షాహిద్ లేకుండానే...
షాహిద్ లేకుండానే...
Published Fri, Feb 14 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
తన ఫియూన్సీ(కాబోయే భర్త) షాహిద్ లేకుండానే ప్రేమికుల రోజును జరుపుకుంటోంది నజ్రియా నజిమ్. వాలెంటైన్స్ డే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితం. అదిప్పుడు మన సంస్కృతికి బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమికుల రోజు అంటే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య దినోత్సవంగా మారిపోయింది. ఈ రోజున ప్రేమికులు విందులు, వినోదాల్లో పాల్గొనడం చక్కని బహుమతులతో ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తం చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సినీ తారలు ఈ దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది నటి నజ్రియా మాత్రం తన ఫియూన్సీతో ప్రేమికుల రోజును గడపడం లేదంటోంది.
కోలీవుడ్‌లో నేరం, రాజారాణి తదితర చిత్రాల్లో నటించిన ఈ మలయాళి బ్యూటీకి ఇటీవలే మలయాళ యువ నటుడు షాహిద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 21న పెళ్లి పీటలెక్కనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాబోయే జీవిత భాగస్వామితో ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారన్న ప్రశ్నకు నజ్రియా బదులిస్తూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తాము కలిసి జరుపుకోవడం లేదని తెలిపింది. కారణం ఇద్దరం షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని చెప్పింది. తాను బెంగుళూరు డేస్ అనే కన్నడ చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉందని వివరించింది.
Advertisement
Advertisement