Hero Nani Gets Emotional On Social Media Over Movie Theater Fire Accident: హైదరాబాద్ బిగ్‌స్క్రీన్ థియేటర్లో కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ ఒకటి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి. అంత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ థియేటర్ సోమవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో సినిమా హాల్‌లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.
చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు
ఈ థియేటర్ ప్రమాదంపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. శివ పార్వతి థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తుంది. ఆ సినిమాకి ఫ్రెండ్స్ వేళ్లి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’ అంటూ నాని ట్వీట్ చేశాడు.
చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ..
Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt.
— Nani (@NameisNani) January 3, 2022
Comments
Please login to add a commentAdd a comment