బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. సొన్నాల్లి సెగల్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్యార్ కా పంచ్‌నామా మూవీ నటి సొన్నాల్లి సెగల్ ఆమె ప్రియుడు అషేష్ ఎల్ సజ్నానీని సీక్రెట్‌గా వివాహాం చేసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట జూన్ 7న ముంబయిలో ఒక్కటి కాబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పెళ్లికి కేవలం ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. నటి ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా సోమవారం మెహందీ వేడుకను జరుపుకున్నట్లు తెలిపారు.
(ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!)
కాగా.. 34 ఏళ్ల సొన్నాల్లి సెగల్ మే నెల ప్రారంభంలోనే తన బ్యాచిలరేట్ పార్టీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి గురించి ఎక్కడా కూడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతేడాది డిసెంబరులో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. నటి సొన్నాల్లి సెగల్ చివరిసారిగా 'అనామిక' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అందులో రియా పాత్రను పోషించింది. ప్రస్తుతం నూరానీ చెహ్రా, బ్లాక్ కరెన్సీ అనే ప్రాజెక్టుల్లో నటించనున్నారు.
(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?)
Comments
Please login to add a commentAdd a comment