secret marriage
-
ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది. (ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
ఐదేళ్లుగా డేటింగ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్!
బాలీవుడ్లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. సొన్నాల్లి సెగల్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్యార్ కా పంచ్‌నామా మూవీ నటి సొన్నాల్లి సెగల్ ఆమె ప్రియుడు అషేష్ ఎల్ సజ్నానీని సీక్రెట్‌గా వివాహాం చేసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్ 7న ముంబయిలో ఒక్కటి కాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పెళ్లికి కేవలం ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. నటి ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా సోమవారం మెహందీ వేడుకను జరుపుకున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!) కాగా.. 34 ఏళ్ల సొన్నాల్లి సెగల్ మే నెల ప్రారంభంలోనే తన బ్యాచిలరేట్ పార్టీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి గురించి ఎక్కడా కూడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతేడాది డిసెంబరులో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. నటి సొన్నాల్లి సెగల్ చివరిసారిగా 'అనామిక' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అందులో రియా పాత్రను పోషించింది. ప్రస్తుతం నూరానీ చెహ్రా, బ్లాక్ కరెన్సీ అనే ప్రాజెక్టుల్లో నటించనున్నారు. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
హీరోయిన్‌తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
తల్లయ్యాక సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్!
Travis Scott: హాలీవుడ్ స్టార్ కైలీ జెన్నర్, ట్రావిస్ స్కాట్ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అందులో కైలీ డైమండ్ రింగ్ ధరించి ఉంది. దీంతో ఆమె ట్రావిస్ స్కాట్‌ను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఎవరికివారే తెగ ఊహించేసుకుంటున్నారు. కాగా గతంలోనూ కైలీ పెళ్లి చేసుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. 2018లో ఆమె JW(ట్రావిస్ అసలు పేరు జేక్వ్స్ వెబ్‌స్టర్) అక్షరాలు ఉన్న బ్యాండు ధరించడంతోపాటు వేలికి వజ్రాల ఉంగరం ఉండటంతో ఆమె పెళ్లి జరిగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ కొంతకాలానికి అది వట్టి పుకారేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే కైలీ, ట్రావిస్ 2017 నుంచి డేటింగ్లో ఉన్నారు. వీరికి నాలుగేళ్ల వయసున్న కూతురు స్టోర్మీ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొడుకు జన్మించగా, అతడికి వోల్ఫ్ వెబ్‌స్టర్ అని నామకరణం చేశారు. చదవండి: స్టార్ హీరో సినిమాకు బాయ్ కాట్ సెగ.. ట్విటర్లో ట్రెండింగ్ -
ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రముఖ యూట్యూబర్
Youtuber Bumchik Babloo Mayaa Got Secretly Married in Arya Samaj: ప్రముఖ యూట్యూబర్ బుమ్చిక్ బబ్లూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి అలరించిన బబ్లూ ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేస్తూ.. జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు బబ్లూకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. బ్యూటిఫుల్ కపుల్‌కి కంగ్రాట్స్ అంటూ పులువరు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరేమో ఇది నిజమైనా పెళ్లేనా? లేక ఏదైనా వెబ్‌సిరీస్ కోసమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_mayaa) -
తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..
Amrita Rao And RJ Anmol Reveals Their Wedding Photos: బాలీవుడ్ బ్యూటీ అమృత రావు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అతిథి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రంలో తన గ్లామర్, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. కానీ తర్వాత మళ్లీ తెలుగు తెరపై ఆమె కనిపించలేదు. తిరిగి బాలీవుడ్‌కే వెళ్లిన అమృత మంచి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాందించుకుంది. తాజాగా అమృత తన పెళ్లి ఫొటోలను మొట్టమొదటిసారిగా షేర్ చేసింది. అది ఎలా అంటే తన భర్తను తానే మళ్లీ పెళ్లి చేసుకుని. అవును.. అమృతకు ఆర్జే అన్మోల్తో 2014లో రహస్య వివాహం జరిగింది. అయితే ఇదివరకూ ఆర్జే అన్మోల్తో తనకు రహస్య వివాహం జరిగినట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆర్జే అన్మోల్ను మళ్లీ చేసుకుంటూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఒక వీడియో రూపంలో బయట పెట్టింది ఈ బ్యూటీ. ఈ సెలబ్రిటీ జంట యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్'లోని కొత్త ఎపిసోడ్లో తమ వివాహ వివరాలను పంచుకున్నారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ వీడియోలో అమృత, అన్మోల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంభాషించడం, మెమొరీ లేన్‌లో నడవడం వంటి తదితర మధురమైన క్షణాలను పంచుకుంది ఈ జంట. కాగా ఈ సెలబ్రిటీ జంట తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే రహస్యంగా 2014లో మే 15న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యూటీఫుల్ సెలబ్రిటీ కపుల్‌కు నవంబర్ 1, 2020న బాబు పుట్టాడు. -
అతిథి హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్, వీడియోతో వెల్లడి!
బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు, ఆర్జే అన్మోల్ 2014లోనే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్ తమ యూట్యూబ్ ఛానల్లో వెల్లడించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందేమో అన్న ఉద్దేశ్యంతో మొదట్లో వెనుకడుగు వేశామని గుర్తు చేసుకున్నారు. పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో అన్మోల్ పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడట. కానీ దీనివల్ల కెరీర్ ప్రభావితమవుతుందేమోనని అమృత భయపడటంతో అన్మోల్ ఓ ప్లాన్ చెప్పాడు. రహస్య వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందన్నాడు. ఇద్దరూ కలిసి ఉండొచ్చు, కెరీర్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదు కాబట్టి సరేనంది అమృత. అలా ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. సీక్రెట్ మ్యారేజ్ కాబట్టి కజిన్స్‌ను కూడా పిలవలేదని చెప్పింది హీరోయిన్. ఈ పెళ్లి 2014లో మే 15న జరిగిందని వెల్లడించారు. ఈ రహస్య వివాహాన్ని నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువకాలం దాచలేమని ముందే తెలుసంటున్నాడు అన్మోల్. అందుకే 2016లో తామిద్దరం దంపతులమని అధికారికంగా ప్రకటించారు. కాగా అమృతరావు.. షాహిద్ కపూర్ 'ఇష్క్ విష్క్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'వివాహ్', 'మస్తీ' వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ తెలుగులో 'అతిథి' సినిమాలో కథానాయికగా మెప్పించింది. -
హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ రహస్య వివాహం, ఫొటో వైరల్!
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఈ ఫొటో చూసిన సల్మాన్ అభిమానులు చడీచప్పుడు లేకుండా మా హీరో పెళ్లి చేసుకోవడమేంటి? అది కూడా రహస్యంగానా? ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్‌గా, ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలెక్కేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజమేంటంటే సల్మాన్ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అతడింకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గానే ఉన్నాడు. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఇక ఆ ఫొటో సంగతంటారా? అది కేవలం మార్ఫింగ్ ఫొటో లేదా ఏదైనా సినిమా స్టిల్ అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కాగా సల్మాన్, సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'కబీ ఈద్ కబీ దివాళి' సినిమా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే..
Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. -
రహస్య పెళ్లిపై స్పందించిన పాకిస్తాన్ నటి
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలపై పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ స్పందించింది. తాను రహస్య వివాహం చేసుకోలేదని స్పష్టం చేసింది. "నా చేతి వేళ్లకేమైనా ఉంగరం కనిపిస్తుందా? లేదు కదా, నేను పెళ్లి పీటలెక్కితే ఆ విషయాన్ని తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను. అయినా నేను మ్యారేజ్ చేసుకుంటే అది మీకు తెలీకుండా ఉంటుందా! ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఎప్పుడో దాన్ని మీకు షేర్ చేసేదాన్ని. కాబట్టి నేనిప్పుడు చెప్పొచ్చేదేంటంటే నాకు పెళ్లి కాలేదు. కనీసం నిశ్చితార్థం కూడా జరగలేదు" అని తన యూట్యూబ్ ఛానల్ మ్యాషన్లో ఓ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. కాగా 'హమ్‌సఫర్', 'షెహర్ ఇ జాత్', 'బిన్ రోయ్' వంటి టీవీ షోల ద్వారా మహీరా ఖాన్ హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 2017లో 'రేస్' సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం స్టార్ హీరో టామ్ క్రూయిజ్‌తో కలిసి హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఉరి ఉగ్రదాడుల తర్వాత ఈ పాకిస్తానీ నటి భారత్‌లో అడుగు పెట్టనేలేదు. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె
వాషింగ్టన్ : పాప్ సింగర్ అరియానా గ్రాండే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలోని తన నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో తన ప్రియుడు ఎస్టేట్ డాల్టన్ గోమేజ్‌ని పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ యంగ్కపుల్. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ ఎస్టేట్ డాల్టన్‌తో అరియానా గ్రాండే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరు క్లోజ్‌గా ఫోటోలకు ఫోజులిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. వీరిద్దరి డేటింగ్, విహారయాత్రలకు సంబంధించిన వార్తలు అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇక పాపులర్ సింగర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 253మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) గత కొద్ది కాలంగా వీరి రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా తన నివాసంలో ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇక అరియానా- ఎస్టేట్ డాల్టన్ పెళ్లి ఎప్పుడు జరిగిందనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ గత వారంలో వీరి పెళ్లి జరిగినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కేవలం 20 మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ముందే వీరు అమెరికాలో ఓ ఖరీధైన ఇంటిని కొనుగోలు చేశారు. గతంలో కమెడియన్ ప్యాట్ డేవిడ్సన్తో అరియానా ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు ఇక పెళ్లి చేసుకోబుతున్నారు అనుకున్న సమయంలో అనూహ్యంగా విడిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) చదవండి : షారుఖ్ ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా : నటి ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జాన్సేన
ఫ్లోరిడా: నటుడిగా మారిన రెజ్లింగ్ స్టార్ జాన్సేన మరోసారి పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోన్న ప్రియురాలు షే షరియాత్జాదేను రహస్యంగా పెళ్లాడారు. ఫ్లోరిడాలోని తంపాలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ వివాహ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ అక్కడి మీడియాకు మాత్రం సమాచారం లీకైంది. దీంతో అతని పెళ్లి సర్టిఫికెట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి) కాగా గతేడాది మార్చిలో జాన్సేన "ప్లేయింగ్ విత్ ఫైర్" సినిమా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఈ ఇద్దరికీ చూపులు కలిశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో షే షరియాత్జాదే ఎడమ చేతికి వజ్రపుటుంగరం కనిపించడంతో నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజాగా డేటింగ్‌కు ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా జాన్సేన 2009లో మొదట ఎలిజబెత్ హుబెర్డీయును పెళ్లాడారు. తర్వాత ఆమెతో తెగతెంపులు చేసుకుని నిక్కీ బెల్లాతో తొమ్మిదేళ్లపాటు ప్రేమాయణం జరిపారు, కానీ అనుకోని కారణాల వల్ల 2018లో బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: రణ్వీర్ డ్రెడ్లుక్ ఫొటో షేర్ చేసిన జాన్సెనా) View this post on Instagram John is married. He didn't blame a pandemic for not getting married. Y'all love to see it. #nikkibella #johncena#shayshariatzadeh #shena #married #getsome #youcantseeme #Nartem A post shared by @ johncenaismarried on Oct 14, 2020 at 7:18pm PDT -
లాక్డౌన్లో వెడ్ లాక్
‘క్రేజీ స్టుపిడ్ లవ్, అమేజింగ్ స్పెడర్ మేన్, లా లా ల్యాండ్’ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. మూడేళ్లుగా నటుడు, రచయిత డేవ్ మెక్యారీ, ఎమ్మా డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్డౌన్ వల్ల గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారనే వార్త ఈ మధ్య ప్రచారంలోకొచ్చింది. దానికి కారణం ఈ జంట మ్యాచింగ్ రింగులు ధరించి కనిపించడమే. ప్రచారంలోకొచ్చిన వార్త నిజమే. ఈ ఇద్దరూ లాక్డౌన్లో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు. -
ప్రభుత్వ కార్యాలయంలో..‘ఛీ’ కటి పడ్డాక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఆయనో కీచకుడు. అభాగ్యులు, ఆసరాలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. జిల్లాలో గత నాలుగేళ్లుగా అతని కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎందరో దివ్యాంగ మహిళలు, యువతులు నలిగిపోయారు. తల్లిదండ్రులు లేని అభాగ్యులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతుంటాడు. ఉన్నత చదువులు అభ్యసించిన వారికి సంక్షేమ పథకాలను ఎరగా వేసి లోబర్చుకుంటాడు. తన మాట వినకపోతే అసభ్య పదజాలంతో విరుచుకుపడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎదుటి వారిని భయపెట్టి తన కార్యాన్ని చక్క బెట్టుకుంటుంటాడు. దర్యాప్తుల పేరుతో ఇళ్లలో చొరబడి.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో ఇతను ప్రత్యేక దర్యాప్తులు చేపడుతుంటాడు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు, వసతి గృహాల వద్దకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుంటాడు. ఇంటి బయట కూర్చొని మాట్లాడుదాం అంటూ దరఖాస్తుదారులు అంటున్న వినకుండా బలవంతంగా లోపలకు చొరబడి మాటలతో వారిని మాయ చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతని వ్యవహారం పలుమార్లు వివాదస్పదమైంది. అయితే తనకు సహకరించకపోతే సంక్షేమ పథకాల లబ్ధి చేకూరకుండా చేస్తానంటూ బెదిరించి పలువురిని లోబర్చుకున్నట్లు సమాచారం. వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ఈయన సమాజపరంగా పెద్ద నటుడు. సందర్భానుసారంగా రంగులు మారుస్తూ.. దివ్యాంగులకు సేవ చేయడానికే తాను ఉన్నట్లు నటిస్తుంటాడు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో వారే తన సర్వస్వంగా పెద్ద బిల్డప్ చూపిస్తూ మంత్రులను, ఉన్నతాధికారులను సైతం బురిడి కొట్టిస్తుంటాడు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అతను.. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాతే అందరికీ అందుబాటులోకి వస్తాడు. సాధారణంగా కార్యాలయం వేళలు సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తాయి. ఈయన మాత్రం ఆరు గంటల తర్వాత కార్యాలయానికి చేరుకుంటాడు. ఇదే విషయాన్ని లబ్ధిదారు మహిళలకు తెలిపి.. కార్యాలయం వద్దకు రమ్మని ముందుగానే ఆదేశిస్తాడు. సమయం కాకపోయినా.. గత్యంతరం లేని స్థితిలో వారు అతను చెప్పినట్లు కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. రహస్య వివాహం జిల్లాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని ఆ అధికారి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆమెను కార్యాలయంలోని ఓ ఉద్యోగి, వికలాంగుల సంఘం నాయకులే ఒప్పించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా నగర శివారులోని ఓ ప్రాంతంలో ఆమెతో రహస్యంగా కాపురం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారం లేని ఆమెకు బ్యాక్లాగ్ పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లోను ఇదే తంతు గతంలో చిత్తూరు జిల్లాలో విధులు పనిచేసిన సమయంలోనూ అతను ఓ దివ్యాంగురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె సోదరులు, ఇతరు దివ్యాంగులు కలిసి తగిన శాస్తి చేశారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అదే తంతును ఇక్కడ కొనసాగిస్తూ నాలుగేళ్లుగా టీడీపీ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయాడు. వికలాంగ సంక్షేమ సంఘాలకు చెందిన కొందరు నాయకులను మచ్చిక చేసుకుని తన కార్యకలాపాలను ఇక్కడ కూడా విస్తరించినట్లు సమాచారం. -
ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. పొమ్మన్నాడు..!
సాక్షి, విశాఖపట్నం: ఇద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరారు. కొన్నాళ్లకు మనసులు కలిశాక ఒకరికొకరు చేరువయ్యారు. ఆమెను పెళ్లాడుతానని మాటిచ్చాడు. ఇద్దరి మతాలు వేరవడంతో తమ తల్లిదండ్రులు పెళ్లికి ఇష్టపడరని ప్రియుడు ప్రియురాలికి చెప్పి ఆమెతో సహజీవనం సాగించాడు. అతడిని నమ్మిన ఆమె తన శరీరాన్నే కాదు.. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయల జీతాన్నీ ఇచ్చేసింది. ఇలా నాలుగేళ్లు గడిచాక ఉన్నత విద్యాభ్యాసం పేరిట పోలెండ్‌కు వెళ్లిపోయాడు. అటు నుంచి వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు.. కానీ ప్రియురాలిని కాదు.. మరో యువతిని. ఆ సంగతి తెలిసిన ప్రియురాలు నిలదీయడంతో మతాలు వేరు కావడం వల్ల తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, మరో దారి చూసుకోమని సలహా ఇచ్చి భార్యతో పోలెండ్ వెళ్లిపోయాడు. పరాయి రాష్ట్రం జార్ఖండ్ నుంచి వచ్చిన ఆమె విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విశాఖలోని ప్రియుని ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమవుతోంది. తనలా మరో యువతి మోసపోకూడదంటూ ఆమె పోరుబాట పట్టనుంది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సోనీకుమారిసింగ్, విశాఖ పరిధి కంచరపాలెంకు చెంది న రఫీషేక్‌లు విశాఖ రుషికొండలోని సదర్లాండ్ గ్లోబల్ కంపెనీ అనే బీపీవో సంస్థలో సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగం చేసేవారు. అక్కడ వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల అనంతరం 2012లో ఆ సంస్థ శాఖ విశాఖలో మూతపడడంతో ఉద్యోగులను చెన్నైకి బదిలీ చేసింది. సోనీకుమారి, రఫీషేక్‌లు చెన్నైకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికొచ్చిన వీరు చెన్నై, ఢిల్లీల్లో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఉన్నత విద్యనభ్యసిస్తే మెరుగైన ఉద్యోగం వస్తుందని, అప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవచ్చని, పెళ్లికి తమ తల్లిదండ్రులను కూడా ఒప్పించానని సోనీని రఫీ నమ్మించాడు. అక్కడ చదువుకు రూ.2 లక్షలు అవసరమవుతుందని చెప్పడంతో తాను కష్టించి సంపాదించిన జీతం సొమ్మును ఇచ్చింది. దీంతో రఫీ 2013లో పోలెండ్ ఉన్నత చదువులకు వెళ్లాడు. అప్పటి నుంచి ఏటా ఒకసారి వచ్చి చెన్నైలో ఉంటున్న సోనీతో కొన్నాళ్లు గడిపి వెళ్లేవాడు. అక్కడ చదువు పూర్తి కాగానే ఉద్యోగంలోనూ చేరాడు. 2018లో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో సోనీ తమ వివాహం గురించి రఫీని ఒత్తిడి చేసేది. 2017 సెప్టెంబర్ వరకు సఖ్యతగా ఉన్న ఆయన ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇద్దరివి వేర్వేరు మతాలు కావడంతో ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, అందువల్ల మరొకరితో వివాహం చేసుకోవాలని సూచించాడు. అందుకు ఆమె సమ్మతించకపోవడంతో తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కొంత సమయం కావాలన్నాడు. ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేని సోనీకుమారి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగాన్ని వదిలేసి రాంచీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలో ఈ ఏడాది జనవరి 7న రఫీ మరొక మహిళను విశాఖలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న సోనీకుమారి అదే నెల 10న కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేసిన రఫీ షేక్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటిదాకా రఫీపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, పైగా ఆ కుటుంబంతో రాజీ కుదుర్చుకోమని సలహా ఇస్తున్నారని సోనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జాయింట్ పోలీస్ కమిషనర్ డి.నాగేంద్రకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. రఫీ ఇంటి ముందు ఆందోళనకు దిగుతా రఫీ షేక్ నన్ను మోసం చేసి మరో మహిళను పెళ్లాడాడు. ఆర్థికంగానూ నష్టపరిచాడు. నాలా మరే మహిళా రఫీ చేతిలో మోసపోకూడదు. అందుకే రఫీ ఇంటి ఎదుట ఆందోళన చేపడతా. నాకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తా. – సోనీకుమారిసింగ్, బాధితురాలు అరెస్టు నోటీసులు జారీ చేశాం బాధితురాలు సోనీకుమారిసింగ్ ఫిర్యాదు మేరకు రఫీషేక్ అరెస్టుకు నోటీసులు జారీ చేశాం. సోనీకుమారి ఢిల్లీలోనూ రఫీషేక్‌తో సహజీవనం చేయడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించాం. కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఢిల్లీకి పంపుతాం. – డి.నాగేంద్రకుమార్, జాయింట్ పోలీస్ కమిషనర్ -
ఇలియానా పెళ్లైపోయింది!
ముంబై: హీరోయిన్ ఇలియానా పెళ్లిపై గత కొంతకాలంగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబొనెతో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పరోక్షంగా వెల్లడించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్ చేసింది. తాను షేర్ చేసిన ఫొటో తన భర్త(హబ్బీ) ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు అంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో ముంబై రెస్టారెంట్లో జంటగా కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి బాలీవుడ్ కార్యక్రమాలు, వేడుకలకు జంటగానే హాజరవుతూ వచ్చారు. తామిద్దరి ఫొటోలను ఇలియానా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తుండటంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అప్పట్లోనే అంతా అనుకున్నారు. My favourite time of the year ♥️ #christmastime #happyholidays #home #love #family Photo by hubby @andrewkneebonephotography ♥️ A post shared by Ileana D'Cruz (@ileana_official) on Dec 23, 2017 at 3:54am PST -
శ్రుతి రహస్య వివాహం..?
సాక్షి , సినిమా: నటుడు కమలహాసన్ వారసురాలు, నటి శ్రుతీహాసన్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కారు. శ్రుతికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సెల్‌తో శ్రుతీహాసన్ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ముంబైలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లి సారికకు పరిచయం చేశారు. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా శ్రుతీహాసన్, తన బాయ్ ఫ్రెండ్‌ను రహస్య వివాహం చేసుకున్నట్లు వైరల్ అవుతోంది. శ్రుతి పట్టుచీరతో ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ పట్టుపంచె, చొక్కాలతో దర్శనమిచ్చిన ఫోటోలు.. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారానికి దోహదమయ్యాయి. విశేషం ఏమి టంటే ఈ ఫొటోలో నటుడు కమలహాసన్ కూడా పట్టు వస్త్రాల్లో ఉన్నారు. దీంతో నిజంగానే శ్రుతి పెళ్లి జరిగిపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే బుధవారం దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మనవడు ఆదవ్ వివాహం జరిగింది. ఈ వివాహాంలో నటుడు కమలహాసన్, కూతురు శ్రుతిహాసన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌లు పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. -
ఆ వదంతులు నమ్మవద్దు: జబర్దస్త్ నటుడు
హైదరాబాద్ (బంజారాహిల్స్): తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ప్రముఖ హాస్యనటుడు హైపర్ ఆది పేర్కొన్నారు. ఇటీవల తాను రహస్యంగా బుల్లితెర నటిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని 'జబర్దస్త్' కామెడీ షో నటుడు చెప్పారు. పెళ్లి వదంతులపై బుల్లితెర నటుడు హైపర్ ఆది ‘సాక్షి’తో మాట్లాడారు. తానింకా ప్రేమపై దృష్టిసారించలేదని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి చేసుకుంటానన్నారు. ఆట కదరా శివ అనే సినిమాలో తాను ఓ పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. దీప్తి అనే నటితో పెళ్లి సీన్ ఇటీవల చిత్రీకరించారని ఆ సీన్‌ను ఎవరో లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. దానిని చూసి తన పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగిందని ఆది వివరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని ఆయన వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని అయితే రెండేళ్లు ఆగాల్సిందేనని ఆది స్పష్టంచేశారు. -
నవ దంపతులపై దాడి
► ఐదుగురిపై కేసు కేకేనగర్ : తంజావూరు జిల్లా పాపనాశం సమీపంలో పెళ్లి జరిగిన 30 నిమిషాలకే నవ వధువు తరఫు వారు దాడి జరపడంతో సంచలనం కలిగింది. దీనికి సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తంజావూరు సమీపంలో గల కరందై వీధికి చెందిన మణివన్నన్. ఇతని కుమారుడు రాజేష్ (22). బీబీఏ చదివి మినీబస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఒరత్తనాడు సమీపంలో గల వడక్కుర్ ప్రాంతానికి చెందిన వీరరాజు కుమార్తె అభినయ (22)ను ప్రేమించాడు. ఈ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. సోమవారం అభినయ, రాజేష్ పాపనాశనం తాలూకా కార్యాలయం వెనుక గల దుర్గమ్మన్ ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయం అభినయ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆగ్రహించిన వారు పదిమందితో ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ పెళ్లి చేసుకున్న రాజేష్, అభినయ దంపతులపై దుడ్డుకర్రలతో దాడి చేసి గాయపరిచారు. వెంటనే ప్రేమ జంట తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పాపనాశం సహాయ పోలీసు సూపరింటెండెంట్ సెల్వరాజ్ వారి వద్ద విచారణ జరిపారు. రాజేష్, అభినయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. -
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
పెరంబూర్: హీరోయిన్ మనీషా యాదవ్ ప్రేమించిన ప్రియుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వళక్కు ఎన్ 18/9 తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన నటి మనీషా యాదవ్. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం, పట్టౖయె కెలప్పనుమ్ పాండియా, త్రిష ఇల్లన్న నయనతార చిత్రాల్లో నటించిన మనీషాకు ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన చెన్నై28–2 చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో మెరిసింది. ఆ తరువాత అవకాశాలు తలుపు తడుతున్నా అంగీకరించడం లేదని సమాచారం. ఈ అమ్మడు ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగింది. అది నిజమైంది. బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్త వార్నిడ్ను ప్రేమించిన మనీషా రెండు రోజుల క్రితం రహస్య వివాహం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరికీ చివరికి తనను పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ శక్తివేల్‌కి కూడా ఆహ్వానం పంపలేదు. దీని గురించి మనీషా తల్లి యమున తెలుపుతూ ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే మనీషా పెళ్లి జరిగిందని అన్నారు. వివాహానంతరం మనీషా నటిస్తుందా? లేదా? అన్నది తన భర్త నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
హత్య కేసులో వీడుతున్న చిక్కుముడులు
‘సాక్షి’ కథనంతో కదలిక బయటపడ్డ గౌతమి, బుజ్జి పెళ్లి నాటి ఫొటోలు సాక్షి నరసాపురం: రోడ్డు ప్రమాదం పేరుతో శ్రీగౌతమిని హత్య చేశారనే విషయం రూఢి అయింది. తమను నలుగురైదుగురు కారులో వెంబడించి మరీ ఢీకొట్టారని శ్రీగౌతమి సోదరి పావని చెబుతోంది. సజ్జా బుజ్జి భార్య శిరీష, ఆమె కారు డ్రైవర్ రాంబాబు కలసి హత్య చేయించారని రోదిస్తోంది. శ్రీగౌతమి, బుజ్జి రహస్య వివాహానికి చెందిన ఫొటోలు బయటకు వచ్చాయి. 2016 జనవరిలో బుజ్జి అన్నవరంలో శ్రీగౌతమిని వివాహం చేసుకున్నాడు. అయినా పోలీసులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. చదవండి...(ఐఏఎస్ కావాల్సిన యువతి...) కేసు మాఫీకి ఎమ్మెల్యే ప్రయత్నం! టీడీపీ నేత సజ్జా బుజ్జి టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంటాడనే పేరుంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు కేసును పక్కదోవ పట్టించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు ప్రచారం జరుగు తోంది. జిల్లాలోని మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెబుతున్నారు. రోడ్డెక్కిన విద్యార్థి, మహిళా సంఘాలు ఈ కేసుతో సంబంధం ఉన్న సజ్జా బుజ్జి, అతని భార్యను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహిం చారు. కాపు సంఘం ముఖ్య నేతలు సమావేశమై ఘటనను ఖండించారు. దీంతో బుజ్జి కుటుంబీకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసుల అదుపులో కారు డ్రైవర్ కేసు పురోగతిపై పాలకొల్లు సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా కారు డ్రైవర్ కడియాల ప్రసాద్ (24)తోపాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.కాగా సోమవారం ఉదయం వైజాగ్ నుంచి కారు డ్రైవర్‌ను తీసుకువచ్చి ఎస్పీ వద్దకు తీసుకు వెళ్లినట్టు సమాచారం. -
హత్య కేసులో వీడుతున్న చిక్కుముడులు
-
రహస్య పెళ్లి ట్వీట్‌తో షాకిచ్చారు!
ఆ జోడీ ఒలింపిక్స్‌లో మొత్తం పది స్వర్ణాలు గెలిచింది. తాజాగా ముగిసిన రియో ఒలింపిక్స్‌లోనూ ఐదు స్వర్ణాలు గెలుచుకొని తమ దేశానికి గర్వకారణంగా నిలించింది. ఆ జంట ఆదివారం తమ అభిమానులకు షాకిచ్చింది. తాము ఎవరికీ తెలియకుండా గప్‌చుప్‌గా పెళ్లిచేసుకున్నామని ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. వారే బ్రిటన్ సైక్లింగ్ క్రీడాకారులు జాసన్ కెన్నీ, లారా ట్రోట్. ఈ జోడీ రియో ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు గెలుచుకుంది. జాసన్ కెన్నీ ఆదివారం ఓ ఆస్తకికరమైన ట్వీట్ చేశాడు. ’గుడ్ మార్నింగ్.. మిసెస్ కెన్నీ’ అంటూ మారిటల్ బెడ్ మీద ఉన్న లారా ట్రోట్ ఫొటోను ట్వీట్ చేశాడు. దీంతో వారి పెళ్లికబురు బయటి ప్రపంచానికి తెలిసింది. జాసన్ కెన్నీ, లారా ట్రోట్ జంట శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ వేడుక పూర్తిగా ప్రైవేటు వ్యవహారంగా బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా జరిగింది. ఈ పెళ్లి వేడుకను కవర్ చేసేందుకు ఓ మ్యాగజీన్ భారీమొత్తంలో ఆఫర్ చేసినా.. దానిని ఈ జంట తిరస్కరించినట్టు సమాచారం. మరోవైపు లారా కూడా తమ పెళ్లి వేడుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను పోస్టు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు సైక్లింగ్క్రీడలో జంటగా, వ్యక్తిగతంగా ఆడుతూ బ్రిటన్‌కు పలు పతకాలు తెచ్చిన కెన్నీ-లారా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్
పిచ్చైక్కారన్ చిత్ర నాయకి సాట్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన పిచ్చైక్కారన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సాట్నాటైటస్. ఆ చిత్రం తమిళంలో విజయవంతమైన విషయం, అంతకంటే సంచలన విజయాన్ని అనువాద చిత్రంగా తెలుగులో సాధించిన విషయం తెలిసిందే. దీంతో నటి సాట్నాకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం మెదలెట్టాయి. అయితే పిచ్చైక్కారన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల ముందే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం కాస్త ఆలస్యంగా బయట పడింది. దీంతో సాట్నా నటించడానికి అంగీకరించిన తిట్టం పోట్టు తిరుడర కూట్టం చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే విధంగా అమీర్ దర్శకత్వంలో నటించడానికి సంగదేవన్ చిత్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా నటి సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా మళ్లీ వివాహం చేసుకుంటామని పేర్కొనడం గమనార్హం. సాట్నా చిత్రాలను తగ్గించుకుంటున్నార ని, పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నారని, ఇది తామిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. మరి వీరి వివాహ తంతు ఎటు దారి తీస్తుందో చూద్దాం. -
ఔను.. ప్రేమలో పడ్డాను!
నటి ప్రియమణి రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. పరుత్తివీరన్ చిత్రంతో కోలీవుడ్ దృష్టిని తనపై పడేలా చేసుకున్న మాలీవుడ్ బ్యూటీ ప్రియమణి. ఆ చిత్రంలో ముత్తళిగి పాత్రలో జీవించి జాతీయ అవార్డును అందుకున్న ఈ భామ ఆ తరువాత కమర్షియల్ పాత్రపై మోహం పెంచుకుని కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తరువాత అవకాశాలు దూరం అవడంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ కొన్నిఅవకాశాలను దొరకపుచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. అరుుతే తాజాగా కన్నడ నటుడు గోవింద్ పద్మ సూర్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ప్రియమణి కొట్టి పారేసింది. అవన్నీ వదంతులేనని తేల్చి చెప్పేసింది. ఈ వదంతులపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తాను అంబిరిషా అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో దర్శిన్ హీరోగా నటిస్తున్నారని చెప్పారు. ఇందులో పొగరుబోతు అమ్మాయిగా నటిస్తున్నానని తెలిపింది. ఎప్పుడూ బిజినెస్, డబ్బు గురించే ఆలోచించే అమ్మాయి పాత్ర అని వెల్లడించింది. ఎవరినీ తనకు సమఉజ్జీగా భావించకుండా తన మాటే వినాలనే మనస్తత్వం గల యువతిగా నటిస్తున్నానని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే పడయప్పా చిత్రంలో నీలాంబరి తరహా పాత్ర తనదని తెలిపింది. ఇకపోతే తనకు పెళ్లి అయ్యిందనే ప్రచారం తరచూ జరుగుతోందని ఈసారి వరుడి పేరు కూడా ప్రస్తావిస్తూ వదంతులు ప్రచారం చేసేస్తున్నారని అంది. నిజానికి అలాంటిది ఏదైనా జరిగితే ముందుగా మీకే తెలియచేస్తానని అంది. తానొకరిని ప్రేమిస్తున్న విషయం నిజమే కానీ, అది గోవింద పద్మ సూర్య కాదని, సమయం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతానని ప్రియామణి పేర్కొంది. -
పెళ్లికి తొందరేముంది
పెళ్లికిప్పుడే తొందరేముంది తనకిప్పుడు యుక్త వయసే కదా అంటోంది అంజలి. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కొద్ది మంది హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. అంగాడి తెరు చిత్రంతో కోలీవుడ్‌లో కథానాయికగా గుర్తింపు పొందిన అంజలి అచ్చ తెలుగు అమ్మాయన్నది గమనార్హం. ఆ తరువాత వరుసగా ఎంగేయుం ఎప్పోదుం, కలగలప్పు వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో తన పినతల్లి భారతీ దేవితో విభేదాలు, దర్శకుడు కలైంజియంతో వివాదాల కారణంగా కోలీవుడ్‌లో కలకలం పుట్టించారు. దీంతో కొంత కాలం కోలీవుడ్‌కు దూరమైన అంజలిపై పలు వదంతులు ప్రచారమయ్యాయి. అందులో ఒకటి అంజలి ఒక తెలుగు నిర్మాతను రహస్య వివాహం చేసుకున్నారన్నది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించారు. అయినా ఆమెపై పెళ్లి దుమారం ఆగలేదు. దీనికి తాజాగా స్పందించిన అంజలి తనకింకా యుక్తవయసే కదా పెళ్లకి తొందరేమీలేదు అన్నారు. పెళ్లికి చాలా సమయం ఉందన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనేనని వెల్లడించారు. ఆమె సన్నిహితులు మాత్రం అంజలికి కోర్టులు, కేసులు అంటూ చాలా ఖర్చు అయ్యింది. అదంతా తిరిగి సంపాదించిన తరువాతనే వివాహం గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో సురాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జయం రవి సరసన నటిస్తున్నారు. -
ప్రేమ జంటకు సాయం.. తీసింది ప్రాణం!
రహస్య వివాహానికి సాయం చేసినందుకే విద్యార్థిని ఆత్మహత్య స్నేహితురాలి వేదన తీర్చలేదన్న బాధతో అఘాయిత్యం పోలీసుల అనుమానాలు సాగర్‌నగర్: స్నేహితురాలి రహస్య వివాహానికి చేసిన సాక్షి సంతకమే ఆమె ప్రాణాలు తీసింది. ఓ ప్రేమ జంటకు సాయం చేసిన ప్రయత్నం చివరకు ఆమె ఆత్మహత్యకు దారి తీసింది. పార్వతి అనే విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఆమె స్నేహితురాలు అనూష రహస్య వివాహమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో వార్డు పరిధి పెదగదిలిలో విద్యార్థిని ఎం.పార్వతి (19) శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం విదితమే. ఈ కేసుపై ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆదివారం కొన్ని కీలక విషయూలను పోలీసులు వెల్లడించారు. సీఐ సీహెచ్ ధనుంజయ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న పార్వతి, అనూష, సునీత స్నేహితులు. వారు తరచూ మద్దిలపాలెం నుంచి పెదగదిలిలో ఉంటున్న రామిరెడ్డి వద్దకు సందేహాల నివృ త్తి కోసం వస్తుండేవారు. మాచర్ల ప్రాంతం ధర్మవరానికి చెందిన రామిరెడ్డి నగరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష, రామిరెడ్డి మధ్య ప్రేమ చిగురించింది. సుమారు రెండు నెలల క్రితం వారిద్దరూ రహస్యంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి వివాహానికి పార్వతి సాక్షి సంతకం పెట్టింది. రిజిస్ట్రేషన్ పత్రాలు రామిరెడ్డి వద్ద ఉన్నాయి. కొద్ది రోజులుగా రామిరెడ్డికి, అనూషకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో రెండు రోజులుగా రామిరెడ్డి ఎక్కడికో వెళ్లిపోయి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో రామిరెడ్డి వద్ద ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకురావాలని, సాక్షి సంతకం పెట్టినందుకు నీదే బాధ్యతని పార్వతిపై అనూష ఒత్తిడి తీసుకొచ్చింది. పార్వతి కూడా రామిరెడ్డికి ఫోన్‌చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో స్నేహితురాలికి సాయం చేయలేకపోయూనన్న మనస్తాపంతో పార్వతి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రామిరెడ్డి ఆచూకీ తెలిస్తేగాని అసలు విషయం బయటపడదని, అతని ఆచూకీ త్వరలో కనుగొంటామని సీఐ తెలిపారు. -
శర్వంతి రహస్య వివాహం
లైఫ్ ఆఫ్ పై ఆంగ్ల చిత్రం హీరోయిన్ శర్వంతి వ్యాపార వేత్తను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈ భామ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. లైప్ ఆఫ్ పై చిత్రం గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులతో పాటు మొత్తం ఎనిమిది ఆస్కార్లను గెలుచుకున్న గొప్ప చిత్రం లైఫ్ ఆఫ్ పై. పుదుచ్చేరికి చెందిన సూరజ్ శర్మ హీరోగా నటించిన ఈ చిత్రంలో చెన్నైకి చెందిన శర్వంతి హీరోయిన్గా నటించారు. ఈ భామకు వ్యాపార వేత్త సమీర్ భరత్‌రామ్‌కు మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఈ ప్రేమ జంట ఇటీవల అనూహ్యంగా రహస్య వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నిడారంబరంగా జరిగింది. అయితే పెళ్లి కారణంగా శర్వంతి నట జీవితానికి ఎలాంటి ఆటంకం కలగదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శర్వంతికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయని, వాటిని అంగీకరించే విషయమై చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. తన రహస్య వివాహం గురించి శర్వంతిని అడగ్గా అయ్యో ఆ వ్యవహారం గురించి ఇప్పుడెందుకులే అంటూ నిట్టూర్చారు. అయితే ఈ వివాహం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదని సమాచారం. -
కామ్నకు పెళ్లయిపోయిందా?
కథానాయిక కామ్న జఠ్మలానీకి పెళ్లయిపోయిందా? మూడు నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్‌తో ఆమె వివాహం జరిగిందని, ఆ వేడుకకు తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు కథానాయికలను మాత్రమే కామ్న ఆహ్వానించారని వినికిడి. ‘ప్రేమికులు’ సినిమాతో నాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ రణం, సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్ఎంపీ లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే ‘భాయ్’లో నాగార్జునతో కలిసి నటించారు. ఈ పెళ్లి వార్త రూమరా? ఒకవేళ నిజమైతే కామ్న ఎందుకు రహస్యంగా ఉంచినట్టు? అసలు నిజం కామ్నానే చెప్పాలి. -
సమంత రహస్య వివాహమా?
నిత్యం వార్తల్లో ఉంటోన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ చెన్నై బ్యూటీపై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే రహస్యంగా వివాహం చేసుకోనుందని ప్రచారం సాగుతోంది. ఈ వదంతులపై సమంత స్పందించింది. తన వివాహం గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒకరితో సహజీనం చేస్తున్నానని, రహస్యంగా వివాహం చేసుకోనున్నానని అంటున్నారని పేర్కొంది. ఇవన్నీ అబద్ధాలని స్పష్టం చేసింది. అసలు తానెందుకు రహస్యంగా వివాహం చేసుకోవాలని ప్రశ్నించింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని, కొన్నేళ్ల తర్వాతే దీని గురించి ఆలోచిస్తానని వివరించింది. తాను వివాహం చేసుకునే ముందు అందరికీ తెలియజేస్తానని పేర్కొంది. వచ్చే ఏడాది తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారిస్తానని స్పష్టం చేసింది. తాను నటించిన తెలుగు చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని చెప్పింది. తర్వాత తెలుగు చిత్రం ఏదీ అంగీకరించేది లేదని తెలిపింది. ఇటీవలి ఆమెను ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోందని మీడియా అడిగిన ప్రశ్నకు 'చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం'అని చెప్పింది కూడా. -
వాళ్లిద్దరికి పెళ్లయిపోయిందా!
గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన సమంత, సిద్ధార్థల ప్రేమ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఈసారి వారిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిపోయినట్లు కొన్ని తమిళ పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. సమంత, సిద్ధార్థల కుటుంబ సభ్యులతో పాటు, పరిమిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగిట్లు ఆ పత్రికలు పేర్కొన్నాయి. సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలసి జబర్దస్త్ అనే తెలుగు చిత్రంలో నటించారు. ఆ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారమైంది. ఆ తర్వాత సిద్ధార్థ, సమంత కుటుంబసభ్యులు శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుని రాహుకేతువు పూజ నిర్వహించారు. దాంతో వారి ప్రేమ వ్యవహారంపై వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై స్పందించిన సిద్ధార్థ అది తమ వ్యక్తిగత వ్యవహారమని, ప్రచారాలకు పుల్‌స్టాప్ పెట్టాలని ట్విట్ట్ చేశారు. కాగా సిద్ధార్థ తన స్నేహితురాలు మేగ్నాని 2003లో ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అయితే వారి పెళ్లి మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది దాంతో వారిద్దరూ 2006లో విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకూ బయట పొరపాటున కూడా మాట్లాడక పోవటం విశేషం. ఇక సమంత అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనుగాక చేసుకోను...నాకు నచ్చినోడ్ని నా పెద్దలకు పరిచయం చేసి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది కూడా. అంతే కాకుండా తాను ఓ వ్యక్తి ప్రేమలో ఉన్నానని, అయితే ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఇప్పుడే కాదని దానికి చాలా టైమ్ ఉందనీ ఆ సమయం వచ్చినప్పుడు తాను మెచ్చినవాడ్ని అందరికి పరిచేయం చేస్తానని సమంత చెప్పింది కూడా ప్రేమ వివాహమే..అని చెప్పడానికి తనకు భయం లేదనీ ప్రేమిస్తేనే ఒకర్ని ఒకరు అర్థం చేసుకొని జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలవుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని సమంత అబిప్రాయపడింది. ప్రస్తుతం సమంత కెరీర్ టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. ఆమె అయిదు చిత్రాల్లో నటిస్తుండగా, వాటిలో రెండు చిత్రాలు దాదాపు పూర్తయ్యాయి. తమిళంలోనూ ఈ చిన్నది బిజీబిజీగా ఉంది. సిద్ధార్థ కూడా తెలుగుతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఇటీవల తమిళంలో నటించిన ఓ చిత్రంలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. సిద్ధూ కోరిక మేరకే ఆమె ఈ పాత్ర పోషించినట్లు కోలీవుడ్ టాక్. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఓ తెలుగు ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమంత దక్షిణాది సంప్రదాయంలో నిండుగా పట్టు చీర కట్టుకొని, జడ ముడి వేసుకొని ఆ ముడి చుట్టు నిండైన పూలు అలంకరించుకొని అప్పటికే పెళ్లి అయిపోయిన గృహిణిలా రావడం అందరినీ ఆశ్చర్య పరచింది. అలాగే ఇటీవల సిద్ధార్థ స్నేహితుడి వివాహ వేడుకలోనూ సిద్దార్థ, సమంత హంగామా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై వారిద్దర్లో ఎవరూ ఒకరు పెదవి విప్పితే కాని పెళ్లి గుట్టు బయటపడే అవకాశం ఉంది.