
సాక్షి, విజయనగరం: సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా.. ఇష్టానుసారం రేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
చదవండి: అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు
సామాన్యునికి సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అని.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment