Nazriya Nazim
-
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?
మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్) టైమ్ మేనేజ్మెంట్లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం. మూడ్ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్‌డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది. -
Nazriya Nazim Rare Unseen Photos: హీరోయిన్ నజ్రియా నజీమ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్‌గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్‌ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్తుందని సమచారం. -
'రాజా రాణి' బ్యూటీ.. బంపరాఫర్ కొట్టేసింది!
మలయాళ బ్యూటీ నజ్రియా మరో బంపరాఫర్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నాని 'అంటే సుందరానికీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'జవాన్' డైరెక్టర్ అట్లీ తీసిన 'రాజా రాణి'లో నజ్రియా ఓ హీరోయిన్ గా చేసింది. అప్పటి నుంచి ఈమెకు తెలుగులో బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఏరికోరి సినిమాలు చేసే ఈమె.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగమైందట. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' మూవీ చేస్తాడు. మరోవైపు 'ఆకాశమే హద్దురా'తో సూపర్ హిట్ ఇచ్చిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా అదితి శంకర్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నజ్రియా పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో నజ్రియాని హీరోయిన్ పాత్ర కోసం సెలెక్ట్ చేశారా? లేదా స్పెషల్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)) -
నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!
ఓ నటుడు. తండ్రి డైరెక్టర్ కావడంతో ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. 19 ఏళ్లకే హీరోగా తొలి సినిమా. బ్యాడ్ లక్. మూవీ ఫ్లాప్ అయింది. దీనికి తోడు అదనంగా అవమానాలు, యాక్టింగ్ రాదని ఘోరమైన విమర్శలు. దెబ్బకు భయపడిపోయాడు. వల్ల కాదు బాబోయ్ అని దేశం వదిలేసిపోయాడు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ. సినిమా హిట్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతడే ఫహాద్ ఫాజిల్. మంగళవారం అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. హీరోలా ఉండడు సినిమా హీరో అంటే ఫిట్‌గా ఉండాలి, అందంగా కనిపించాలి, అమ్మాయిలని ఆకట్టుకోవాలి.. ఇలాంటి కొలమానాలు బోలెడు. వాటన్నింటికీ ఫహాద్ ఫాజిల్ చాలా దూరం. చూడటానికి బక్కగా ఉంటాడు. బట్టతలతోనే కనిపిస్తాడు. ఓ సాదాసీదా మనిషిలా ఉంటాడు. ఇవన్నీ కాదు ఎవరికోసమే తన వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోడు. అందుకే ప్రేక్షకులు ఇతడిని అభిమానిస్తున్నారు, సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) పనికిరాడన్నారు తండ్రి ఫాజిల్ దర్శకత్వంలో 19 ఏళ్లకే 'కైయెతుమ్ దూరత్' సినిమాతో ఫహాద్ హీరో అయిపోయాడు. కానీ ఇది ఫెయిలవడంతో ఫహాద్‌ని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. నటుడిగా అస్సలు పనికిరాడని అవమానించారు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తనపై విమర్శలకు నటనతోనే సమాధానమిచ్చాడు. హీరోయిన్‌తో పెళ్లి రీఎంట్రీలో నటుడిగా ఫహాద్ ఫాజిల్ సక్సెస్‌లు అందుకున్నాడు. 'బెంగళూరు డేస్'లో తనకు భార్యగా నటించిన నజ్రియా నజీమ్‌ని చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. లవ్ లెటర్లో ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నజ్రియా.. కొన్నాళ్లు చుట్టూ తిప్పించుకుని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకే అంటే 2014 ఆగస్టు 21న వీళ్ల పెళ్లి జరిగిపోయింది. (ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) ఓటీటీల్లోకి ధైర్యంగా లాక్డౌన్ టైంలో దాదాపు అందరూ హీరోలు షూటింగ్స్ చేయడానికే భయపడితే.. ఫహాద్ ఫాజిల్ మాత్రం వరసపెట్టి మూవీస్ చేశాడు. వాటిని ఓటీటీల్లో ధైర్యంగా రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఉపాధి కల్పించాడు. అదే టైంలో తెలుగు డబ్బింగ్ కూడా ఉండేసరికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. 'పుష్ప'లో షెఖావత్, 'విక్రమ్'లో అమర్‌గా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. కళ్లు చాలు సాధారణంగా హీరోలంటే ఫైట్స్ చేయాలి, గడ్డం పెంచాలని అందరూ అంటుంటారు. ఫహాద్ ఫాజిల్ మాత్రం జస్ట్ కళ్లతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసేస్తుంటాడు. అతడి సినిమాలు చూసే ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. అలానే హీరో అనే కాకుండా విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ లాంటి రోల్స్ చేయడానికి అస్సలు మొహమాటపడడు. ఇకపోతే ఫహాద్ ఫాజిల్ మరెన్నో మంచి సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) -
రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా.. సినిమాలో కాదట!
మాలీవుడ్ భామ నటి నజ్రియా తొలుత మాతృభాషలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత తమిళంలో నేరం, రాజారాణి, నయ్యాండి, తిరుమనమ్ ఎనుమ్ నిఖ్కా తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా మంచి క్రేజ్ ఉండగానే నటుడు ఫహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. అయితే అది కొంతకాలమే! తర్వాత నజ్రియా మళ్లీ నటనపై దృష్టి సారించింది. లక్కీగా ఈమెకు మళ్లీ హీరోయిన్ ఛాన్సులే రావడం మొదలెట్టాయి. మలయాళ చిత్రాల్లో నటిస్తున్న నజ్రియా ఆ మధ్య తెలుగులోనూ నానితో అంటే సుందరానికి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అక్కడ మరో అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తమిళంలో నటించడానికి సిద్ధమవుతోందనేది తాజా సమాచారం. అయితే ఈసారి నటించేది చిత్రంలో కాదు. వెబ్ సిరీస్‌లో నట. దర్శకుడు విజయ్ కొత్త కాంబినేషన్లను సెట్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం ఈయన నటుడు అరుణ్ విజయ్, అమీ జాక్సన్ జంటగా మిషన్ చాప్టర్ –1 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. తొలి ప్రయత్నంగా ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఈయన నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నజ్రియా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో నటుడు శాంతను ముఖ్యపాత్రలో నటించనున్నట్లు తెలిసింది. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: కార్తీ జపాన్‌కు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే.. -
Fashion: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
నజ్రియా నాజిమ్.. తెలుగు తెర ఆమె కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసింది. ఆ ఎదురు చూపులకు చక్కటి ఫలితమే ‘అంటే సుందరానికి’. ఆ సినిమాలో ‘లీల’గా నజ్రియా నటనను మెచ్చుకుని టాలీవుడ్లోకి ఆమెను ఘనంగా స్వాగతించారు. మరి తన స్టయిల్ సిగ్నేచర్‌గా ఏ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ఆమె గ్రాండ్‌గా ధరిస్తుందో చూద్దాం... బ్రాండ్ వాల్యూ తొరానీ ఈ బ్రాండ్ స్థాపకుడు కరణ్ తొరానీ. స్ఫూర్తి అతని నానమ్మ. స్వస్థలం భోపాల్‌లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల ఆసక్తిని రేకెత్తించింది. నానమ్మ ఎప్పుడూ కట్టుకునే చందేరీ కాటన్ చీరలు.. ఆ నేత.. అతన్ని డ్రెస్ డిజైన్ వైపు మళ్లించాయి. దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత తన బ్రాండ్ ‘తొరానీ’కి రూపమిచ్చాడు. నజ్రియా చీర: బ్రాండ్: తొరానీ ధర: రూ. 64,000 ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. నజ్రియా జ్యూయెలరీ: ముత్యాల కమ్మలు బ్రాండ్: అమ్రపాలి జ్యూయెలర్స్ ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. కథ, అందులో నా పాత్ర నచ్చితే చాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తా. అలా మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీ. – నజ్రియా నాజిమ్ -దీపిక కొండి చదవండి: Fashion Jewellery: చెవులకు పెయింటింగ్! ధర రూ.300 నుంచి.. -
తేది గుర్తుంచుకోండి.. 'అంటే సుందరానికీ' ఓటీటీలో ఆరోజే..
Nani Ante Sundaraniki OTT Streaming Date Announced: నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జోడిగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకోగా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. 'సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్ చేసింది. చదవండి:👇 విషాదం: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు You are cordially invited to witness the wedding story of Sundar and Leela 🥰❤️ Save the date! Ante Sundaraniki is coming to Netflix on the 10th of July in Telugu, Malayalam and Tamil.@NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/yRw3XIewK5 — Netflix India South (@Netflix_INSouth) July 3, 2022 -
ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే!
Ante Sundaraniki Movie OTT Streaming: నేచురల్ స్టార్ నాని నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టిన సంగతి తెలిసిందే. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా ఈ సినిమా తర్వాత నెమ్మదిగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే సుందరానికి డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని మంచి డీల్‌కు సొంతం చేసుకుందని సమాచారం. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన జూలై మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట. తాజాగా నెట్‌ఫ్లిక్స్ మూవీ స్ట్రీమింగ్ కోసం డేట్, టైం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. జూలై 8వ తేదీన నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయబోతుంది. అంటే జూలై 7వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. -
'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ?
Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లో మంచి హిట్ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. నైజాం- రూ. 5.58 కోట్లు సీడెడ్- రూ. 1.13 కోట్లు ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు ఈస్ట్- రూ. 0.93 కోట్లు వెస్ట్- రూ. 0.79 కోట్లు గుంటూరు- రూ. 0.87 కోట్లు కృష్ణా- రూ. 0.84 కోట్లు నెల్లూరు- రూ. 0.58 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్) కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు ఓవర్సీస్- 5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్) చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ
టైటిల్ : అంటే..సుందరానికీ నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, నరేశ్ హర్షవర్థన్, నదియా, రోహిణి తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్ నిర్మాతలు:నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. దర్శకత్వం : వివేక్ ఆత్రేయ సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి ఎడిటర్ :రవితేజ గిరిజాల విడుదల తేది : జూన్ 10,2022 ‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫలితాన్ని పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేయడం నానికి అలవాటు. సినిమా సినిమాకి తన పాత్ర, కథలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాడు. వరసగా యాక్షన్ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాని.. ఈ సారి మాత్రం తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘అంటే.. సుందరానికీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 10) విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే సుందర్(నాని)..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి(నరేశ్) కుటుంబ ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు.తన వంశంలో పుట్టిన ఏకైక కుమారుడు సుందర్‌ని కూడా తనలాగే పద్దతిగా పెంచాలనుకుంటాడు. సుందర్ చిన్నవయసులో చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీంతో కొడుకు జాతకంలో ఏదో దోషం ఉందని జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్ అయ్యంగార్)ని సంప్రదిస్తుంది అతని ఫ్యామిలీ. అప్పటి నుంచి సుందర్ జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం జోగారావు ఈ దోషం, ఆ దోషం అంటూ సుందర్‌తో రకరకాల హోమాలు చేయిస్తాడు. దీంతో సుందర్‌కి విసుగెత్తి ఇంట్లో అబద్దాలు చెప్పడం ప్రారంభిస్తాడు. మరోవైపు క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి లీలా థామస్(నజ్రియా నజీమ్) ఫ్యామిలీ కూడా మతంపై మమకారం ఎక్కువ. ఆమె తండ్రి(అలగం పెరుమాల్) హిందువులు పెట్టిన ప్రసాదం కూడా స్వీకరించడు. అలాంటి ఫ్యామిలీకి చెందిన సుందర్, లీలాలు..ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాలను ఒప్పించడానికి రకరకాల అబద్దాలు ఆడతారు. ఆ అబద్దాలు వీరి జీవితంలో ఎలాంటి అల్లకల్లోలానికి దారి తీశాయి? సుందర్, లీలాలు చెప్పిన ఆబద్దాలు ఏంటి? ఇతర మతస్థులతో స్నేహం అంటేనే మండిపడే సుందర్, లీలాల కుటుంబ సభ్యులు వీరికి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అంటే సుందరానికీ’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.‘అంటే సుందరానికీ’ కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..అయితే పాత కథకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి, కాస్త కామెడీగా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. పద్దతులు ఆచారాల ముసుగులో లోపలి మనిషిని చంపుకోవద్దు. మతం కంటే మానవత్వం గొప్పదనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ ఓ అందమైన లవ్‌స్టోరీని చూపించాలనుకున్నాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు. ఎలాంటి అశ్లీలతకు తావివ్వకుండా..కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించినా.. కథనం మాత్రం సాదాసీదాగా సాగుతుంది. ఫస్టాప్‌లో బ్రాహ్మణ కుర్రాడు సుందర్ బాల్యంలో వచ్చే ఒకటి రెండు సన్నివేశాలు తప్పా మిగతావేవి అంతగా ఫన్ని క్రియేట్ చేయలేదు. హీరోయిన్ని పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. దీనికి తోడు హీరో కంటే ముందే ఆమెకు మరో లవ్ స్టోరిని యాడ్ చేసి ఫస్టాఫ్ అంతా సాగదీశాడనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సుందర్, లీలా ఇద్దరు అమెరికాకు వెళ్లడం.. పెళ్లి కోసం అబద్దం చెప్పి ఇండియాకు రావడంతో అసలు స్టోరీ ముందుకు సాగుతుంది. వీరిద్దరు చెప్పిన అబద్దాలే నిజంగా జరగడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చిన కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్‌లో ‘ప్రెగ్నేన్సీ అనేది చాయిస్ మాత్రమే కానీ. ఆప్షన్ కాదు’ అని హీరో చెప్పే డైలాగ్ హృదయాలను హత్తుకుంటుంది. దాదాపు మూడు గంటల నిడివి ఉండడం సినిమాకు మైనస్. మొత్తంగా అబద్దాలతో కాసేపు నవ్వించి.. చివర్లో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్స్ నుంచి బయటకు పంపాడు దర్శకుడు. ఎవరెలా చేశారంటే.. యాక్షన్ అయినా.. కామెడీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు నాని. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా అంతే.. సుందర్ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. లీలా థామస్‌గా నజ్రియా ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమా అయినా.. చాలా బాగా నటించింది. పైగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సుందర్ తండ్రిగా నరేశ్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఇక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా, భర్త మాటకు ఎదురు చెప్పలేని భార్యగా రోహిణి తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ తల్లిగా నదియ, తండ్రిగా అలగం పెరుమాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎందుకు దాచిపెట్టిందో తెలియదు కానీ.. ఆమె పాత్ర మాత్రం అందరిని ఆకట్టుకుంది. సుందర్ సహోద్యోగి సౌమ్య పాత్రలో అనుపమ మెరిసింది. ఇక సుందర్ బాస్‌గా హర్షవర్ధన్ తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం కొత్తగా ఉంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది.ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అంటే.. సుందరానికీ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
‘అంటే..సుందరానికీ’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నాని మరోసారి కామెడీ చిత్రంతో వస్తుండటంతో ‘అంటే..సుందరానికీ’కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు(జూన్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional! The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect. Go for it 👍 Rating: 3.25/5 — Venky Reviews (@venkyreviews) June 9, 2022 ‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్ రెండూ వర్కౌట్ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్ కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్గా నటించారు. ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు 1st half just baundi.. 2nd half Chala baundi .. back to back good movies from Vivek athreya.. nani, nazriya, Vivek athreya, Harsha vardhan, naresh 👌👍 #AnteSundaraniki — Indebted to Petla🔔 (@JakDexxter) June 10, 2022 ఫస్టాఫ బాగుంది. సెకండాఫ్ చాలా బాగుంది. వివేక్ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్, నరేశ్‌ల యాక్టింగ్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Brilliant n flawless writing in second half esp climax…Sensibilities, emotions chala baga chupinchadu…First half too slow adhokkate complaint..Nani and Nazriya pair, acting, BGM is perfect #AnteSundaraniki — Pandagowwww (@ravi_437) June 10, 2022 సెకండాఫ్, క్లైమాక్స్ అదిరిపోయింది. కానీ ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంది.నాని, నజ్రియ జంట తెరపై బాగుంది. వివేక్ సాగర్ చక్కటి బీజీఎం అందించాడు అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. #AnteSundaraniki is nonstop nonsense, loud unfunny characters with literally no humor with very thin plot. After two great scripts Jersey, Shyam singha roy very bad selection of script by @NameisNani . — Sean (@SimiValleydude) June 10, 2022 #AnteSundaraniki good watch!! Very clean writing by vivek atreya and @NameisNani with unique timing nailed it. Go for it... 3.5/5 — Rahul Reddy (@Rahulreddy118) June 10, 2022 -
నాని నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే ఇష్టం: పవన్ కల్యాణ్
‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఒక కుటుంబానిది కాదు.. ఇది మనందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం.. అది సహజం. అంతేకానీ ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. అయినప్పటికీ సినిమా వేరు.. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది’’ అని హీరో పవన్ కల్యాణ్ అన్నారు. నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నాని విలక్షణమైన నటుడు.. తన నటనే కాదు.. వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం.. గౌరవం. తనకు మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను. భవిష్యత్‌లో నవీన్ యెర్నేని, రవిశంకర్గార్ల నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నేను హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లలో అందరి హీరోలను కలిశాను. కానీ పవన్ కల్యాణ్‌గారిని కలిసే సందర్భం రాలేదు. ఇప్పుడు కలిశాక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. ‘అంటే.. సుందరానికీ’ నాట్ ఎంటర్టైన్మెంట్.. ఇట్స్ ఎంజాయ్మెంట్’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ ప్రివ్యూ చూశా. ఫస్టాఫ్ చూసి ‘పర్లేదమ్మా.. బాగుంది’ అని వివేక్ ఆత్రేయకి చెప్పా. సెకండాఫ్ చూశాక నా అహం పోయింది.. మనస్ఫూర్తిగా ఆత్రేయని హత్తుకుని మంచి సినిమా తీశావని అభినందించాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నజ్రియాతో కలిసి నాని భార్య స్టెప్పులు.. వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ మూవీతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(జూన్ 10)న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. అందులో నాని,నజ్రియా స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. (చదవండి: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్) ఇదిలా ఉంటే.. ఈ పాటకు నజ్రియాతో కలిసి స్టెప్పులేసింది నాని భార్య అంజన. స్క్రీన్‌పై పాట ప్లే అవుతుంటే.. నజ్రీయా, అంజనా..తమకు నచ్చిన విధంగా స్టెప్పులేశారు. ఇక చివర్లో వీరితో నాని కూడా జత కట్టాడు. ఈ వీడియోని నజ్రీయా ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నాని, అంజనలతో కలిసి డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) -
మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Nazriya Nazim Says Ante Sundaraniki Story Is Unique: ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా. -
సూర్య చేసిన ఆ సినిమా.. నాకొస్తే బాగుండేదనిపించింది: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా హీరో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. వివేక్ ఆత్రేయతో మీ జర్నీ ఎలా ఉంది? కొత్త డైరెక్టర్లతో లేదా ఒకటి రెండు సినిమాలు తీసిన దర్శకులతో ఎందుకు సినిమాలు చేస్తావని అందరూ నన్ను అడుగుతుంటారు. ప్రజెంట్ లీడింగ్‌లో ఉన్న దర్శకుల కంటే.. ఫ్యూచర్లో లీడింగ్ డైరెక్టర్‌తో పని చేస్తే.. అప్పుడు మనం వాళ్ల జర్నీలో కూడా పాలు పంచుకోవచ్చు అనే చిన్న స్వార్థం నాకు ఉంటుంది. వివేక్‌తో మాట్లాడినా.. ఆయన సినిమాలు చూసినా... భవిష్యత్తులో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడనిపించింది. అందుకే ఆయనతో సినిమా కమిట్ అయ్యాను. కొత్త దర్శకులు చెప్పిన కథను తీస్తారో లేదో తెలియదు.. మీరు మాత్రం అలాంటి వాళ్లను ఎలా నమ్ముతారు? అది నమ్మకం అంతే. మొదట్లో చాలా మంది నన్ను నమ్మి సినిమాలు తీశారు. ఇప్పుడు నాకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్నా. అందుకే.. టాలెంట్ ఉన్నవాళ్లకి నేను అవకాశం ఇవ్వాలనుకుంటాను. అంటే..సుందరానికిలో కొత్తగా ఏం చూపిస్తున్నారు? నేను ఇంతకు ముందు తీసిన ఫన్ జానర్ సినిమాల్లో ఎలాంటి కామెడీ చేశానో.. దానికి చాలా భిన్నంగా ఇందులో చేస్తాను. డైలాగ్స్ కానీ, పాత్ర ప్రవర్తన కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. తెరపై కొత్త నానిని చూస్తారు. ఫస్ట్ టైం బ్రాహ్మణ కుర్రాడి పాత్రని చేశారు కదా? ఏమైనా హోం వర్క్ చేశారా? లేదు. మన సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు.. ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ చూపిస్తాం. వాళ్ల మాటలను కూడా ఢిపరెంట్‌గా చూపించి కామెడీ పండిస్తాం. కానీ ఇందులో ఎవరినైనా సరే కించపరిచి కామెడీ చేసిన సీన్స్ ఉండవు. వివేక్ ఆత్రేయ ఓ బ్రాహ్మణ కుర్రాడు. వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఎలా ఉంటారు, వాళ్ల ఆచారాలు ఏంటి? ఎలా ప్రవర్తిస్తారు ..ఇలాంటి విషయాలను చాలా చక్కగా చూపించాడు. ఇందులో మీరు అమాయకుడైన సుందరం పాత్రని పోషించారు. ఆ పాత్ర గురించి? ట్రైలర్ చూసి సుందరం చాలా ఇన్నోసెంట్, వాళ్ల నాన్న చేతిలో నలిగిపోతున్నాడు అనిపించొచ్చు కానీ.. వాడు చాలా వరస్ట్ ఫెల్లో(నవ్వుతూ..). వివేక్ కూడా నాకు కథ చెప్పినప్పుడు అదే చెప్పాడు. ‘వీడు వరస్ట్ ఫెలో సర్. కానీ ప్రతి ఫ్రేమ్‌లో వీడిని ప్రేమించాలి’ అని అన్నాడు. అలా చేయడం పెద్ద టాస్క్ మాకు. ఔట్పుట్ చాలా చక్కగా వచ్చింది. నరేశ్‌తో బాండింగ్? ఇంతకు ముందు నరేశ్‌తో నేను చేసిన ఏ సినిమాలు కూడా.. అంటే సుందరానికి.. దరిదాపుల్లో ఉండవు. మా ఇద్దరి కాంబినేషన్ ఈ చిత్రంలో వేరే లెవల్‌కు వెళ్లిపోతుంది. కులాంతర వివాహాలపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించారు? ఇందులో రెండు కొత్త విషయాలు ఉంటాయి. ఒకటి ట్రైలర్లో చెప్పేశాం. రెండోది థియేటర్స్‌లో చూడాల్సిందే. రియల్ లైఫ్‌లో కూడా మీది ప్రేమ వివాహం. ఈ సినిమాలో మీ రియల్ లైఫ్ సన్నివేశాలు ఉన్నాయా? నా పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని మా పెళ్లి చేశారు. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే.. అమ్మాయి వాళ్లదేమో సైంటిస్ట్ ఫ్యామిలీ.. నేనేమో సినిమాలు అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నా. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు నాకు ఇవ్వొచ్చా లేదా అని అమ్మాయి ఫ్యామిలీ టెన్షన్ పడింది. నన్ను కలిశాక ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేశారు. ఈ చిత్రంలోకి నజ్రియా ఎలా వచ్చింది? నేను, వివేక్ అనుకొనే నజ్రియాను తీసుకొచ్చాం. ఈ కథలో హీరోహీరోయిన్ ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది. లీలా పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన ప్రతిసారి మేమిద్దరం.. నజ్రియాలాగే ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. నజ్రియాలాగా ఎందుకు ఆమెనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకొని కథ వినిపించాం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తేనే ఒప్పుకోని నజ్రియా.. ఈ కథ విన్నవెంటనే ఎగిరి గంతేసి.. చేసేద్దాం అని చెప్పారు. కథను బాగా నమ్మితే తప్ప నజ్రియా ఒప్పుకోదు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల టైంలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని మాట్లాడారు. ఇప్పుడేమో ఫిల్మ్ మేకర్సే టికెట్ల రేట్లను తగ్గిస్తున్నారు. అంటే సుందరానికి ఎలా ఉండబోతుంది? సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు చూశాను. అసలు నేను ఏ సందర్భంలో రేట్ల గురించి మాట్లాడాను? టికెట్ల రేట్లు రూ.30, రూ.40 ఉన్నప్పుడు నేను అలా అన్నాను. కనీసం రూ.100, రూ.120 లేకుంటే ఎలా అని అడిగాను. ఇప్పుడు రూ. 500 అయితే.. చూశావా మీ కోసం 500 పెంచాలా? అంటున్నారు. ఎవరు పెంచమన్నారు? ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలకు పెంచితే తప్పులేదు కానీ.. అన్ని సినిమాలకు అదే స్థాయిలో పెంచితే అది చాలా పెద్ద తప్పు. కనీస ధరలు ఉంటే చాలు. టీజర్లో మీ లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? ఆ నవలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. పంచె కట్టే సమయంలోనే బారిష్టర్ పార్వతీశం గుర్తొస్తుంది. అప్పుడే ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ‘శ్యామ్ సింగరాయ్’ది సీరియస్ సబ్జెక్..ఇది కామెడీ జానర్. మీకు కొంచె రిలీఫ్ అనిపించిందా? సబ్జెక్ట్ సీరియస్ అయినా.. కామెడీ అయినా షూటింగ్లో పడే కష్టాలు పడాల్సిందే. సీన్ బాగా రావాలనే తపన, ఒత్తిడి ఎప్పటికీ ఉంటుంది. అయితే సీరియస్ చిత్రాల్లో ఫైటింగ్‌లు, ఎగరడాలు, దూకడాలు ఉంటాయి. కామెడీ మూవీస్‌లో అలాంటివి ఉండవు అంతే. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. మరోపక్క బాలీవుడ్ స్ట్రగుల్ అవుతుంది. ఈ ఫేజ్‌ని ఎలా చూస్తారు? ఇది సినిమాకే గోల్డెన్ ఫేజ్. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు.. ఇండియా వైజ్‌గా సినిమాకు ఇది మంచి ఫేజ్. వంశీ పైడిపల్లి, విజయ్ మూవీలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తునాయి? రోజుకో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మహేశ్‌తో మూవీ, ప్రశాంత్ నీల్‌తో పాన్ ఇండియా చిత్రం అంటూ.. రూమర్స్ వస్తున్నాయి. రేపు నేను నిజంగానే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అది కూడా పుకారే అనుకుంటారేమో(నవ్వుతూ..) మైత్రీ మూవీస్ మేకర్స్ గురించి? టాలీవుడ్లో లీడింగ్ ప్రొడెక్షన్ హౌస్‌గా మైత్రీ మూవీ మేకర్స్ మారింది. గొప్ప గొప్ప నిర్మాతలు ఉన్నారు కానీ.. వీళ్లంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసేవాళ్లు లేరు. గ్యాంగ్ లీడర్‌తో వీళ్లతో సినిమా చేసే అవకాశం కలిసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. దసరా సినిమా ఎంత వరకు వచ్చింది? 25 శాతం షూటింగ్ పూర్తయింది. ఇది కామెడీ మూవీ.ఇందులో మతాలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేసినప్పుడు కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది కదా? అస్సలు లేదు. రియల్ లైఫ్‌లో లేనివి చూపిస్తే.. కాంట్రవర్సీ అవుతుంది. కానీ రియల్ లైఫ్‌లో మన ఫ్యామిలీలాగే ఉన్నది ఉన్నట్లుగా,.. వాళ్లలోని మంచితనాన్ని బయటకు చూపిస్తే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? సెలబ్రేట్ చేసుకుంటారే తప్ప.. ఎక్కడా హర్ట్ కారు. వివేక్ సాగర్ సంగీతం గురించి? వివేక్ సాగర్ కథకు ఒక ఆయుధంలాంటి వాడు. ఆయన పాటలు విన్నవెంటనే.. సంగీత్ ఫంక్షన్లో పెట్టి డ్యాన్స్ వేయాలనిపించవు. కానీ కథను ఎంత ఇంపాక్ట్పుల్గా చెప్పాలో..అంత చూపిస్తాడు. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా అతియోశక్తిగా అనిపిస్తుంది. సినిమా విడుదల తర్వాత మాట్లాడుతాను. పాన్ ఇండియా సినిమాలు పెరుగుతున్నాయి. మీరు కూడా అలాంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా? నా ఉద్దేశంలో పాన్ ఇండియా సినిమా అంటే.. మనం చెప్పుకోవడం కాదు..ప్రేక్షకులు చెబితేనే అది పాన్ ఇండియా చిత్రం. మంచి కథ తీస్తే చాలు.. అది పాన్ ఇండియా చిత్రమే. అందుకు పుష్ప చిత్రమే నిదర్శనం. ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తే అది పాన్ ఇండియా చిత్రం. అంతేకాని మనం పోస్టర్ మీద వేసుకున్నంత మాత్రాన అది పాన్ ఇండియా చిత్రం కాదు. ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో.. అది నేను చేస్తే బాగుండు అని అనిపించిన చిత్రం ఏదైనా ఉందా? జై భీమ్ సినిమా చూసినప్పుడు.. ఇలాంటి కథ తెలుగులో వస్తే బాగుంటుంది అనిపించింది. అలాంటి కథ ఏ హీరోకి వచ్చినా ఓకే.. నాకు వస్తే ఇంకా హ్యాపీ మీ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలు? మీట్ క్యూట్, హిట్ 2 చిత్రాలు రాబోతున్నాయి. -
రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది: హీరోయిన్
Nani Adade Sundara Movie Trailer Launch In Chennai: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన తెలుగుతో పాటు తమిళం, మళయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నటి నజ్రియా నజీమ్ నాయికిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ తమిళంలో ‘అడడే సుందరా’ (Adade Sundara Movie) పేరుతో విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ ఈ చిత్రం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ సింగరాయ్ వంటి యాక్షన్ కథా చిత్రం తరువాత వినోదంతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడం సముచితంగా అనిపించిందని తెలిపారు. ఈ మూవీ చాలా సంతృప్తికరంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని నటి నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. చదవండి: అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్.. -
అంటే.. ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిగా గ్లింప్స్
Ante Sundaraniki Movie Release Date: నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ..'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చింది. ఓ వీడియోను షేర్ చేస్తూ మూవీ ట్రైలర్‌ను జూన్ 2న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'సరదా వ్యక్తులైన సుందర్, లీల కలిసినప్పుడు వినోదం కచ్చితంగా ఉంటుంది' అంటూ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వీటితోపాటు నాని, నజ్రీయాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోలో 'చూసింది చాలు అవతల నాకు చాలా పని ఉంది త్వరగా చెప్పు' అని హర్ష వర్ధన్ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది. ఈ గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకునేలా ఉంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, మూవీ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ Entertainment guaranteed when the happening and fun worlds of Sundar and Leela meet 😀❤️#AnteSundaraniki #AdadeSundara #AhaSundara Trailer on JUNE 2nd 💥 ▶️ https://t.co/o19uGSw2Ou Natural Star @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/vv2cMkLMXc — Mythri Movie Makers (@MythriOfficial) May 30, 2022 -
అంటే సుందరానికి నుంచి మరోసాంగ్, ‘అయోమయంలో నాని’
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు థర్డ్ సింగిల్ పేరుతో రిలీజ్ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాతో పాటు 'దసరా' మూవీ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. -
'అంటే సుందరానికి' నుంచి అప్డేట్ షేర్ చేసిన నాని
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. ఈ సినిమా నుంచి 'రంగో రంగా'.. అనే లిరికల్ సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో నాని లుక్ తలకు గాయంలో చేత్తో సైకిల్‌ను పట్టుకొని భయంతో చూస్తున్నట్లు ఉంది. కాగా ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. Kickstarting with a quirk ;)#AnteSundaraniki #RangoRanga pic.twitter.com/bgYY7xq3h7 — Nani (@NameisNani) May 21, 2022 -
సెకండ్ సింగిల్: మే 9న ‘అంటే సుందరానికి’ నుంచి లవ్‌ట్రాక్
Nani Ante Sundaraniki Movie Latest Update: నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఫస్ట్‌సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించి అప్డే ఇచ్చింది చిత్రం బృందం. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! ఈ సందర్భంగా అంటే సుందరానికి సెకండ్ సింగిల్ ఎంత చిత్రం’ లవ్ ట్రాక్‌ను మే 9న విడదుల కానుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు బస్సులో కుర్చుని ఉండగా.. నాని, నజ్రియా భుజంపై తలవాల్చి కనిపించాడు. తన చేతితో నాని తలను అడ్డు పెట్టిన నజ్రియా చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అసలు వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది. Our next single #EnthaChithram from #AnteSundaraniki will dazzle your ears and leave you “in love”… Releasing on May 9th 🎧❤️#AnteSundaranikiOnJune10th Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/MWoTGe0uvp — Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2022 -
'అంటే సుందరానికీ' టీజర్ విడుదల (ఫోటోలు)
-
నజ్రియా కోసం చాలా మంది ట్రై చేశారు.. ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయలేదు: నాని
‘నజ్రియా నజీమ్‌ని తెలుగులోకి తీసుకురావడానికి ఎంతో మంది ప్రయత్నించారు. ఎవరు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. కానీ మా మూవీలో నటించడానికి అంగీకారం తెలిపింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు’అన్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఏఎంజీలో జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో నాని, నజ్రీయాతో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. వివేక్ ఆత్రేయ ఏ సినిమా చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అంత బాగా చెప్పలేరు. టీజర్లో చూపించిన దానికంటే రెండు రెట్లు ట్రైలర్, పది రెట్లు సినిమా ఉంటుంది’అన్నారు. నజ్రియా మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు సినిమా. టాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన కథ అనిపించింది. ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. వీళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్న. ఈ మూవీ కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. నేనే డబ్బింగ్ కూడా చెప్పుకున్నాను’అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంటే సుందరానికీ.. నాని నాలుక మీద వాత పెట్టారు!
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి బుధవారం టీజర్ రిలీజైంది. సుందర్ ప్రసాద్ మీ అబ్బాయే కదండీ అన్న డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. గండాలు ఉన్నాయంటూ హీరోతో పూజల మీద పూజలు చేయించడమే కాక ఏకంగా నాలుకకు వాత పెట్టే సన్నివేశాలు బాగున్నాయి. పక్కా ఆచారి అయిన హీరో సుందర్.. క్రైస్తవ అమ్మాయి లీలాను ప్రేమించడంతో అసలు కథ మొదలైనట్లు తెలుస్తోంది. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అసలు వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో! 'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే? -
తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్, ‘శాకుంతలం’కు 3 నెలలు శిక్షణ
మలయాళం మనసిలాయో అంటే... ‘మలయాళం అర్థమవుతుందా’ అని అర్థం. భాష కాని భాష ఎలా అర్థమవుతుంది? నేర్చుకుంటే అర్థమవుతుంది. మలయాళ తారలు నదియా, నజ్రియా తమ భాష కాని భాష తెలుగు నేర్చుకున్నారు. ఎంచక్కా డబ్బింగ్ చెప్పేశారు. ఫారిన్ బ్యూటీ షిర్లియా కూడా తెలుగు నేర్చుకుని, తెలుగు పలుకులు పలికారు. తియ్యగా తియ్యగా ఈ తారలు తెలుగు మాట్లాడితే, ‘పలుకే తెలుగాయె’ అనకుండా ఉండగలమా! ఇక... ఎవరెవరు ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారో తెలుసుకుందాం. మలయాళం, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నదియా ఇటీవల తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రీసెంట్గా ‘గని’ వంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు తెలుగు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. నదియా నటించిన తాజా చిత్రం ‘అంటే... సుందరానికీ’!. నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాలో నదియా కీలక పాత్ర చేశారు. అయితే ఇప్పటివరకూ తెలుగులో తన పాత్రలకు డబ్బింగ్ చెప్పని నదియా ‘అంటే...సుందరానికీ..!’లో సొంత గొంతు వినిపిస్తారు. ఈ సినిమాలో తన పాత్రకు ఆమె ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఇక సుందరం ప్రియురాలు లీలా థామస్ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంతకీ లీలా థామస్ అంటే తెలుసుగా..! అదేనండీ.. మలయాళ బ్యూటీ నజ్రియాయే. ‘అంటే.. సుందరానికీ..!’ సినిమాతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారామె. అయితే తెలుగులో నటిస్తున్న తొలి సినిమాకే నజ్రియా డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ పూర్తి చేశాను. చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు, నా స్నేహితుడు వివేక్ ఆత్రేయ గైడెన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాను’’ అన్నారు నజ్రియా. ఇక నదియా, నజ్రియా పలికిన తెలుగు పలుకులను జూన్ 10న థియేటర్స్‌లో వినవచ్చు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆ రోజే. ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఫారిన్ అమ్మాయిల జాబితాలో షిర్లే సేతియా ఒకరు. ఈ న్యూజిల్యాండ్ బ్యూటీ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్గా నటించారు. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేశారు షిర్లే. ‘‘హీరోయిన్గా పరిచయం అవుతున్న నా తొలి తెలుగు సినిమాకే డబ్బింగ్ చెప్పడం చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ చిత్రయూనిట్ సహకారంతో పూర్తి చేయగలిగాను. తెలుగు డబ్బింగ్ కోసం ప్రిపేర్ కావడం, ఆ తర్వాత చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు షిర్లే. అలాగే హిందీ అమ్మాయిలు అనన్యా పాండే (‘లైగర్’), మృణాళినీ ఠాకూర్ (‘సీతారామం’) తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. మరి.. వీరు కూడా డబ్బింగ్ చెబుతారా? చూడాలి. ఈసారి సవాల్ దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత కానీ సమంత తెలుగులో డబ్బింగ్ చెప్పలేదు. సమంతకు చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. తొలిసారిగా ‘మహానటి’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు సమంత. తాజాగా ‘శాకుంతలం’కి చెప్పారు. అయితే ఈసారి చెప్పిన డబ్బింగ్ సమంతకు సవాల్ అనాలి. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’కు గుణశేఖర్ దర్శకుడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు సమంత దాదాపు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారట. ‘‘ఇది మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాలో సమంత చేసిన శకుంతల పాత్ర డైలాగ్స్ గ్రాంథికంలో ఉంటాయి. దీంతో ఉచ్ఛరణపై శ్రద్ధ పెట్టాం. అందుకే కొంత ట్రైనింగ్ తర్వాత సమంత డబ్బింగ్ చెప్పారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
'అంటే సుందరానికి' టీజర్ వచ్చేస్తోంది,రిలీజ్ ఎప్పుడంటే..
నాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. జూన్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దమైంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంటే సుందరానికి టీజర్‌ను ఈనెల 20న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒక పోస్టర్లో సుందర్, లీలా హిందూ సంప్రదాయ పద్ధతిలో, మరో పోస్టర్లో వెస్ట్రన్ పెళ్లి దుస్తుల్లో కన్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Meet our Naughty Sundar & Mighty Leela! Witness their celebration of Love & Laughter 😀#AnteSundaranikiTeaser on 20th April at 11:07 AM 🥳❤️ అందాక, Stay Tuned!#AnteSundaraniki @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/7SddIAswNr — Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2022 -
ఫహద్ ఫాజిల్, నజ్రియాల ట్రాన్స్ తమిళ్ ట్రైలర్ రిలీజ్
సబ్బుల యాడ్ తరహాలో కొందరు మతాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత హెచ్.రాజా అన్నారు. ఫహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా జంటగా నటించిన మళయాళ చిత్రం ట్రాన్స్. దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ తెరకెక్కించారు. అక్కడ మంచి విజయాన్ని సాధించిన దీన్ని ధర్మ విజువల్ క్రియేషన్స్ సంస్థ అధినేత తమిళంలో నిలై మరందవన్ అనే పేరుతో అనువదిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఇందులో బీజేపీ నాయకుడు హెచ్.రాజా, కల్యాణరామన్, అశ్వథ్థామన్, హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ తదితరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్.రాజా మాట్లాడుతూ తమిళ ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడానికే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు భావించవచ్చునన్నారు. వివేకానంద చెప్పినట్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
ఫొటోగ్రాఫర్‌గా మారిన హీరోయిన్!
Ante Sundaraniki Movie Nazriya Look: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'. దర్శకుడు వివేక్ ఆత్రేయ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. నజ్రియాకు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. తాజాగా అంటే సుందరానికి సినిమా నుంచి నజ్రియా లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మిస్ లీలా థామస్‌ను పరిచయం చేస్తున్నాంటూ హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్ వదిలారు. ఇందులో నజ్రియా ఒక చేతికి వాచ్ పెట్టుకుని మరో చేతిలో కెమెరా పట్టుకుని ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. పోస్టర్ చూస్తుంటే ఆమె ఫొటోగ్రాఫర్‌గా కనిపించనుందని ఇట్టే తెలిసిపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది. A photographer sailing in her ocean of Dreams 📸🌊 Introducing our Electric Charm⚡#NazriyaFahadh as Ms.Leela Thomas ❤️😍 ▶️ https://t.co/OrQfjjazi1 Alage, Happy Holi! Amen.#AnteSundaraniki#ZerothLookOfLeela@NameisNani #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/wwqZk1ZK6O — Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2022 చదవండి: బాక్సాఫీస్ వద్ద 'ది కశ్మీర్ ఫైల్స్' సునామీ, ఇప్పటిదాకా ఎంత వచ్చాయంటే? -
'అంటే సుందరానికి'... నజ్రియా లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
నాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. తాజగా ఈమె లుక్‌ను రివీల్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మార్చి 17న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి నజ్రియా లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరి నాని, నజ్రియా కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. Aeeelllo! Ladies and gentlemen, obliging to your repeated requests of love, we will introduce our electric Charm⚡ #NazriyaFahadh as LEELA THOMAS on 17th March at 4:05 PM ❤️#AnteSundaraniki#ZerothLookOfLeela@NameisNani #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/HZcORNKg9g — Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2022 -
నానికి గండం.. 108 రోజుల వరకు బయటకు రాకూడదట!
‘పుట్టిన రోజున ఏంటే ఇది. ఇంకెన్ని హోమాలు చేయాలి? మీ చాదస్తం తగలెయ్యా. ఇంకో రెడు హోమాలు చేశానంటే.. అన్ని హోమాలు చేసినట్లు గిన్నీస్ బుక్‌లోకి ఎక్కొచ్చు’అంటూ కుటుంబ సభ్యులపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని.ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. నాని బర్త్‌డే(ఫిబ్రవరి 24) పురస్కరించుకొని ఆయనకు మందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘అంటే సుందరానికి..’నుంచి చిన్న గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో నాని అమాయకపు బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. అతని జీవితంలో గండాలు ఉన్నందున కుటుంబ సభ్యులు అతనితో తరచుగా హోమాలు చేయిస్తున్నారు. వరుస హోమాలతో విసిగెత్తిపోయిన నాని.. ‘బటకు వెళ్తే దినచక్ర వాహన గండం, నీళ్లల్లోకి వెళ్తే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చి గండం..దీనమ్మ గండం’అంటూ ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నాడు. ‘అంటే మావాడి జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల వరకు బయటకు రాకూడదన్నారు. అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్స్ వస్తున్నాం’అంటూ చిత్రం ఈ గ్లింప్స్‌ని విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
‘అంటే సుందరానికీ..’అప్డేట్.. ఫన్నీగా పోస్టర్
Ante Sundaraniki Makers Treats Fans On Nani Birthday: 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్టు కొట్టిన నాని అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ..’రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. పుట్టినరోజుకి ఒకరోజు ముందుగా యువ సుందరుడి బర్త్ డే హోమం.. అందరూ ఆహ్వానితులే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలారు. దీన్ని రీట్వీట్ చేసిన నాని ఏంటో.. అంటూ సిగ్గుపడుతున్న ఎమోజీని షేర్ చేశారు. మరి నాని బర్త్‌డే ట్రీట్ ఏ విధంగా ఉంటుదన్నది చూడాల్సి ఉంది. Yentoo 🙈#AnteSundaraniki https://t.co/oZ3znSMOc3 — Nani (@NameisNani) February 22, 2022 -
నాని సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు... వీడియో షేర్ చేసిన హీరో
Ante Sundaraniki starring Nani and Nazriya wraps up shoot: నాని తాజా చిత్రం ‘అంటే సుందరానికీ..’కి గుమ్మడికాయ కొట్టేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ ఫాహద్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మాతలు. ‘‘ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం (అంటే సుందరానికీ) షూటింగ్ పూర్తయింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్’ అనేది నాని పాత్ర పేరు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్. It’s a wrap for the roller coaster movie of the year ♥️#AnteSundaraniki pic.twitter.com/1Kq27vtPF9 — Nani (@NameisNani) January 23, 2022 -
తెలుగు తెరపై మలయాళ కుట్టీల హవా.. పవన్, మహేశ్ సినిమాల్లో చాన్స్!
కొత్త సినిమా చర్చ జరుగుతోంది... చర్చ హీరోయిన్ దగ్గర ఆగింది... కొత్త హీరోయిన్ కావాలి... ‘హల్లో మల్లు’ అంటూ టాలీవుడ్ నుంచి మల్లూవుడ్కి ఫోన్ వెళ్లింది.. అలా ఈ ఏడాది అరడజనకు పైగా కేరళ కుట్టిలకు ఫోన్ వెళ్లింది.. తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ మలయాళ కుట్టీల గురించి తెలుసుకుందాం. బాలనటి నుంచి హీరోయిన్గా మారి మలయాళం, తమిళ ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు నజ్రియా నజీమ్. ‘నిరమ్’, ‘రాజారాణి’, ‘బెంగళూరు డేస్’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాల్లోని నటన నజ్రియాను స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ నాని తాజా సినిమా ‘అంటే.. సుందరానికీ’తో తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు.. నజ్రియా భర్త, ప్రముఖ మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక బుల్లితెరపై సూపర్ హిట్ అయి, ఇప్పుడిప్పుడే వెండితెరపై ఫేమస్ అవుతున్న రజీషా విజయన్ ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగులో తొలి అడుగు వేశారు. రవితేజ హీరోగా శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్ అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’, ‘విశ్వాసం’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొంది, ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. మలయాళ హిట్ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా నటిస్తున్నారు అనిఖా. ఇందులో విశ్వస్ సేన్ హీరో. మరోవైపు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే దాదాపు పదిహేను సినిమాలను ఖాతాలో వేసుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పీరియాడికల్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఓ కీ రోల్ చేసే చాన్స్ దక్కించుకున్నారు ఐశ్వర్యా లక్ష్మీ. ‘గాడ్సే’ ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం కానున్నారామె. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకుడు. ఇంకోవైపు మ్యూజిక్ వీడియోస్‌తో ఫేమస్ అయి, హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్నారు సౌమ్యా మీనన్. ఈ బ్యూటీ మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఇక పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు సంయుక్తా మీనన్. ఇందులో రానాకు జోడీగా నటిస్తున్నారు సంయుక్తా. అలాగే కల్యాణ్ రామ్ ‘బింబిసారా’లో కూడా ఓ హీరోయిన్గా నటిస్తున్నారు సంయుక్తా మీనన్. మరి.. ఈ మల్లూవుడ్ కుట్టీలు తెలుగు తెరను ఏ రేంజ్లో రూల్ చేస్తారో చూడాలి. -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..అదే సాంప్రదాయం అంటున్న పూనమ్
♦ భర్తకు బర్త్‌డే విషెస్ తెలిపిన హీరోయిన్ నాజ్రియా ♦ పట్టు పరికిణిలో యాంకర్ శ్రీముఖి ♦ నీ గురించే ఆలోచిస్తున్నా అంటున్న ఈషా రెబ్బా ♦ చేనేతపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచిన కీర్తి సురేష్ ♦ పైపైకి ఎగరాలంటున్న బిగ్‌బాస్ ఫేం వితికా షెరు ♦ అన్నయ్యతో ఫోటోషూట్ చేసిన జాన్వీకపూర్ ♦ మన చేనేత-మన సాంప్రదాయం అంటున్న పూనమ్ కౌర్ View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) -
కంటిచూపుతోనే నటించడం ఈయన స్పెషాలిటీ
Fahadh Faasil Birthday Special: నటన కొందరి రక్తంలో ఉంటుంది. మరికొందరికి అలవాటు చేసుకుంటే అబ్బుతుంది. ఇంకొందరికి శిక్షణ తప్పనిసరి. కానీ, ఈయనకి మాత్రం కంటిచూపులోనే ఉంటుందట. ఈ మాట అంది ఎవరో కాదు.. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్. విక్రమ్‌లో తనతో పాటు నటిస్తున్న ఫహద్ ఫాజిల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు కమల్. ఆ మాటకొస్తే.. ఫహద్‌పై చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. బట్టతల, ఐదున్నర అడుగులు, గడ్డం, బక్కపల్చని రూపం, పొడి పొడిగా మాట్లాడే ఫహద్.. నటనకొచ్చేసరికి విశ్వరూపం చూపిస్తుంటాడు. అందుకేనేమో సౌత్ నార్త్ ఆడియొన్స్ మొత్తం అతన్ని ఇష్టపడుతుంటే.. ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని భాషలూ అతన్ని అక్కున చేర్చుకుంటున్నాయి. నటుడు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు ప్రత్యేకం.. ఇవాళ ఫహద్ 39 పుట్టినరోజు.. 1982 ఆగష్టు 8న అలపుజ్జాలో జన్మించాడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్. పెద్ద దిక్కులేని కుటుంబానికి షమ్మీనే దిక్కు. బావ మంచోడని అనుకుని తన ప్రేమ విషయం చెప్తే.. ఆ ‘చెత్త’ కుటుంబంలోకి మరదల్ని పంపడం ఇష్టంలేని షమ్మీ తన సైకోయిజం చూపించి అందరినీ హడలకొట్టిస్తాడు. ఈ ఒక్క ‘కుంబళంగి నైట్స్’లోనే కాదు.. చాలా సినిమాల్లో ఫహద్ సైకిక్ క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కూడా. కేవలం కళ్లతోనే అతను పలికే హవభావాలు కట్టిపడేస్తుంటాయి. ప్రేయసిని నమ్మించి మోసం చేసే పాత్ర అయితేనేం, తన్నులు తిన్న ప్రతీకారంతో.. తిరిగి తంతేగానీ చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ చేసే అమాయకుడైతేనేం, ప్రేమభగ్నమైన తర్వాత భర్త, దొంగ, సైకో, మానసిక రోగి, గ్యాంగ్‌స్టర్.. ఇలా పాత్రకు తగ వేరియేషన్స్‌ను అలవోకగా ప్రదర్శించడం ఫహద్‌కు నటనతో పెట్టిన విద్య. ‘టేకాఫ్’, ఎన్జన్ ప్రకాశన్, వారాతన్ లాంటి కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు.. ఈమధ్యకాలంలో ‘ట్రాన్స్’, ‘సీయూసూన్’, ‘జోజి’ ‘మాలిక్’.. ఇలా వరుస ప్రయోగాత్మక సినిమాలతో ఇండియన్ వ్యూయర్స్‌కు దగ్గరైన ఫహద్ ఫాజిల్‌ను.. విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్. కుంబళంగి నైట్స్‌లో షమ్మీగా పనికిరాడన్నారు! అవమానంతో.. ఫహద్ది స్టార్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. తండ్రి ఫాజిల్ పెద్ద డైరెక్టర్ కావడంతో హీరో అయ్యేందుకు ఉవ్విళ్లూరాడు. డిగ్రీ చదివే టైంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకున్నాడు ఫహద్. 2002లో తొలి చిత్రం ‘కైయేథుమ్ దురత్’ రిలీజ్ అయ్యింది. తండ్రి డైరెక్షన్, లవ్ స్టోరీ, పైగా మమ్మూట్టి గెస్ట్ రోల్.. ఇంకేం సినిమా సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడగా.. ఫాజిల్ నటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని.. ఏ కోణంలోనూ అతను హీరోగా పనికి రాడంటూ క్రిటిక్స్ ఏకీపడేశారు. తొలి సినిమా పోస్టర్ ఆ సినిమా దర్శకుడు ఫాజిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇందులో తన తండ్రి అంచనాలు తప్పలేవని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహద్. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు. కమ్‌బ్యాక్.. ఘోరమైన అవమానం-విమర్శల తర్వాత యూఎస్ వెళ్లిపోయిన ఫహద్.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. తండ్రి ప్రొత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్ డైరెక్షన్లో ‘కేరళ కేఫ్’(2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చప్పా ఖురిష్(మలయాళం సినిమాల్లో సుదీర్ఘ కిస్ సీన్ ఉంది ఈ మూవీలోనే), డైమండ్ నెక్లెస్, 22 ఫిమేల్ కొట్టాయం, అన్నయుమ్ రసూలుమ్, బెంగళూరు డేస్, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహద్‌ను ఎస్టాబ్లిష్ చేశాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఫహద్ సినీ కెరీర్. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహద్. తొండిముథలం ద్రిక్సాక్షియుంలో సూరజ్ వెంజరమూడుతో ఫహద్.. గొలుసు మింగేసి ఆపై ఇక్కట్లు పడే దొంగగా ఫహద్ నటన బాగుంటుంది. ప్రత్యేకించి మలయాళ సినీ పరిశ్రమకు ప్రయోగాలకు, కొత్త జానర్లను, కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడిగా ఫహద్ పేరు ముద్రపడిపోయింది. ఇక తొండిముథలం ద్రిక్సాక్షియుం(2017) ఏకంగా నేషనల్ అవార్డును(బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్) తెచ్చిపెట్టగా.. స్టేట్, సౌత్ అవార్డులను సైతం అందుకున్నాడు. కరోనా తర్వాత వరుస ఓటీటీ రిలీజ్‌లతో సౌత్ ఆడియొన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఫహద్. నిర్మాతగానూ సూపర్ హిట్లు అందుకుంటున్నాడు ఫహద్. ఇక తమిళంలో శివకార్తీకేయన్ ‘వెళ్లైక్కారన్’తో డెబ్యూ ఇచ్చిన ఫహద్.. ఆపై సూపర్ డీలక్స్‌తో అలరించగా, కమల్ హాసన్ ‘విక్రమ్’తో మరోసారి సందడి చేయనున్నాడు. తెలుగుకొచ్చేసరికి అల్లుఅర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ ఆయన డెబ్యూ మూవీ కానుంది. జోజిలో ఫహద్ మహేషింటే ప్రతీకారం(దీని రీమేకే సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య) ఆండ్రియాతో ఎఫైర్.. నజ్రియాతో పెళ్లి వివాదాలకు దూరంగా ఉండే ఫహద్.. వ్యక్తిగత జీవితంతో మాత్రం ఓసారి వార్తల్లో నిలిచాడు. కోలీవుడ్ సింగర్ కమ్ నటి ఆండ్రియాతో ఎఫైర్ ఉందంటూ 2013లో ఓ మ్యాగజీన్ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నాడు ఫహద్. అయితే అలాంటిదేం లేదని, ఫహద్ పేరు కోసం అలాంటి ప్రకటన చేసి ఉంటాడని ఆండ్రియా ఖండించింది. కానీ, తమ మధ్య ప్రేమాయణం నడించిందని, బ్రేకప్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టొచ్చంటూ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫహద్. ఈ వివాదంలో ఆండ్రియా పరువు నష్టం దావాకు సిద్ధపడగా.. ఫహద్ క్షమాపణలు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి కూడా. ట్రాన్స్ మూవీలో భార్య నజ్రియాతో ఫహద్ ఇది జరిగిన మరుసటి ఏడాదే.. మాలీవుడ్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న నజ్రియా నజీమ్(26)ను వివాహం చేసుకున్నాడు ఫహద్. అయితే ఈ జంట మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉండడంతో అక్కడి మీడియాలోనూ ఇదో పెద్ద చర్చగా నడిచింది అప్పట్లో. -
భార్యలతో మాలీవుడ్ స్టార్ హీరోలు.. ఫోటో వైరల్
మలయాళ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు ఒకచోట చేరారు. గెట్ టు గెదర్ పార్టీలో భార్యలతో కలిసి దర్శనమిచ్చారు. ఈ ఫోటోలను హీరోయిన్ నజ్రియా నజిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మలయాళ స్టార్ హీరోలంతా ఒకచోట చేరడంతో ఈ ఫోటో ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ స్వీట్ మూమెంట్‌ని నజ్రియా మిర్రర్ సెల్ఫీలో బంధించారు. అయితే ఈ గెట్ టు గెదర్ లో అందరూ బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించారు. ఇక ‘ట్రాన్స్’లో చివరిసారిగా కనిపించిన నజ్రియా నాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక ‘కోల్డ్ కేస్’ విడుదల కోసం హీరో పృథ్వీరాజ్ సన్నద్ధమవుతుండగా, ‘కురూప్’, ‘సెల్యూట్’ చిత్రాల రిలీజ్ కోసం దుల్కర్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) చదవండి : కమెడియన్ అలీ సినిమాకు ప్రభాస్ ప్రమోషన్స్ ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందట! -
క్యాజువల్ లుక్‌లో కాజల్, సూపర్ క్యూట్‌గా అర్హ
♦ క్యాజువల్ లుక్‌లో కాజల్ అగర్వాల్ ♦ 21వ వడిలోకి అడుగుపెట్టిన షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ♦ ఇది ఏ పాటలోదో చెప్పుకోండంటోన్న అదా శర్మ ♦ స్వర్గం, నరకం రెండూ తానే అంటోన్న నందిత శ్వేత ♦ సోదరికి బర్త్‌డే విషెస్ తెలిపిన నజ్రియా ♦ కిచెన్‌లో చికెన్ వండిన అరియానా గ్లోరీ ♦ సింపులే కానీ అంత ఈజీ కాదంటోన్న ఆర్విక గుప్తా ♦ అర్హ క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు స్నేహారెడ్డి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aarvika Gupta (@aarvikagupta09) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ananya (@ananya_x.x) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
సోషల్ హల్చల్ : రష్మీ కొంటె చూపులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆర్జీవీ
కొన్ని విషయాలు ప్రయత్నించకుండా మీ హృదయాన్ని నింపుతాయంటూ ఒ అరుదైన వీడియోని అభిమానులతో పంచుకుంది యాంకర్ అనసూయ కొంటె చూపులతో చంపేస్తున్న యాంకర్ రష్మీ కలలు వాస్తవికత కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుందటూ పార్క్‌లో నిద్రిస్తున్న ఫోటోని షేర్ చేసింది బ్యూటీ రాశిఖన్నా పాపకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుతూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ నజ్రీయా నజీమ్ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 8 సింహాలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ జాతియ చానల్లో వచ్చిన వీడియోని షేర్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) ] View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) -
నాని మూవీకి హ్యాండ్ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్ వాయిదా!
నటి నజ్రీయా నజీమ్.. టాలీవుడ్లో ఒక్క సినిమా చేయనప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మళయాల భామ ‘రాజారాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తెలుగులో తొలిసారిగా ఆమె నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ఇందులో నజ్రీయా హీరో నానితో జతకట్టనుంది. ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగుతో పాటు ‘అంటే .. సుందరానికీ!’ సినిమా షూటింగులో కూడా పాల్గొంటు ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే నజ్రీయా భర్త ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ మూవీలో విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల షూటింగ్ నేపథ్యంలో ఈ జంట ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాలు షూటింగ్‌లు వాయిదా పడినప్పటికి, కొన్ని సినిమాలు మాత్రం అతి తక్కువ సిబ్బందితో షూటింగ్‌లను జరుపుకుంటున్నాయి. అయితే పుష్ప మూవీ కూడా వాయిదా పడటంతో నజ్రీయా భర్త ఫహద్ తిరిగి చెన్నై వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడట. ‘అంటే.. సుందరానికీ’ సినిమా షూటింగ్ కోసం భర్తతో హైదరాబాద్ వచ్చిన నజ్రీయా తిరిగి భర్తతో వెళ్లిపోవడానికి రేడి అయ్యిందట. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే సుందరానికీ మూవీ షూటింగ్ చేయాలని భావించారట మేకర్స్. అయితే హీరోయిన్ నజ్రియా మాత్రం ఈ పరిస్థితుల్లో తాను షూటింగ్లో పాల్గొన్నానని తెగేసి చెప్పిందట. దీంతో నాని సహా 'అంటే సుందరానికీ' టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. కాగా ఇందులో నటి నదియా కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే : హీరోయిన్ అంటే సుందరానికి... -
ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే : హీరోయిన్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్. రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే నాచ్యులర్ స్టార్ నానీ సరసన 'అంటే సుందరానికి...' అనే చిత్రంతో తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్ కోసం నజ్రియా తన భర్త ఫాహద్ ఫజిల్‌తో కలిసి హైదరాబాద్ వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'అందరికీ నమస్కారం. ఈరోజు నా ఫస్ట్ తెలుగు మూవీ షూటింగ్లో పాల్గొన్నాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే.'అంటే సుందరానికి'...నాకు ఎప్పటికీ ప్రత్యేకమే' అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నాజ్రియా..అంజలీ మీనన్’ కూడె’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నాజ్రియా భర్త ఫాహిద్ ఫాజిల్ సైతం తెలుగులో తొలిసారిగా పుష్ప సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) చదవండి : బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన స్టార్ హీరోయిన్ భర్త వర్మ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్ -
బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన స్టార్ హీరోయిన్ భర్త
ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాసిల్ షూటింగ్లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ అదుపుతప్పి నటుడు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం కాగా, కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఫాహద్ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఆయన 'సూపర్ డీలక్స్' సినిమాలో కనిపించారు. 2014లో ఫాహద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్’ కూడె’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని సరసన ‘అంటే సుందరానికీ!’ అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి : (నజ్రియా నజీమ్ ‘వాది’ కమింగ్!.. ఎందుకంటే..) (‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’) -
ఇంట గెలిచి.. రచ్చ గెలవడానికి వచ్చారు
తమిళ పొన్ను (అమ్మాయి), కేరళ కుట్టి (అమ్మాయి).. భాష ఏదైనా తెలుగమ్మాయిలా కనిపించడానికి రెడీ అయిపోతారు. తెలుగు అమ్మాయిలు అక్కడికి వెళుతున్నారు. అక్కడి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న పరభాషా నాయికల్లో కొందరు ఇంట గెలిచారు.. రచ్చ గెలవడానికి వచ్చారు. ఈ తారలపై స్పెషల్ స్టోరీ. ఎమోషనల్... కామెడీ... రొమాంటిక్.. లవ్... ఇలా సీన్ ఏదైనా అద్భుతంగా నటిస్తారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ‘నిరమ్’ (2013), ‘బెంగళూరు డేస్’ (2014) వంటి మలయాళ మూవీస్‌లోనే కాదు...‘రాజా రాణి’ (2013) వంటి తమిళ సినిమాలో కూడా నటించారు నజ్రియా. మాలీవుడ్‌లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్‌గా ఉన్న నజ్రియా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న ‘అంటే...సుందరానికీ!’ సినిమాలో ఈ మలయాళ సుందరి హీరోయిన్గా నటించనున్నారు. నజ్రియా చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. కేవలం నటిగానే కాదు... తన భర్త, హీరో ఫాహద్ ఫాజిల్‌తో కలిసి నిర్మాతగా కూడా మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు నజ్రియా. నజ్రియా నజీమ్ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి హీరోయిన్గా సక్సెస్ అయినవారిలో ప్రియాభవానీ శంకర్ ఒకరు. ప్రస్తుతం అరడజను తమిళ సినిమాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు ప్రియ. మంచు మనోజ్ హీరోగా నటించనున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కి సైన్ చేశారామె. ప్యాన్ ఇండియా స్థాయిలో శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్షన్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో పాటుగా తెలుగులో మరో కొత్త సినిమా చేయడానికి కూడా ప్రియ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రియా భవానీ శంకర్ మరో మలయాళ భామ ఐశ్వర్యా లక్ష్మీ మాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చిన ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో చాన్సులు క్యూ కడుతున్నాయి. బ్రదర్స్ డే, వరదన్ వంటి మలయాళ సినిమాలు చేసిన ఐశ్వర్య తమిళంలో విశాల్, తమన్నా నటించిన ‘యాక్షన్’ సినిమాలో కూడా ఐశ్వర్య ఓ కీ రోల్ చేశారు. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ కాంబినేషన్లో వస్తోన్న ‘గాడ్సే’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక మరో మలయాళీ భామ ఐశ్వర్యా మీనన్ తమిళంలో సిద్ధార్థ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాదలిల్ సొదప్పువదు ఎప్పడి’ (తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’గా విడుదలైంది) సినిమా ద్వారా నటిగా ప్రయాణం ప్రారంభించారు. తమిళంతో పాటు ఇప్పుడు కన్నడ సినిమాలూ చేస్తున్నారామె. ఐశ్వర్యా లక్ష్మి తాజాగా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్‌ను ఐశ్వర్యా మీనన్ దక్కించుకున్నారని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారు. ‘పెళ్లిసందడి’ సినిమా సీక్వెల్లో హీరోయిన్గా చేస్తున్నారు శ్రీలీల. తెలుగులో శ్రీలీలకు హీరోయిన్గా ఇది తొలి సినిమా. ఇక కన్నడలో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న నటి రచితా రామ్. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ వంటి శాండిల్‌వుడ్ టాప్ స్టార్స్ సరసన నటించారామె. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు డైరెక్షన్లో రూపొందుతోన్న ‘సూపర్ మచ్చీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు రచితా. వీరితో పాటు మరికొంతమంది తమిళ, మలయాళ, కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. -
నజ్రియా నజీమ్ ‘వాది’ కమింగ్!.. ఎందుకంటే..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్. రాజారాణి సినిమాలో నటనతో అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టారామె. మళయాల నటుడు ఫాహద్ ఫజిల్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్’ కూడె’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు వీడియోలు, ఫొటోలతో అభిమాలను పలకరిస్తూ ఉంటారు. తాజాగా తన స్నేహితురాలు, దర్శకుడు అల్ఫోన్స్ పుథిరన్ భార్య అలీమతో కలిసి ఓ వీడియోను చేశారామె. విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్ చిత్రంలోని ‘వాది కమింగ్!’ పాటకు ఇద్దరూ కాళ్లు కదిపారు. నజ్రియా ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఎందుకంటే.. వాది కమింగ్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి..’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి : ఇంటర్వెల్ లేని సినిమాలో కత్రినా కైఫ్ View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) -
ఆట త్వరలో ఆరంభం
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు ‘అంటే సుందరానికీ!’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కర్టెన్ రైజర్ వీడియో ద్వారా ప్రకటించారు. నవీన్ యర్నేని, రవిశంకర్ .వై నిర్మించనున్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి నజ్రియా ఫాహద్ తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నారు. సంగీత ప్రాధాన్యమున్న వినోదాత్మక చిత్రం ఇదని చిత్రబృందం తెలిపింది. ఈ టైటిల్ ప్రీలుక్ పోస్టర్లో పంచె కట్టుకుని ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు నాని. ‘‘మునుపు ఎన్నడూ లేనంతగా ప్రేమిస్తాం. అలానే నవ్విస్తాం. 2021ని గ్రాండ్‌గా ముగిద్దాం. ఆట త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని ఈ సినిమా గురించి అన్నారు నాని. అంటే.. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలవుతుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: నికేత్ బొమ్మి, ఎడిటర్: రవితేజ గిరిజాల, సీఈఓ: చెర్రీ. -
అంటే సుందరానికి...
‘బ్రోచేవారెవరురా’ అనే అచ్చ తెలుగు టైటిల్‌తో మంచి హిట్ సినిమా తీశారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇప్పుడు నానీతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది తనకి. ఈ సినిమాకి కూడా ఓ క్రేజీ టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్గా చేయబోతున్నారు. నజ్రియా చేయబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి...’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. టైటిల్ రోల్లో నాని కనిపిస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారట. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. -
‘ రాజా రాణి ’ మూవీ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఫోటోలు
-
నా వల్లే ఆమె పెళ్లి జరిగింది!
తమిళసినిమా: నా వల్లే ఆమె పెళ్లి జరిగింది అంటోంది నటి నిత్యామీనన్. సినీ పరిశ్రమలో పొగరుబోతుగా ముద్ర పడిన నటి నిత్యామీనన్. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సై అనే ఈ కేరళా కుట్టి నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రానైనా నిరాకరించేస్తుంది. అలా మాతృభాషలోనూ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లో టైటిల్ పాత్రను పోషిస్తున్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. నటి నజ్రియా గుర్తుండే ఉంటుంది. తిరుమణం ఎన్నుం నిక్కా, రాజారాణి వంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషలోనూ పలు చిత్రాలు చేసింది. కథానాయకిగా మంచి మార్కెట్ ఉండగానే నటుడు ఫాహత్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా సినిమాలకు రీఎంట్రీ అవుతోందనుకోండి. అది వేరే విషయం. ఈమె పెళ్లికి తానే కారణం అంటోంది నటి నిత్యామీనన్. దీని గురించి ఈమె తెలుపుతూ బెంగళూర్ డేస్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం తనకే వచ్చిందని చెప్పింది. అయితే తానప్పుడు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయానని చెప్పింది. తాను వదులుకున్న అవకాశం ఆ తరువాత నటి నజ్రియాను వరించిందని చెప్పింది. ఆ చిత్ర షూటింగ్‌లోనే ఫాహత్ ఫాజిల్‌కు, నటి నజ్రియా మధ్య పరిచయం ప్రేమగా మారిందని, ఆ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేలోపే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారన్న రహస్యాన్ని నిత్యామీనన్ బయట పెట్టింది. అంతే కాదు ఏ కార్యక్రమంలో కలిసినా నీ వల్లే మా పెళ్లి జరిగిందని నటి నజ్రియా, ఫాహత్ ఫాజిల్ గొప్పగా అంటుంటారని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడమ్మా అంటే మాత్రం దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అంటూ దాటేసే ధోర ణిలో మాట్లాడుతోంది. -
మలయాళంలో మళ్లీ
యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా శోభనను సిల్వర్ స్కీన్‌పై మిస్ అవుతున్నారు ఆమె అభిమానులు. 2005 నుంచి ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాల్లో కనిపించారు శోభన. 2013లో ‘తిర’ అనే మలయాళ చిత్రం, 2014లో ‘కొచ్చడయాన్’ అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఓ మలయాళ చిత్రంలో కనిపించడానికి శోభన అంగీకరించారు. నజ్రియా నజీమ్, శోభన కీలక పాత్రల్లో నూతన దర్శకుడు అనూప్ సత్యన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సురేశ్ గోపి కీలక పాత్రలో కనిపిస్తారు. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపి. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో కనిపించిందీ జోడీ. మరి తాజా చిత్రంలో జంటగా నటిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. జూన్‌లో ఈ సినిమా ఆరంభం కానుంది. -
న్యాయాన్ని గెలిపిస్తారు
ముగ్గురు ఆకతాయిల వల్ల లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిలు న్యాయం కోసం పోరాడతారు. వీరికి ఓ లాయర్ అండగా నిలబడతాడు. న్యాయం గెలిచేట్టుగా కలసి పోరాడతారు. ఈ కథాంశంతో బాలీవుడ్లో రూపొందిన చిత్రం ‘పింక్’. అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్ర పోషించారు. లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించారు. ‘పింక్’ చిత్రం సూపర్ హిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బోనీ కపూర్. అమితాబ్ పోషించిన పాత్రను అజిత్ చేయనున్నారు. ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో మలయాళ నటి నజ్రియా నజీమ్, ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. నటుడు ఫాహద్ ఫాజిల్‌తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు నజ్రియా. ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. అలాగే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి తెలియాలి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ‘ఖాకీ’ ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్టర్. మే 1 అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ
ఒక్కసారి సినీరంగంలోకి ఎంటర్ అయితే దాని నుంచి బయటకు వెళ్లడం కష్టం. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగినా, శాశ్వతంగా దూరం అవడమూ సాధ్యం కాదు. ఇలా చాలా మంది తారలు ఏదో కారణంగా మధ్యలో నటనకు దూరమైనా మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. నటి నజ్రియా కూడా ఇందుకు అతీతం కాదు. నేరం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ నజ్రియా. ఆ తరువాత రాజా రాణి, నైయాండి, తిరుమణం ఎనుమ్ నిక్కా చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన నజ్రియా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అంతే కాదు ఇక నటనకు టాటా అనేయడాన్ని కూడా ఎవరూ ఊహించలేదు. అలా ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరగా 2014లో తిరుమణం ఎనుమ్ నిక్కా చిత్రంలో నటించింది. అంటే దాదాపు ఐదేళ్లు అవుతోంది. అంతే గోడకు కొట్టిన బంతిలా ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యిపోతోంది. నజ్రియా ఇప్పటికే మలయాళంలో రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త నిర్మాతగా రూపొందుతున్న రెండు చిత్రాల్లో నటించేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశం వచ్చిందనేది తాజా సమాచారం. అయితే ఈ సారి ఏకంగా అల్టిమేట్ స్టార్ అజిత్‌తోనే నటించే అవకాశాన్ని కొట్టేసిందంటున్నారు. అజిత్ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో అజిత్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. హిందీలో సంచలన విజయన్ని సాధించిన పింక్ చిత్ర రీమేక్‌లో అమితాబ్‌బచ్చన్ పాత్రను పోషించనున్నారు. దీనికి చతురంగవేట్టై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ద్వారా నటి నజ్రియా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ భామ నటి తాప్సీ పాత్రను పోషించనుందా, వేరే పాత్రా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నజ్రియా రీఎంట్రీ మాత్రం పక్కా అని తెలిసింది. -
ప్రియా వర్రీయర్
ఒక్క కొంటె సైగతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు ప్రియా ప్రకాశ్ వారియర్. నార్త్ టు సౌత్ ‘వింక్ గర్ల్’గా ఫేమస్ అయిపోయారు. ఎంత పాపులారిటీ సంపాదించారో అంతే విరివిగా వివాదాల్లో కూడా వినిపిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు విపరీతంగా అప్సెట్ అవుతున్నారట ప్రియా వారియర్. ఇంతకుముందు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే ఇప్పుడు ఆన్లైన్లో విమర్శలు చేస్తుండటం వర్రీగా ఉందట. మలయాళంలో నజ్రియా నజీమ్ తన కంబ్యాక్ ఇచ్చారు. ఆ హీరోయిన్‌తో ప్రియా ప్రకాశ్‌ను పోల్చి విమర్శిస్తున్నారట. నిజానికి ‘ఒరు అడార్ లవ్’ ట్రైలర్ రిలీజ్ కాగానే ‘ఇంత అందమైన కళ్లను చూడలేదు’ అని ప్రియాని చాలామంది పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పుడేమో తన కళ్ల కంటే నజ్రియా కళ్లు ఇంకా బావుంటాయి అని కామెంట్ చేశారట సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు. ఇలా సినిమా రిలీజ్ కాకముందే తన మీద నెగటివిటీ, కామెంట్స్ చూడటం తన కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తోంది అని పేర్కొన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. సో.. ఇప్పుడు వారియర్ కాస్తా వర్రీయర్ అయ్యారన్నమాట. -
బెంగళూర్ టు ముంబై
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్. -
2018 చాలా స్పెషల్
పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ఆమెకు 2018 ఫుల్ స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ‘కూడే’ సినిమాతో సినిమాలు స్టార్ట్ చేశారు. అలాగే భర్త ఫాహద్ ఫాజల్ నటించనున్న ‘వరతాన్’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి అమల్ నీరద్ దర్శకుడు. నిర్మాతగా మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారట. శుషిన్ శ్యామ్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌ను నజ్రియా రీసెంట్గా పాడగా, రికార్డ్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్. 2014లో దుల్కర్ సల్మాన్‌తో యాక్ట్ చేసిన ‘సలాలా మొబైల్స్’ సినిమాలో ఫస్ట్ టైమ్ పాట పాడిన నజ్రియాకు ఇది సింగర్‌గా సెకండ్ సాంగ్. ‘వరతాన్’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
భర్త కోసం సింగర్‌గా మారిన హీరోయిన్!
అందమైన మోము, అమాయకపు నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మాలీవుడ్ బ్యూటీ నజ్రియా నజీమ్. నటుడు ఫాహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘బెంగళూర్ డేస్’ డైరెక్టర్ అంజలి మీనన్ డైరెక్షన్లో ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్గా కొనసాగుతూనే ప్రొడ్యూసర్ కొత్త అవతారమెత్తారు. తన భర్త ఫాహద్ హీరోగా నజ్రియా నజీమ్ బ్యానర్‌పై ‘వరదాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నజియా ఓ పాట కూడా పాడారట. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘వరదాన్’ సినిమా సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తమ అభిమాన హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, నిర్మాతగా, సింగర్‌గా తమను అలరించేందుకు సిద్ధమవుతున్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమల్ నీరద్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాహద్కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఇంతకుముందు ‘సాలా మొబైల్స్’ అనే మలయాళ చిత్రంలో కూడా నజియా ఓ పాటను ఆలపించారు. #studiosession #upcomingproject #songrecording #nazriyafahadh #vivekthomasproductions #varathan A post shared by Sushin Shyam (@sushintdt) on Jun 23, 2018 at 7:07am PDT -
నజ్రియా రిటర్న్స్
నయనతారకు సిస్టరా?.. నజ్రియా నజీమ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది ఇలానే అనుకున్నారు. ఎందుకంటే నయనతార పోలికలు కొంచెం నజ్రియాలో కనిపిస్తాయి. ఆ సంగతలా ఉంచితే నజ్రియా చాలా క్యూట్‌గా ఉంటారు. తన అమాయకపు నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారామె. నటుడు ఫాహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. నజ్రియా నటించిన లాస్ట్ మూవీ ‘బెంగళూర్ డేస్’. విశేషం ఏంటంటే ఆ సినిమాలో ఫాహద్ భార్యగానే నటించారామె. మళ్లీ మలయాళ స్క్రీన్‌పై కనిపించటానికి రెడీ అయ్యారు నజ్రియా. ‘బెంగళూర్ డేస్’ డైరెక్ట్ర్ అంజలి మీనన్ డైరెక్షన్లో ప్రస్తుతం ఓ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారామె. ఈ సినిమాలో పార్వతి, పృథ్వీరాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇది కాకుండా భర్త ఫాహద్తో ఓ సినిమాలో కనిపిస్తారట నజ్రియా. అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ట్రాన్స్’ సినిమాలో ఫాహద్కు జోడీగా నజ్రియాను సంప్రదించినట్టు మలయాళం మీడియా టాక్. దాదాపు నాలుగేళ్ల తర్వాత నజ్రియా స్క్రీన్‌పై కనిపించనుండటం ఆమె అభిమానులకు ఆనందం కలిగించే విషయం. -
పెళ్లితో చిన్న కామా... మళ్లీ ఇప్పుడు కంటిన్యూ!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది ఈతరం హీరోయిన్ల ఫిలాసఫీ! అందువల్లే, ప్రేక్షకుల్లో మంచి పేరున్నప్పుడు నాలుగు రాళ్లు వెనక వేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నజ్రియా నజీమ్ మాత్రం కొంచెం డిఫరెంట్! ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే... అన్నట్టు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ, ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తెలుగులోనూ మంచి హిటై్టన ‘రాజా రాణి’లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నటించిన హీరోయిన్. 2014 ఆగస్టులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చిన్న కామా (,) పెట్టారామె. ఇప్పుడు కామా తర్వాత కదలిక వచ్చింది. కొత్త సినిమాకు నజ్రియా నజీమ్ సంతకం చేశారు. అంటే... నటిగా మళ్లీ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారన్న మాట! మహిళా దర్శకురాలు అంజలీ మీనన్ తీయనున్న సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి నజ్రియా అంగీకరించారు. ఆమె కూడా ఈ వార్తను కన్ఫర్మ్ చేశారు. ‘‘మీ నెక్ట్స్ సిన్మా ఎప్పుడు? – ‘బెంగళూరు డేస్’ తర్వాత నన్నందరూ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. వాళ్లకు నా ఆన్సర్ ఇదే... బ్యాక్ ఇన్ యాక్షన్.. ఈ సినిమాలో పృథ్వీరాజ్, పార్వతి, నేనూ! లవ్’’ అని నజ్రియా నజీమ్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. -
నజ్రియా ఈజ్ బ్యాక్..!
తమిళసినిమా: హీరోయిన్ గా మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా వేగంగా ఎదిగిన నటి నజ్రియా. మాతృభాషలో పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో లక్షలాది మంది అభిమానుల మనసుల్ని దోచుకున్న ఈ కేరళాకుట్టి నేరం అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది.ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆ భామకు ఇక్కడ వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ధనుష్‌తో నయ్యాండి, దుల్కర్సల్మాన్ కు జంటగా వాయైయూడి పేసవుమ్, జై సరసన తిరుమణం ఎనుమ్ నిఖా, ఆర్యకు జంటగా రాజారాణి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇలా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలోనే నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ప్రేమ వివాహం చేసుకుని నటనకు దూరమైన నజ్రియా సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ కథానాయకిగా ఎంట్రీ అవుతోంది. ప్రముఖ మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ ప్రోద్బలంతో నజ్రియా మళ్లీ నటించడానికి రెడీ అయ్యినట్లు సమాచారం. అంజలిమీనన్ దర్శకత్వం వహిస్తున్న మలయాళ చిత్రంలో పృథ్వీరాజ్‌కు జంటగా నటిస్తున్న నజ్రియా తాజాగా తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న మరో చిత్రంలో దుల్కర్సల్మాన్ కు జంటగా నటించడానికి ఒప్పందం కుదుర్చుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి రీఎంట్రీలో నజ్రియా లక్కు ఎలా ఉంటుందో చూడాలి. -
నేడే నజ్రియా పెళ్లి
నటి నజ్రియా పెళ్లి గురువారం జరగనుంది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళ కుట్టి నజ్రియా నజీమ్. అనంతరం రాజారాణి, నయాండి, వాయైమూడి పేసవుం, తిరుమణం ఎనుం నిఖా తదితర చిత్రాల్లో నటించి అనతికలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మకు మలయాళ నటుడు భగత్ పాజిల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. ఇది ఇరు కుటుంబాలు నిశ్చయించిన పెళ్లి. భగత్ దర్శకుడు ఫాజిల్ కుమారుడు. మలయాళంలో కేరళా కబే, కాక్టెయిల్, రెడ్ వైన్ తదితర చిత్రాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. భగత్ పాజిల్, నజ్రియాల వివాహం గురువారం కేరళ లోని తిరువనంతపురంలో ముస్లింల వివాహ సంప్రదాయం ప్రకారం జరగనుంది. వీరి వివాహ రిసెప్షన్ 24వ తేదీన ఆలప్పుళాలో జరగనుంది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. నజ్రియా నిశ్చితార్థంతోనే నటనకు ఫుల్స్టాప్ పెట్టారు. తమిళంలో ఆమె నటించిన తిరుమణం ఎనుమ్ నిఖా చివరిగా విడుదలయింది. -
15న తిరుమణం ఎన్నుం నిఖా
తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువజంట జయ్, నజ్రియా నజీమ్ నటించిన చిత్రం తిరుమణం ఎన్నుం నిఖా చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాజర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అనిస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు అనిస్ మాట్లాడుతూ తిరుమణం ఎన్నుం నిఖా రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రమన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జయ్, నజ్రియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు. చిత్రం ఆస్కార్ ఫిలింస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. రంజాన్ వేడుకలను చెన్నై నగరంలో ఒకరకంగాను, ఉత్తర చెన్నై రాయపురంలో మరో విధంగాను నిర్వహిస్తారన్నారు. ఈ రెండు ప్రాంతాల రంజాన్ నిజ వేడుకలను తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం కోసం చిత్రీకరించామని తెలిపారు. చిత్ర ఆలస్యానికి ఇదే కారణంగా పేర్కొన్నారు. అదే విధంగా మోహరం వేడుకలను యథాతథంగా చిత్రీకరించామని చెప్పారు. చిత్రంలో పలువురు నూతన తారలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి నటింప చేశామని వెల్లడించారు. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని లేటెస్ట్ కాదల్‌కోట్టై గా చెప్పవచ్చునని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీత బాణీలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
షాహిద్ లేకుండానే...
తన ఫియూన్సీ(కాబోయే భర్త) షాహిద్ లేకుండానే ప్రేమికుల రోజును జరుపుకుంటోంది నజ్రియా నజిమ్. వాలెంటైన్స్ డే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితం. అదిప్పుడు మన సంస్కృతికి బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమికుల రోజు అంటే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య దినోత్సవంగా మారిపోయింది. ఈ రోజున ప్రేమికులు విందులు, వినోదాల్లో పాల్గొనడం చక్కని బహుమతులతో ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తం చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సినీ తారలు ఈ దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది నటి నజ్రియా మాత్రం తన ఫియూన్సీతో ప్రేమికుల రోజును గడపడం లేదంటోంది. కోలీవుడ్‌లో నేరం, రాజారాణి తదితర చిత్రాల్లో నటించిన ఈ మలయాళి బ్యూటీకి ఇటీవలే మలయాళ యువ నటుడు షాహిద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 21న పెళ్లి పీటలెక్కనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాబోయే జీవిత భాగస్వామితో ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారన్న ప్రశ్నకు నజ్రియా బదులిస్తూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తాము కలిసి జరుపుకోవడం లేదని తెలిపింది. కారణం ఇద్దరం షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని చెప్పింది. తాను బెంగుళూరు డేస్ అనే కన్నడ చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉందని వివరించింది. -
ముహూర్తం కుదిరింది
తమిళ సినిమా, న్యూస్‌లైన్: నటి నజ్రియా వివాహ నిశ్చితార్థం శనివారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలోని తాజ్ హోటల్లో జరిగింది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ భామ నజ్రియా నజీమ్. ఆ మధ్య నయ్యాండి చిత్రంలో తన పొట్ట చూపించారంటూ నానా రభస చేసిన ఈ బ్యూటీ రాజారాణి, తదితర చిత్రాల్లో నటించింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ కొడుకు, నటుడు పాహత్ పాజిల్‌తో ప్రేమ పెళ్లికి బాటలు వేసింది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఆగస్టు 21న తిరువనంతపురంలోని కళాకూట్టం అల్తాజ్ హాల్లో జరగనుంది. ఆ తర్వాత 24న వివాహ రిసెప్షన్ జరగనుంది. వివాహానంతరం తన భర్త, తల్లిదండ్రుల అనుమతితో నటనను కొనసాగిస్తానని నజ్రియా స్పష్టం చేసింది. -
మలయాళ నటుడుతో తమిళ తార నాజ్రియా పెళ్లి!
ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో తమిళ నటి నాజ్రియా పెళ్లి కుదిరింది. నాజ్రియా, ఫహద్ లిద్దరూ ఎల్ ఫర్ లవ్ అనే మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్టు తెలిసింది. దాంతో ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లికి ఏర్పాటు జరుగుతున్నాయి. 'ఫహద్ తో తన కూతురు వివాహం కుదిరింది. ఆగస్టు నెలలో పెళ్లికి జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం' అని నజ్రియా తండ్రి మీడియాతో అన్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. తన నిశ్చితార్ధం వార్తను నజ్రియా సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రాజా రాణి చిత్రంలో నజ్రియా నటించింది. ఫహద్ ఇప్పటి వరకు 12 చిత్రాల్లో నటించారు. -
భయం పుట్టిస్తున్న ప్రేమ
తమిళ సినిమా, న్యూస్‌లైన్: ప్రేమ అంటే ఏహ్యభావం పుడుతుందేమోనన్న భయమేస్తోందని చెబుతోంది నటి నజ్రియా నజీమ్. గ్లామర్ పేరుతో జుగుప్సాకరమైన సన్నివేశాల చిత్రీకరణను ఖండిస్తూ సంచలన హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళి కుట్టికి మంచి అవకాశాలు తలుపులు తడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు ఈ బ్యూటీ కాల్షీట్స్ డైరీ ఫుల్ అట. ప్రస్తుతం బాలాజీ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న నజ్రియా కొన్ని ప్రత్యేక విషయాలను వెల్లడించారు. అవేమిటో ఆమె నోటనే విందాం. అదృష్టం అంతా ఒకేసారి నన్ను వరించిందని చెప్పాలి. నేను తొమ్మిదో తరగతి వరకు దుబాయ్‌లో చదివాను. దుబాయ్‌లో నాకు ఎల్కేజీ నుంచే స్నేహితులున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ మిస్ అవ్వడం బాధగా ఉంది. ఆ తరువాత తిరువనంతపురంలో చదివాను. అక్కడి పాఠశాలలో ఎన్నో కట్టుబాట్లు, రెండు జడలు వేసుకోవాలి. యూనిఫామ్ దుస్తులు ధరించా లి వంటి షరతులతో ఏమిటో జీవితం అని ఫీలైన సందర్భం లేకపోలేదు. అలాంటి సమయంలో ఆదిరై, పార్వతి, అనామిక, మీనాక్షి వంటి స్నేహితురాలు లభించడం సంతోషకరమైన విషయం. అప్పటి నుంచి పాఠశాల జీవితం ఆనందమయమనే చెప్పాలి. యువి అనే నా మ్యూజిక్ ఆల్బమ్ యూ ట్యూబ్‌లో ప్రేక్షకులను అలరించింది. తిరువనంతపురంలోని కళాశాలలో బి.కాం చదవడానికి సిద్ధమయ్యాను. అయితే ఆ కళాశాలలో అడ్మిషన్‌కు మాత్రమే వెళ్లాను. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికి ఎవరైనా అధ్యాపకులు తారస పడితే తప్పకుండా కళాశాలకు రమ్మని అంటుంటారు. నటి మీరానందన్, మేగ్నారాజ్ కలిస్తే ఊరు చుట్టేస్తాం. ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడ చేరిపోతాం. మేగ్నారాజ్ చికెన్ ఐటెమ్స్ బాగా లాగించేస్తోంది. మీరానందన్ రకరకాల దోసెలు ఆరగిస్తుంది. నాకు మాత్రం ఈ రెండూ ఇష్టమే. తమిళ చిత్రాలే ఎక్కువ నేను ఎక్కువగా చేస్తున్నది తమిళ చిత్రాలే. నేరం, రాజారాణి, నయ్యాండి చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. తిరుమణం ఎన్నుమ్ నిక్కా చిత్రం త్వరలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నా కాల్షీట్స్ డైరీ పుల్ అయ్యింది. మరిన్ని నూతన అవకాశాలు వస్తున్నాయి. రాజారాణి చిత్రంలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నటుడు ఆర్య ఎప్పుడే నవ్విస్తుంటారు. ఆర్య నా కిప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. నేనిప్పుడు సంపాదిస్తున్నానని అనవసరంగా ఏది పడితే అది కొనను. సినిమా రంగానికి రాకముందు నాకవసరం అయిన దాన్ని నాన్నే సమకూర్చేవారు. ఇప్పుడు కూడా ఏమి కావాలన్నా నాన్ననే అడుగుతా. నేను నటినైన తరువాత మంచి హ్యాండ్‌బ్యాగ్స్ ఖరీదైన సెల్ఫోన్లు కొనుక్కున్నాను. ఏ చిత్రం చూసినా ప్రేమ పాత్రలే. అయితే కథా కోణం మారుతుంది కాబట్టి అలాంటి పాత్రలు చేయడం నాకు బోర్ అనిపించడం లేదు. అయితే సినిమాల్లో ప్రేమించి, ప్రేమించి నిజ జీవితంలో ప్రేమ మీద ఏహ్యభావం కలుగుతుందేమోనన్న భయం మాత్రం కలుగుతోంది. ఎవరినైనా ప్రేమించాలనే కోరిక కలిగినా సినిమాల్లో అదే కథ చేస్తున్నాం, జీవితంలోనూ అది అవసరమా అనే భావం కలగకూడదుగా అంటోంది సంచలన నటి నజ్రియా. -
మమ్ముట్టి కొడుకుతో నజ్రియా రొమాన్స్
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌తో సంచలన నటి నజ్రియా నజీమ్ రొమాన్స్ చేస్తోందట. అయితే రొమాన్స్ అనగానే సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లోనూ, డ్యూయెట్లు పాడటమే కాదు నిజ జీవితంలోనే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని జోరుగా షికార్లు కొడుతున్నారట. నేరం చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళకుట్టి నజ్రియా. దుల్కర సల్మాన్ మాలీవుడ్‌లో యువ హీరోగా ప్రకాశిస్తున్నారు . వీరిద్దరూ తాజాగా వామై ముడిపేసుమ్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో వీరిద్దరికి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారిందని యూనిట వర్గాల టాక్. అయితే నయ్యాండి చిత్రంలో తన పొట్టను చూపించినందుకే పోలీసులు, కోర్టులు అంటూ ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేసిన నజ్రియ ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో బహిరంగంగా ప్రేమ పాఠాలు వల్లించడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. మరో విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్‌కు ఇది వరకే పెళ్లి అయ్యింది. మరిప్పుడీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు తీసుకెళుతుందో చూడాలంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
నజ్రియూకు బాసట
నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ నజిమ్‌కు మేఘ్నారాజ్ మద్దతుగా నిలిచింది. నయ్యాండి చిత్ర వ్యవహారంలో నజ్రియూ అనవసర రాద్దాంతం చేసిందంటూ నయనతార ఇదివరకు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నజ్రియూకు మేఘ్నారాజ్ బాసటగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ పొట్ట కనిపించేలా నటించడానికి నిరాకరించిన నజ్రియా భావాన్ని గౌరవించాలని పేర్కొంది. తమిళ చిత్రం సుందర పాండియన్‌లో లక్ష్మీమీనన్ పోషించిన పాత్రను తాను కన్నడంలో చేసినట్లు చెప్పింది. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా కథలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపింది. తమిళంలో లక్ష్మీమీనన్ నటన తనకు నచ్చిందని చెప్పింది. అయితే తాను ఆమె నటనను అనుకరించనని, కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనదైన బాణీలో నటిస్తానని అంది. నజ్రియా వ్యవహారం గురించి తన వద్ద చాలా మంది ప్రస్తావిస్తున్నారని తెలిపింది. నజ్రియా తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. నటన అనేది వారివారి వ్యక్తిగత విషయమని పేర్కొంది. నజ్రియా కుటుంబం సనాతన సంప్రదాయాల నుంచి ఇంకా మారలేదని తెలిపింది. కాబట్టి ఆమె భావాన్ని గౌరవించాలని మేఘ్నారాజ్ తెలిపింది. -
పక్కతోవ పట్టించారు
ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన నటి నజ్రియా నజీమ్. ఈ భామ నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు వచ్చింది. ఈ చిత్ర విజయంతో నజ్రియూ స్థాయిక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత ఆర్యతో రాజారాణి, ధనుష్ సరసన నయ్యాండి వంటి భారీ చిత్రాల్లో మెరిసింది. ఈ కేరళ కుట్టి అతి చేష్టలకు పోయి కెరియర్ను నాశనం చేసుకుంటోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. నయ్యాండి చిత్రంలో తన పాత్రను డూప్‌తో అశ్లీలంగా తెరకిక్కించారని రాద్దాంతం చేసింది. విషయం పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లింది. చివరకు నజ్రియూ అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించి నయ్యాండి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సంఘటన ఆమె కెరియర్‌పై ప్రభావం చూపింది. విజయ్ చిత్రం పోయే! నటిగా ఎదుగుతున్న నజ్రియాకు కోలీవుడ్‌లో పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా సమంతను ఎంపిక చేశారు. రెండవ హీరోయిన్ అవకాశం నజ్రియాను వరించిందని సమాచారం. అయితే నయ్యాండి సంఘటన తర్వాత విజయ్ చిత్రం నుంచి నజ్రియాను తొలగించినట్లు తెలిసింది. అదే విధంగా యువనటుడు జీవా సరసన నటించాల్సిన అవకాశమూ నజ్రియా చేయి దాటిపోయింది. గుడ్డిలో మెల్ల గుడ్డిలో మెల్ల సామెతలా నజ్రియాకు చిన్నపాటి సంతోషం. మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రంలో నజ్రియా హీరోయిన్గా ఎంపికైంది. కాదలిల్ సొదప్పువదు ఎప్పడి ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం హీరోహీరోయిన్లపై ఫొటో సెషన్ ఇటీవల చెన్నై నగరంలో జరిగింది. నజ్రియా ఎలాంటి షరతులూ విధించలేదని దర్శకుడు బాలాజీ మోహన్ తెలిపారు. ఫోటోసెషన్లోనూ యూనిట్ ఇచ్చిన దుస్తులనే ఆమె ధరించిందని పేర్కొన్నారు. నయ్యాండి చిత్ర వ్యవహారంలో పరివారమే నజ్రియాను పక్కతోవ పట్టించిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
తను ఓవర్ యాక్షన్ చేసింది-నీ జోక్యం అనవసరం
ఏ వివాదాలు లేకపోయే సరికి... ఎవరో ఒకరి విషయంలో తల దూర్చి మరీ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు నయనతార. వేరొకరితో అసభ్యకర సన్నివేశాలు తీసి, అందులో తాను ఉన్నట్లుగా చిత్రీకరించారంటూ ‘నయ్యాండి’ సినిమా విషయంలో ఆ చిత్ర కథానాయిక నజ్రియా నజీమ్ రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేకపోయినా నయనతార స్పందించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ‘‘నజ్రియా నిజంగా ఓవర్ యాక్షన్ చేసింది. సినిమా అంటేనే గ్లామర్. అది తెలిసే కదా ఇక్కడకొచ్చేది. అలాంటప్పుడు వివాదాలు చేయడమెందుకు’’ అని ఆమె ఓ సందర్భంలో అనడం నజ్రియాకు కూడా చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘‘ఇష్టం లేని విషయంపై నిరసన వ్యక్తం చేసే హక్కు నాకుంది. ఈ విషయంలో నయనతార జోక్యం అనవసరం. అయినా ఆమెకు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఏంటి?’’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నజ్రియా. కెరీర్ మంచి పీక్‌లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలను భూతద్దంలో చూడకూడదని, ఆమె మంచి కోరుకునే సాటి నటిగా మాత్రమే తాను స్పందించానని ఆ తర్వాత నయన వివరణ ఇవ్వడం విశేషం. -
రచ్చ రచ్చ చేసింది... చివరకు నష్టపోయింది
కొంతమంది హీరోయిన్లు చిటికెడంత విషయాన్ని చేటంత చేస్తుంటారు. చివరకు అది చాపంత అవుతుంది. పర్యవసానం... దర్శక, నిర్మాతలకు లేనిపోని తిప్పలు. తమిళ హీరోయిన్ నజ్రియా నజీమ్ అలాంటి పనే చేసింది. ఈ నెల 11న ధనుష్‌తో ఆమె జతకట్టిన ‘నైయాండి’ సినిమా విడుదలైంది. నిజానికి ఆ సినిమా ఓ పదిరోజులు ముందే విడుదలవ్వాలి. కానీ ఆలస్యమైంది. కారణం ఈ ముద్దుగుమ్మే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు ధనుష్, నజ్రియాలపై దర్శకుడు ఎ.సర్కునమ్ ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని ప్లాన్ చేశారు. హీరోయిన్ ‘నాభి’ని హీరో తాకే చేసే సన్నివేశం అది. అయితే... ఆ సన్నివేశంలో నటించడానికి నజ్రియా ససేమిరా అన్నారు. దాంతో... మరొకరితో ఆ సన్నివేశాన్ని చేయించి, నజ్రియానే చేసినట్లు చూపించారట దర్శకుడు సర్కునమ్. సినిమా పూర్తయింది. చిత్రం యూనిట్‌కి ప్రివ్యూ వేశారు. నజ్రిమ్ కూడా ఆ షోకి హాజరయ్యారు. ఆ సీన్ రానే వచ్చింది. నజ్రిన్ కోపం నషాళానికి అంటింది. ‘నా అనుమతి లేకుండా నన్ను అసభ్యంగా చూపిస్తారా?’ అంటూ అక్కడే రచ్చ రచ్చ చేసేసింది. చివరకు ఈ విషయం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. దాంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దర్శక, నిర్మాతలు ఎలాగోలా తిప్పలు పడి, ఎట్టకేలకు ఈ నెల 11న సినిమాను విడుదల చేశారు. ఇంత జరిగాక తమిళ నిర్మాతలు ఊరుకుంటారా! పైగా హీరోయిన్లపై నిషేధం విధించడంలో వాళ్లు ముందుంటారు కదా! ఇక ఆలోచించకుండా... ఇంతటి ఆందోళనకు కారకురాలైన నజ్రియాపై నిషేధం విధించేశారు. ఇక ఏ సినిమాలోనూ ఈ మలయాళీ ముద్దుగుమ్మని తీసుకోకూడదని ఆర్డర్ పాస్ చేసేశారు. ఇప్పుడిప్పుడే తమిళనాట మంచి పేరు తెచ్చుకుంటున్న నజ్రియాకు ఇది నిజంగా గట్టి దెబ్బే. మరి ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ‘రభస’ చిత్రంలో ఈ అమ్మాయి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.