నీరు తెచ్చుకొని మరుగుకు వెళుతున్నారు.