బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్‌లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
(ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?)
మద్యం తాగమని బలవంతం
తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది.
అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్‌లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్‌మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్‌లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు.
'కుటుంబాన్ని వదిలి షూట్‌కు రావాలన్నారు'
తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్‌మెంట్‌లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది.
తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్‌కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా సెట్‌లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment