
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 10న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టిన చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది. మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు మూవీ ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు.
చదవండి: చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
ఈ సందర్భంగా హీరో నాని, హీరోయిన్ నజ్రియాలకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది చిత్ర బృందం. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నాని లుక్, టీజర్‌లోని ఫన్ని సన్నివేశాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ట్రైలర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Leela and Sundar are coming to take you along on their joyous journeys ❤️#AnteSundaraniki, #AdadeSundara, #AhaSundara Trailer update on May 30 at 11:07 AM 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022
Natural Star @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @SVR4446 @saregamasouth pic.twitter.com/vMIkFgh2BG
Comments
Please login to add a commentAdd a comment