'నాకు కోపం వచ్చిందంటే.. ఇది నా సమస్య'.. 'సరిపోదా శనివారం' ట్రైలర్ వచ్చేసింది! | Actor Nani Saripodha Sanivaram Movie Offical Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Saripodha Sanivaram Trailer: 'వాడెవడో శనివారమే కొడుతున్నాడు'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!

Published Tue, Aug 13 2024 8:56 PM | Last Updated on Wed, Aug 14 2024 10:55 AM

Tollywood Hero Saripodha Sanivaram Trailer out Now

హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న  పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు చేయని పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే నాని యాక్షన్‌ సీన్స్‌, ఎలివేషన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ మాస్‌ యాక్షన్‌ ట్రీట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఎస్‌జే సూర్య పోలీస్‌ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్నఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో సాయికుమార్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్ సంగీతమందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement