గేమ్‌ ఛేంజర్‌ సెట్‌లో ఈ సినిమా గురించే చర్చ: దిల్‌ రాజు కామెంట్స్ | Dil Raju Comments On Actor SJ Surya In Saripodha Sanivaram Movie Event, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Dil Raju: అతను విలన్‌గా దొరకడమే అసలు మజా

Published Wed, Aug 21 2024 4:38 PM | Last Updated on Wed, Aug 21 2024 5:28 PM

Dil Raju Comments On Actor SJ Surya In Saripodha Sanivaram Movie

నేచురల్ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించారు.  దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్‌జే సూర్య గురించి ప్రస్తావించారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ..'గేమ్ ఛేంజర్‌ షూటింగ్‌లో ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. గ్యాప్‌ వచ్చినప్పుడల్లా నానికి, ఎస్‌జే సూర్య మధ్య సీన్స్‌ గురించి చెప్పేవారు. నానికి కూడా విలన్‌గా ఎస్‌జే సూర్య దొరకడం చూస్తుంటే ఫుల్ మజా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తున్నందుకు ఎస్‌జే సూర్యకు థ్యాంక్స్‌. సరిపోదా శనివారం చిత్రంలో నాని, ఎస్‌జే సూర్య, ట్రైలర్‌ చాలు. ఈ మూవీ దసరాను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.' ‍అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement