Swara Bhasker Old Tweet Calling Husband As Bhai Assures Trolling - Sakshi
Sakshi News home page

Swara Bhasker: 'అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా'? స్వర భాస్కర్‌పై ట్రోలింగ్‌

Published Fri, Feb 17 2023 7:31 PM | Last Updated on Fri, Feb 17 2023 8:24 PM

Swara Bhasker Old Tweet Calling Husband As Bhai Assures Trolling - Sakshi

నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్‌ స్వర భాస్కర్‌ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్‌ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్న స్వర భాస్కర్‌ తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్‌ వీడియో ద్వారా పంచుకుంది.

దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్‌ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్‌ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది.

స్వరా భాస్కర్‌ 2020లో సమాజ్‌ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్‌ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement