14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం | Swaccha college Award to the 14 schools | Sakshi
Sakshi News home page

14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం

Published Sat, Sep 2 2017 3:19 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం

14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం

- జిల్లాల కేటగిరీలో ఖమ్మం, నల్లగొండకు అవార్డులు 
- ఢిల్లీలో జాతీయ అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి జవదేకర్‌
 
సాక్షి, న్యూఢిల్లీ: నీరు, పరిశుభ్రత వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించే ప్రభుత్వ పాఠశాలలకు కేంద్రం జాతీయ స్థాయిలో ఇచ్చే ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కార్‌ కింద రాష్ట్రానికి చెందిన 14 స్కూళ్లు అవార్డులు అందుకున్నాయి. రాష్ట్రాల కేటగిరీలో 2016–17కి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.

శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ రాష్ట్రాలు, జిల్లాలు, పాఠశాలల కేటగిరీల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు రాష్ట్రాలు, 11 జిల్లాలు, 172 పాఠశాలలకు ఈ అవార్డులు అందజేశారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, ఏపీలోని పశ్చిమ గోదావరి... జిల్లాల కేటగిరీలో అవార్డులు అందుకున్నాయి. పురస్కారాలు దక్కిన పాఠశాలలకు రూ. 50 వేల నగదు అందజేశారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలలకు పురస్కారాలు అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు.
 
పురస్కారాలు అందుకున్న పాఠశాలలు ఇవీ..
తెలంగాణ నుంచి మొత్తం 14 పాఠశాలలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పుర స్కారాలు అందుకున్నాయి. అం దులో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఎంపీయూపీఎస్‌ బండల్‌ నాగ పూర్, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ బాలు ర పాఠశాల–బెల్లంపల్లి, కరీంనగర్‌ జిల్లాకు చెందిన అంబారీపేట జడ్పీహెచ్‌ఎస్, గంగాధర టీఎస్‌ ఎంఎస్, కొత్తపల్లి(పీఎన్‌) ఎంపీ యూపీఎస్, మెదక్‌ జిల్లాలోని ఎంపీయూపీఎస్‌ ఇబ్రహీంపూర్, రంగారెడ్డి జిల్లా నుంచి ఎంపీపీఎస్‌ బుద్దారం, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎంపీపీఎస్‌ చౌటగడ్డ తండ, నల్లగొండ జిల్లా నుంచి జడ్పీహెచ్‌ఎస్‌ అనంతారం, వరంగల్‌ నుంచి జడ్పీహెచ్‌ఎస్‌ తిమ్మాపేట్, ఖమ్మం నుంచి టీఎస్‌ఎంఎస్‌ కారేపల్లి, ఎంపీపీఎస్‌ మల్లారం, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఈఐఎస్‌ సింగారెడ్డిపాలెం, ఎంపీయూపీఎస్‌ గండగలపాడు ఈ పురస్కారాలు అందుకున్నాయి. కాగా, ఏపీ నుంచి మొత్తం 21 పాఠశాలలు పురస్కారాలు అందుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement