ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరైన నవాబ్ మాలిక్ అభ్యర్థిత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలకు మన్‌ఖుర్ద్ శివాజీ నగర స్థానానికి ఆఖరి నిమిషంలో ఆయన రెండు నామినేషన్‌లు దాఖలు చేశారు.
ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ సభ్యుడిగా చేశారు. చివరికి ఎన్సీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నుంచే పోటీలోకి దిగుతున్నారు. కాగా మాలిక్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
తాజాగా నవాబ్ మాలిక్ రెండు నామినేషన్లు వేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అశిష్ షెలార్ మాట్లాడుతూ.. కూటమిలోని అన్నిపార్టీలు తమ సొంత అభ్యర్థిని నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు.
‘ఎన్సీపీకి సంబంధించి నవాబ్ మాలిక్ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించే ఇక్కడ సమస్య. బీజేపీ వైఖరిని దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పదే పదే స్పష్టం చేశారు, నేను మళ్ళీ చెబుతున్నాను. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదు. మేము అతని కోసం ప్రచారం చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే దావూద్ సంబంధిత కేసులతో సంబంధం ఉన్న ఎవరికీ మేము ప్రచారం చేయము’. అని పేర్కొన్నారు.
వాస్తవానికి నవాబ్ మాలిక్ అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటు తన కుమార్తె సనా మాలిక్‌కు న్సీపీ కేటాయించింది. దీంతో నవాబ్ మాలిక్ మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే నవాబ్ మాలిక్‌కు నామినేషన్ ఇవ్వవద్దని అజిత్ పవార్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం
Comments
Please login to add a commentAdd a comment