
వాటాదారులను తప్పుదోవపట్టిస్తున్నారు..!
• రతన్ టాటాపై మిస్త్రీ మళ్లీ విమర్శలు
• ఆయన హయాంలోనే భారీగా దుబారా..
• కార్పొరేట్ జెట్స్ కోసం ఎడాపెడా ఖర్చు...
• పీఆర్ ఏజెన్సీ మార్పుతో వ్యయాలు పెరిగాయ్
ముంబై: టాటా-మిస్త్రీల మధ్య కార్పొరేట్ యుద్ధం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. టాటా గ్రూప్ చైర్మన్‌గా తన నాలుగేళ్ల హయాంలో అనవసర వ్యయాలు భారీగా పెరిగిపోయాయంటూ టాటా సన్‌స చేసిన ఆరోపణలపై మిస్త్రీ మరోసారి ఎదురుదాడి చేశారు. రతన్ టాటాపైనే ఈసారి గురిపెట్టి ప్రత్యారోపణలు చేశారు. వాటాదారులను తప్పు దోవపట్టించేందుకే తనపై నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అసలు రతన్ టాటా హయాంలోనే కార్పొరేట్ జెట్‌ల వినియోగం కోసం భారీగా ఖర్చు చేశారని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని అర్దంతరంగా తొలగించడం.. దీంతో రతన్ టాటా, టాటా సన్‌స బోర్డు సభ్యులపై ఆయన తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. దీనికి ప్రతిగా టాటా సన్‌స మిస్త్రీ చర్యలను ఎండగడుతూ 9 పేజీల లేఖను విడుదల చేసింది కూడా. లేఖలో తనపై చేసిన విమర్శలపై ఇప్పటికే ఒకసారి వివరణ ఇచ్చిన మిస్త్రీ కార్యాలయం మంగళవారం మరోసారి కొన్ని అంశాలపై ప్రకటన విడుదల చేసింది.
దివాలా కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు...
‘రతన్ టాటా హయాంలో ఆఫీసు ఖర్చంతా టాటా సన్స్ భరించింది. ఇందులో కార్పొరేట్ జెట్‌ల వాడకానికే భారీగా వ్యయం అరుుంది. అంతేకాదు.. వివాదాస్పద లాబీరుుస్ట్ నీరా రాడియాకు చెందిన వైష్ణవి కమ్యూనికేషన్‌స నుంచి టాటా గ్రూప్ పీఆర్ వ్యవహారాలను అరుణ్ నందాకు చెందిన ‘రిడిఫ్యూజన్ ఎడెల్‌మన్’కు అప్పగించింది కూడా రతన్ టాటానే. దీనివల్ల ఏడాది వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్లకు ఎగబాకింది. మరోపక్క, ఈ పీఆర్ సేవలను రతన్ నేతృత్వం వహిస్తున్న టాటా ట్రస్టులకు కూడా వాడుకుంటున్నారు’ అని మిస్త్రీ పేర్కొన్నారు.
మిస్త్రీ సారథ్యంలో టాటా సన్‌స సిబ్బంది వ్యయాలు రూ.84 కోట్ల నుంచి రూ.180 కోట్లకు ఎగబాకాయని.. ఇతర ఖర్చులు కూడా రూ.220 కోట్ల నుంచి రూ.290 కోట్లకు పెరగిపోరుునట్లు టాటా సన్‌స ఆరోపించడం తెలిసిందే. అదేవిధంగా టాటా సన్‌సకు సంబంధించి 2015-16 ఏడాదిలో పెట్టుబడి నష్టాలు(రైట్ డౌన్‌స, ఇంపెరుుర్‌మెంట్స్) రూ.2,400 కోట్లకు ఎగబాకాయని, దీనికి బాధ్యత వహించాల్సింది గత సారథ్యమేనని మిస్త్రీ ఆరోపించడాన్ని టాటా సన్‌స తప్పుపట్టింది. అరుుతే, దీనికి ముమ్మాటికీ రతన్ టాటా హయాంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని మిస్త్రీ మరోసారి తేల్చిచెప్పారు. రతన్ టాటా స్నేహితులు ప్రమోట్ చేసిన ‘పియాజియో ఏరో’ అనే కంపెనీలో పెట్టుబడులపై రూ.1,150 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఈ కంపెనీ ఇప్పుడు దాదాపు దివాలా తీసేస్థారుుకి దిగజారిందని కూడా మిస్త్రీ ఆరోపించారు.