
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని యూఎస్ కాన్సులేట్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా, యాక్టింగ్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్ లార్సన్ తాజాగా హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉమ్మడి మిలిటరీ విన్యాసాల వంటి అనేక అంశాల్లో అమెరికా–భారత్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయన్నారు.
దాదాపు 19 ఏళ్లపాటు దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్.. లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సూడాన్, జెరూసలేం, లెబనాన్‌లలో పనిచేశారు. అంతకుముందు నేషనల్ పబ్లిక్ రేడియోలో ఓ టాక్ షో నిర్మాతగా వ్యవహరించారు. ‘అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోని సాహిత్యాల్లో పోలికలు’, ‘మధ్యప్రాచ్య’అంశాలపై కాలిఫోర్నియా వర్సిటీలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించారు.
Comments
Please login to add a commentAdd a comment