Natural Star Nani Going To Announce His 30th Movie On January 1st 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

Natural Star Nani: కొత్త సినిమా ప్రకటించిన నాని, ఆసక్తిగా ఫస్ట్‌ పోస్టర్‌

Published Fri, Dec 30 2022 7:42 PM | Last Updated on Fri, Dec 30 2022 8:28 PM

Natural Star Nani Going to Announce His 30th Movie on January 1, 2023 - Sakshi

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘అంటే సుందరానికి’  సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ప్రస్తుతం దసరా మూవీతో బిజీగా ఉన్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ కనిపించనున్నాడు. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్న నాని హిట్‌ 2 చిత్రాన్ని తెరకెక్కించి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతోన్న హిట్‌ 3లో నాని స్వయంగా నటించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. హీరోగా, నిర్మాతగా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్న నాని తాజాగా న్యూ ఇయర్‌ కానుకగా మరో సినిమాను ప్రకటించి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ అందించాడు. తన 30వ సినిమాగా  తెరకెక్కుతున్న మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి అప్‌డేట్‌ . జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. కాగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో నాని కుర్చీలో కూర్చుని మొబైల్‌ బ్రౌజ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ పోస్టర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.

చదవండి: 
వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్‌ సాంగ్‌, గొంతు కలిపిన చిరు, రవితేజ
రొమాంటిక్‌ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement