రెండు బోర్డు మీటింగ్లకు మిస్త్రీ డుమ్మా
• టీసీఎస్, టాటా సన్స్ సమావేశాలకు దూరం
• డిసెంబర్ 13న టీసీఎస్ ఈజీఎం
• డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు ముహూర్తం ఖరారు
ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ గురువారం జరిగిన రెండు గ్రూపు సంస్థల బోర్డు సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. ముంబైలో ఉదయం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశానికి, ఆ తర్వాత జరిగిన టాటా సన్‌స బోర్డు మీటింగ్‌కు కూడా హాజరు కాలేదు. ఈ విషయమై టాటా సన్‌స బోర్డు డెరైక్టర్ విజయ్ సింగ్ మాట్లాడుతూ... ఇది సాధారణ భేటీయేనని, వ్యాపార మదింపు, వచ్చే 6 నెలలకు ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిందిగా తెలిపారు. అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేసే ఆలోచనేది లేదన్నారు. మిస్త్రీతోపాటు డెరైక్టర్లు ఫదీదా, రాల్ఫ్ స్పెత్ కూడా బోర్డు మీటింగ్‌కు హాజరు కాలేదని విజయ్ సింగ్ చెప్పారు. కాగా, గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా నిర్వహించిన అనధికారిక డెరైక్టర్ల భేటీ కావడంవల్లే హాజరు కాలేదని మిస్త్రీ వర్గాలు తెలిపారుు.
డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు రంగం సిద్ధం
టీసీఎస్ చైర్మన్ పదవిని ఇప్పటికే కోల్పోరుున సైరస్ మిస్త్రీ త్వరలోనే కంపెనీ డెరైక్టర్‌గా కూడా ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నారుు. డెరైక్టర్‌గా మిస్త్రీ తొలగింపునకు వాటాదారుల అనుమతి కోరేందుకు వీలుగా డిసెంబర్ 13న ఈజీఎం నిర్వహించాలని గురువారం నూతన చైర్మన్ ఇషాంత్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలో నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని కంపెనీ బీఎస్‌ఈకి కూడా తెలియజేసింది. టాటా సన్‌స పంపిన ప్రత్యేక నోటీసు, అభ్యర్థనను పరిశీలించి, సరైనదని భావిస్తే డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు తీర్మానం ఆమోదించేందుకు వీలుగా ఈజీఎం ఏర్పాటు చేసినట్టు వివరించింది.
నాడు ఎందుకు తొలగించలేదు?
మిస్త్రీ ఆరోపణలపై టాటా గ్రూప్ పీఆర్ రెడిఫ్యూజన్ ప్రశ్నలు
న్యూఢిల్లీ: టాటా గ్రూపు ప్రజా సంబంధాల (పీఆర్) కాంట్రాక్టును రెడిఫ్యూజన్ ఎడెల్‌మన్ కట్టబెట్టిన విషయంలో సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలకు ఆ ఏజెన్సీ హెడ్ నందా స్పందించారు. రెండేళ్ల క్రితం కాంట్రాక్టును పొడిగించే సమయంలో మిస్త్రీ తనకున్న అవకాశాన్ని ఉపయోగించి ఎందుకు తొలగించలేదని? నందా ప్రశ్నించారు. ‘‘మీ వాదనకు మద్దతుగా మాకు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని విషయాలను ప్రజలు, మీడియా ముందు ఉంచకండి’’ అంటూ మిస్త్రీకి రాసిన లేఖలో నందా కోరారు.
‘‘43 ఏళ్ల కాలంలో సంపాదించుకున్న మా పేరు, ప్రతిష్టలను దెబ్బతీసే ఎటువంటి చర్యలను అనుమతించేది లేదు. టాటా గ్రూపు పీఆర్ ఏజెన్సీ కాంట్రాక్టును 2011 నవంబర్ 1న రెడిఫ్యూజన్ చేపట్టింది. ఐదేళ్ల కాంట్రాక్టు ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియగా... మూడేళ్ల కాలానికి ఇరువైపులా ‘నో ఎగ్జిట్ క్లాజ్’ కాంట్రాక్టుపై సంతకాలు జరిగారుు. మీరు 2011 నవంబర్ నుంచి మాతో కలసి పనిచేశారు. ఐదేళ్ల తర్వాత మా కాంట్రాక్టును కొనసాగించేందుకు ఈ ఏడాది మే నెలలోనూ అంగీకరించారు’ అని నందా పేర్కొన్నారు. వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్‌స స్థానంలో రతన్ టాటా తన అనుకూలుడైన వ్యక్తికి సంబంధించిన రెడిఫ్యూజన్‌కు కాంట్రాక్టును కట్టబెట్టడం వల్ల ఏడాదికి రూ.60 కోట్ల భారం పడినట్టు మిస్త్రీ ఆరోపించిన విషయం తెలిసిందే.