jennifer
-
నిర్మాత లైంగిక వేధింపులు.. ఆ విషయంలో సంతోషంగా ఉందన్న నటి!
బాలీవుడ్లో ప్రముఖ రియాలిటీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ షోలో రోషన్ దారువాలా కౌర్ సోధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత షో నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపుల గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసిత్ కుమార్ మోడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ విజయం సాధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని పోలీసులను కోరినట్లు ఆమె వెల్లడించారు. నాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా అందించారని తెలిపారు. ఈ కేసులో నాకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు కోర్టు జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఈ కేసులో తనకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని జెన్నిఫర్ మిస్త్రీ వాపోయింది. జెన్నిఫర్ మాట్లాడుతూ.." ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చి 40 రోజులకు పైగా అయింది. ఇంకా నాకు రావాల్సిన మొత్తం పరిహారం రాలేదు. అతన్ని దోషిగా నిరూపించినప్పటికీ.. ముగ్గురు నిందితులకు ఎలాంటి శిక్ష విధించలేదు. సోహిల్ రమణి, జతిన్ బజాజ్‌లను దోషులుగా చేర్చలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసు తీర్పుతో నేను ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. నాపై జరిగిన వేధింపులను గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి నాకు సరైన న్యాయం లభించలేదని భావిస్తున్నా" అని చెప్పింది. కోర్టు విధించిన పరిహారం చిన్నదని.. ఇలాంటి నేరాలు ఇతరులు చేసేలా ప్రేరేపించవచ్చని నటి పేర్కొంది. -
సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
టీవీ షోలు అనేది ప్రస్తుతం ట్రెండ్. సినిమాల కంటే వీటి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లే ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి జెన్నీఫర్ మిస్త్రీ ఓ నెలన్నర ముందు షో నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించారని పోలీస్ కేసు పెట్టింది. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. ఇప్పుడు షోలో ఎదురైన మరిన్ని చేదు అనుభవాల్ని బయటపెట్టింది. బట్టల నుంచి దుర్వాసన 'ప్రొడక్షన్ టీమ్ మా బట్టలు కూడా ఉతికేవాళ్లు కాదు. 20 రోజుల పాటు వాటినే వేసుకునేవాళ్లం. దీంతో వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చేది. చేసేదేం లేక కొన్నిసార్లు మేమే ఉతక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సెట్లోని కొందరు కాస్ట్యూమ్స్‌ని మాత్రం వాష్ చేసేవాళ్లు. తాగేనీరు కోసం అడుక్కునే పరిస్థితి. ఎందుకంటే సెట్లో కొన్న వాటర్ బాటిల్స్ మాత్రమే ఉండేవి. ఒకవేళ మేం అవి కావాలని అడిగితే మమ్మల్ని తిట్టేవారు. బిస్కెట్ ప్యాకెట్ కూడా సెట్లో మహాప్రసాదంలా అనిపించేది. రాత్రి షిఫ్ట్‌లో అయితే అది కూడా ఇచ్చేవారు కాదు' (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?) వ్యాన్‌లో బొద్దింకలు 'అలానే షో జరిగినన్నీ రోజులు నా సొంత జ్యూవెలర్లీ ధరించేదాన్ని. నా షూస్ చిరుగులు పడినా అవే కొన్నాళ్లపాటు యూజ్ చేశారు. మాకు కనీసం కాస్ట్యూమ్స్ అయినా ఇచ్చేవారు. చైల్డ్ ఆర్టిస్టులకు అయితే అవి కూడా ఇవ్వరు. కొవిడ్ టైంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు మాత్రం శానిటైజేషన్ చేశారు అంతే. మేముండే క్యార్ వాన్స్‌లో విపరీతంగా బొద్దింకలు ఉండేవి' అని చెప్పిన జెన్నీఫర్ మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పటికి ముగుస్తుందో? తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి జెన్నీఫర్ మిస్త్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే గతంలో నిర్మాతలపై కేసు పెట్టిన ఈమె.. ఆయన తన చెంప గిల్లాడని, అసభ్యంగా మాట్లాడుతూ మద్యం తాగాలని బలవంతం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈమెకు సకాలంలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం, వేధింపులకు గురిచేయడంతో ఈ మార్చిలో ఈమె షో నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి షో యాజమాన్యం తీరుపై ఈమె ఆరోపణలు చేస్తూనే ఉంది. మరి ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో? -
ఆసక్తికరంగా ‘పరమపద సోపానం’ టీజర్
అర్జున్ అంబటి, జెన్నిఫర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పరమపద సోపోనం’. నాగ శివ దర్శకత్వంలో గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా అక్రమాలు ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్. -
నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?) మద్యం తాగమని బలవంతం తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది. అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్‌లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు. 'కుటుంబాన్ని వదిలి షూట్‌కు రావాలన్నారు' తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్మెంట్లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది. తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్‌కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా సెట్లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు) -
నటిపై లైంగిక వేధింపులు.. నిర్మాతపై కేసు నమోదు!
హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) -
రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు
తారక్ మెహతా నటి జెన్నిఫర్ మిస్త్రీ సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాత అసిత్ మోడీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనతో విస్కీ తాగడానికి రూమ్‌కు రావాలని రెండుసార్లు పిలిచాడని తెలిపింది. అయితే అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో సిట్కామ్లోని తన సీన్స్‌ను తొలగించాడని వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. (ఇది చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ నటి!) పాపులర్ సిట్కామ్ 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా'లో రోషన్ సోధి పాత్రను పోషించిన జెన్నిఫర్ మిస్త్రీ.. నిర్మాత లైంగిక వేధింపులతో షో నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. మీరు చాలా అందంగా ఉన్నారంటూ తనపై పొగడ్తలు కురిపించేవారని తెలిపింది. అతనితో కలిసి విస్కీ తాగేందుకు రావాలని పలు సందర్భాల్లో అడిగేవాడని పేర్కొంది. జెన్నిఫర్ మిస్త్రీ మాట్లాడుతూ.. '2019లో మా బృందం మొత్తం సింగపూర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీకు రాత్రిపూట పార్టనర్ లేకపోతే.. నా గదికి వచ్చి విస్కీ తాగు అన్నారు. ఇది విని నేను ఆశ్చర్యపోయా. ఒక రోజు తర్వాత మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.' అని అన్నారంటూ జెన్నిఫర్ తన బాధను చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) View this post on Instagram A post shared by Jennifer Mistry Bansiwal🧚♀️♾ (@jennifer_mistry_bansiwal) -
ముగ్గులు వేసి.. మురిసిపోయి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రముఖ నృత్యకారిణి, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి నివాసంలో శనివారం సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం.72లోని దీపికారెడ్డి నివాసంలో జరిగిన ఈ వేడుకలకు హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరై సందడి చేశారు. దీపికారెడ్డి ఆమెకు సంప్రదాయబద్ధంగా తిలకందిద్ది ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ రంగవల్లులు వేసి మురిసి పోయారు. సంక్రాంతి ప్రత్యేక వంటకాలైన అరిసెలు, సకినాలు, పొంగల్ రుచిచూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దీపికారెడ్డి శిష్యబృందం సంక్రాంతి నేపథ్యంగా నిర్వహించిన నృత్యరూపకాన్ని ఆమె తిలకించారు. సంక్రాంతి పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారో తెలియజేస్తూ.. ముగ్గులు, భోగి మంటలు, భోగి పండ్లు, సంక్రాంతి, కనుమ విశిష్టతలపై ఈ నృత్యరూపకం కొనసాగింది. 3 గంటలపాటు జెన్నిఫర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం శాస్త్రీయ నృత్య ముద్ర లను అభినయించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జెన్నిఫర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మన పండుగలను తెలుసుకునేందుకు ఆమె చూపిన ఉత్సా హం మరువలేనిదని ఈ సందర్భంగా దీపికారెడ్డి వెల్లడించారు. తమ ఇంట్లోకి వచ్చేక్రమంలో చెప్పులను బయట విడిచి రావడమే కాకుండా బొట్టు పెడుతుండగా దానిని ఆనందంతో ఆస్వాదించి పండుగలో నిమగ్నమైన తీరు ఆకట్టుకుందని ఈ సందర్భంగా దీపికారెడ్డి తెలిపారు. -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’ వంటి చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు కట్టిపడేశావు అని ఆడియన్స్ అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఆ థ్రిల్, ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రావు’’ అని చిత్ర దర్శకుడు గురు పవన్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జంటగా నటించిన చిత్రం ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం విజయోత్సవంలో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదరిస్తామని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమా తీశారనే మంచి పేరు వచ్చింది’’ అన్నారు అట్లూరి నారాయణ రావు. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. -
ఆంగ్లంపై ఏపీ చర్యలు భేష్
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్): ఆంగ్ల భాషను అందరికీ చేరువ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని అమెరికన్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆంగ్ల భాషను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వంటివి అందిస్తోందా అని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక శాతం విద్యార్థులకు కళాశాల రుసుములను, హాస్టల్ చార్జీలను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా చెల్లిస్తోందని వివరించారు. ఏయూలో ఇంక్యుబేషన్, స్టార్టప్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులు స్టార్టప్ రంగాలలో పరస్పరం కలసి పనిచేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైందన్నారు. ఏడాది కాలంలో ముప్పైకి పైగా కార్యక్రమాలను అమెరికన్ కార్నర్ నిర్వహించడాన్ని జెన్నిఫర్ ప్రశంసించారు. ఏయూలో 58 దేశాలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ వివరించగా, అత్యధికంగా విదేశీ విద్యార్థులను కలిగి ఉండటంతో జెన్నిఫర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాటామంతి గ్లోబల్ వర్చువల్ స్కూల్ ఇంగ్లిష్ ప్రోగ్రాంలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులతో జెన్నిఫర్ లార్సన్ అమెరికన్ కార్నర్లో సమావేశమయ్యారు. తరగతులు జరుగుతున్న విధానం, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. అమెరికన్ కార్నర్లో నిర్వహించిన కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తదితర వివరాలు పాలకమండలి సభ్యుడు జేమ్స్ స్టీఫెన్ వివరించారు. రెక్టార్ కె.సమత, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ కె.శ్రీనివాసరావు, వి.విజయలక్ష్మి, టి.శోభశ్రీ, ఎస్కే భట్టి, డీన్లు ఎన్.కిశోర్‌బాబు, కె.బసవయ్య పాల్గొన్నారు. -
తప్పుడు వార్తలతో ఎక్కువ ముప్పు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు సమాచారం, కథనాలు ప్రధాన మీడియాలో ప్రచుర ణకు నోచుకోకుండా, ప్రసారం కాకుండా జర్నలిస్టులు జాగ్రత్తపడాలని యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ కోరారు. తప్పుడు స మాచారం, కథనాల వల్ల వచ్చే ముప్పును గుర్తించి ఆదిలోనే వాటిని పరిహరించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, జర్నలిస్టులు వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి జనసామాన్యానికి చేరకుండా నిలువ రిస్తున్నారని కొనియాడారు. మంగళవారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ‘‘కౌంటెరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు టీవీ జర్నలిస్ట్స్’’అన్న అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో లార్సెన్ మాట్లాడారు. అనంతరం జర్నలిస్టులకు సర్టిఫికె ట్లు అందించారు. ‘‘తప్పుడు సమాచారాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తులు తాము ఎన్నుకున్నవారి గురించి చాలా అంశాలు మాట్లాడుకుంటారు. వాదించుకుంటారు. వారిని బాధ్యులుగా చేస్తారు. తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంటే ఇదంతా సాధ్యం కాదు’’అని లార్సెన్ వివరించారు. ఉస్మాని యా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ తప్పుడు సమాచారం విద్యావ్య వస్థలో సృష్టించిన సమస్యలను ఏకరవు పెట్టారు. జర్నలిజం విభాగం ప్రొఫెసర్, ఈ ప్రాజెక్టు సమన్వయకర్త స్టీఫెన్సన్ కోహీర్ మాట్లాడుతూ హైబ్రిడ్ పద్ధతిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు నిర్వహించామని తెలిపారు. తప్పుడు వార్తలను గుర్తించడం ఎలా? నిర్ధారించుకోవడం ఎలా? ఫ్యాక్ట్ చెక్కు ఉపయోగపడే టూల్స్, టెక్నిక్‌లు, సమాచారాన్ని సేకరించడం వంటి అంశాల్లో మెళకువలను నేర్పించామని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నీఫర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని యూఎస్ కాన్సులేట్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా, యాక్టింగ్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్ లార్సన్ తాజాగా హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉమ్మడి మిలిటరీ విన్యాసాల వంటి అనేక అంశాల్లో అమెరికా–భారత్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయన్నారు. దాదాపు 19 ఏళ్లపాటు దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్.. లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సూడాన్, జెరూసలేం, లెబనాన్లలో పనిచేశారు. అంతకుముందు నేషనల్ పబ్లిక్ రేడియోలో ఓ టాక్ షో నిర్మాతగా వ్యవహరించారు. ‘అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోని సాహిత్యాల్లో పోలికలు’, ‘మధ్యప్రాచ్య’అంశాలపై కాలిఫోర్నియా వర్సిటీలో అండర్గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించారు. -
వీసా అపాయింట్మెంట్ల పెంపునకు కృషి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లా ర్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్నిఫర్ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్వేర్ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు. 2019లో కోవిడ్ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్ మినిస్టర్(ఎకనామిక్) డాక్టర్ రవి కోటతోపాటు యూఎస్ఐబీసీ, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..
వాషింగ్టన్: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్‌గేట్స్ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. (చదవండి: ప్రియుడితో బిల్‌గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!) కొన్ని రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్ గేట్స్ తన వివాహ వేడుక గురించి వోగ్ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్. (చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!) ‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది. ‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. జెన్నీఫర్ భర్త నాయల్ నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్‌గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్‌గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
ఆ వీడియోలతో వేధిస్తున్నాడు!: బుల్లితెర నటి
సాక్షి, చెన్నై: వీడియోలను తీసి వేధింపులకు గురిచేస్తున్నాడని టీవీ సీరియల్ సహాయ దర్శకుడిపై బుల్లితెర నటి జెన్నిఫర్(24) శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ తాను మనాలి సమీపంలోని చిన్న సేక్కాడు ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నానన్నారు. ఐదేళ్లుగా టీవీ సీరియల్లో నటిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్జీఆర్ నగర్‌కు చెందిన శరవణన్ అనే వ్యక్తిని గత 2019 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నానన్నారు. అయితే తమ మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయాం అన్నారు. శరవణన్‌తో వివాహ రద్దు కేసు కోర్టులో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను, టీవీ సీరియల్ సహాయ దర్శకుడు నవీన్‌కుమార్ సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్‌కుమార్‌కు పనిపోయిందన్నారు. దీంతో అతను ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని తనను వేధిస్తూ ఉండేవాడన్నారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో షూటింగ్ స్పాట్ నుంచి తనను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి నగ్నంగా వీడియో తీశాడని చెప్పారు. ఈ విషయం గురించి అతని తల్లి దృష్టికి తీసుకెళ్లగా ఆమె తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని బెదిరించారన్నారు. దీంతో నవీన్ కుమార్‌పై మనాలి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నవీన్ కుమార్ తీసిన వీడియోను తనకు ఇప్పించాలని, తనపై దౌర్జన్యాలకు పాల్పడిన నవీన్‌కుమార్, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. -
మహిళల సింగిల్స్ తుది పోరు నేడే
ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల సింగిల్స్ విజేత ఎవరో నేడు తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్, జపాన్ స్టార్ నయోమి ఒసాకాతో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) తలపడుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఒసాకా స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే చాలు... ఫైనల్‌ను లాంఛనంగా ముగించేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 2019లో ఇక్కడ టైటిల్ గెలిచిన ఒసాకా గతేడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అయితే కఠినమైన ప్రత్యర్థుల్ని, దిగ్గజాన్ని ఓడించి మరీ తుదిపోరుకు చేరుకుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన జపాన్ స్టార్... సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనాకు చెక్ పెట్టింది. నేటి మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఒసాకానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు బ్రాడీ ఓడించిందంతా అనామక క్రీడాకారిణిలనే. 25 ఏళ్ల అమెరికన్‌కు అసలు ఫైనల్ చేరిన అనుభవమే లేదు. -
భన్సాలీ అభిమాన తార
జెన్నిఫర్ వింగెట్.. ఈ పేరు విని ఫారెనర్ అనుకొని ఆమెను చూశాక ‘ఓ ఇండియనే’ అని మొహమ్మీదే కామెంట్ చేసేవాళ్లు జెన్నిఫర్ ఎక్కడికి వెళ్లినా తారసపడ్తారట. ఆమె టీవీ, సినిమా, వెబ్ సిరీస్ నటి. సంజయ్‌లీలా భన్సాలీ అభిమాన తార. పుట్టింది, పెరిగింది ముంబైలోనే. తల్లి ప్రభ. గృహిణి. తండ్రి హేమంత్ వింగెట్. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగి. ఆమెకు ఒక అన్న మోసెస్ వింగెట్. ఇదీ జెన్నిఫర్ కుటుంబం. బీకామ్ డిగ్రీ.. ఆమె అకడమిక్ సమాచారం. ‘అకేలే హమ్ అకేలే తుమ్’ సినిమాతో బాలనటిగా ఎంటర్ అయినా, నటిగా పరిచయమైంది మాత్రం ‘షకలక బుమ్ బుమ్’ టీవీ సీరియల్‌తో. తర్వాత ‘కుసుమ్’, ‘కసౌటీ జిందగీ కే’ వంటి సీరియళ్లతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దిల్ మిల్ గయే’తో పాపులర్ అయింది. మనసుల్లో ముద్ర వేసింది మాత్రం సంజయ్‌లీలా భన్సాలీ ‘సరస్వతీచంద్ర’ సీరియల్లో కుముద్ పాత్రతో. ‘సరస్వతిచంద్ర’ లీడ్ రోల్ కోసం జెన్నిఫర్‌నే మొదట ఎంపిక చేసుకున్నప్పటికీ కాంట్రాక్ట్ కుదరక ఆమెను తప్పించాడు సంజయ్‌లీలా. చాలా మందిని వెదికి మళ్లీ జెన్నిఫర్‌నే తీసుకున్నాడు. ఆమె తప్ప ఆ రోల్‌కి ఇంకెవరూ న్యాయం చేయలేరని. అతను అనుకున్నట్టుగానే జెన్నిఫర్‌తో ఆ సీరియల్ హిట్ అయింది. ఆ సీరియల్‌తో జెన్నిఫర్ అందరి ఫేవరేట్ అయింది. ‘‘యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఎయిర్‌హోస్టెస్ అయ్యేదాన్ని’ అంటుంది జెన్నిఫర్ వింగెట్. వెబ్ సిరీస్ ఎంట్రీ.. ‘డామేజ్డ్ 2’, ‘కోడ్ ఎమ్’తో. ‘ఫిర్ సే’ అనే వెబ్ మూవీలోనూ హీరోయిన్గా నటించింది కునాల్ కొహ్లీ పక్కన. అయితే ఇది 2015లో ఫీచర్ ఫిల్మ్‌గానే థియేటర్లలో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల 2018లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయింది. ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ జెన్నిఫర్‌కు. వ్యాయామంతోనే ఆమె రోజు, కూరగాయల జ్యూస్‌తో ఆమె డైట్ ప్రారంభమవుతుంది. అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం. డ్రీమ్‌రోల్.. ‘బ్లాక్’ సినిమాలో రాణీ ముఖర్జీ ధరించిన పాత్ర. -
నటి జెన్నీఫర్ మోసగత్తె ..!
పెరంబూరు: నటి జెన్నీఫర్ మోసగత్తె అని, ఆమె పలువురిని మోసం చేసిందని బుల్లితెర సహాయ నటుడు ఫకృద్దీన్ పేర్కొన్నాడు. సినిమా, టీవీ సీరియళ్లలో సహాయ నటిగా చేస్తున్న జెన్నీఫర్ ఇటీవల సహాయ నటుడు ఫకృద్దీన్‌పై స్థానిక వడపళనిలో ఫిర్యాదు చేసింది. అందులో.. కొంత కాలం క్రితం తనకు పరిచయమైన ఫకృద్దీన్ తనతో కలిసున్న అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు అతడిపై హత్యాబెదిరింపులు, లైంగిక వేధింపులు తదితర మూడు కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫకృద్దీన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నటి జెన్నీఫర్ మోసగత్తె అని, పలువురితో సంబంధాలు పెట్టుకుని మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. తన భార్యతో తనకెలాంటి మనస్పర్థలు లేవని, సినిమాల్లో రాణించాలని చెన్నైలో నివశిస్తున్నానని తెలిపారు. ఓ స్నేహితుడి ద్వారా జెన్నీఫర్ పరిచయమైందని..కష్టాల్లో ఉంటే ఒక కూతురిలా భావించి పలుమార్లు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. తనకు తెలిసిన వారి నుంచి డబ్బు తీసుకుని మోసం చేసిందన్నారు. ఆమెపై పళల్, వడపళని పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకే ఫిర్యాదు చేసిందని ఫకృద్దీన్ తెలిపాడు. -
స్త్రీలోక సంచారం
ఆడవాళ్లలా మగవాళ్లు మళ్లీ మళ్లీ కలిసి కబుర్లు చెప్పుకోడానికి ఎందుకనో పెద్దగా ఆసక్తి చూపించరని 49 ఏళ్ల హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ అన్నారు. ‘లేట్ నైట్ షో విత్ జేమ్ కార్డన్’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జెన్నిఫర్.. ‘‘మీరంతా ఎందుకు మళ్లీ కలిసి నటించరు?’’ అని ఆడియన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ ‘‘బాయ్స్‌కి పెద్దగా ఫీలింగ్స్ ఉండవనుకుంటాను’’ అని అన్నారు. 1994 నుండి 2004 వరకు పదేళ్ల పాటు అమెరికన్ టెలివిజన్ చానల్ ఎన్.బి.సి.లో ‘ఫ్రెండ్స్’ అనే సిట్కామ్ (సిట్యుయేషన్ కామెడీ)లో జెన్నిఫర్‌తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు నటించారు. ఆ ఆరుగురూ ఫ్రెండ్స్. న్యూయార్క్ సిటీలో ఉంటారు. నిత్యజీవితం వాళ్లని ఎన్నివిధాలుగా దోపిడీ చేస్తుంటుందో ఆ సిట్‌కామ్‌లో హాస్యభరితంగా చూపించారు. పదేళ్ల పాటు సాగిన ఆ హిట్ ధారావాహికతో జెన్నిఫర్, మిగతా ఇద్దరు అమ్మాయిలు కోర్టెనీ, లీసా.. అమెరికన్ టీవీ సీరియళ్ల చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులుగా రికార్డు సాధించారు. అప్పట్లో వీళ్లతో కలిసి ఆ సీరియల్ నటించిన ముగ్గురు అబ్బాయిలు డేవిడ్, మాట్, మేథ్యూ.. ఇప్పుడు ‘రీయూనియన్’ అంటే.. ‘నో ఇంట్రెస్ట్’ అంటున్నారట. అదే విషయాన్ని జెన్నిఫర్ ‘లేట్ నైట్ షో’లో ఇంకోలా చెప్పారు.. బాయ్స్, పూర్వ స్నేహాల పట్ల పెద్ద ఎగై్టట్మెంట్తో ఉండరని. -
కనడం మన చాయిస్
హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘పిల్లల విషయంలో నా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. యాక్టింగ్ కెరీర్ కోసం నేను పిల్లల్ని కనడం లేదని, నా అందం పాడైపోతుందని పిల్లల్ని వద్దనుకుంటున్నానని ఇలా నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిల్లల్ని కనడం కోసమే నేను ఈ భూమ్మీదికి రాలేదు. అంతకుమించిన లక్ష్యాలుంటాయి. వాటి కోసం వచ్చాను. నాకే కాదు, ఏ స్త్రీ జీవిత పరమార్థం కూడా పిల్లల్ని కనడమే కాదు. కాబట్టి పిల్లల్లేని ఆడవాళ్లను పనికిరాని వస్తువులుగా చూడకండి’’ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. ఇప్పుడు బాలీవుడ్ నటి, కమర్షియల్ పైలట్ గుల్ పనాగ్.. పిల్లల విషయంలో స్త్రీలకు మరో విధంగా సలహా ఇచ్చింది. ‘‘పిల్లల్ని పెంచడానికి మానసికంగా సంసిద్ధమైనప్పుడే కనండి. అంతే తప్ప సమాజం కోసమో, బయోలాజికల్ సైకిల్ గురించి ఆలోచించో.. భయపడో కనొద్దు’’ అని. ముప్పైతొమ్మిదేళ్ల గుల్‌పనాగ్ ఆర్నెల్ల కిందట మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఆమె భర్త రిషి అత్తారి జెట్ ఎయిర్వేస్ కెప్టెన్. ‘వియ్ ఆర్ ప్రెగ్నెంట్’ ‘‘పిల్లల కోసం మేము తొందరపడలేదు. ఆర్థికంగానే కాదు.. మానసికంగా కూడా ఓకే అనుకున్నప్పుడు.. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచగలం అని అనుకున్నప్పుడే నేను పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాను. అప్పటికి నాకు 39 ఏళ్లు. అయినా అన్నాళ్లు నేను నా దేహధర్మాల గురించి దిగులుపడలేదు. పిల్లలను కనడం, పెంచడం విషయంలో భార్యాభర్తలు ఇద్దరికీ అవగాహన ఉండాలి. బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. భార్య మాత్రమే ప్రెగ్నెంట్ అని అనుకోవద్దు.. వియ్ఆర్ ప్రెగ్నెంట్ అని భర్త అనుకోవాలి. నిహాల్ (కొడుకు) ప్రిమెచ్చూర్ బేబీ. అయినా వాడిని పెంచే విషయంలో నేనేం భయపడలేదు. డాక్టర్ల సలహాతో నేను, రిషి ఇద్దరం పూర్తి సమయాన్ని వాడికే కేటాయించాం. ఉద్యోగాలు చేసే భార్య, భర్త కూడా పిల్లల పెంపకం విషయంలో సమానబాధ్యతలు తీసుకోవాలి. తల్లి అయిన భార్య మానసిక స్థితిని భర్త అర్థం చేసుకోవాలి. అటెన్షన్ ఇవ్వాలి. సో... పిల్లలు లేరని సమాజం ఏదో అంటుందని తొందరపడి పిల్లలను కనొద్దు. వాళ్ల ఆలనాపాలనాలో ఉన్న ఆనందాన్ని మిస్ చేసుకోవద్దు’’ అని తన అభిప్రాయాన్ని చెప్పారు గుల్‌పనాగ్. -
పాప్ సింగర్ జెన్నిఫర్ పాత్రలో ఆండ్రియా
చరణ్ తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఆయుష్మాన్ భవ. నేను లోకల్ ఫేం త్రినాథ్ రావు నక్కిన కథ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు మరో యువ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ రచయిత పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండటం విశేషం. బాలీవుడ్ లో బేబీ డాళ్, హ్యాంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి చిత్రాలకు సంగీతమందించిన బ్రోస్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. చరణ్ తేజ్ సరసన స్నేహా ఉల్లాల్ హీరోయిన్గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా అలరించనున్నారు. అది కూడా పాప్ సింగర్ జెన్నిఫర్ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారు. ప్రేమ పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన దీర్ఝ ఆయుష్మాన్ భవ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో జెన్నీఫర్‌గా ఆండ్రియా లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు
ఒంటారియో: అమెరికాలోని బ్రాంప్టన్‌లో ఓ సిక్కు పౌరుడు, చట్టసభ ప్రతినిధికి జాత్యహంకార వ్యాఖ్యల దాడి తప్పలేదు. ఆయన ఆ మాటలకు తగిన బదులు ఇచ్చి పలువురి మనసులు దోచుకున్నాడు. ఆగ్రహంతో తనపైకి వచ్చిన ఓ అమెరికా మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా సంయమనంగా వ్యవహరించడమే కాకుండా ఆమె కళ్లు చెదిరే సమాధానం ఇచ్చే సభికులతో షబాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జగ్మీత్ సింగ్ అనే వ్యక్తి కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)ని స్థాపించి నడుపుతున్నాడు. ఆయన ఒక చట్టసభ ప్రతినిధి కూడా. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్రాంప్టన్ అనే పట్టణానికి వచ్చిన ఆయన సభ ముందు కొలువై ఉన్న వారిని సంబోధిస్తూ మాట్లాడే సమయంలోనే ఒక మహిళ అడ్డు తగిలింది. ఆమెను జెన్నిఫర్ అనే మహిళగా గుర్తించారు. నేరుగా వేదికపైకి వచ్చి 'మాకు తెలుసు నువ్వు ముస్లిం సోదరభావంతో ఉన్నావు' అంటూ ఆమె మొదలుపెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. అయితే, అక్కడ ఉన్నవారంతా ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఆమె మాటలు విన్నతర్వాత ఆమెను నేరుగా అనకుండా ' మేం ప్రేమను, ధైర్యాన్ని నమ్ముతాం.. జాత్యహంకారాన్ని ప్రదర్శించం.. ఒక మంచిపనికి మేం జాత్యహంకారాన్ని పూయబోము.. ప్రేమను ఎలా పంచుతారో చెప్పేందుకు ముందుకు రండి.. అప్పుడైతే మేం మీకు స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ప్రేమిస్తాం. మీకు మద్దతిస్తాం' అంటూ ఆయన అన్నారు. ఈ మాటలు విన్న అక్కడి వారంతా కూడా ముగ్దులైపోయారు. -
ఈవిడగారు పడకపోతే న్యూస్!
కాకతాళీయంగా జరుగుతుందో, నలుగురూ తన గురించి చర్చించుకోవాలని చేస్తారో కానీ... ఏ ఫంక్షన్లో పాల్గొన్నా అక్కడ అమాంతం కిందపడిపోతుంటారు జెన్నీఫర్ లారెన్స్. ఈ పాతికేళ్ల హాలీవుడ్ అందానికి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ఈవిడగారు కిందపడ్డప్పుడల్లా అభిమానులు తెగ ఫీలైపోతుంటారు. 2013లో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళుతూ జర్రున జారారు జెన్నీఫర్. 2014లోనూ అలానే జరిగింది. కారులోంచి దిగి, రెడ్ కార్పెట్ మీద ఒయ్యారంగా నడుస్తూ అమాంతంగా పడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ షోస్‌లో కూడా జెన్నీఫర్ కాలు జారిపడ్డ దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజా విషయం ఏమిటంటే... జెన్నీఫర్ నటించిన ‘ది హంగర్ గేమ్స్: మాకింగ్‌జే -పార్ట్ 2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా జెన్నీఫర్ ఎర్ర తివాచీపై నడిచారు. నలుపు రంగు పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు ధరించి జెన్నీఫర్ మెట్లు ఎక్కారు. అంతే.. అడుగు తడబడింది. కిందపడిపోయారు. పడడం ఎలాగూ అలవాటే కనుక వెంటనే లేచి, ఏమీ జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయారు జెన్నీఫర్. ఎప్పుడూ పడిపోతుంటారు కాబట్టి, జెన్నీఫర్ పడకపోతే న్యూస్ అని హాలీవుడ్లో జోక్‌లు వేసుకుంటున్నారు. -
ఈ చిట్టితల్లి చనిపోయింది!
విషాదం పదిహేడు సంవత్సరాల జెన్నీఫర్ మరణం ఇటీవల మాంచెస్టర్(బ్రిటన్)ను కుదిపేసింది. ఆమె చనిపోవడానికి ఏకైక కారణం ఒత్తిడి. పరీక్షల సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల జెన్నీఫర్ చనిపోయింది. జెన్నీఫర్ మరణంతో ‘విద్యార్థులు-ఒత్తిడి’కి సంబంధించిన సమస్య మళ్లీ తెర మీదికి వచ్చింది. ‘‘రివిజన్‌కు ఎక్కువ టైం లేదు’’ అని జెన్నీఫర్ స్నేహితుల దగ్గర తరచుగా బాధపడేదట. టైమ్ లేకపోవడం, మరోవైపు పరీక్షలు దగ్గర పడడం ఆమెను విపరీతమైన ఒత్తిడికి గురి చేశాయి.జెన్నీఫర్ మరణం, ఆమె చదివే ‘ఓక్స్‌బ్రిడ్జి కాలేజీ’ పేరెంట్స్‌ను షాక్‌కు గురి చేసింది. ‘‘ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలో చెప్పేవాళ్లు ఉన్నారుగానీ, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో చెప్పేవాళ్లు లేరు’’ అని ఒక పేరెంట్ వాపోయారు. ‘‘కాలేజీలో సైకాలజీని తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలి. దీని ద్వారా వారిలో మానసిక దృఢత్వం పెరుగుతుంది’’ అన్నారు మరో పేరెంట్. ‘‘పరీక్షలు లేని విద్యావిధానాన్ని ఊహించలేమా?’’ అని ఆవేశంగా ప్రశ్నించారు ఒక బ్యాంకు ఉద్యోగి.నిజానికి, జెన్నీఫర్‌లు ఒక్క మాంచెస్టర్‌లో మాత్రమే లేరు. మన దేశంలో కూడా ఉన్నారు. అందుకే ఒత్తిడి లేని విద్యకు ఒక దారి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. -
పేద విద్యార్థుల కోసం...
నేను సైతం... ఇక్కడ పిల్లలతో కనిపిస్తున్న అమ్మాయి పేరు జెన్నీఫర్. ఆస్ట్రేలియాకి చెందిన ‘తర ఎడ్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ఆస్ట్రేలియాలోని టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ విద్యార్థులను ఇన్టర్న్షిప్గా భారతదేశంలోని మారుమూల పల్లెలకు పంపుతోంది. అందులో భాగంగా మహరాష్ట్ర, రాజస్థాన్‌లోని గ్రామాలకు ఓ శిక్షణలో ఉన్న ఓ 30 మంది ఉపాధ్యాయులను ‘తర ఎడ్’ పంపింది. అందులో ఒకరే జెన్నీఫర్. ఇరవై ఏళ్ల జెన్నీఫర్ ఆ సంస్థ తరపున టీచర్‌గా పనిచేయడానికి రాజస్థాన్‌కి వచ్చి మూడేళ్లు దాటింది. జెన్నీఫర్ తన విధి నిర్వహణతో పాటు స్వచ్ఛందంగా కొందరు పేద విద్యార్థుల్ని, అనాథ పిల్లల్ని, బాలకార్మికులను పాఠశాలలో చేర్పించే పనిలో పడింది. రాజస్థాన్‌లోని జైపూర్ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగి 1500 మంది విద్యార్థుల్ని ఆ చుట్టుపక్కల పాఠశాలల్లో చేర్పించి, ఉత్తమ యువ స్వచ్ఛంద సేవకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందింది జెన్నీఫర్. పేదపిల్లలను గుర్తించి, వారిని ఒప్పించి పాఠశాలలో చేర్పించే క్రమంలో జెన్నీఫర్ చాలా కష్టాలను ఎదుర్కొంది. పలు గ్రామాలకు వెళ్లినపుడు రాత్రులు అక్కడే ఉండాల్సి వచ్చేది. ‘‘ఒకసారి నేను ఓ గిరిజన తండాకు వెళ్లాను. అప్పుడు చాలా వర్షం వచ్చింది. అక్కడ నేను ఒక చిన్నగదిలో వారంరోజుల పాటు ఉండాల్సి వచ్చింది. అప్పుడు వరదనీరంతా నా గదిలోకి వచ్చేసేది. ఆ ఊరి పిల్లల్ని పాఠశాలలో చేర్పించకుండా వెనక్కి తిరిగి రాకూడదనుకున్నాను. అలాగే ఓ వారం రోజులు ఉండి నా పని ముగించుకుని వచ్చాను. ఇంకొన్ని ప్రాంతాల్లో బాలకార్మికులను కలవడానికి వెళ్లినపుడు పెద్దవాళ్లు నన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. నేను భయపడకుండా ఆ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థల సాయంతో నేననుకున్న పని చేసుకొచ్చేదాన్ని. అప్పుడే మూడేళ్లు గడిచిపోయిందా అనిపిస్తోంది ’’ అని చెప్పింది జెన్నీఫర్. 2020 నాటికి మన దేశంలో 20 వేలమంది పేదవిద్యార్థులను పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలన్న ‘తర ఎడ్’ లక్ష్యంతో నేనుసైతం అంటూ జెన్నీఫర్ భాగం కావడం మరెందరికో ఆదర్శం కదూ! -
లవ్ ఇన్ మలేషియా మూవీ స్టిల్స్