Nani Ante Sundaraniki Movie OTT Release Date: Streaming On Netflix From July 8th, Deets Inside - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki OTT Release Date: ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌.. డేట్‌, టైం ఫిక్స్‌,

Published Wed, Jun 22 2022 3:22 PM | Last Updated on Wed, Jun 22 2022 3:45 PM

Is Nani Ante Sundaraniki Movie Streaming On Netflix From July 8th - Sakshi

Ante Sundaraniki Movie OTT Streaming: నేచురల్‌ స్టార్‌ నాని నటించిన లెటెస్ట్‌ మూవీ ‘అంటే..సుందరానికీ’. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ ఈ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా జోడి కట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: హెల్త్‌అప్‌డేట్‌: ‘కెప్టెన్‌’ విజయకాంత్‌ కాలివేళ్లు తొలగింపు

ఫుల్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా ఈ సినిమా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి డిజిటల్‌ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీని మంచి డీల్‌కు సొంతం చేసుకుందని సమాచారం.

చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్‌ నటుడు నరేశ్‌ స్పందన

జూలై మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నారట. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ మూవీ స్ట్రీమింగ్‌ కోసం డేట్‌, టైం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. జూలై 8వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేయబోతుంది. అంటే జూలై 7వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement