డిసెంబర్ 7 శనివారం, సాయంత్రం 5 గంటలకు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ ఫెస్టివల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్‌లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇండియా, యూరప్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్‌లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు చెందిన బ్యాండ్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్ తెగకు చెందిన అలస్కాన్ నేటివ్, ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్‌స్ట్రోమ్‌తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి; పోర్చ్‌గీస్ ఆర్టిస్ట్ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.
వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment