Mistry
-
నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మా గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో ఫేమస్ అయినా ఈ షో తెలుగువారికి సుపరిచితమే. అయితే ఇటీవల ఈ షో నిర్మాతలపై పలువురు నటీమణులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఈ షో నిర్మాతలు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ జెన్నిఫర్ మిస్త్రీ ఇప్పటికే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాత అసిత్ మోదీతో పాటు ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (ఇది చదవండి: Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?) మద్యం తాగమని బలవంతం తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జెన్నిఫర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్మాత అసిత్ మోడీ తన చెంపలు గిల్లాడని ఆరోపించింది. తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడని వెల్లడించింది. తనను మద్యం తాగాలని బలవంతం చేసేవాడని తెలిపింది. అతని చెప్పినట్లు చేయకపోతే.. తన వర్క్‌లో తప్పులను ఎత్తి చూపేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరోజు మా టీమ్ సింగపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ లేని సమయంలో అతనితో కలిసి మద్యం తాగమని బలవంతం చేశాడని తెలిపింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుతూనే నిన్ను కౌగిలించుకోవాలనుందని అన్నాడని ఆమె ఆరోపించారు. 'కుటుంబాన్ని వదిలి షూట్‌కు రావాలన్నారు' తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బందులు పెట్టేవారని మిస్త్రీ స్టేట్మెంట్లో వివరించింది. రమణి, బజాజ్ ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడల్లా తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతారని జెన్నిఫర్ పోలీసులకు చెప్పింది. వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని పేర్కొంది. తన కుటుంబంతో ఉన్నప్పుడు మేకర్స్ తనను షూట్‌కు రమ్మని బలవంతం చేస్తారని.. తన తండ్రి చనిపోయినప్పుడు, తన సోదరుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా సెట్లోకి రావాలని వేధించారని వెల్లడించింది. తనకు రెమ్యునరేషన్ సకాలంలో చెల్లించరని.. వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది మార్చి 6న జెన్నిఫర్ మిస్త్రీ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు) -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
సవాళ్లే సక్సెస్‌కు మెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మహిళా రిఫైనరీ యూనిట్ హెడ్‌గా సమర్ధంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్లా మిస్త్రీ. పురుషాధిపత్య విభాగమైన మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ లీడర్‌గా కొనసాగుతున్న శుక్లా ఈ యేడాది ప్రతిష్టాత్మక ఇటిప్రైమ్ ఉమన్ లీడర్షిప్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. గతంలో భారతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలోనూ మొట్టమొదటి మహిళా ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం శుక్లా ఖాతాలో ఉంది. వారంలో అన్ని షిఫ్టులలోనూ, సమ్మె రోజున కూడా సమర్థంగా విధులను నిర్వర్తించిన అధికారిగా, సహోద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలుస్తారు శుక్లా. అత్యుత్తమ సంస్థాగత నైపుణ్యాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా కీలక విధులను నిర్వర్తిస్తారనే ఘనత ఆమెది. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న బసంతి అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు శుక్లా మిస్ట్రీ. ప్రతి యేటా వరదలకు గురవుతుండే ఆ గ్రామానికి పడవ సాయం తప్ప రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కరెంటు, కాలేజీలు లేని చోటు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా చేరడానికి ఎన్నో అవరోధాలను అధిగమించారు. అంచెలంచెలుగా రిఫైనరీ హెడ్‌గా ఎదిగారు. ‘మన దారి ఎప్పుడూ సునాయసంగా ఉండదు. కష్టాలు అనే బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. సవాళ్లుగా వాటిని ఎదుర్కొని, ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యానికి చేరగలం’ అంటారు ఐదు పదుల వయసున్న శుక్లా. సామర్థ్య నిరూపణ రిఫైనరీ కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ అన్నివేళలా అవసరం. లేదంటే, ప్రమాదకరస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి కీలమైన విధి నిర్వహణ గురించి శుక్లా వివరిస్తూ ‘ముడిసరుకును మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుంది. వారంలో అన్ని షిఫ్టులకీ లీడ్ చేయడం తప్పనిసరి. అందరికీ సరైన గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి’ అని వివరిస్తారు ఆమె. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు బంధువు అందించిన సాయంతో, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1986లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఓసీలో చిన్న పోస్టులో చేరారు. అక్కడ మగవాళ్లు ఆన్సైట్లో పనిచేయడం చూసి, ఈ రంగంలో మహిళ ఎదగడానికి హద్దులున్నాయని గమనించారు. ఒక మహిళా ఇంజినీర్‌గా ఆఫీసులోనే కాకుండా పట్టుదలతో సైట్లో పనిచేయడానికి అనుమతి లభించేలా కష్టపడ్డారు. కానీ, ఆ సవాల్ అక్కడితో ఆగలేదు. శుక్లా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మగ సహచరులతో పనిచేయగల అర్హతను సంపాదించుకోవడమే కాదు తగిన సామర్థ్యాన్ని కూడా చూపగలగాలి’ అంటారామె. అందుకు కొన్నేళ్ల సమయం పట్టిందని వివరిస్తారు శుక్లా. అవకాశాల కల్పనకు కృషి ఐసిఎఫ్ఎఐ నుంచి మోడర్న్ టెక్నాలజీలో డిప్లమా కూడా చేసిన శుక్లా నిర్వర్తించే విధులను గమనిస్తే అత్యంత చురుకుదనం, మానసిక శక్తి అవసరమయ్యే కఠినమైన ఉద్యోగం ఇది అని తెలుస్తుంది. మహిళలు కఠినమైన పని చేయడానికి ఇది తమకు తగనిది అని భావించడం తప్పు అనే శుక్లా ‘ఆడ–మగ తేడా లేదు. ఒకసారి పని మొదలుపెడితే ఎవరైనా దానిని సజావుగా పూర్తి చేయగల సామర్థ్యం తప్పక కలిగి ఉంటారు. అప్పుడు సమస్యలు, సవాళ్లు ఏవైనా కాలక్రమేణా తగ్గిపోతుంటాయి. మెరుగైన పనిని ‘చేయగలను’ అని సంకల్పించుకుంటేనే అవకాశాలు మనకోసం నడిచి వస్తాయి. అందుకు ప్రకృతి కూడా మన సమర్థతను నిరూపించుకోగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది’ అంటారు. మనల్ని మనం అంగీకరిస్తేనే.. శుక్లా ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇండియన్ ఆయిల్స్‌లో ముగ్గురు మహిళలలో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తన పనితనాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టును అధిరోహించుకుంటూ వెళ్లారు. తరచూ దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణిస్తూ, అవగాహన పెంచుకోవడంతో పాటు, సవాళ్లను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ‘మగ సహచరులతో కలిసి పనిచేసే వాతావరణాన్ని మనమే తయారుచేసుకోవాలి. నేను సైట్లో వచ్చిన మొదటి రోజుల్లో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడకున్నారు. కానీ, నన్ను నేను నిరూపించడం మొదలుపెట్టేసరికి ఇతరులూ నా సమర్థతను అంగీకరించడం ప్రారంభించారు. నేను వృత్తిరీత్యా కతార్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆఫీస్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నాను. 75 మంది గల గల్ఫ్ దేశ సభ్యులలో ఏకైక మహిళగా ఏడాది పాటు పనిచేశాను. సాధారణంగా మహిళలు డెస్క్ జాబ్‌లు సరైనవి అన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు తమ సామర్థ్యాలను తాము గుర్తిస్తున్నారు. చేయగలం అని నిరూపిస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు బాగా రాణించగలరు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని వివరిస్తారు శుక్లా. అవార్డుల నిధి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మొదటి మహిళా యూనిట్ హెడ్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా గతంలో ఎన్పిఎంపీ అవార్డు, పెట్రోఫెడ్ బెస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్, కైజెన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సజెషన్, పెట్రోటెక్ ఉజాసిని అవార్డు మొదలైన అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శుక్లా మంచి వక్త. వ్యాస రచన, కవిత్వం, క్రీడల పైనా ఎంతో ఆసక్తి చూపుతారు. కష్టంగా అనిపించే పనులను పట్టుదలతో చేపట్టి, సంకల్పబలంతో సాధించి, ఆశ్చర్యపరిచే విజయాలను సొంతం చేసుకునే శుక్లా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన మిస్త్రీ
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)ను ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. టాటా గ్రూపు సంస్థ ‘టాటా సన్స్’ చైర్మన్‌గా తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కొట్టివేస్తూ జూలై 9న తీర్పునిచ్చిన విషయం గమనార్హం. అంతేకాదు, మిస్త్రీని తప్పించడం చట్టబద్ధమేనని, ఆ అధికారం టాటా సన్స్ బోర్డుకు ఉందని ఎన్సీఎల్టీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బోర్డులో మెజారిటీ సభ్యులు మిస్త్రీపై విశ్వాసం కోల్పోవడం వల్లే తప్పించినట్టు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. రతన్ టాటా తదితరుల ప్రవర్తనపై ఆయన చేసిన ఆరోపణలను కూడా తోసిపుచ్చడం జరిగింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలకు వ్యతిరేకం గా ఎన్సీఎల్ఏటీ వద్ద పిటిషన్ దాఖలు చేసినట్టు మిస్త్రీ వర్గాలు తెలిపాయి. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. మిస్త్రీ 2012లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులవ్వగా, 2016 అక్టోబర్‌లో ఆయన్ను అనూహ్యంగా తప్పించడం తెలిసిందే. -
ఎయిర్ ఏషియా కేసు.. సిగ్గు సిగ్గు!
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఉన్నతాధికారులపై సీబీఐ కేసు నమోదు కావడం ఎయిర్ ఏషియా ప్రమాణాల పతనానికి నిదర్శనమని సైరస్ పి. మిస్త్రీ వ్యాఖ్యానించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బలవంతంగా తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చేసిన నిరాధారమైన ఆరోపణల వల్లే ఎఫ్ఐఆర్లో తన పేరు చోటు చేసుకుందని ఎయిర్ఏషియా డైరెక్టర్ ఆర్. వెంకటరామన్ చేసిన ఆరోపణలపై సైరస్ మిస్త్రీ మండిపడ్డారు. వెంకటరామన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆ ఆరోపణలన్నీ దురుద్దేశపూరితమైనవేనని పేర్కొన్నారు. దురుద్దేశపూరిత లక్ష్యాలున్న వ్యక్తుల వల్లే టాటా బ్రాండ్‌కు చెడ్డపేరు వస్తోందని మిస్త్రీ విమర్శించారు. ఎయిర్ ఏషియా ఇండియా ఏర్పాటైనప్పటి నుంచి వెంకటరామన్ వివిధ పాత్రలు పోషించారని వివరించారు. ఎయిర్ఏషియా కంపెనీ బోర్డ్‌లో టాటా సన్స్ నామినీ డైరెక్టర్‌గానే కాకుండా ఆ కంపెనీలో 1.5 శాతం వాటా కూడా వెంకటరామన్‌కు ఉందని పేర్కొన్నారు. తాను నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను మాత్రమేనని, ఎలాంటి బాధ్యతలు లేవని వెంకటరామన్ చెప్పడం సమంజసం కాదని వివరించారు. -
టాటా సన్స్ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్
సాక్షి, ముంబై: టాటా గ్రూపులోని టాటా సన్స్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్‌గా అవతరించనుంది. టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చే ప్రతిపాదనను మైనారిటీ షేర్‌హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది. అయితే మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ బోర్డు కు ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను మరింత అణిచివేసే "మరొక ఆయుధం" గా పేర్కొంది. మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను మరింత నిరుత్సాహపరుస్తుందని ప్రాక్సీ సలహా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు. ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం. అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి. సైరస్ మిస్త్రీ ని టాటా సన్స్ బోర్డు ఛైర్మన్‌గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. -
టాటాలపై మిస్త్రీ అప్పీలు
► పిటిషన్‌కు వీలు కల్పించాలని అభ్యర్థన ► దిగువ ట్రిబ్యునల్ ఉత్తర్వుల సవాలు న్యూఢిల్లీ: టాటా సన్స్‌లో అవకతవకలపై పిటిషన్‌కు వీలు కల్పించాలని, ఇందుకు సంబంధించి అర్హత నిబంధనలను సడలించాలని కోరుతూ టాటా సన్స్ బహిష్కృత చైర్మన్ మిస్త్రీ శుక్రవారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, ఆయన ఎన్సీఎల్ఏటీలో ఈ అప్పీల్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే... టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ నాలుగురోజుల క్రితం తోసిపుచ్చింది. కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్‌లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటిషనర్‌కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో పిటిషనర్ సంస్థలకు కేవలం 2.17 శాతం వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాల కోణంలో పిటి షన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని అప్పీలేట్ ట్రిబ్యునల్ వచ్చేవారం మిస్త్రీ అప్పిలేట్ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టాటా కంపెనీలపై మిస్త్రీ ఆరోపణలు... ఐసీఏఐ దృష్టి
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా టాటా గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించింది. పలు టాటా గ్రూప్ కంపెనీల్లో అకౌంటింగ్ సంబంధిత అంశాల్లో అవకతవకలు జరిగాయని మిస్త్రీ లేవనెత్తిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని ఐసీఏఐ తెలిపింది. దీనితోపాటు యునైటెడ్ స్పిరిట్స్‌కు సంబంధించిన అకౌంటింగ్ అంశాలను కూడా క్షుణ్ణంగా శోధిస్తున్నామని పేర్కొంది. వెలువడిన ఆరోపణలపై దృష్టి కేంద్రీకరించాలని ఇప్పటికే తాము ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ)ని కోరామని ఐసీఏఐకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ నీలేశ్ ఎస్ వికాంసే తెలిపారు. కాగా టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగించిన తర్వాత ఆయన టాటా గ్రూప్‌కు చెందిన కొన్ని కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను లేవనెత్తుతూ, పలు ఇతర అంశాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బోర్డుతోపాటు సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలకు లేఖలు రాశారు. -
టాటా గ్రూపును వీడని మిస్త్రీ బోర్డ్ వార్!
ముంబై: టాటా-మిస్త్రీ బోర్డ్ వార్ ఇంకా టాటా గ్రూపును ఇంకా వెన్నాడుతూనే ఉంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ ఉద్వాసన అనంతర పరిణామాల నేపథ్యంలో టాటా గ్రూపునకు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్ ర్యాంక్ నుంచి వైదొలగింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ ర్యాంకింగ్ 21 స్థానాలు కిందికి దిగజారింది. గత ఏడాది 82వ స్థానం నుంచి ఈ ఏడాది 103 స్థానంలో నిలిచింది. అంతేకాదు టాప్ 100 జాబితానుంచి కిందికి పడిపోవడం ఇదే మొదటి సారని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది. ఒకపుడు టాప్ 100 జాబితాలో ఏకైక భారతీయ బ్రాండ్ గా నిలిచిన టాటా గ్రూపు 2016 సం.రానికి వచ్చేసరికి అసలు ఆ జాబితాలోనే చోటును కోల్పోయింది. 2014లో 34 వ స్థానంలో ఉన్నటాటా గ్రూపు క్రమంగా తన ర్యాంకింగ్ ను కోల్పోతూ వస్తోంది. 2015లో 65వ స్థానానికి, ఆతరువాత 82 స్థానానికి పరిమితమైంది. బ్రాండ్ ఫైనాన్స్ టాప్ 500 కంపెనీల జాబితాలో ఎయిర్టెల్ ర్యాంక్ బాగా ఎగబాకింది. 2015 లో 242 స్థానం నుంచి పుంజుకుని 190 వద్ద నిలిచింది. ఇదే బాటను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనుసరించింది . 283 వ ర్యాంక్ నుంచి 222 స్థానానికి అధిగమించింది. ఇన్ఫోసిస్ ర్యాంక్ 251గా ర్యాంక్ ను సాధించగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్ 244 నుంచి 294 ర్యాంక్ కు పడిపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 442నుంచి 345కి ఎగబాకింది. కాగా గత ఏడాది అక్టోబర్ లో టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్న మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించింది టాటా గ్రూపు. గ్రూపు అధినేత రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్ గా బాధత్యలను స్వీకరించడంతో దుమారం రేగింది. టాటా గ్రూపునకు, మిస్త్రీకి మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది. అటు టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త చైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
రతన్ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్
• టాటా సన్స్‌పై మిస్త్రీ న్యాయ పోరాటం • బోర్డ్ నుంచి తొలగింపు ప్రయత్నం జరుగుతోందని విమర్శ ముంబై: టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటాసహా హోల్డింగ్ కంపెనీ– టాటా సన్స్ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో సైరెస్ మిస్త్రీ నేతృత్వంలోని రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజాగా ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ నుంచి మిస్త్రీని తప్పించడానికి చర్యలు ప్రారంభిస్తూ, ట్రిబ్యునల్ గత ఉత్తర్వుల ఉల్లంఘనలకు టాటా సన్స్ పాల్పడుతోందన్నది బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రధాన ఆరోపణ. ఫిబ్రవరి 6వ తేదీన టాటా సన్స్ ఈజీఎం జరగనుందని, ఈ సమావేశాన్ని నిలుపుచేయడంతోపాటు, ఆ తేదీసహా మరే రోజునా... గతంలో ట్రిబునల్ ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకోకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ పిటిషన్లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కోరాయి. జైలుశిక్ష.. జరిమానా విధించండి... టాటా బోర్డ్ నుంచి డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి సంబంధించి జనవరి 3న టాటా సన్స్ ఒక ప్రత్యేక నోటీసు జారీ చేసిందని పిటిషన్ పేర్కొంది. డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ జారీ చేసిన ఉత్తర్వును పూర్తిస్థాయిలో ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషన్ వివరించింది. ఈ ఉల్లంఘనలకు గాను టాటాసహా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జి ట్రస్ట్ డైరెక్టర్లకు ఆరు నెలల వరకూ వర్తించే విధంగా సాధారణ జైలు శిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలూ విధించాలని పిటిషన్ ట్రిబునల్ను ఆశ్రయించింది. మిస్త్రీ పిటిషన్లో ఉన్న డైరెక్టర్లలో ఎన్ఏ సూనావాలా, ఆర్కే కృష్ణకుమార్, ఆర్ వెంకటరమణలు ఉన్నారు. ఇంతక్రితం తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేస్తూ... ఈ అంశాన్ని పరిష్కారించేంతవరకూ దీనిపై ఎటువంటి చర్యలు లేదా ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించిందని దిక్కార పిటిషన్ పేర్కొంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ– టాటాసన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి ఫిబ్రవరి 6వ తేదీన షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధం అయిన నేపథ్యంలో మిస్త్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. -
ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: టాటా గ్రూపులోని లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సవివరణ ఇవ్వాలని సెబీ ఆదేశించింది. టాటా గ్రూపు చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ పదవుల నుంచి తొలగింపునకు గురైన సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియా ఈ ఆరోపణలు చేయగా, వారు ఈ విషయాలను సెబీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి తాజా వివరణలు కోరడం గమనార్హం. నిర్దిష్ట వివరాలు, విరణలు అందజేయాలని సెబీ కోరింది. ఇప్పటికే ఈ అంశాలపై సెబీ ప్రాథమిక విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. స్టాక్ ఎక్స్ఛేంజ్లకు టాటా కంపెనీలు ఇచ్చిన వివరణలను సెబీ పరిశీలించగా... లిస్టింగ్ నియమాల ఉల్లంఘనలు జరిగిన ఆధారాలు ఏవీ లభించలేదని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇది ఇంకా పూర్తి కాలేదని, ఈ సమయంలో తుది ఫలితం ఏంటన్నది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదన్నారు. టాటా గ్రూపు యాజమాన్యం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో... ఇన్వెస్టర్లకు మరింత స్పష్టనిచ్చేందుకు గాను సెబీ గతవారం లిస్టెడ్ కంపెనీల బోర్డుల పరిధి, ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర విషయమై సమగ్ర మార్గదర్శక నోట్‌ను విడుదల చేసింది. -
టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీపై వేటు!
వచ్చే నెల 6న ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వచ్చే నెల 6న జరగనున్నది. సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని టాటా సన్స్ తెలిపింది. చైర్మన్‌గా తొలగించిన తర్వాత మిస్త్రీ టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో నిరాధార ఆరోపణలు చేశారని, కంపెనీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేశారని పేర్కొంది. ఆయన కారణంగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయిందని, వాటాదారులకు పరోక్షంగా నష్టం వాటిల్లిందని వివరించింది. చైర్మన్‌గా మిస్త్రీని టాటా సన్స్ గతం ఏడాది అక్టోబర్ 24న తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ డైరెక్టర్‌గా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల నుంచి ఆయనను తొలగించడానికి ఆయా కంపెనీలు ఈజీఎంలను కూడా నిర్వహించాయి. ఈజీఎంలు జరుగుతుండగానే ఆయన ఆరు టాటా కంపెనీల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు తనను చైర్మన్‌గా తొలగించినందుకు టాటా సన్స్, ప్రస్తుత చైర్మన్ రతన్ టాటాలపై సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేశారు. -
మార్పునకు నేను సై : మిస్త్రీ
టీసీఎస్ బోర్డు నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలపై పోరును కొనసాగిస్తానని వాగ్దానం చేశారు. టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ వల్ల టాటా గ్రూప్ వారసత్వ సంపదను రక్షించాలనే తన సంకల్పానికి మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు పరిపాలనలో సంస్కరణల కోసం తాను పాటుపడతానని వాగ్దానం చేశారు. మంగళవారం జరిగిన టీసీఎస్ అసాధారణ సర్వసభ్య ఓటింగ్ ప్రక్రియలో మిస్త్రీ తొలగింపుకు మొత్తం 93.11 శాతం మంది అనుకూలంగా, 6.89 వ్యతిరేకంగాను ఓటు వేసిన సంగతి తెలిసిందే.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆయనకు మద్దతు లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు మిస్త్రీకి మద్దతిస్తూ ఆయన తొలగింపుకు వ్యతిరేకంగా 78 శాతం మంది ఓటు వేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఓటింగ్ ప్రక్రియ ద్వారా మైనారిటీ వాటాదారులు టాటా గ్రూప్ పాలనలో మార్పు అవసరమని బలమైన సిగ్నల్ పంపించారని మిస్త్రీ చెప్పారు. దాన్ని అశ్రద్ధ చేయకూడదని సూచించారు. టాటా గ్రూప్‌లో సంస్కరణల కోసం తాను కూడా తన పోరాటం కొనసాగిస్తానని మిస్త్రీ వాగ్దానం చేశారు. గ్రూప్ సంస్కరణలతో స్టాక్హోల్డర్స్ హక్కులను, పాలనను రక్షించవచ్చని చెప్పారు. -
టాటా మోటార్స్‌లో నేడు ఏం జరుగబోతుంది?
ముంబాయి : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి కష్టకాలం వెన్నంటే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రూప్‌లోని ఒక్కొక్క కంపెనీ మిస్త్రీని చైర్మన్‌గానే కాక, డైరెక్టర్‌గాను పీకేస్తున్న సంగతి తెలిసిందే. అసాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసి మరీ డైరెక్టర్‌గా ఆయన్ను తొలగించేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ ఆటో దిగ్గజం ఉన్న టాటా మోటార్స్ మిస్త్రీని తొలగించడానికి డిసెంబర్ 22న షేర్‌హోల్డర్స్ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ మీటింగ్‌లో మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్‌లో పైచేయి సాధించడానికి రహస్యంగా షేర్లను కొనుగోలుచేయాలని టాటా సన్స్ భావిస్తోంది. దీనికోసం నేడు ఓ భారీ బ్లాక్డీల్ను టాటా సన్స్ నిర్వహించబోతుందట. ఓ రహస్య క్లయింట్ కోసం విదేశీ బ్రోకరేజ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ 5 కోట్ల షేర్లను, సోమవారం ముగింపు ధర రూ.454.4కు 10 శాతం ప్రీమియంగా కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.2,500కోట్లగా ఉండబోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇది టాటా మోటార్స్ ఈక్విటీ క్యాపిటల్‌లో 1.73 శాతం. ఈ లావాదేవీ మంగళవారమే జరిగే అవకాశముందని తెలుస్తోంది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో నెగ్గడానికి కంపెనీలో 33 శాతం కంటే ఎక్కువగా తమ హోల్డింగ్‌ను పెంచుకోవాలని టాటా సన్స్ భావిస్తోందని, ఈ మేరకే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌లో టాటా సన్స్ 33 శాతం వాటా కలిగి ఉంది. ఈ అదనపు షేర్ల కొనుగోలు ద్వారా మిస్త్రీకి అనుకూలంగా ఓట్లు వేసే వారిమీద టాటా సన్స్ పైచేయి సాధించనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఓపెన్ లెటర్ అవసరం లేకుండా ఒక ఆర్థికసంవత్సరంలో ప్రమోటర్స్ కంపెనీలో 5 శాతం మాత్రమే వాటా కొనుగోలు చేసే అవకాశముంది. చారిత్రాత్మకంగా టాటా గ్రూప్ రహస్య డీల్ ద్వారా గ్రూప్ కంపెనీలో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాగ, టాటా సన్స్ ఆదేశాల మేరకు కంపెనీ బోర్డు నుంచి మిస్త్రీని తొలగించడానికి ఆరు దిగ్గజ కంపెనీలు ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అదేవిధంగా టాటా సన్స్ నుంచి మెజార్టీ సపోర్టు పొందాలని ఆశిస్తున్నాయి. ఈ రహస్య భారీ బ్లాక్ డీల్ ద్వారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తును కాపాడటానికి పేరెంట్ కంపెనీ ఏదైనా చేయగలదనే సందేశాన్ని మార్కెట్లోకి పంపనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
టాటా స్టీల్ నుంచీ మిస్త్రీ ఔట్!
టాటా పవర్, టాటా కెమెకిల్స్ అనంతరం టాటా స్టీల్ కూడా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై వేటు వేసింది. శుక్రవారం ఏర్పాటుచేసిన అత్యవసర బోర్డు సమావేశంలో టాటా స్టీల్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఓపీ భట్‌ను డిసెంబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు టాటా స్టీల్ బోర్డు పేర్కొంది. చైర్మన్ పదవితో కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా కూడా ఆయనకు ఉద్వాసన పలుకనున్నట్టు బోర్డు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనతో పాటు మిస్త్రీకి వంత పాడుతున్న నుస్లీ ఎన్ వాడియాను కూడా కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా తొలగించేందుకు బోర్డు నిర్ణయించింది. దీనికోసం డిసెంబర్ 21న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు బోర్డు పేర్కొంది. ఈ సమావేశంలోనే బోర్డు చైర్మన్‌ను నియమించనున్నారు. మెజారిటీ బోర్డు మెంబర్లు మిస్త్రీని చైర్మన్‌గా తొలగించేందుకు మొగ్గుచూపినట్టు టాటాస్టీల్ పేర్కొంది. అయితే టాటా గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మిస్త్రీని గ్రూప్‌లోని మిగతా కంపెనీల చైర్మన్‌గా కూడా తొలగించాలని నిర్ణయించిన టాటా సన్స్, ఈ మేరకు కంపెనీలు బోర్డు సమావేశాల్లో ఆయనపై వేటు వేయాలని ఆదేశిస్తూ ఓ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు టాటా పవర్, టాటా కెమెకిల్స్ ఇప్పటికే మిస్త్రీని చైర్మన్‌గా తొలగించాయి. -
రెండు బోర్డు మీటింగ్‌లకు మిస్త్రీ డుమ్మా
• టీసీఎస్, టాటా సన్స్ సమావేశాలకు దూరం • డిసెంబర్ 13న టీసీఎస్ ఈజీఎం • డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు ముహూర్తం ఖరారు ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ గురువారం జరిగిన రెండు గ్రూపు సంస్థల బోర్డు సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. ముంబైలో ఉదయం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశానికి, ఆ తర్వాత జరిగిన టాటా సన్స బోర్డు మీటింగ్‌కు కూడా హాజరు కాలేదు. ఈ విషయమై టాటా సన్స బోర్డు డెరైక్టర్ విజయ్ సింగ్ మాట్లాడుతూ... ఇది సాధారణ భేటీయేనని, వ్యాపార మదింపు, వచ్చే 6 నెలలకు ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిందిగా తెలిపారు. అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేసే ఆలోచనేది లేదన్నారు. మిస్త్రీతోపాటు డెరైక్టర్లు ఫదీదా, రాల్ఫ్ స్పెత్ కూడా బోర్డు మీటింగ్‌కు హాజరు కాలేదని విజయ్ సింగ్ చెప్పారు. కాగా, గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా నిర్వహించిన అనధికారిక డెరైక్టర్ల భేటీ కావడంవల్లే హాజరు కాలేదని మిస్త్రీ వర్గాలు తెలిపారుు. డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు రంగం సిద్ధం టీసీఎస్ చైర్మన్ పదవిని ఇప్పటికే కోల్పోరుున సైరస్ మిస్త్రీ త్వరలోనే కంపెనీ డెరైక్టర్‌గా కూడా ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నారుు. డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు వాటాదారుల అనుమతి కోరేందుకు వీలుగా డిసెంబర్ 13న ఈజీఎం నిర్వహించాలని గురువారం నూతన చైర్మన్ ఇషాంత్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలో నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి కూడా తెలియజేసింది. టాటా సన్స పంపిన ప్రత్యేక నోటీసు, అభ్యర్థనను పరిశీలించి, సరైనదని భావిస్తే డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు తీర్మానం ఆమోదించేందుకు వీలుగా ఈజీఎం ఏర్పాటు చేసినట్టు వివరించింది. నాడు ఎందుకు తొలగించలేదు? మిస్త్రీ ఆరోపణలపై టాటా గ్రూప్ పీఆర్ రెడిఫ్యూజన్ ప్రశ్నలు న్యూఢిల్లీ: టాటా గ్రూపు ప్రజా సంబంధాల (పీఆర్) కాంట్రాక్టును రెడిఫ్యూజన్ ఎడెల్మన్ కట్టబెట్టిన విషయంలో సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలకు ఆ ఏజెన్సీ హెడ్ నందా స్పందించారు. రెండేళ్ల క్రితం కాంట్రాక్టును పొడిగించే సమయంలో మిస్త్రీ తనకున్న అవకాశాన్ని ఉపయోగించి ఎందుకు తొలగించలేదని? నందా ప్రశ్నించారు. ‘‘మీ వాదనకు మద్దతుగా మాకు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని విషయాలను ప్రజలు, మీడియా ముందు ఉంచకండి’’ అంటూ మిస్త్రీకి రాసిన లేఖలో నందా కోరారు. ‘‘43 ఏళ్ల కాలంలో సంపాదించుకున్న మా పేరు, ప్రతిష్టలను దెబ్బతీసే ఎటువంటి చర్యలను అనుమతించేది లేదు. టాటా గ్రూపు పీఆర్ ఏజెన్సీ కాంట్రాక్టును 2011 నవంబర్ 1న రెడిఫ్యూజన్ చేపట్టింది. ఐదేళ్ల కాంట్రాక్టు ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియగా... మూడేళ్ల కాలానికి ఇరువైపులా ‘నో ఎగ్జిట్ క్లాజ్’ కాంట్రాక్టుపై సంతకాలు జరిగారుు. మీరు 2011 నవంబర్ నుంచి మాతో కలసి పనిచేశారు. ఐదేళ్ల తర్వాత మా కాంట్రాక్టును కొనసాగించేందుకు ఈ ఏడాది మే నెలలోనూ అంగీకరించారు’ అని నందా పేర్కొన్నారు. వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్స స్థానంలో రతన్ టాటా తన అనుకూలుడైన వ్యక్తికి సంబంధించిన రెడిఫ్యూజన్కు కాంట్రాక్టును కట్టబెట్టడం వల్ల ఏడాదికి రూ.60 కోట్ల భారం పడినట్టు మిస్త్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. -
వాటాదారులను తప్పుదోవపట్టిస్తున్నారు..!
• రతన్ టాటాపై మిస్త్రీ మళ్లీ విమర్శలు • ఆయన హయాంలోనే భారీగా దుబారా.. • కార్పొరేట్ జెట్స్ కోసం ఎడాపెడా ఖర్చు... • పీఆర్ ఏజెన్సీ మార్పుతో వ్యయాలు పెరిగాయ్ ముంబై: టాటా-మిస్త్రీల మధ్య కార్పొరేట్ యుద్ధం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. టాటా గ్రూప్ చైర్మన్‌గా తన నాలుగేళ్ల హయాంలో అనవసర వ్యయాలు భారీగా పెరిగిపోయాయంటూ టాటా సన్స చేసిన ఆరోపణలపై మిస్త్రీ మరోసారి ఎదురుదాడి చేశారు. రతన్ టాటాపైనే ఈసారి గురిపెట్టి ప్రత్యారోపణలు చేశారు. వాటాదారులను తప్పు దోవపట్టించేందుకే తనపై నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు రతన్ టాటా హయాంలోనే కార్పొరేట్ జెట్ల వినియోగం కోసం భారీగా ఖర్చు చేశారని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని అర్దంతరంగా తొలగించడం.. దీంతో రతన్ టాటా, టాటా సన్స బోర్డు సభ్యులపై ఆయన తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. దీనికి ప్రతిగా టాటా సన్స మిస్త్రీ చర్యలను ఎండగడుతూ 9 పేజీల లేఖను విడుదల చేసింది కూడా. లేఖలో తనపై చేసిన విమర్శలపై ఇప్పటికే ఒకసారి వివరణ ఇచ్చిన మిస్త్రీ కార్యాలయం మంగళవారం మరోసారి కొన్ని అంశాలపై ప్రకటన విడుదల చేసింది. దివాలా కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు... ‘రతన్ టాటా హయాంలో ఆఫీసు ఖర్చంతా టాటా సన్స్ భరించింది. ఇందులో కార్పొరేట్ జెట్ల వాడకానికే భారీగా వ్యయం అరుుంది. అంతేకాదు.. వివాదాస్పద లాబీరుుస్ట్ నీరా రాడియాకు చెందిన వైష్ణవి కమ్యూనికేషన్స నుంచి టాటా గ్రూప్ పీఆర్ వ్యవహారాలను అరుణ్ నందాకు చెందిన ‘రిడిఫ్యూజన్ ఎడెల్మన్’కు అప్పగించింది కూడా రతన్ టాటానే. దీనివల్ల ఏడాది వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్లకు ఎగబాకింది. మరోపక్క, ఈ పీఆర్ సేవలను రతన్ నేతృత్వం వహిస్తున్న టాటా ట్రస్టులకు కూడా వాడుకుంటున్నారు’ అని మిస్త్రీ పేర్కొన్నారు. మిస్త్రీ సారథ్యంలో టాటా సన్స సిబ్బంది వ్యయాలు రూ.84 కోట్ల నుంచి రూ.180 కోట్లకు ఎగబాకాయని.. ఇతర ఖర్చులు కూడా రూ.220 కోట్ల నుంచి రూ.290 కోట్లకు పెరగిపోరుునట్లు టాటా సన్స ఆరోపించడం తెలిసిందే. అదేవిధంగా టాటా సన్సకు సంబంధించి 2015-16 ఏడాదిలో పెట్టుబడి నష్టాలు(రైట్ డౌన్స, ఇంపెరుుర్‌మెంట్స్) రూ.2,400 కోట్లకు ఎగబాకాయని, దీనికి బాధ్యత వహించాల్సింది గత సారథ్యమేనని మిస్త్రీ ఆరోపించడాన్ని టాటా సన్స తప్పుపట్టింది. అరుుతే, దీనికి ముమ్మాటికీ రతన్ టాటా హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని మిస్త్రీ మరోసారి తేల్చిచెప్పారు. రతన్ టాటా స్నేహితులు ప్రమోట్ చేసిన ‘పియాజియో ఏరో’ అనే కంపెనీలో పెట్టుబడులపై రూ.1,150 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఈ కంపెనీ ఇప్పుడు దాదాపు దివాలా తీసేస్థారుుకి దిగజారిందని కూడా మిస్త్రీ ఆరోపించారు. -
మాజీ ఉద్యోగుల మోసపూరిత క్లెయిమ్‌లపై దర్యాప్తు
మిస్త్రీ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ ఏషియా వెల్లడి న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులు కొందరు అక్రమంగా వ్యక్తిగత ఖర్చులను, కొన్ని రకాల చార్జీలను క్లెయిమ్ చేసుకోవడంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఇండియా) లిమిటెడ్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ బోర్డ్‌కు నివేదించినట్టు, గత సమావేశంలో చర్చిం చినట్టు తెలిపింది. విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారానికి సంబంధించి ఈ దశలో ఎటువంటి ప్రత్యేక వివరాలను ప్రస్తావించదలచుకోలేదని, అలా చేస్తే అది విచారణకు ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.అనైతిక విధానాలను సహించేది లేదని, కుట్రదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎయిర్ ఏసియాలో రూ.22 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఇటీవల తొలగింపునకు గురైన తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సభ్యులకు రాసిన లేఖలో పేర్కొనటం తెలిసిందే. -
ప్రధాని చెంతకొచ్చిన మిస్త్రీ రగడ!
న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌లో వారం రోజులుగా జరుగుతున్న మిస్త్రీ రగడ, ప్రధాని చెంతకు చేరింది. టాటా సన్స్‌కు తాత్కాలిక చైర్మన్‌గా ఎన్నికైన రతన్ టాటా, గ్రూప్ చైర్మన్ పదవి అర్థాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీలు విడివిడిగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మోదీని సైరస్ మిస్త్రీ గురువారం కలువగా.. రతన్ టాటా శుక్రవారం 20 నిమిషాల పాటు ప్రధానితో సమావేశమయ్యారు. మిస్త్రీ తనను ఏకపక్షంగా టాటా సన్స్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించిన వైనంపై మోదీకి వివరించగా.. బోర్డు స్థాయిలో జరుగుతున్న మార్పులపై రతన్ టాటా వివరించినట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. మోదీతో భేటీ అయిన రోజే రతన్ టాటా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తొలగించిన సైరస్ మిస్త్రీ వైఖరి, కీలక నిర్ణయం తీసుకోవడం దోహదం చేసిన కారకాలను జైట్లీకి టాటా తెలిపినట్టు సమాచారం. టాటా బోర్డు సోమవారం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ గ్రూప్‌పై మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ప్రస్తుతం కార్పొరేట్, రాజకీయ వర్గాలను కుదుపేస్తున్నాయి. తనకు రతన్ టాటా పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, బిలియన్ డాలర్ల సంస్థగా పేరొందిన టాటా గ్రూప్, పలు నిర్ణయాలు తీసుకోవడంలో తప్పిదాలకు పాల్పడిందని మిస్త్రీ ఆరోపించారు. కాగ, కొత్త చైర్మన్ ఎంపికను చేసేందుకు సెర్చ్ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. నాలుగు నెలల్లో కొత్త చైర్మన్‌ను ఆ కమిటీ నియమించనుంది. ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరిస్తున్నారు. -
టాటాల మరో కీలక అడుగు?
టాటా గ్రూప్ లోసైరస్ మిస్త్రీ తొలగింపు దుమారం చల్లారకముందే టాటాలు కీలక పావులు కదుపుతున్నారు. ఈ వివాదంలో మిగిలిన కార్యక్రమాలను చకచకా చక్క పెట్టే పనిలో టాటా గ్రూప్ బిజీగా ఉంది. ముఖ్యంగా టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారులకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల ఫ్రెండ్లీ పార్టనర్స్ కోసం వెతుకుతోందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. సమర్థవంతమైన కొనుగోలుదారులకోసం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే టాటాలు మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలుకు ఆసక్తి వున్న సావరిన్ హెల్త్ ఫండ్ (ప్రభుత్వ ఆధీనంలో ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ఇతర దీర్ఘకాల పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు నివేదించింది. టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలో 65 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది. అయితే ఈవార్తలను ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా ఖండించారు. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదనీ, మిస్త్రీ తన పోరాటాన్ని వదులుకోరని వ్యాఖ్యానించారు. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి టాటాసన్స్, షాపూర్జీ పల్లాంజీ గ్రూపు తిరస్కరించాయి. కాగా టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి అకస్మాత్తుగా ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్ లోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ షాపూర్జీ , పల్లోంజి గ్రూప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. , -
టాటాల రూ.17వేల కోట్ల సంపద ఆవిరి
సంచలనం రేపిన సైరస్ మిస్త్రీ ఉద్వాస వ్యవహారంతో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సరైస్ మిస్త్రీని తొలగించిన ఈ రెండురోజుల కాలంలో మార్కెట్ విలువ పరంగా టాటా గ్రూప్ దాదాపు రూ.17 వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. ఈ షాకింగ్ న్యూస్ తో రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిస్త్రీ తొలగింపు ఐటీ కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావాన్ని చూపించనుందని సిటీ గ్రూపు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ రెండు రోజుల్లో 1.6 శాతం నష్టపోయింది. మార్కెట్ విలువలో రూ.7.788 కోట్ల రూపాయలు కోల్పోయింది. టాటా మోటార్స్ (డీవీఆర్ షేర్లు సహా) రూ.6,100 కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాగే ఇతర కంపెనీల కూడా ఇదే బాటలో పయనించాయి. టాటా స్టీల్ రూ.1,431 కోట్లు, టైటాన్ రూ.906 కోట్లు, టాటా పవర్ రూ.607కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి అయితే మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా ఈ పరిణామాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం టాప్ సీఈవోల సమావేశంలో హామీ ఇచ్చారు. దీనికి బదులుగా వ్యాపారంపై తద్వారా సంస్థను మార్కెట్ లీడర్స్ గా నిలపడం పై దృష్టిపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే. -
వ్యాపారాలపైనే పూర్తి దృష్టిపెట్టండి..
గ్రూప్ కంపెనీల సీఈఓలకు రతన్ టాటా ఉద్బోధ ముంబై: మిస్త్రీ తక్షణ తొలగింపు.. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఈ హఠాత్ పరిణామం గ్రూప్ కంపెనీల ఉద్యోగులు, అత్యున్నత స్థాయి అధికారులపై ప్రతికూల ప్రభావం చూపకుండా అప్రమత్తమయ్యారు. మంగళవారం గ్రూప్ కంపెనీలకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ)లతో సమావేశమయ్యారు. ముఖ్యంగా సారథ్యం మార్పుపై ఆందోళన చెందకుండా తమతమ వ్యాపారాలపై పూర్తిగా దృష్టికేంద్రీకరించాలని.. వాటాదారులకు మరింత రాబడులను అందించడమే పరమావధిగా పనిచేయాలని సీఈఓలకు ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ‘పరిస్థితులను పూర్తిగా మదింపు చేశాక అవసరమైతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం. ఏవైనా మార్పులు చేర్పులుంటే మీతో(సీఈఓలు) చర్చించాకే జరుగుతాయి. నా నియామకం తాత్కాలికమే. కొంతకాలం మాత్రమే నేను కొనసాగుతాను. గ్రూప్ వ్యాపారాల్లో స్థిరత్వం, ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా చూడటం కోసమే ఈ బాధ్యతలను స్వీకరించా. కాబట్టి నాయకత్వ శూన్యం ఏమీ లేనట్టే. కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతాం. మార్కెట్లో పూర్తిస్థాయి ఆధిపత్యమే లక్ష్యంగా ముందుకెళ్లండి’ అని రతన్ పేర్కొన్నారు. కాగా, మిస్త్రీ తొలగింపునకు దారితీసిన కారణాలను ఆయన సీఈఓలతో చర్చించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైర్మన్ పదవి నుంచి దిగి పోయినా.. మిస్త్రీ టాటా సన్స్, గ్రూప్ కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ ఎంపికకు ఐదుగురి సభ్యులతో అన్వేషణ కమిటీని బోర్డు ప్రకటించింది. -
మిస్త్రీ మిస్టరీ
-
రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్అండ్డీ కేంద్రం
శంకుస్థాపన చేసిన టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శాస్త్ర సాంకేతిక ఫలితాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రధానంగా దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీగా ప్రచారంలో ఉన్న రోబోటిక్, ఆటోమేషన్ రంగాలపై పరిశోధన చేయడానికి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీతో టీసీఎస్ చేతులు కలిపింది. దేశీయ ఐటీ పితామహుడిగా పేరొందిన టీసీఎస్ తొలి ఫౌండర్ సీఈవో ఎఫ్.సి.కొహ్లి పేరుమీద హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రూ. 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ‘ఎఫ్.సి కొహ్లి సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మిస్త్రీ మాట్లాడుతూ టాటా గ్రూపుతో 50 ఏళ్లకుపైగా అనుబంధం కలిగిన కొహ్లి పేరుమీద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం చేతులు కలిపిన రెండు దిగ్గజాలు, టీసీఎస్, ట్రిపుల్ ఐటీలు కొహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ ఈ ఆర్అండ్డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై సంతోషం వెలిబుచ్చారు. స్టార్టప్ రాష్ట్రమైన తెలంగాణకు టాటా గ్రూపు పెద్ద బ్రాండ్ అంబాసిడరని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉందన్నారు. ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాలి అమెరికా కంటే మూడు రెట్లు అధిక జనాభా కలిగిన ఇండియా నూతన ఆవిష్కరణల్లో మాత్రం బాగా వెనుకబడి ఉందని ఎఫ్.ఎస్.కొహ్లి అన్నారు. దేశంలో టాప్ 50 విద్యా సంస్థలు 90-95 శాతం ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటున్నాయని, కానీ ఈ సంస్థల నుంచి వస్తున్న పీహెచ్‌డీల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని, దీనికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థేనన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని అప్పుడే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. దేశంలో తయారవుతున్న 125 బిలియన్ డాలర్ల సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో దేశీయంగా 15 బిలియన్ డాలర్లు మాత్రమే వినియోగిస్తుండటం దారుణమైన విషయమన్నారు. దేశ జనాభాలో 80 కోట్ల మందికి ఇంగ్లిష్ రాదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తీసుకువస్తేనే దేశంలో ఐటీ వినియోగం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖరన్, టీసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రామదొరై, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ పి.జే.నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా-భారత్ సీఈఓ ఫోరం సారథిగా మిస్త్రీ
26న సమావేశం; ఒబామా, మోదీ ప్రసంగం! న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో యూఎస్-ఇండియా సీఈఓ ఫోరంలో మార్పులు జరిగాయి. ఫోరం కో-చైర్మన్‌గా టాటా గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీ నియమితులయ్యారు. భారత్ తరఫున సీఈఓలకు ఆయన నేతృత్వం వహిస్తారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో రతన్ టాటా ఉన్నారు. కాగా, ఫోరంలోకి కొత్త సభ్యుడిగా అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని చేర్చారు. ఇక ఫోరంలో అమెరికా సీఈఓలకు హనీవెల్ చీఫ్ డేవిడ్ ఎం కోట్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ నెల 26న సీఈఓల ఫోరం భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఫోరంలో భారత్ నుంచి 17 మంది సభ్యుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ గ్రూప్ చీఫ్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ-ఎండీ చందా కొచర్, ఎస్సార్ గ్రూప్ శశి రూయా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తదితర దిగ్గజాలు ఉన్నారు. ఇక అమెరికాతరఫున పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి తదితరులు ఉన్నారు. భారత్ నుంచి ఐటీ ఇతరత్రా నిపుణులకు అమెరికా వీసాల జారీలో ఇబ్బందులతో పాటు ద్పైక్షిక వ్యాపార సంబంధాలపై ఫోరం సమావేశంలో చర్చించనున్నారు.