బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ ఇటీవల సీఏ టాపర్ వెబ్ సిరీస్‌లో మెరిసింది. ఈ సిరీస్‌ను త్రిభువన మిశ్రా డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ నటి తనకెదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హజరైన తిలోతమా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇది నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన అని పేర్కొంది. ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.
తిలోతమా మాట్లాడుతూ..'ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నా. ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. నేను భయంతో కొంచెం దూరంగా వెళ్లాలనుకున్నా. కానీ నేను పరిగెత్తితే వారు నన్ను పట్టుకోగలరు. అందుకే రహదారి మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడిగా. చాలా కార్లు వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. కొద్దిసేపటికే మెడికల్ గుర్తు ఉన్న కారు ఆపారు. అపరిచితుడితో కలిసి ముందు సీటులోకి కూర్చున్నా. కొంచెం దూరం వెళ్లాక అతను నా చేయి పట్టుకున్నాడు. తాను ప్యాంటు విప్పాడు. నా చేతిని బలవంతంగా పట్టుకున్నాడు. దీంతో అతనిపై తిరగబడడంతో కారు ఆపేశాడు. ఆ తర్వాత కారు దిగేశా' అని చెప్పుకొచ్చింది.
అదో భయంకరమైన జ్ఞాపకం..
ఇది నా జీవితంలో ఎదురైన భయానక అనుభవం తిలోతమా షోమ్ పేర్కొంది. ఈ ఘటనతో తాను చలించిపోయానని చెప్పింది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అతను డాక్టర్ కావడం వల్ల సురక్షితంగా ఉంటుందని భావించి కారు ఎక్కానని వెల్లడించింది. అయితే నేను కారు ముందు సీట్లో కూర్చోవడంతో.. డ్రైవర్ తన ప్యాంట్ విప్పి.. నా చేతిని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడని తెలిపింది. దీంతో వెంటనే అతన్ని కొట్టడంతో కారు ఆపేశాడు.. ఆ తర్వాత వెంటనే కారు దిగి బయటకు వచ్చానని తిలోతమా ఆ చేదు సంఘటనను వివరించింది. నాలోని తిరగబడే ధైర్యమే ఆ రోజు కాపాడిందని సీఏ టాపర్ నటి వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment