
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా డ్రామాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమనే కథాంశంగా రూపొందించారు. తల్లి లేని బిడ్డ జీవితంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుందనే కథనే చూపించనున్నారు. ట్రైలర్ చూస్తే తండ్రీ,కూతుళ్ల ప్రేమ, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment