Shiva parvati
-
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం
Hero Nani Gets Emotional On Social Media Over Movie Theater Fire Accident: హైదరాబాద్ బిగ్‌స్క్రీన్ థియేటర్లో కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ ఒకటి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి. అంత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ థియేటర్ సోమవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు ఈ థియేటర్ ప్రమాదంపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. శివ పార్వతి థియేటర్‌తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తుంది. ఆ సినిమాకి ఫ్రెండ్స్ వేళ్లి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’ అంటూ నాని ట్వీట్ చేశాడు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt. — Nani (@NameisNani) January 3, 2022 -
శివ పార్వతి సారీ చెప్పారు
-
శివ పార్వతి వీడియోపై ప్రభాకర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: తనకు కరోనా వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారని 'వదినమ్మ' సీరియల్ నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. తన గురించి ఆ సీరియల్ నటుడు, నిర్మాత ప్రభాకర్ పట్టించుకోలేదని ఆమె వీడియోలో వాపోయారు. అయితే, ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని పేర్కొంటూ ప్రభాకర్ బుధవారం రాత్రి ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. "శివపార్వతి అమ్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్లు, అలాగే అది నిజమని నమ్మిన వాళ్లు, మీడియా ఛానల్స్ వాళ్లు, అసలేం జరిగిందని తెలసుకోవాలనుకునేవాళ్లు.. అందరూ అడిగారు. ఇంతమంది అడుగుతున్నా కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటే.. ఇన్ని రోజుల తర్వాత అమ్మని నిన్న వీడియోలో చూడటమే. ఆ వీడియోలో ఆమె మాటలు వినడమే. ఎందుకంటే నాకు అటునుంచి ఫోన్లు రాలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాట్లాడాడు. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) ఇవన్నీ అమ్మకు పెద్దగా తెలియకపోవడం వల్ల చిన్న మిస్ అండర్స్టాండింగ్ జరిగి బాధపడి, వీడియో రిలీజ్ చేశారు. అయినా నేను అమ్మ కోలుకోవాలి, అమ్మ కోలుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడతాను అని రియాక్ట్ అవలేదు. కానీ ఇందాక శివ పార్వతమ్మ నాకు ఫోన్ చేసి బాబు.. సారీ, చిన్న పొరపాటు జరిగింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగింది. నేను అది యూట్యూబ్‌లో కూడా పెట్టలేదు. నాకు సోషల్ మీడియా గురించి కూడా తెలీదు. వదినమ్మ గ్రూప్‌లో మాత్రం పెట్టాను. అది బయటకు ఎలా వెళ్లిందో నాకు తెలియదు. నాకు విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. అసలేం జరిగిందనేది మళ్లీ ఇంకో వీడియో పెడతానన్నారు. ఈ వీడియోలు పెట్టడాలు వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పాను. (నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోడానికి మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా! అమ్మే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏం ఆపద వచ్చినా అందరం సాయం చేస్తాం. ఈ సందర్భంగా శివ పార్వతి అమ్మకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డ మా ఇండస్ట్రీ గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా శివబాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జీవితా రాజశేఖర్, ఇంకా ఎవరెవరు ముందుకొచ్చి అమ్మకు సహాయపడ్డారో వాళ్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ విషయం గురించి తప్పకుండా నేను వివరణ ఇస్తాను. అమ్మ కూడా వివరణ ఇస్తుంది. ప్రస్తుతానికి అమ్మ కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం ప్రార్థిద్దాం" అని ప్రభాకర్ తెలిపారు. -
నటి శివ పార్వతి ఎమోషనల్ వీడియో
-
నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి
నటి శివ పార్వతి.. బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన పేరు. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడ్డారు. ఈ సమయంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను తెలియజేస్తూ ఎమోషన్ వీడియోను షేర్ చేశారు. "ప్రభాకర్ నటిస్తూ నిర్మిస్తున్న "వదినమ్మ" యూనిట్‌కు నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మళ్లీ ఇంటికి వస్తానో లేదో అన్న పరిస్థితిలోకి వెళ్లిపోయాను. పది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ తర్వాత నిన్న రాత్రి ఇంటికి చేరాను. ఈ మధ్యలో రెండు ఆస్పత్రులు మారాను. ఈ విషయం ప్రభాకర్‌కు, అతని యూనిట్‌కు కూడా తెలుసు. ఈ విషయంలో నేను ఎవర్నీ ఏమీ అనదలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటి? అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా ప్రాణం అనేది ఒకటే, ఆపద అనేది ఒకటే. కరోనా చిన్న విషయం కాదని ప్రపంచానికి తెలుసు. (నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..) నేను వదినమ్మ యూనిట్లో పని చేసిన ఆర్టిస్ట్‌ను. పని చేసినా, చేయకపోయినా ఆర్టిస్ట్‌ల మధ్య ఒక అనుబంధం ఉంటుంది. పని చేసిన తర్వాత ఇంకా అనుబంధం దగ్గరవుతుంది. కానీ నా గురించి ఎవరూ ఏ ఆస్పత్రిలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అని అడగలేదు. ఇది దురదృష్టం. అంటే ఎవరి సమస్య వాళ్లదే.. ఇక్కడ ఎవరికి ఎవరూ తోడుండరు. ప్రభాకర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. మేము కూడా అలాగే ఉండాలి. నటించామా? ఆ క్షణాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలి.. అంతే! మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయి. నేను 5 ఏళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి నా పరిస్థితి తెలుసుకుని నాకు సాయం చేశారు. (మీరు లేకపోతే నేను లేను!) ప్రభాకర్ ఈ వైరస్ పై నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందన్నారు. రెండు లక్షలు సరిపోదు, పది లక్షల ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నారు. అది నేను చేసుకోలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ చేశానన్నారు. కనీసం అది తీసుకోండి, క్లెయిమ్ చేసుకోండి అని కూడా నాకు చెప్పలేరా? నేను చచ్చిపోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వరు. సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారు. సీరియల్ నిర్మాత శివ కుమార్ అప్పట్లో నాకు వరంగల్‌లో శాలువా కప్పి సన్మానం చేశారు, చాలా అభిమానం చూపించారు. కానీ ఈ అభిమానంలో కనీసం ఆవగింజంతైనా చూపించకుండా మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం తప్పు. ఆర్టిస్ట్‌ల పట్ల ప్రేమ పంచితే చచ్చిపోయే వాడికి కూడా బలం వస్తుంది. ఇది మర్చిపోవద్దు" అని శివ పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. -
ఆది దంపతులని ఎందుకు పేరు?
శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది. శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట. బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో... తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరుగాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే. ఇన్ని నియమాలెందుకు? సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కావు. ప్రతి పండుగ వెనుకా వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి ఈ నియమాలు. అభిషేకం: శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సున కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు.శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ... జాగరణ అవదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. నమకం, చమకం చదువుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, శివనామస్మరణ అనేక పాపాలను ప్రక్షాళన చేస్తుంది. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
టీవీ సీరియవళ్ళకి వీళ్ళే పెద్ద దిక్కు
టీవీక్షణం కుటుంబంలో అందరి కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు అన్ని బాధ్యతలూ నెత్తిన వేసుకుంటారు. అన్నీ చక్కబెడతారు. అయితే ఇది ఓ పరిమితి వరకూ మాత్రమే ఉంటుంది. కానీ సీరియళ్లలో ఇంటి పెద్దల్ని ఎప్పుడైనా గమనించారా? వాళ్లు చెప్పిందే వేదం, పాటించేదే సంప్రదాయం అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఇంటిపెద్దలు ప్రతీ సీరియల్లోనూ కనిపిస్తున్నారు. తల్లో, తండ్రో, బామ్మో... ఎవరైతేనేమి, కుటుంబంలో ఓ పెద్ద! నిలువెల్లా హుందాతనం ఉట్టిపడుతుంది. మాట్లాడితే వారి స్వరం చెవుల్లో ఖంగుమంటుంది. చూపుల్లో తీక్షణత భయపెడుతుంది. కాస్త కన్నెర్రజేస్తే అవతలివారికి నిలువెల్లా వణుకు పుడుతుంది. అలాంటి ఇంటి పెద్దలను పోటీపడి సృష్టిస్తున్నారు దర్శకులు. హిందీలో... ‘న ఇస్ దేశ్ లాడో’లో అమ్మాజీ, ‘బాలికావధు’లో కళ్యాణీదేవి, ‘సాథ్ నిభానా సాథియా’లో కోకిల, ‘సంస్కార్’ లో అన్షుబా, ‘ససురాల్ సిమర్‌కా’లో మాతాజీ, ‘దియా ఔర్ బాతీ హమ్’లో సంతోష్ రాఠీ, ‘కైరీ’లో ఇమర్తీదేవి, ‘ఉతరన్’లో ఠాకూర్, ‘ముక్తిబంధన్’లో ఐ.ఎం.విరానీ ఇంటి పెద్దగా హల్చల్ చేశారు. సీరియల్లో ఇంటి పెద్ద అంటే మంచివాళ్లే కానక్కర్లేదు. కొందరు విలన్స్... కొందరు శాంతమూర్తులు. వాళ్లు ఎలాంటి వాళ్లయినా సరే... ఆ ఇంట్లోని పాత్రలన్నీ వారి కనుసన్నల్లో మెలుగుతాయి. ఊరు ఊరంతా భయంతోనో, గౌరవంతోనో వారికి దణ్నాలు పెడుతుంటుంది. వారు చిటికె వేసినా, కనుసైగ చేసినా పనులు అయిపోతుంటాయి. వారిని అనుసరించే సీరియల్లోని మిగతా పాత్రలన్నీ సాగుతుంటాయి. తెలుగులో కూడా ఈ మధ్య ఇలాంటి పాత్రలు బాగానే వస్తున్నాయి. ‘మంగమ్మగారి మనవరాలు’లో శివ పార్వతి పాత్ర ఈ కోవలోకే వస్తుంది. ‘అపరంజి’లో నాగబాబు పాత్ర అలాంటిదే. కాకపోతే హిందీలో మాదిరిగా కడవరకూ ప్రాధాన్యత లేదా పాత్రకి. మధ్యలో డల్ అయిపోయింది. ‘గోరంతదీపం’లో జయలలిత పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘మొగలిరేకులు’లో శృతి పాత్ర కూడా దాదాపు అలాంటిదే. కానీ దుష్టపాత్ర కావడంతో రాను రాను మిగతా పాత్రలు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ పోయాయి. అయితే నిజానికి ఈ ‘పెద్ద’ పాత్రలకు హిందీలో ఉన్నంత ప్రాధాన్యత తెలుగులో లేదనే చెప్పాలి. మనకి అవసరాన్ని బట్టి ఆ పాత్ర ఉంటోంది. కానీ వాళ్లకు ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతోంది. ఇదంతా ‘బాలికావధు’లో దాదీసా పాత్రను చూసిన తర్వాత మరీ ఎక్కువయ్యిందంటారు కొందరు. ఆ పాత్రకి కళ్యాణీదేవి ప్రాణప్రతిష్ట చేయడంతో అద్భుతంగా పండింది. ఇక ప్రతి దర్శకుడూ అలాంటి ఓ పాత్రని సృష్టించేస్తున్నాడు. ప్రముఖ నటీనటుల్ని పెట్టడం కూడా ప్లస్ అవుతోంది! -
సంభాషణం: ఇల్లాలిని విలన్‌గా చూపించడం నాకు నచ్చదు!
నటనను వృత్తిగా భావించేవాళ్లు కొందరుంటారు. నటనే జీవితం అనుకునేవాళ్లు కొందరుంటారు. శివపార్వతికి నటనే జీవితం. నాటకాలు, సినిమాలు, సీరియళ్లు... వేదిక ఏదైనా, పాత్రకు ప్రాణప్రతిష్ట చేయగల గొప్ప నటి ఆమె. రెండు వందల సినిమాలకు పైగా నటించిన శివపార్వతి ఇన్నేళ్ల తన నటనా జీవితం గురించి చెబుతోన్న విశేషాలు... నాటకాలకు ఇంకా ఆదరణ ఉందని అంటారా? ఎందుకు లేదు! నాటకం ఎప్పుడూ వెనుకబడిపోదు. దాన్ని ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. నాటకానికి ఇతివృత్తమే ప్రాణం. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి కథలను ఎంచుకుంటే ఆదరణ ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు నటిగా మారిన వైనం? మా నాన్నగారు రంగస్థల నటులు. నా చిన్నప్పుడు అనుకోకుండా ఓ నాటకంలో నన్ను నటించమన్నారు. నాటి నుంచి నేటి వరకూ నటిస్తూనే ఉన్నాను. ఆసక్తి లేకుండానే నటి అయ్యారా? ఆసక్తి లేకుండా కాదు, నటనంటే ఏంటో తెలీకుండా నటినయ్యాను. మాది తెనాలి. ఎందరో మహా నటీనటులకు జన్మస్థలం అది. అలాంటిచోట పుట్టడం వల్లనో ఏమో... ఆ కళ నాకు చిన్ననాటే అబ్బింది. మొదట అవకాశాలు రావడం వల్ల నటించేసినా, కొన్నాళ్లు పోయాక నటన మీద మక్కువ, గౌరవం పెరిగాయి. అప్పట్నుంచీ నటనే నా ఊపిరి అయ్యింది. సినిమాల వైపు ఎలా వచ్చారు? 1991లో పరుచూరి బ్రదర్స్ రఘురామ్ నాటక కళా పరిషత్తును పెట్టారు. నా నటన చూసి తమ పరిషత్తులోకి తీసుకున్నారు. వారి ద్వారా ‘సర్పయాగం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాటకం... సినిమా... ఎందులో నటించడం కష్టమంటారు? ఎక్కడైనా నటన ఒకటే. వాటిని ప్రదర్శించే తీరులో కాస్త తేడా ఉంటుంది. సినిమాల్లో నటించేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది చూసుకుని అప్పటికప్పుడు మార్పు చేసుకోవచ్చు. నాటకంలో ఆ అవకాశం లేదు. ఒక్కసారి వేదిక ఎక్కాక పర్ఫెక్ట్గా చేయాల్సిందే. ఆ పాత్రను పండించాల్సిన, నాటకాన్ని రక్తి కట్టించాల్సిన బాధ్యత మనదే. సినిమాల్లో డబ్బింగ్ వేరే వాళ్లతో అయినా చెప్పించుకోవచ్చు. కానీ నాటకంలో మనం చెప్పే ఆ డైలాగులు, పద్యాల మీదే విజయం ఆధారపడి ఉంటుంది. మీకు ఎక్కువ తృప్తి ఎక్కడ దొరికింది? రెండిటినీ ఎంజాయ్ చేశాను. నాటకరంగం కన్నతల్లిలా ఆదరిస్తే, సినిమా రంగం మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహించింది. నాకు రెండూ రెండు కళ్లు. మరి ఆ రెంటినీ వదిలి సీరియల్స్‌కి ఎందుకొచ్చారు? సినిమాల్లో బిజీ అయ్యాక నాటకాలకు దూరమయ్యాను. సినిమాల్లో అవకాశాలు కొరవడటం వల్ల సీరియల్స్‌కి వచ్చాను. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు బాగా వచ్చేవి. అమ్మ, అక్క, అత్త, వదిన అంటూ రకరకాల పాత్రలుండేవి. ఇప్పుడలాంటి సినిమాలే రావడం లేదు. ఇక మాలాంటి వారికి అవకాశాలెలా వస్తాయి! ఇప్పుడు ట్రెండు మారిందిగా మరి? కావచ్చు. కానీ మార్పు కోసం మంచిని వదిలేసుకుంటామా? కమర్షియల్ సినిమాలు తీయొద్దనడం లేదు. కానీ విలువల్ని చెప్పే సినిమాలు కూడా తీయాలి. కుటుంబపు విలువల్ని, బాంధవ్యాల గొప్పదనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు సీరియల్స్ ఉన్నాయిగా? అవి మాత్రం ఏం చెబుతున్నాయి! సీరియల్స్‌లో కూడా యాభైశాతం వయొలెన్సే చూపిస్తున్నాం. పంచభక్ష పరమాన్నాలు భోంచేసి, పాయసం తిని, తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో హీరోయిన్ పాత్రని చూస్తే అలా ఉండాలి. అలా కాకుండా ఇల్లాలిని విలన్ని చేసి ఓ రాక్షసిలాగా చూపిస్తే ఎలా! ఇంటి ఇల్లాలే కనుక అలా ఉంటే ఇక ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇవన్నీ ఆలోచించాలి. ‘మంగమ్మగారి మనవరాలు’లో మీరు చేస్తోందీ విలన్ పాత్రేగా? కాదని అనడం లేదు. అలాంటివి ఉండకూడదు అని కూడా అనడం లేదు. ఎప్పుడూ అలాగే చూపించవద్దని అంటున్నాను. నటిగా నేను పాత్ర వరకే ఆలోచిస్తాను. కానీ పాత్రను సృష్టించేవారు ఆ పాత్ర సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. నటిగా నాకు అన్ని పాత్రలూ సమానమే అయినా వ్యక్తిగా మాత్రం అలాంటివాటినే ఇష్టపడతాను. నాటకాల నుంచి ఇక్కడి వరకూ వచ్చారు. మళ్లీ నాటకాల వైపు వెళ్లే ఆలోచనేమైనా ఉందా? ప్రస్తుతానికైతే లేదు. నాటకం అంటే అనుకోగానే వెళ్లి చేసేయడం కుదరదు. ఎంతో సాధన చేయాలి. ప్రస్తుతానికి అంత తీరిక నాకు లేదు. నటన కాకుండా వేరే లక్ష్యమేదైనా..? లేదు. నటనలోని మాధుర్యాన్ని తెలుసుకున్న తర్వాత నటనే జీవితం అనుకున్నాను. ఊపిరున్నంత వరకూ నటిస్తూనే ఉంటాను. - సమీర నేలపూడి