
నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంటే సుందరానికీ. వెరైటే టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'ఎవరా అమ్మాయి? హిందువులేనా? చెప్పి చావరా? అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. అయితే ఈ దిక్కుమాలిన సోదంతా మొన్న వచ్చిన టీజర్‌లోనే చెప్పావన్న డైలాగ్ ఎదురవడంతో సరే, ఇప్పుడొక ఫ్లోలో చెప్తానంటూ తన కథను మొదలుపెట్టాడు నాని. ఒకసారి అమెరికా వెళ్లి రావాలని ఉందని, కానీ దానికి తన కుటుంబమే పెద్ద అడ్డని చెప్పాడు. అంతేకాకుండా పక్కా బ్రాహ్మణుడైన అతడు క్రైస్తవ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.
సాంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లను నిష్టగా ఆచరించే సుందరం కుటుంబం అతడి వివాహానికి ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చదవండి: నాగార్జునను సైడ్ చేసి సమంతకు బాధ్యతలు!
ఆస్ట్రేలియా ఆఫర్, భారీ రెమ్యునరేషన్, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!
Comments
Please login to add a commentAdd a comment