
తారక్ మెహతా నటి జెన్నిఫర్ మిస్త్రీ సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాత అసిత్ మోడీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనతో విస్కీ తాగడానికి రూమ్‌కు రావాలని రెండుసార్లు పిలిచాడని తెలిపింది. అయితే అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో సిట్‌కామ్‌లోని తన సీన్స్‌ను తొలగించాడని వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
(ఇది చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ నటి!)
పాపులర్ సిట్‌కామ్ 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా'లో రోషన్ సోధి పాత్రను పోషించిన జెన్నిఫర్ మిస్త్రీ.. నిర్మాత లైంగిక వేధింపులతో షో నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. మీరు చాలా అందంగా ఉన్నారంటూ తనపై పొగడ్తలు కురిపించేవారని తెలిపింది. అతనితో కలిసి విస్కీ తాగేందుకు రావాలని పలు సందర్భాల్లో అడిగేవాడని పేర్కొంది.
జెన్నిఫర్ మిస్త్రీ మాట్లాడుతూ.. '2019లో మా బృందం మొత్తం సింగపూర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీకు రాత్రిపూట పార్టనర్ లేకపోతే.. నా గదికి వచ్చి విస్కీ తాగు అన్నారు. ఇది విని నేను ఆశ్చర్యపోయా. ఒక రోజు తర్వాత మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.' అని అన్నారంటూ జెన్నిఫర్ తన బాధను చెప్పుకొచ్చారు.
(ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment