
Shruti Haasan Tests Positive For Covid-19: హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. హాయ్ ఎవర్రీవన్. ఇది సరదా అప్‌డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.
దీంతో ఆమె అభిమానులు శ్రుతి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రుతి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 107వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రంలోనూ నటిస్తుంది.