బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఈ ఫొటో చూసిన సల్మాన్ అభిమానులు చడీచప్పుడు లేకుండా మా హీరో పెళ్లి చేసుకోవడమేంటి? అది కూడా రహస్యంగానా? ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్‌గా, ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలెక్కేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
నిజమేంటంటే సల్మాన్ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అతడింకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గానే ఉన్నాడు. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఇక ఆ ఫొటో సంగతంటారా? అది కేవలం మార్ఫింగ్ ఫొటో లేదా ఏదైనా సినిమా స్టిల్ అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కాగా సల్మాన్, సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'కబీ ఈద్ కబీ దివాళి' సినిమా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment