ఆగస్టు 15 లాంటి లాంగ్ వీకెండ్‌ని తెలుగు సినిమా సరిగా ఉపయోగించుకోలేకపోయింది. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలు ఫెయిలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన 'ఆయ్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ షోలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ఎప్పటిలానే ఓ మాదిరి వసూళ్లతో సర్దుకోవాల్సి వస్తుంది.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)
సంక్రాంతికి 'హనుమాన్'.. మార్చిలో 'టిల్లు'.. జూన్‌లో 'కల్కి' తప్పితే టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా ఉంది. చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ గట్టిగా నిలబడలేకపోతున్నాయి. కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ థియేటర్లకి ఇవి జనాల్ని తీసుకురాలేకపోతున్నాయి. దీంతో నెక్స్ట్ పెద్ద మూవీ ఏంటా అని చూస్తే నాని 'సరిపోదా శనివారం' కాస్త గట్టిగా కనిపిస్తోంది.
యాక్షన్ ప్లస్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమా ఆగస్టు 29న రానుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉంది. దీంతో టాలీవుడ్ ప్రస్తుతం దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది హిట్ కావడం నానితో పాటు ఇండస్ట్రీకి కూడా ముఖ్యమే. ఆపై నెలల్లో 'దేవర', 'పుష్ప', 'గేమ్ ఛేంజర్' తదితర సినిమాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ..ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోలు)
Comments
Please login to add a commentAdd a comment