ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ | Hollywood Movie Badland Hunters Telugu review | Sakshi
Sakshi News home page

ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ

Published Sun, Aug 18 2024 1:38 PM | Last Updated on Sun, Aug 18 2024 5:23 PM

Hollywood Movie Badland Hunters Telugu review

స్టార్‌ హీరో డాన్ లీ.. హాలీవుడ్‌ సినిమా లవర్స్‌కు అభిమాన నటుడు. సౌత్ కొరియ‌న్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్‌ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. హియో మ్యుంగ్-హేంగ్ దర్శకత్వం వహించాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా జనవరి 26, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

సౌత్ కొరియాలో ఒక భారీ భూకంపంతో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అతికష్టం మీద కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారికి సరైన ఆహారం దొరకదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. ఆకలితో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారు జీవిస్తుంటారు. సరిగ్గా అదే ప్రాంతంలో నామ్‌సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. 

అతనితో పాటుగా నామ్‌సామ్‌, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్‌) ఉంటారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. భూకంపం వల్ల నామ్‌సామ్ కూతురు చ‌నిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు హ‌న్ సునా (రోహ్ జియోంగ్‌) అనే యువతిని త‌న కూతురిగా భావిస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.

అలా వారి జీవితాల్లోకి వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్ పేరుతో కొందరు ఎంట్రీ ఇస్తారు. దీంతో వారి లైఫ్‌ ప్రమాదంలో పడుతుంది. వారి నమ్మించి హ‌న్ సునా (రోహ్ జియోంగ్‌) అనే యువతిని తమ వెంట తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆమె అమ్మమ్మను క్రూరంగా చంపేస్తారు.  యాంగ్ జీ సు (లీ హీ జూన్‌) అనే డాక్ట‌ర్ యుక్త వ‌య‌సులో ఉన్న అమ్మాయిల‌పై ప్ర‌మాద‌క‌ర ప్ర‌యోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా ఉండేందుకు సైన్స్‌కు పదునుపెడుతాడు. ఈ క్రమంలో అనేకమంది యువతులపై ప్రయోగాలు చేస్తూ ఉండలం వల్ల వారందరూ కూడా భ‌యంక‌ర‌మైన‌ జాంబీలుగా మారిపోతుంటారు.

కూతురుగా భావించిన హ‌న్‌సునా ప్ర‌మాదంలో చిక్కుకుందని తెలుసుకున్న నామ్‌సామ్‌ కాపాడేందుకు ప్లాన్‌ వేస్తాడు.  తన మిత్రుడు అయిన చోయ్ జీ వాన్‌ను కూడా సాయంగా తీసుకెళ్తాడు.  ఆమెను ఆ సైకో డాక్ట‌ర్  నుంచి వారిద్దరూ ఎలా కాపాడారు? డాక్టర్‌తో పాటు పనిచేస్తున్న లీ యూన్ హో ఎలా సాయ‌ప‌డింది? ఆమె వారికి ఎందుకు సాయం చేసింది..? డాక్టర్‌గా మంచి పేరున్న యాంగ్ జీ సు ఇదంతా ఎవరిని కాపాడేందుకు చేస్తున్నాడు..? ఆ డాక్టర్‌ బారి నుంచి  హ‌న్ సునా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిందా..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న బ్యాడ్‌లాండ్ హంట‌ర్ మూవీ చూడాల్సిందే.

బ్యాడ్‌లాండ్ హంట‌ర్స్ సినిమా అంతా కూడా భూకంపంతో శిథిల‌మైన న‌గ‌రం చూట్టే సాగుతుంది. వాస్తంగా దానిని సెట్‌ వేసి ప్రేక్షకులకు చూపించారు. అయినా చాలా రియ‌లిస్టిక్‌గా సినిమాను  డైరెక్ట‌ర్‌ మ‌లిచాడు. ఎక్కువగా ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను భారీగా మెప్పిస్తాయి.

డైరెక్ట‌ర్ హియో మ‌యాంగ్  స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కావ‌డంతో ఈ సినిమా యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ అదిరిపోయాయి. మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే ఎపిసోడ్స్ ఆక‌ట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి పీక్స్‌లో ఉంటుంది. నామ్‌ సామ్‌ పాత్రలో డాన్ లీ అద‌ర‌గొట్టాడు. కేవలం ఆయన చేస్తున్న స్టంట్స్‌ కోసం సినిమా చూడొచ్చు. ఇదే సమయంలో లీహీజూన్ విలనిజం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇందులో ల‌వ్‌స్టోరీతో పాటు  యాక్ష‌న్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాలు ఎవరినీ నిరుత్సాహపరచవని చెప్పవచ్చు. ఒక సైకో డాక్టర్‌ నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement