Hero Nani
-
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
రిస్క్ చేస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు.. కెరీర్ పీక్ పోజిసిషన్ లో నాని
-
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)
-
నాని కెరీర్లో పెద్ద మల్టీస్టారర్...
-
ఫ్లాప్ డైరెక్టర్ తో హిట్ కొడుతున్న నాని
-
తెర వెనక 'సరిపోదా శనివారం'.. నాని-ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
నాని, ఝాన్వి కలిసి పని చేస్తారా లేక ఇది పుకార్లేనా?!
-
రాజమౌళి, ఈగ 2 కి నేను అవసరం లేదన్నారు
-
నాని సినిమా ఇప్పట్లో లేనట్టేనా..?
-
నాని కొత్త సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్!
-
టాలీవుడ్ పై కన్నేసిన జాన్వీ..
-
బలగం వేణుకి షాక్ ఇచ్చిన నాని..?
-
Nani-Mrunal Thakur Latest Photos: హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోటకు చేరిన నాని, మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
బలగం-2 లో హీరో నాని..!
-
ఈ సినిమాలో కొత్త విరాజ్ ని చూస్తారు
-
Natural Star Nani: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ స్టైలిష్ లుక్ (ఫోటోలు)
-
సలార్ మూవీ వస్తుంది.. దానికంటే ముందు ఈ సినిమా చూడండి!
-
టికెట్స్ ఇవ్వకపోతే గొడవ చెయ్యండి: హీరో నాని
-
దసరా డైరెక్టర్ మరోసారి నాని.. ఈసారి వేరే లెవెల్
-
నాని మరియు మృణాల్ గురించి నెటిజన్లు వెతికిన ప్రశ్నలివే చూడండి
-
యాంకర్ సుమతో నాని మరియు కార్తీ జోకులు
-
ప్రతి సినిమాలో ఒక కొత్త ధనం చూపిస్తాడు..!
-
Nani's New Movie: హీరో నాని కొత్త చిత్రం షురూ (ఫొటోలు)
-
సాయి పల్లవిది ఎంత మంచి సంస్కారం చూడండి
-
సూపర్ ఫిలాసఫీ చెప్పిన హీరో నాని..!
-
హీరో నానిపై బిత్తిరి సత్తి కామెడీ..!
-
నాకు డైరెక్షన్ చేయాలంటే చాలా ఇష్టం : హీరో నాని
-
అవకాశాలు ఇస్తామని నన్ను డ్రైవర్‌గా వాడుకున్నారు: నాని
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. -
రీల్‌లైఫ్‌లో హీరో నాని.. రియల్ లైఫ్‌లో కేన్ మామ
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్లో మ్యాచ్ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్.. సింగిల్ తీసేందుకు కేన్ మామ క్రీజు వీడాడు. ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్ నుంచి తప్పించుకొని కేన్ మామ హీరోగా నిలిచాడు. ఇదంతా రియల్ లైఫ్ మ్యాచ్‌లో జరిగింది. అయితే ఇది సీన్ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్‌లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్ మామ ఇన్నింగ్స్‌ను తలపించింది. రియల్ లైఫ్ మ్యాచ్ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు. ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్‌ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్ తన బ్యాట్‌ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by TwEETA PORADU (@tweetaporadu) చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా' NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
నాపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇదే: సందీప్ కిషన్
‘‘నేను, నాని మా కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెండ్స్. కానీ, నా సినిమా వేడుకల్లో నాని పాల్గొన్న తొలి ఈవెంట్ ఇదే. ఒక సినిమా కోసం ఎంత చేయగలనో ‘మైఖేల్’ కోసం అంత చేశా. నాపై వచ్చిన విమర్శలకు ఈ సినిమానే సమాధానం’’ అన్నారు సందీప్ కిషన్. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం, ప్రతిభ ఉంటే చాలా పైస్థాయికి చేరుకుంటారు.. సందీప్‌లో నాకు కష్టం, ప్రతిభ కనిపించింది.. కానీ అదృష్టం కనిపించలేదు.. అది ‘మైఖేల్’తో తనకి మొదలవుతుంది. ‘మైఖేల్’ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీతో ఓ కొత్త ఒరవడి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘శివ’ సినిమా వచ్చినప్పుడు కొత్తగా ఉందనిపించింది.. అలాంటి ఓ సినిమా ‘మైఖేల్’ కావాలని కోరుకుంటున్నాను. సునీల్, రామ్మోహన్, భరత్గార్లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలవాలి’’ అన్నారు. చదవండి: చేతులారా ప్రాణాలు తీసుకున్నాడు.. అసలు మాట వినలేదు: వేణు మాధవ్ తల్లి ఆవేదన ‘‘మైఖేల్’ని ఇండియాలో 1500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది.. నిర్మాతలుగా మేము సంతోషంగా ఉన్నాం’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘నాది చెన్నై.. నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నాను అనే అనుభూతి నాకు కలగకుండా నాదీ హైదరాబాదే అనేలా చూసుకున్న ఈ చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్ జయకొడి. -
గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని కొత్త సినిమా (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కి నాని న్యూ ఇయర్ ట్రీట్.. కొత్త సినిమా ప్రకటన
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ప్రస్తుతం దసరా మూవీతో బిజీగా ఉన్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ కనిపించనున్నాడు. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్న నాని హిట్ 2 చిత్రాన్ని తెరకెక్కించి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతోన్న హిట్ 3లో నాని స్వయంగా నటించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. హీరోగా, నిర్మాతగా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్న నాని తాజాగా న్యూ ఇయర్ కానుకగా మరో సినిమాను ప్రకటించి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించాడు. తన 30వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి అప్డేట్ . జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. కాగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ పోస్టర్లో నాని కుర్చీలో కూర్చుని మొబైల్ బ్రౌజ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుందని సమాచారం. చదవండి: వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ రొమాంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ కలిస్తే.. ఆసక్తిగా ట్రైలర్
నాని సోదరి దీప్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఈ సిరీస్‌లో సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదు విభిన్నమైన కథలతో సరికొత్తగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. (చదవండి: నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అదే.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్) ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 'మీకు మీచ్ క్యూట్ అంటే తెలుసా.. అంటే అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు.. ఆ క్యూట్ సిచ్యువేషన్స్.. వారి మధ్య జరిగే సంభాషణలు.' అనే నాని వాయిస్‌తో ప్రారంభమైంది. 'ఈ మనిషితో గొడవపడటం కూడా అనవసరం కదా అనుకున్నప్పుడే బంధాలు విఫలమవుతాయి. మనం ప్రేమించే వాళ్లతోనే కదా గొడవపడతాం' అంటూ సాగే సత్యరాజ్ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదైనా రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే గొడవలను పరిష్కరించుకుని బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేయాల్సిన పనులను వివరిస్తూ సిరీస్ రూపొందించారు. -
మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, డైరెక్టర్ గొపిచంద్ మలినేని, హీరో నాని, నటుడు పవన్ కల్యాణ్ ఇతర నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్ చేయలేరేమో!) ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/B0FI5lAEYf — Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022 ఆయన కోలుకుని వస్తారనుకున్నా: పవన్ కల్యాణ్ కృష్ణ మృతిపై నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటులు కృష్ణ గారు. ఆయన మరణించారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ అలాగే నందమూరి హీరో బాలకృష్ణ కూడా కృష్ణ మృతిపై స్పందించారు. ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు. A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ మృతి సీనియర్ హీరో, నటుడు సాయి కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల చేస్తూ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ‘ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశీలి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి, జనం మనిషి, అందరు నచ్చే మేచ్చే మహా మనిషి, ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణగారు. కృష్ణగారి కథ ఒక చరిత్ర.. ఆ కథ ఈ రోజుతో ఆగింది. కానీ.. చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో ఎప్పుడు వెండితెరపై నిలిచే ఉంటుంది. మన గుండెలో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సూపర్ స్టార్’ అని సాయి కుమార్ నివాళులు అర్పించారు. Heart broken by the demise of Krishna garu. His contribution to the Telugu cinema industry cannot be described in words . A true Superstar by all means . My deepest condolences to his family , well wishers & fans. May his beautiful soul rest in peace. #SuperStarKrishna garu pic.twitter.com/eFhvkTa6Rm — Allu Arjun (@alluarjun) November 15, 2022 Deeply pained to hear about Krishna garu's passing. A Superstar in every right, he stood tall and commanded attention on screen like no other. We will sorely miss him. Rest in peace, Sir. Sending love, light and strength to Mahesh and the family in this time of grief. pic.twitter.com/o3492JJEQX — Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2022 Our prayers and respects to Krishna garu, sending lots of love and strength to @urstrulymahesh and family. It’s been a tough year for you brother.. We are with you! — Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2022 SUPER STAR KRISHNA ⭐️ End of an era. My deepest condolences to @urstrulyMahesh sir,family and Krishna Gaaru’s extended family which includes you,me and every telugu cinema fan. 💔 — Nani (@NameisNani) November 15, 2022 Devastated on hearing the news of our Super Star Krishna Garu's Demise.. May his soul rest in peace. 🙏 Telugu Cinema lost a LEGEND 💔 My Deepest condolences to @urstrulyMahesh garu, family, fans and loved ones. pic.twitter.com/W6KKdtoQfH — Gopichandh Malineni (@megopichand) November 15, 2022 కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever. — Jr NTR (@tarak9999) November 15, 2022 Extremely saddened at the loss of #Superstarkrishna garu. can't imagine how tough this could be. Wishing all the strength to @urstrulymahesh anna and the family. May your soul RIP & you'll always be alive in our hearts sir. om shanti 🙏 pic.twitter.com/QoaBdFrSSI — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2022 Deeply saddened on the passing of #KrishnaGaru a man who made a great mark as a #SuperStarKrishna . May his soul #RIPKrishnaGaru . My condolences to @urstrulyMahesh and family in these trying times🙏🙏🙏 pic.twitter.com/SZKWLoaHYF — Radikaa Sarathkumar (@realradikaa) November 15, 2022 This is Heart Breaking. Our SUPERSTAR KRISHNA Garu is no more. Legend 🙏🏽 Icon and Inspiration for Generations …. We will all Miss You sir . Praying for strength to the family @ManjulaOfficial , @urstrulyMahesh sir. May god be with you in this Testing time. pic.twitter.com/gm9OlQQYsL — Nikhil Siddhartha (@actor_Nikhil) November 15, 2022 సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. Super Star Forever. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 15, 2022 Such a devastating loss to the entire film industry, What a Legend he was. I had the pleasure of working with him and a total privilege to know him personally. Rest in peace #SuperStarKrishna garu! Heartfelt condolences to Mahesh & family in this hour of grief. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) November 15, 2022 తెలుగు సినిమా చరిత్రలో మరో గొప్ప అధ్యాయం ముగిసింది... సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను 🙏 — RamajogaiahSastry (@ramjowrites) November 15, 2022 Rest of peace dear ‘THE SUPERSTAR’ Krishna garu. Deep condolences to the entire family, All the Fans. It’s a huge loss. Love you Krishna garu. You will be greatly missed. pic.twitter.com/wp3RkPJNsu — Sunil (@Mee_Sunil) November 15, 2022 Shocking & Heartbreaking to hear abt d news of Super Star Sri.Krishna Garu🙏🏻 1 of d Biggest LEGENDS & PILLARS of our Cinema🙏🏻 The Most Humble Human Being.. May his soul rest in peace.. May God give Strength to dear @urstrulyMahesh sir & his Family🙏 pic.twitter.com/WVwvuUWKpS — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 15, 2022 The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh — Rajinikanth (@rajinikanth) November 15, 2022 Deeply in grief on hearing that our only super star #Krishna garu is no more... yet he is with us. — Jaggu Bhai (@IamJagguBhai) November 15, 2022 కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది... నా అభిమాన హీరో ఇక లేరు .. Rest in peace Super Star 🙏 pic.twitter.com/qWprJp3Pfi — KONA VENKAT (@konavenkat99) November 15, 2022 Saddened and shocked to know about the sudden demise of Daring and Dashing hero Legendry actor #SuperStarKrishna garu May his soul rest in peace. my deepest condolences and strength to @urstrulyMahesh garu & the entire family pic.twitter.com/uWLZUku8vf — Director Maruthi (@DirectorMaruthi) November 15, 2022 My heartfelt condolences to @urstrulyMahesh garu and the whole family. #RIPSuperStarKrishnaGaru 🙏 You will live forever in our memories pic.twitter.com/GG71Da2bae — Samantha (@Samanthaprabhu2) November 15, 2022 It's shocking to hear about the demise of #SuperStarKrishna garu 😞 God is being too ruthless with #MaheshBabu garu this year. Brother, mother & now the legend 🙏🏼 Deepest condolences to entire family. #RestInPeaceKrishnaGaru pic.twitter.com/jbBKfM52bH — Jani Master (@AlwaysJani) November 15, 2022 Deeply saddened to hear legendary actor Superstar #Krishna Garu is no more 💔 Prayers & strengths to @urstrulymahesh garu and family.#RIPKrishnaGaru #RIPSuperstarKrishna pic.twitter.com/ngJ3tDSw2B — Simran (@SimranbaggaOffc) November 15, 2022 Deepest condolences @urstrulyMahesh family, friends and fans #RIPKrishnaGaru https://t.co/5n8C0kDgJE — venkat prabhu (@vp_offl) November 15, 2022 What a tragic year it’s been. My deepest condolences to @urstrulyMahesh garu & family. TFI wouldn’t have been what it is today if not for your contribution SUPERSTAR.Thank you! Om Shanthi 🙏#RAPO pic.twitter.com/C2bjrQoceD — RAm POthineni (@ramsayz) November 15, 2022 #SuperStarKrishna garu one of the legendary actors of the telugu film industry is no more. Deeply saddened to hear about the demise. My heartfelt condolences to @urstrulyMahesh and the entire family. Superstar Krishna lives on. OM Shanthi🙏 pic.twitter.com/kcV9wwqubM — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) November 15, 2022 Dear @urstrulyMahesh, Krishna Garu entertained audiences worldwide for so many years & he will stay in our hearts forever. He was a super star who lived a complete life. Pls stay strong brother. It has been a very difficult year. My prayers and thoughts with you.#RIPKrishnaGaru — Karthi (@Karthi_Offl) November 15, 2022 An icon of Telugu cinema Krishna gaaru is no more, an era ends with his demise. I wish to share the grief of brother @urstrulyMahesh who has to bear this third emotional trauma of losing a mother, brother and now his father. My deepest condolence dear Mahesh gaaru. — Kamal Haasan (@ikamalhaasan) November 15, 2022 Deeply saddened to hear the demise of Legendary Superstar Krishna garu 💔 His contribution to Indian cinema will be remembered forever 🙏 My deepest condolences to @urstrulyMahesh garu , family and fans 🙏 Om Shanti 😢💐 pic.twitter.com/HmpPmV3dmc — Anushka Shetty (@MsAnushkaShetty) November 15, 2022 -
చిల్డ్రన్స్ డే, కొడుకుతో కలిసి డిస్నీ ల్యాండ్‌లో నాని రచ్చ.. వీడియో వైరల్
నేచులర్ స్టార్ నాని తన కొడుకుతో కలిసి చేసి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయంలో కొడుకు అర్జున్‌తో సరదగా ఆడుకుంటూ ఉండే వీడియోల తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కొడుకుతో నాని సరదగా సమయాన్ని గడిపాడు. కొడుకు కోసం షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వాలిపోయాడు. బాలల దినోత్సవం సందర్భంగా తనయుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్నర్స్ స్టాచ్యూ(Partners statue) ముందు నాని, అర్జున్ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అర్జున్ మిక్కీ మౌస్లా డ్రెస్ వేసుకుని.. క్యూట్ క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం నాని పోస్ట్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు సరదా కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేసి నానికి దొరికిపోయిన హీరో
నేచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ దొరికేశాడు హీరో అడివి శేష్. నానికి తెలియకుండా ఆయన ఆఫీస్‌లో షూట్ చేసిన ఈ వీడియోను శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నాని ట్విట్టర్ వేదికగా.. నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా అంటూ అడివిశేష్‌ను ప్రశ్నించాడు. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో ఎందుకంటే.. అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా హిట్-2 అనే చిత్రంలో నటించారు. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు. 'ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా' అంటూ శేష్ వీడియోను షేర్ చేశాడు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని.. 'నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. Naa office ni ila kooda vaadocha 🧐@AdiviSesh @Meenakshiioffl https://t.co/PVdIc5UrXn — Nani (@NameisNani) November 12, 2022 -
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న నాని
నేచురల్ స్టార్ నాని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న నానికి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు.. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆయనతో పాటు నటుడు బెనర్జీ కూడా ఉన్నారు. కాగా నాని ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ నాని ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
లైగర్ ప్లాప్ తో రౌడీలో మార్పు మొదలైందా..?
-
నాని 'దసరా' సర్ప్రైజ్.. దుమ్మురేపుతున్న 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్
నాచురల్ స్టార్ నాని, అందాల రాశి కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని లుక్ ఇంతవరకు ఎన్నడు చూడని రేంజ్లో ఉండనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ధూం.. ధాం.. దోస్తాన్ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్‌ను మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. (చదవండి: ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!) సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో నాని పక్కా మాస్‌గా అలరించనున్నారు. ఈ సినిమాలో సముద్ర ఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దసరా' తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అచ్చమైన తెలంగాణ యాసలో నాని అద్భుతంగా డైలాగులు చెప్పాడు. తెలంగాణ సంస్కృతి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
హీరో నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ ట్రైలర్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘అల్లూరి’ చిత్రంతో అలరించబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లక్ష్యసాధనకు పడిన శ్రమ గొప్పది’ అంటూ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ వస్తుండగా పోలీసు ఆఫీసర్‌గా శ్రీవిష్ణు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులు నిజమైన హీరోలు అంటూ చెప్పే డైలాగ్, యాక్షన్స్ సీన్స్, లవ్ యాంగిల్ వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఊహించిన రితీలో ఉన్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత ఈళలు వేయించడం ఖాయం అంటున్నారు. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలని హీరో సవాలు విసరడం, అలాగే, ఎక్కువ మంది పిల్లలు పోలీసు అధికారులుగా మారాలని కోరుకుంటున్నానంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ చూపించాడని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలెట్ అని చెప్పవచ్చు. ఇలా సాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్ ప్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా తనికేళ భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. సెప్టెంబర్ 23న ఈచిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. -
నాని దసరా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, థియేటర్లోకి వచ్చేది అప్పుడే
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 30 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ నానికి సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 30, 2023కి ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు మేకర్స్. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన నాని కొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ పోస్టర్లో హాట్‌బ్యూటీ సిల్క్స్మితా పోస్టర్ ముందు నాని కూర్చుని ఉండగా.. మాసిన గడ్డం, బట్టలతో శరీరమంతా మట్టితో ఫుల్ మాస్‌లుక్‌లో దర్శనమిచ్చాడు నాని. కాగా ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇక చిత్రంలో సాయి కుమార్, తమిళ నటుడు సముద్రఖనిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా గోదావరిఖని సమీపంలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ పేర్కొంది. MARCH 30TH WORLDWIDE 🔥#EtlaitheGatlayeSuskundhaam This one will be remembered for a long time🖤 Telugu - Tamil - Malayalam - Kannada - Hindi #DASARA pic.twitter.com/70PuwsnIhq — Nani (@NameisNani) August 26, 2022 -
ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ
నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా గత ఏడాది డిసెంబర్లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్యామ్ సింగరాయ్ అనే అభ్యుదయ భావాలున్న బెంగాలీ రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా రెండు పాత్రల్లో నాని నటన ప్రేక్షకులను మెప్పించింది. చదవండి: అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్ దేవదాసీగా సాయిపల్లవి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌కి పోటీ పడుతోంది. పీరియాడిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. వచ్చే ఏడాది మార్చిలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నామినేషన్ జాబితాని జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. మరి.. ‘శ్యామ్ సింగరాయ్’కి మూడు విభాగాల్లోనూ నామినేషన్ దక్కుతుందా? కాని పక్షంలో ఏదో ఒక విభాగంలో అయినా దక్కించుకుంటుందా? అనేది చూడాలి. -
ఆకట్టుకుంటున్న నాని 'దసరా' స్పెషల్ పోస్టర్
నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడు(ఆదివారం)ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Dhoom dhaam dostaan Iraga maraga chedhaam ❤️🔥#HappyFriendshipDay #Dasara pic.twitter.com/0JrI1mybmf — Nani (@NameisNani) August 7, 2022 -
ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే!
Ante Sundaraniki Movie OTT Streaming: నేచురల్ స్టార్ నాని నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టిన సంగతి తెలిసిందే. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా ఈ సినిమా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని మంచి డీల్‌కు సొంతం చేసుకుందని సమాచారం. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన జూలై మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట. తాజాగా నెట్‌ఫ్లిక్స్ మూవీ స్ట్రీమింగ్ కోసం డేట్, టైం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. జూలై 8వ తేదీన నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయబోతుంది. అంటే జూలై 7వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. -
వైజాగ్ అల్లుడొచ్చాడు.. వస్తూనే సందడి చేశాడు..
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): విశాఖ అల్లుడొచ్చాడు...వస్తూనే సందడి చేశాడు.. ఈనెల 10న విడుదల కానున్న అంటే సుందరానికి..చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏయూ కాన్వొకేషన్ హాల్లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర హీరోయిన్ నజ్రియా ఫాహద్తో కలిసి హాజరయ్యారు. ఎమోషన్స్, హ్యూమన్‌టచ్ అన్నీ కలిసిన బ్లాక్‌బస్టర్ చిత్రం తీశామన్నారు. లీల క్యారెక్టర్లో నజ్రీయాను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేమన్నారు. చదవండి: నవ్వులు పూయిస్తున్న అంటే సుందరానికీ ట్రైలర్.. తన చిత్రం గురించి మాట్లాడుతూ యూత్ సుందరాన్ని ఫాలో అవ్వద్దంటూ సూచించారు. సుందరం కనిపించేటంత అమాయకుడు కాదన్నారు. సినిమా మాతో కలసి చూడాలని అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిత్ర విజయోత్సవం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటానన్నారు. తాను విశాఖ అల్లుడినని సాధారణంగా అల్లుడికి విందు ఇస్తారని, కాని ఈ నెల 10న తానే విశాఖ ప్రజలకు తన సినిమాతో విందు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. చిత్ర హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ ఇది తన తొలి చిత్రమని, డబ్బింగ్ కూడా చెప్పానన్నారు. తెలుగులో మరిన్ని మంచి చిత్రాలను నటించాలని ఉందన్నారు. చిత్ర నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నాని విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారన్నారు. నాని ఫ్యామిలీ పిక్‌తో అభిమానుల సందడి -
నాని ‘అంటే సుందరానికి’ ట్రైలర్ అప్డేట్ ఆ రోజే
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 10న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టిన చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చింది. మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు మూవీ ట్రైలర్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో ఈ సందర్భంగా హీరో నాని, హీరోయిన్ నజ్రియాలకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది చిత్ర బృందం. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నాని లుక్, టీజర్‌లోని ఫన్ని సన్నివేశాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ట్రైలర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. Leela and Sundar are coming to take you along on their joyous journeys ❤️#AnteSundaraniki, #AdadeSundara, #AhaSundara Trailer update on May 30 at 11:07 AM 💥💥 Natural Star @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @SVR4446 @saregamasouth pic.twitter.com/vMIkFgh2BG — Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022 -
అంటే సుందరానికి నుంచి మరోసాంగ్, ‘అయోమయంలో నాని’
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు థర్డ్ సింగిల్ పేరుతో రిలీజ్ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాతో పాటు 'దసరా' మూవీ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. -
త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్ఎస్ఎమ్బీ28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలోనే ఈమూవీ సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఆయన ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం నానిని సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
సెకండ్ సింగిల్: మే 9న ‘అంటే సుందరానికి’ నుంచి లవ్‌ట్రాక్
Nani Ante Sundaraniki Movie Latest Update: నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఫస్ట్‌సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించి అప్డే ఇచ్చింది చిత్రం బృందం. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! ఈ సందర్భంగా అంటే సుందరానికి సెకండ్ సింగిల్ ఎంత చిత్రం’ లవ్ ట్రాక్‌ను మే 9న విడదుల కానుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు బస్సులో కుర్చుని ఉండగా.. నాని, నజ్రియా భుజంపై తలవాల్చి కనిపించాడు. తన చేతితో నాని తలను అడ్డు పెట్టిన నజ్రియా చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అసలు వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది. Our next single #EnthaChithram from #AnteSundaraniki will dazzle your ears and leave you “in love”… Releasing on May 9th 🎧❤️#AnteSundaranikiOnJune10th Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/MWoTGe0uvp — Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2022 -
‘జయమ్మ పంచాయతీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్‌గా ఈ స్టార్ హీరోలు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi. Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani 📍Daspalla convention ⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk — Vennela Creations (@vennelacreation) April 29, 2022 -
నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే..
Nani Movie Movie Release On Direct OTT: కరోనా సమయంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి, టక్ జగదీశ్’ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు మహమ్మారి వల్ల ఓటీటీలో విడదల చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై నాని, నాని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ మాత్రం థియేటర్లోకి వచ్చింది. ఇక నాని మరో చిత్రం ఒకటి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని ప్రోడక్షన్లో ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీట్ క్యూట్’. నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. చదవండి: వైరల్‌గా కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి ఫొటోషూట్ ఆంథాలజీ (పలు కథల నేపథ్యంలో సినిమా) సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 5 విభిన్న కథానాల నేపథ్యంలో సాగే ఈ సినిమా బాహుబలి కట్టప్ప సత్యరాజ్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, రూహాని శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని భావించి నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మీట్ క్యూట్ నేరుగా నెట్‌ఫ్లక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కానీ, దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..
Nani Interesting Comments on Shahid Kapoor: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన హీరో స్టార్ నాని జెర్సీని హిందీలో షాహిద్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు(ఏప్రిల్ 22) థియేటర్లో విడుదలైంది. ఇందులో షాహిద్ పాత్రకు సినీ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా చూసిన నాని కూడా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. హిందీ జెర్సీలో తన రోల్ పోషించిన షాహిద్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ అర్జున్ పాత్రకు షాహిద్ పూర్తి న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ‘జెర్సీ సినిమా చూశాను. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టేనట్టే. షాహిద్‌కపూర్ అర్జున్ పాత్రను మనస్సు పెట్టి చేశాడు. మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ సర్, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్టర్) కూడా చాలా బాగా చేశారు.. నిజమైన మంచి సినిమా ఇది. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ నాని రాసుకొచ్చాడు. చదవండి: జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ ఇక నాని ట్వీట్‌కు షాహిద్ సమాధానం ఇచ్చాడు. ‘థాంక్యూ మై ఫ్రెండ్(అర్జున్ నుంచి మరోక అర్జున్). మీది చాలా పద్ద మనసు అందుకే జెర్సీకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మోర్ పవర్ టూ యూ’ అంటూ రీట్వీట్ చేశాడు. కాగా ఇప్పటివరకు స్క్రీనింగ్ అయిన షోల వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. Thank you. From one Arjun to another. Big love my friend. You have a big heart and that’s what jersey is all about. More power to you. https://t.co/mMOkevCH5T — Shahid Kapoor (@shahidkapoor) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే..
Nani Apologizes for His Statement on Kannada Audience: నేచురల్ స్టార్ నాని హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుండగా కన్నడ వెర్షన్లో మాత్రం డబ్ కాలేదు. చదవండి: అంటే సుందరానికీ.. నాని నాలుక మీద వాత పెట్టారు! ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్ లాంచ్ వేడుకలో నాని దీనిపై స్పందించాడు. ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో నాని కన్నడ ఆడియన్స్‌కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే.. అంటే సుందరాకి టీజర్ ఈవెంట్లో ఈ మూవీ కన్నడ డబ్బింగ్ వెర్షన్ అంశంపై నాని మాట్లాడాడు. ‘ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు తెలుగు అర్థం చేసుకుంటారు. తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకు వారు ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషల్లో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుంది’ అని అన్నాడు. All I was expressing was my gratitude for how a lot of my films or other telugu films Wer appreciated by our Kannada family there even when there was no dubbing version available. A particular answer in a press meet comes with context. Social media takes the context out. — Nani (@NameisNani) April 20, 2022 దీంతో నాని వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘నాని గారు మీరు తప్పు. చాలా మంది కన్నడిగులకు తెలుగు, తమిళ భాషలు అర్థం కావు. కనీసం వారు తెలుగును అర్థం కూడా చేసుకోలేరు. అలాంటి వారు కూడా మీ సినిమాలు చూడాలి అనుకుంటే తప్పకుండ మీ సినిమాను కన్నడలో డబ్ చేయాల్సిందే’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు దీనికి నాని స్పందిస్తూ.. ‘కన్నడ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేని సమయంలో కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్మీట్లో నేను చేసిన ఈ వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం అవుతుంది. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి దాని అర్థాన్ని మార్చేశారు’ అంటూ రీట్విట్ చేశాడు. అలాగే మరో ట్వీట్లో ‘తన అభిప్రాయాన్ని సరిగా చెప్ప్పలేకపోయుంటే క్షమించండి... బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌కు గర్వపడుతున్నా’ అని నాని వ్యాఖ్యానించాడు. -
IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీ అయిపోగా, ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో హడావుడి షురూ చేశాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌తో అనునిత్యం టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఎస్ఆర్హెచ్.. ప్రముఖ టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నానిని, తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లింక్ చేస్తూ ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. Ante aa Sundaram June lo vastadu, ee Sundar training kuda start chesadu. 💪#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/dxHrqIRswB — SunRisers Hyderabad (@SunRisers) March 18, 2022 నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో.. ‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు..’ అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఇందుకు నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అంటూ ట్వీటాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. All the best sundar 👍🏼 From Sundar :) https://t.co/ht6yD6qRup — Nani (@NameisNani) March 18, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్.. వాషింగ్టన్ సుందర్‌ను ఏకంగా రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడిన సుందర్‌ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వేలంలో పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో సన్‌రైజర్స్.. తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 29వ తేదీన జరగనుంది. చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. Vacchanu guys! 🧡 https://t.co/Bj6DA70NQV — Washington Sundar (@Sundarwashi5) March 18, 2022 చదవండి: కళావతి సాంగ్‌కు ఎస్ఆర్హెచ్ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్ లేదులే! అయినా -
ఆ తెలుగు మూవీ రీమేక్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ అగ్ర హీరోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా? అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్‌కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి. -
ఆశించిన బిజినెస్ చేయలేకపోయిన శ్యామ్‌సింగరాయ్, మొత్తం షేర్ ఎంతంటే..
Nani Shyam Singha Roy 13 Days Business Shares Details Inside: నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కాస్తా స్లో అయింది. శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ ఆశించినంత రాబట్టేలేకపోయాయి. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. తెలంగాణలో ఈ మూవీ బాగానే ఆడినా.. ఏపీలో కొన్ని థియేటర్లు మూత పడటంతో అక్కడ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడ శ్యామ్ సింగరాయ్ తక్కువే బిజినెస్ చేసిందని చెప్పాలి. అయితే ప్రారంభంలో ఈ మూవీకి ఆశించిన వసూళ్లు రావడంతో శ్యామ్ సింగరాయ్ సేఫ్ జోన్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ ఇక సినిమా వసూళ్లను ఓ సారి చూద్దాం. నైజాం : 9.10 కోట్లు సీడెడ్ : 2.53 కోట్లు ఉత్తరాంధ్ర : 2.17 కోట్లు ఈస్ట్ : 1.00 కోట్లు వెస్ట్ : 0.88 కోట్లు గుంటూరు : 1.21 కోట్లు కృష్ణా : 0.96 కోట్లు నెల్లూరు : 0.61 కోట్లు AP-TG 5 డేస్ కలెక్షన్స్: రూ. 18.72 కోట్లు (రూ.31.77 కోట్లు గ్రాస్) కర్ణాకట+ROI: రూ. 2.86 కోట్లు ఓవర్సీస్: రూ. 3.54 కోట్లు టోటల్ 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.25.12 కోట్లు (రూ. 44 కోట్లు గ్రాస్) షేర్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. -
ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం
Hero Nani Gets Emotional On Social Media Over Movie Theater Fire Accident: హైదరాబాద్ బిగ్‌స్క్రీన్ థియేటర్లో కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ ఒకటి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి. అంత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ థియేటర్ సోమవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు ఈ థియేటర్ ప్రమాదంపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. శివ పార్వతి థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తుంది. ఆ సినిమాకి ఫ్రెండ్స్ వేళ్లి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’ అంటూ నాని ట్వీట్ చేశాడు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt. — Nani (@NameisNani) January 3, 2022 -
‘శ్యామ్ సింగరాయ్’ రెమ్యునరేషన్‌ను నాని తిరిగి ఇచ్చేశాడా?
నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నాని గతంలో నటించిన వీ, టక్ జగదీశ్‌లు కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నిరాశలో ఉన్న నాని శ్యామ్ సింగరాయ్‌ని థియేటర్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూశాడు. చదవండి: హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న యంగ్ క్రికెటర్!, ఇదిగో ఫ్రూఫ్ అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లోనే విడుదలయ్యేలా కృషి చేశాడు. నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మాత అయినప్పటికి నానినే వెనకుండి అంతా నడిపించినట్టు ప్రచారం జరిగింది. అంతేగాక శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం స్పెషల్ కేర్ తీసుకున్నాడట. నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేశాడని టాక్. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా వసూళు చేసినట్లు సమాచారం. ఇదంతా బాగానే ఉన్న ఏపీలో మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది. అక్కడ టికెట్ రేట్స్‌తో పాటు ఇంకా చాలా సమస్యలు నాని సినిమాపై ప్రభావం చూపాయి. చదవండి: న్యూ ఇయర్‌ను భావోద్వేగంతో స్వాగతించిన సామ్, ఇలా సాగాలంటూ పోస్ట్ దానికి తోడు మూవీ విడుదలకు ముందు నాని చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో నాని కామెంట్స్, ఏపీ టికెట్స్ రేట్స్ తక్కువగా ఉండటం శ్యామ్ సింగరాయ్ మూవీని కలెక్షన్స్ పరంగా దెబ్బతీశాయి. అందుకే ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్లో 60 శాతం పారితోషికాన్ని నాని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్‌కి నాని 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా అందులో రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు నాని కానీ, మూవీ టీం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకుంది. అంతేగాక కమర్షియల్‌గా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? కాగా గతంలో నాని నటించిన ‘వీ, టక్’ జగదీశ్‌లో నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఈ మూవీపై ఆయన ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు. నాని ఆశించినట్టుగానే శ్యామ్ సింగరాయ్ థియేటర్లో విడుదలై మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు శ్యామ్ సింగరాయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్యామ్ సింగరాయ్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, అయినా థియేటర్లోనే విడుదల చేసేందుకు.. చదవండి: వైరల్ అవుతున్న యాంకర్ ప్రదీప్ ట్వీట్, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు మేకర్స్ ఆసక్తి చూపినట్లు నాని ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ ఈవెంట్లో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా థియేటర్లో రిలీజ్ అయిన ఈమూవీని భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. వచ్చే ఏడాది 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ కానుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. -
నానికి కౌంటర్‌గా తమన్ వరుస ట్వీట్లు! నెట్టింట వైరల్
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ హిట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా కనిపించే తమన్ తాజాగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్స్ నానిని ఉద్దేశించే చేసినవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా నాని మాట్లాడుతూ.. 'తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ లాగానే మ్యూజిక్‌కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని.. సంగీతం లేదా బీజీఎం సినిమాను ఎలివేట్ చేయాలే తప్పా.. డామినేట్ చేయకూడదని, లేదంటే శృతి తప్పుతుంది' అని పేర్కొన్నాడు. దీనికి కౌంటర్‌గా తమన్.. అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ దేనిని డామినేట్ చేయదని వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నార. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁 1/2 — thaman S (@MusicThaman) December 29, 2021 -
సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్టా ??
-
హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విజయనగరం: సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా.. ఇష్టానుసారం రేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. చదవండి: అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు సామాన్యునికి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అని.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. -
బయటికొచ్చిన శ్యామ్ సింగరాయ్ స్టోరీ!, ఆసక్తి పెంచుతున్న స్క్రిప్ట్
Nani Shyam Singha Roy Movie Story Goes Viral In Social Media: ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించించిన నాని ‘వి, టక్ జగదీష్’ చిత్రాలు ఓటీటీలో విడుదల అవ్వడం, అవి నిరాశపరచడంతో ఈ సారి శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టాలి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు నాని. ఇటీవల షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్దమైంది. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలై ట్రైలర్ చూసి ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. చదవండి: చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ కథను వివరిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తాడు నాని. అప్పటికే షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించి.. కథ కోసం కోల్‌కతా వెళతాడు. అక్కడ ఒకప్పటి రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అతడి గురించి ఎక్కువగా స్టడీ చేస్తే తరుణంలో ఆ పాత్రలో తనని ఊహించుకుంటాడు నాని. చదవండి: సెట్లో సుకుమార్‌ను ‘నిన్ను తగలేయా’ అని తిట్టుకునే వాడిని: బన్నీ తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ ముందు వరకు దీన్ని రివీల్ చేయకుండా స్క్రీన్ ప్లేతో రాహుల్ మ్యాజిక్ చేశాడని తెలుస్తోంది. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కథ చాలా ఆసక్తికగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లయన్లాగా ఉన్నావ్ నాన్న.. నాని కొడుకు క్యూట్ వీడియో వైరల్
Hero Nani Son Arjun Ghanta Played With Father And Of Lion: నేచురల్ స్టార్ నాని హీరోగా ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ క్రమంలో తన కుమారుడు అర్జున్‌తో సరదగా ఆడుకుంటున్న ఫొటోలను నాని తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడుతో నాని ఆడుకుంటున్న క్యూట్ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. నాని బెడ్‌పై పడుకుని ఉండగా.. అర్జున్ తండ్రిపై కుర్చుని మీసంతో ఆడుకుంటున్నాడు. చదవండి: బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్ తండ్రి(నాని) పెద్ద పెద్ద మీసాలను పట్టుకుని అర్జున్ నిమిరుతూ ఉంటే నాని ‘నాపేరు ఎంటో తెలుసా?’ అని కొడుకుని అడుగుతాడు. ఇందుకు అర్జున్ తెలుసు అంటూ శ్యామ్ సింగరాయ్ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లయన్(సింహం) లాగా ఉన్నావు నాన్న. అంటూ మీసాలను నిమిడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తండ్రి కొడుకులు ఇలా సరదాగా ఆడుకోవడం చూసి నాని ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. చదవండి: 5 సీజన్ల బిగ్‌బాస్ విన్నర్లు, వారి ప్రైజ్‌మనీ, పారితోషికం ఎంతంటే కాగా నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో నాని మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో డబుల్ రోల్లో పోషిస్తున్న నాని ఓ పాత్రలో శ్యామ్ సింగరాయ్‌గా పెద్ద మీసంతో సరికొత్తగా అలరించబోతున్నాడు. ఈ మూవీ నానికి జోడిగా సాయి పల్లవి, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Lion la vunnavu Nanna 😉#ShyamSinghaRoy pic.twitter.com/OwKZFzJXcL — Nani (@NameisNani) December 20, 2021 -
ఆకట్టుకుంటున్న అడవి శేష్ కేడీ ఫస్ట్ గ్లింప్స్
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు నాని 'హిట్ 2 ది సెకండ్ కేస్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. నేడు(డిసెంబర్ 17) అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ వదిలారు. ఇందులో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. -
ఆ సీన్లో సాయి పల్లవిని చూసి నటించడం మర్చిపోయా: నాని
నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ రాయల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వేదికగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వేడుకు హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి, కృతిశెట్టిలతో ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సుమపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టేజ్‌పై నాని మాట్లాడుతూ.. ‘డైరెక్టర్లు, నిర్మాతలు హీరోల కాల్షిట్ కోసం ఎదురు చూస్తారు. కానీ హీరోలు మాత్రం ఒకరి డేట్స్ కోసం చూస్తారు. ఆవిడే సుమగారు. ప్రీరిలీజ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు ఏ మూవీ ఈవెంట్ అయిన సుమ డేట్స్ చూసుకుని ప్లాన్ చేస్తాం’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు నాని. దీంతో సుమ నవ్వుతూ నానికి దండం పెడుతూ థ్యాంక్స్ చేప్పింది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి గురించి చెబుతూ.. ‘ఈ సినిమాలోని ఓ సీన్లో పల్లవి డాన్స్ చేస్తుంటే.. నేను జనంలో నుంచి ఆశ్చర్యంగా చూస్తుండాలి. ఆమె డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను.. నటించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నిజంగానే తన డ్యాన్స్ చూసి అంతగా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయాను’ అంఊట చెప్పుకొచ్చాడు. -
ఆకట్టుకుంటున్న నాని శ్యామ్ సింగరాయ్ మూవీ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలై టీజర్, ఫస్ట్‌లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ టీం బిజీగా ఉంది. చదవండి: హీరోగా ‘కట్టప్ప’కొడుకు.. ‘మాయోన్' ఫస్ట్ సింగిల్‌కి అనూహ్య స్పందన ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ రోజు(డిసెంబర్ 14) వరంగల్‌లో ట్రైలర్ లాంచ్ రాయల్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. -
పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న నాని
-
ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..!
సాయిపల్లవి.. ఈ పేరు వింటే చాలు అందరిలో ఒక జోష్ వస్తోంది. తన సినిమా అంటే వెంటనే మనసులో మెదిలేది ఒక్కటే. అదే తనపై ఉండే స్పెషల్ సాంగ్. ప్రతి సినిమాలోనూ సాయి పల్లవిపై ప్రత్యేకమైన పాటను పెట్టి తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చూసుకుంటారు దర్శకులు. అంతేగాక ఆ పాటలు సినిమాకే హైలెట్‌గా నిలవడం విశేషం. ఆమె సాంగ్స్ విడుదలయ్యాయంటే చాలు యుట్యూబ్ చానళ్లకు పండగే. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సంచనాలు సృష్టిస్తాయి. దీనికి గతంలో ఆమె నటించి ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’, ఇటీవల వచ్చిన ‘లవ్‌స్టోరీ’లోని సారంగధరియా పాటలే ఉదహరణ. చదవండి: మహేశ్ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ’ ఈ పాటలు జనాల్లోకి, యుట్యూబ్ చానళ్లో ఎంతగా దూసుకుపోయాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా సాయి పల్లవిపై ఓ స్పషల్ సాంగ్ ఉండబోతుందట. కలకత్తాలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాటలో సాయి పల్లవి మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్‌తో అదరగొట్టబోతుందట. ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు. కాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: 'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్ అప్డేట్ -
Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా.. సినిమా థియేటర్లపై భారీ ప్రభావాన్ని చూపించింది. కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా మూతపడ్డ థియేట్లు గత నెల 23 నుంచి తెరుచుకున్నప్పటికి పెద్ద సినిమాలేవి ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో విడుదల కాబోయే నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాల కారణంగా టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుంది. ఈ క్రమంలో నాని నటించిన టక్ జగదీష్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీకానున్నారు. (చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్) ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన శివ నిర్వాణకు ‘టక్ జగదీష్’ సినిమా.. హ్యాట్రిక్ చిత్రం. పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా చిత్ర టీజర్ కూడా తెలియజేసింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు. జగపతిబాబు, నాజర్ వంటి వారితో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా అయినప్పటికి.. నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు. ఈ నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. (చదవండి: ఓటీటీలోకి టక్ జగదీష్! అప్పుడే అంత లాభమా?) -
టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్
హీరో నాని తాజా చిత్రం టక్ జగదీష్. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. అయితే ఓటీటీలో తన సినిమాను రిలీజ్ చేయడంపై నాని మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ విడుదలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘నా సినిమాను థియేటర్లోనే విడుదల చేయలనుకున్నాను. ఎందుకంటే సినిమాను థియేటర్లోనే చూడటానికే నేను ఇష్టపడతా. కానీ నిర్మాతలు ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేశారు. దీంతో ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో థియేటర్లో టక్ జగదీష్ విడుదల కావడం వల్ల వారిపై భారం పడే అవకాశం ఉంది. అందువల్లే వారిని నేను ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తున్న. అయితే టక్ జగదీష్ ఎక్కడ విడుదలైన అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా టక్ జగదీష్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్ల రూపాయలకు మేకర్స్‌తో ఢీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే 8 కోట్ల రూపాలయకు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్నట్లు వినికిడి. అంతేగాక హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ. 5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ. 52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. -
'టక్ జగదీష్' : ఆ వార్తలను నమ్మకండి
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ చితంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్లోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టక్ జగదీష్ చిత్రం జులై 30న విడుదల కాబోతున్నట్లు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మూవీ రిలీజ్‌కు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మవద్దని పేర్కొంది. ‘టక్ జగదీష్’ రిలీజ్ పై వస్తున్న వార్తలను రూమర్స్గా కొట్టిపారేసింది. మా సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. -
టక్ జగదీశ్: త్వరలోనే రిలీజ్ డేట్..
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీశ్. షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమైన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా మేకర్స్ త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే టక్ జగదీశ్ మూవీని విడుదలకు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల ఎప్పడేప్పుడా అని అభిమాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుచేత థియేటర్లు తెరుచుకోగానే తొలి చిత్రంగా టక్ జగదీశ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు విశేష స్పంది వచ్చిన సంగతి తెలిసిందే. షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం నానికి అన్నయ్యగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. -
ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు నాని సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్!
కరోనా కాలంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా సైనికుల్ల మహమ్మారిపై యుద్దం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్కు హీరో నాని ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. ప్రజలను కరోనా కటేయకుండా డాక్టర్లు, నర్సులు, పోలీసులు ముందు వరుసలో నిలబడి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనాతో పోరాటంలో ఎంతో మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ప్రాణాలను కూడా కోల్పోయారు. అలాంటి వారి కోసం, ఇప్పటికీ మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్ అయిన డాక్టర్స్, హెల్త్ డిపార్టుమెంట్లో పని చేస్తున్న నర్సులు, పోలీసుల నాని ఓ స్పెషల్ వన్ అంటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్ చేశాడు. ఈ పోస్టులో నాని.. ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం అంటూ మ్యూజిక్, డాక్టర్ ఎమోజీలకు లవ్ ఎమోజీలను జత చేసి ఫొటో షేర్ చేశాడు. ఈ ఫొటోలో నాని కెమెరాను పట్టుకుని డిస్ప్లేను గమనిస్తున్నాడు. తనతో మరికొందరూ కెమెరా వైపే సిరీయస్‌గా చూస్తున్నారు. అది చూసిన నెటిజన్లు నాని ఏం చేయబోతున్నాడో తెలియక జుట్టు పీక్కుంటు తమదైన శైలిలో స్పందిస్తుంటే మరి కొందరూ ఆ సర్ప్రైజ్ కోసం వెయింటిగ్ సార్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) చదవండి: ‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?! -
రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’
రాజమహేంద్రవరం రూరల్: నగరంలో ‘టక్ జగదీష్’ సందడి చేశాడు. షైన్ స్క్రీన్స్ సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా పరిచయ వేడుక వీఎల్ పురం మార్గాని ఎసేట్స్లో శనివారం రాత్రి ఘ నంగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్లకు వెళ్లేటప్పుడు ఇంటి వద్ద అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం అంటూ.. నాని వేదిక దిగి వచ్చి ఒక తల్లి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా తన అభిమానులు ఉండాలని ఫ్యాన్స్‌కు నాని సూచించాడు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు నగరాన్ని హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. టక్ జగదీష్ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ, ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యి, నాని సినీ జీవితంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, టక్ జగదీష్ చిత్రంలో జగపతిబాబు, నాని అన్నదమ్ములుగా నటించి అందరినీ అలరించనున్నారన్నారు. తొలుత ఎంపీ భరత్‌రామ్ చేతుల మీదుగా సినిమాలోని పాట ‘నీటి నీటి చుక్క’ లిరిక్‌ను విడుదల చేయించారు. నటుడు నరేష్, నిర్మాతలు సాహు గారపాటి, రాహుల్ పెద్ది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, అనుశ్రీ ఫిలింస్ అధినేత ఆల్తి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీ టైమ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, భరత్‌రామ్ చేపట్టిన హరిత – యువత కార్యక్రమంలో భాగంగా మార్గాని ఎస్టేట్స్‌లో హీరో నాని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ భరత్‌రామ్ ఘనంగా సత్కరించారు. చదవండి: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది -
గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్
తాళ్లపూడి: తాళ్లపూడిలోని గోదావరి తీరంలో నాని హీరోగా, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్ర షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను గోదావరి తీరం, గోదావరి నదిలో చిత్రీకరించారు. రెండో రోజూ సోమవారం హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి ఇతర నటులు రేవు వద్ద నుంచి పడవ దాటే సన్నివేశంతో పాటు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మాతగా బాబి ప్రాడక్షన్ మేనేజర్‌గా వ్యహరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు అధిక సంఖ్యలో జనం గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. -
జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని
జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్ స్టార్ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అవార్డులు పొందాయి. ఈ అవార్డు దక్కడంపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా చిత్రబృందాలు సంతోషంలో మునిగాయి. గతేడాది ‘మహానటి’ చిత్రానికి కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. We are happy to share that a very special film #Maharshi has won the National Award for Best Film Providing Wholesome Entertainer. Thank you @urstrulyMahesh garu, @DirectorVamshi, @allarinaresh, @hegdepooja, @thisisdsp and the entire team for making this an unforgettable film ! pic.twitter.com/tKV1B9ojr6 — Sri Venkateswara Creations (@SVC_official) March 22, 2021 -
అప్పుడు నాని కెరీర్ అయిపోయిందనుకున్నారు!
నాని ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆయన 25 సినిమాలు చేశాడు. అంతే కాదు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడీ గ్యాంగ్ లీడర్. 'భలే భలే మగాడివోయ్'లో మతిమరుపున్న వ్యక్తిలా, 'నిన్ను కోరి'లో ప్రేమించిన అమ్మాయికి పెళ్లైనా ఆమెను మనసులో నుంచి తీసేయలేక ప్రత్యక్ష నరకం అనుభవించిన భగ్న ప్రేమికుడిలా, 'ఈగ'లో చనిపోయాక ఈగ అవతారం ఎత్తి మరీ ప్రేమికురాలిని వెన్నంటి ఉండి కాపాడుకునే రక్షకుడిలా నటించి మెప్పించాడు. విభిన్నతకు పెద్ద పేట వేసే అతడిని అభిమానులు నేచురల్ స్టార్ అని పిలుచుకుంటారు. నేడు నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత, కెరీర్ విషయాలను ఓసారి తెలుసుకుందాం.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం మొదలు.. నేచురల్ స్టార్ నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం స్వస్థలం. ఇతడు గంటా రాంబాబు, విజయలక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించాడు. అందరు కుర్రాల్లాగే నానికి కూడా సినిమాలంటే ఇష్టం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ఇష్టం కూడా పెద్దదైంది. దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే చదువు మధ్యలో వదిలేసి అవకాశాల కోసం డైరెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగేలా తిరిగిన నానికి ఎట్టకేలకు బాపు 'రాధాగోపాలం' సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకున్న అతడు తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రేడియోజాకీలో పనిచేస్తున్న సమయంలో దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ ‘అష్టాచమ్మా ’సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. తొలుత సెకండ్ లీడ్‌గా తీసుకుందామనుకున్నా నానినటనకు ఇంప్రెస్ అయ్యి ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి సినీ హీరోగా ఎదిగాడు. బ్రేకిచ్చింది ఆ సినిమానే.. తర్వాత తన దగ్గరకు వచ్చిన కథలన్నీ ఓకే చెప్తూ రైడ్, స్నేహితుడా, భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలు చేశాడు. కానీ ఇవి అతడికి పెద్దగా విజయాన్ని తెచ్చిపెట్టలేవు. 2011లో నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పింది. 2012లో రాజమౌళి ఈగలో నాని నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదే ఏడాది గౌతమ్ మీనన్ ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో సమంతతో కలిసి నటించిన నాని నంది అవార్డును సైతం అందుకున్నాడు. వరుసగా 8 సినిమాలు హిట్టే.. నటుడిగా తనకిక ఎటువంటి ఢోకా లేదనుకుని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడీ హీరో. నిర్మాతగా డీ ఫర్ దోపిడీ సినిమా తీశాడు. కానీ ఇది నాని అంచనాలను తలకిందులు చేస్తూ భారీ నష్టాలను మిగిల్చింది. పైసా, జెండాపై కపిరాజు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన నాని సినీ కెరీర్ ఇక ఏమైపోతుందో అన్న సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం అతడికి హిట్టిచ్చి ఆదుకోగా భలే భలే మగాడివోయ్ అతడిని మళ్లీ సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన 8 సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో మరోసారి నిర్మాతగా ట్రై చేసిన నాని అ, హిట్ సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్డౌన్లో వి సినిమాతో నిరాశపర్చిన ఈ హీరో ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల్లో నటిస్తున్నాడు. వెండితెర మీద మెప్పించిన ఆయన బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి అలరించాడు. నాని వ్యక్తిగత విషయానికి వస్తే.. 2012లో నాని అంజనా ఎలవర్తిని పెళ్లాడాడు. 2017లో వీరికి అర్జున్(జున్ను) అనే కొడుకు పుట్టాడు. అమ్మమ్మ చేసే చేపల పులుసు అంటే ఈ హీరో లొట్టలేసుకుని మరీ తింటాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాడు. బాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పాడు. సినిమా హిట్టైనా, ఫట్టైనా ఇక్కడే ఉండిపోతానంటున్నాడు. నాని కెరీర్లో ఓ మల్టీస్టారర్ చిత్రం కూడా ఉంది. కింగ్ నాగార్జునతో కలిసి దేవదాసు చేశాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘ఆచార్య’లో మంచి పాత్ర పోషిస్తున్నా.. రానాతో సాయిపల్లవి కోలు.. కోలు... టీజర్: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ! -
నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా సిద్ధమవుతోంది. నాని బర్త్‌డేకి రెండు సర్ప్రైజ్లు రాబోతున్నాయని సమాచారం. ఫిబ్రవరి 24న నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫస్ట్ లుక్స్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ రూపొందుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ రూపొందుతోంది. ‘టక్ జగదీష్’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. చదవండి: వచ్చే ఉగాదికి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా ఆ స్టేషన్ ఖర్చు కోటీ అరవై లక్షలట..