ముంబై: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ నేత( అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరిన నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌తో ఆమె తలపడనున్నారు. ఈ సందర్భంగా సనా మాలిక్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఫహద్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు.
తాను నవాబ్ మాలిక్ కుమార్తె అయినందుకు గర్వపడుతున్నానని, నవాబ్ మాలిక్ కూతురు అనుశక్తి నగర్ కూతురిగా మారగలదని తెలిపారు. ఇది ఓ నటి భర్త కావడం కంటే మేలే అంటూ విమర్శలు గుప్పించారు.అనుశక్తి నగర్‌లోని ప్రజల కోసం తాను కష్టపడి పనిచేశానని, నామినేషను దాఖలు చేసే సమయంలో స్థానికులు తన వెంట రావడం వారి మద్దతుకు నిదర్శనమని సనా మాలిక్ అన్నారు.
ఫహద్ అహ్మద్ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆమె అన్నారు.‘ ఇది రాజకీయం. ఎవరూ శత్రువులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం అహ్మద్ నా ప్రత్యర్థి. నేను ఫహద్ గురించి మాట్లాడను, కానీ ఇక్కడి ప్రజలకు నన్ను నవాబ్ మాలిక్ కూతురిగా మాత్రమే తెలుసునని నేను చెబుతాను, కానీ నేను వారి ఇళ్లకు వెళ్లినప్పుడు, వారితో టీ తాగేటప్పుడు, మా మాటలు వినండి, వారు నన్ను తెలుసుకుంటారు. సమస్యలు" అని సనా మాలిక్ అన్నారు.
కాగా సనా మాలిక్ తండ్రి నవాబ్ మాలిక్, అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్‌ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి ఆయన పోటీ చేయున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో..ఫిబ్రవరి 2022లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment