Fahad
-
కొన్ని ఈవీఎంల్లో ‘ఫుల్ చార్జింగ్’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. అణుశక్తినగర్ అసెంబ్లీ స్థానం ఫలితంపై తీవ్ర అనుమానాలున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్సీపీ (అజిత్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో కేవలం 3,378 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలన్నింట్లోనూ సనా మాలిక్ ఆధిక్యం కనబరిచారు. తక్కువ చార్జింగ్ ఉన్న ఈవీఎంల్లోనేమో సనా వెనకబడ్డారు. ఇదెలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. అహ్మద్ అనుమానాలను ఆయన భార్య, సినీ నటి స్వరాభాస్కర్ కూడా బలపరిచారు. ‘‘17 రౌండ్ల దాకా నా భర్తే ఆధిక్యంలో ఉన్నారు. కానీ చివరి మూడు రౌండ్లలో లెక్కించిన ఈవీఎంలన్నీ 99 శాతం బ్యాటరీ చార్జింగ్ ఉన్నవే! వాటన్నింట్లోనూ సనా మాలికే ఆధిపత్యం సాధించడంతో ఫలితమే తారుమారైంది’’అని చెప్పుకొచ్చారు. ‘‘రోజంతా ఓటింగ్ ప్రక్రియ కొనసాగాక ఈవీఎం యంత్రాల్లో చార్జింగ్ తగ్గాలి. చాలా ఈవీఎంల్లో అలాగే తగ్గింది కూడా. కానీ కొన్ని ఈవీఎంల్లోనే, ప్రత్యేకించి చివరి మూడు రౌండ్లలో లెక్కించిన వాటిలోనే ఫుల్ చార్జింగ్ ఉంది. ఇదెలా సాధ్యం?’’అని ఆమె ప్రశ్నించారు. -
నటి భర్త కంటే బెటర్: ప్రత్యర్థిపై నవాబ్ మాలిక్ కుమార్తె
ముంబై: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ నేత( అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరిన నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌తో ఆమె తలపడనున్నారు. ఈ సందర్భంగా సనా మాలిక్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఫహద్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు. తాను నవాబ్ మాలిక్ కుమార్తె అయినందుకు గర్వపడుతున్నానని, నవాబ్ మాలిక్ కూతురు అనుశక్తి నగర్ కూతురిగా మారగలదని తెలిపారు. ఇది ఓ నటి భర్త కావడం కంటే మేలే అంటూ విమర్శలు గుప్పించారు.అనుశక్తి నగర్‌లోని ప్రజల కోసం తాను కష్టపడి పనిచేశానని, నామినేషను దాఖలు చేసే సమయంలో స్థానికులు తన వెంట రావడం వారి మద్దతుకు నిదర్శనమని సనా మాలిక్ అన్నారు. ఫహద్ అహ్మద్ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆమె అన్నారు.‘ ఇది రాజకీయం. ఎవరూ శత్రువులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం అహ్మద్ నా ప్రత్యర్థి. నేను ఫహద్ గురించి మాట్లాడను, కానీ ఇక్కడి ప్రజలకు నన్ను నవాబ్ మాలిక్ కూతురిగా మాత్రమే తెలుసునని నేను చెబుతాను, కానీ నేను వారి ఇళ్లకు వెళ్లినప్పుడు, వారితో టీ తాగేటప్పుడు, మా మాటలు వినండి, వారు నన్ను తెలుసుకుంటారు. సమస్యలు" అని సనా మాలిక్ అన్నారు.కాగా సనా మాలిక్ తండ్రి నవాబ్ మాలిక్, అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి ఆయన పోటీ చేయున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో..ఫిబ్రవరి 2022లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 6న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వరభాస్కర్ మరోసారి పెళ్లికి సిద్ధమైంది. తాను ప్రేమించిన ఫహద్ అహ్మద్‌నే మరోసారి పెళ్లాడనుంది. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ తాజాగా మరోసారి సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోనున్నారు. ఈనెల 11నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని స్వరభాస్కర్ అమ్మమ్మ ఇల్లు వీరి పెళ్లివేదిక కానుంది. ఈనెల 15-16 తేదీల్లో ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో స్వరభాస్కర్వివాహం ఘనంగా జరనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Prateeq Kumar (@prateeq) -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
షాహిద్ లేకుండానే...
తన ఫియూన్సీ(కాబోయే భర్త) షాహిద్ లేకుండానే ప్రేమికుల రోజును జరుపుకుంటోంది నజ్రియా నజిమ్. వాలెంటైన్స్ డే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితం. అదిప్పుడు మన సంస్కృతికి బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమికుల రోజు అంటే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య దినోత్సవంగా మారిపోయింది. ఈ రోజున ప్రేమికులు విందులు, వినోదాల్లో పాల్గొనడం చక్కని బహుమతులతో ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తం చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సినీ తారలు ఈ దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది నటి నజ్రియా మాత్రం తన ఫియూన్సీతో ప్రేమికుల రోజును గడపడం లేదంటోంది. కోలీవుడ్‌లో నేరం, రాజారాణి తదితర చిత్రాల్లో నటించిన ఈ మలయాళి బ్యూటీకి ఇటీవలే మలయాళ యువ నటుడు షాహిద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 21న పెళ్లి పీటలెక్కనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాబోయే జీవిత భాగస్వామితో ఎలా సెలబ్రేట్ చేసుకోనున్నారన్న ప్రశ్నకు నజ్రియా బదులిస్తూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని తాము కలిసి జరుపుకోవడం లేదని తెలిపింది. కారణం ఇద్దరం షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని చెప్పింది. తాను బెంగుళూరు డేస్ అనే కన్నడ చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉన్నట్లు తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉందని వివరించింది.