అర్జున్ అంబటి, జెన్నిఫర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పరమపద సోపోనం’. నాగ శివ దర్శకత్వంలో గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా అక్రమాలు ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: గుడిమిట్ల ఈశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment