Hero Nani: Muthayya Movie Teaser Will Release By Nani, Deets Here - Sakshi
Sakshi News home page

Nani-Muthayya Movie: నాని చేతులమీదుగా తెలుగు ఇండీ చిత్రం 'ముత్తయ్య' టీజర్​..

Published Sat, Apr 30 2022 8:44 AM | Last Updated on Sat, Apr 30 2022 11:53 AM

Muthayya Movie Teaser Will Release By Nani - Sakshi

Muthayya Movie Teaser Will Release By Nani: సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాల హవా బాగానే ఉంది. వీటి కలెక్షన్లు, రికార్డులు ఎప్పుడూ హాట్ టాపిక్​. అయితే పలు చిన్న సినిమాలు సైతం ప్రజా ఆదరణ పొందుతాయి. అలాంటి క్యాటగిరికి చెందినదే ఇండీ తెలుగు చిత్రం ముత్తయ్య. భాస్కర్​ మౌర్య దర్శకత్వం వహించన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కొత్త పోరడు ఫేమ్​ కె. సుధాకర్​ రెడ్డి నటించారు. యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్​కు ఈ సినిమా ఎంపికైన విషయం తెలిసిందే. మే 9న ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 

కాగా ఈ సినిమా గురించి తాజా అప్​డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్​ను నాచురల్​ స్టార్ నాని విడుదల చేయనున్నారు. శనివారం (ఏప్రిల్​ 30) సాయంత్ర 4.30 నిమిషాలకు ఈ టీజర్​ రిలీజ్​ చేయనున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట వైరల్​ అవుతోంది. హైలైఫ్​ ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​పై బ్యానర్​పై కేదార్​ సెలగమ్​ శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్​ నిర్మిస్తున్నారు.  

చదవండి: ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'తెలుగు ఇండీ' సినిమా 'ముత్తయ్య'..
తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement