నటి శివ పార్వతి.. బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన పేరు. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడ్డారు. ఈ సమయంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను తెలియజేస్తూ ఎమోషన్ వీడియోను షేర్ చేశారు. "ప్రభాకర్ నటిస్తూ నిర్మిస్తున్న "వదినమ్మ" యూనిట్‌కు నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మళ్లీ ఇంటికి వస్తానో లేదో అన్న పరిస్థితిలోకి వెళ్లిపోయాను. పది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ తర్వాత నిన్న రాత్రి ఇంటికి చేరాను. ఈ మధ్యలో రెండు ఆస్పత్రులు మారాను. ఈ విషయం ప్రభాకర్‌కు, అతని యూనిట్‌కు కూడా తెలుసు. ఈ విషయంలో నేను ఎవర్నీ ఏమీ అనదలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటి? అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా ప్రాణం అనేది ఒకటే, ఆపద అనేది ఒకటే. కరోనా చిన్న విషయం కాదని ప్రపంచానికి తెలుసు. (నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..)
నేను వదినమ్మ యూనిట్‌లో పని చేసిన ఆర్టిస్ట్‌ను. పని చేసినా, చేయకపోయినా ఆర్టిస్ట్‌ల మధ్య ఒక అనుబంధం ఉంటుంది. పని చేసిన తర్వాత ఇంకా అనుబంధం దగ్గరవుతుంది. కానీ నా గురించి ఎవరూ ఏ ఆస్పత్రిలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అని అడగలేదు. ఇది దురదృష్టం. అంటే ఎవరి సమస్య వాళ్లదే.. ఇక్కడ ఎవరికి ఎవరూ తోడుండరు. ప్రభాకర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను. మేము కూడా అలాగే ఉండాలి. నటించామా? ఆ క్షణాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలి.. అంతే! మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయి. నేను 5 ఏళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి నా పరిస్థితి తెలుసుకుని నాకు సాయం చేశారు. (మీరు లేకపోతే నేను లేను!)
ప్రభాకర్ ఈ వైరస్ పై నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందన్నారు. రెండు లక్షలు సరిపోదు, పది లక్షల ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నారు. అది నేను చేసుకోలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ చేశానన్నారు. కనీసం అది తీసుకోండి, క్లెయిమ్ చేసుకోండి అని కూడా నాకు చెప్పలేరా? నేను చచ్చిపోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వరు. సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారు. సీరియల్ నిర్మాత శివ కుమార్ అప్పట్లో నాకు వరంగల్‌లో శాలువా కప్పి సన్మానం చేశారు, చాలా అభిమానం చూపించారు. కానీ ఈ అభిమానంలో కనీసం ఆవగింజంతైనా చూపించకుండా మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం తప్పు. ఆర్టిస్ట్‌ల పట్ల ప్రేమ పంచితే చచ్చిపోయే వాడికి కూడా బలం వస్తుంది. ఇది మర్చిపోవద్దు" అని శివ పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు.
నటికి కరోనా: ఎమోషనల్ వీడియో
Published Wed, Aug 19 2020 12:12 PM | Last Updated on Wed, Aug 19 2020 4:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment