Nani Ante Sundaraniki OTT Streaming Date Announced Today - Sakshi
Sakshi News home page

Nani Ante Sundaraniki Movie: 'అంటే సుందరానికీ' ఓటీటీలో ఎప్పుడు ? ఎక్కడంటే ?

Published Sun, Jul 3 2022 8:31 PM | Last Updated on Sun, Jul 3 2022 10:08 PM

Nani Ante Sundaraniki OTT Streaming Date Announced - Sakshi

Nani Ante Sundaraniki OTT Streaming Date Announced: నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ జోడిగా నటించిన లెటెస్ట్‌ మూవీ ‘అంటే.. సుందరానికీ’. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఫుల్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గాయి. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా సౌత్‌ అధికారికంగా ప్రకటించింది. 'సుందర్‌ అండ్‌ లీల వెడ్డింగ్‌ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్‌ చేసింది.

చదవండి:👇 
విషాదం: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌
వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement