![Sonakshi Sinha Reacts On Morphing Marriage Picture With Salman Khan - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/5/Sonakshi-Sinha-Reacts-On-Morphing-Marriage.jpg.webp?itok=ozIj_jeH)
దబాంగ్ జంట సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే! కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ టెక్నిక్‌తో సల్మాన్.. సోనాక్షి వేలికి ఉంగరం తొడుగుతున్నట్లు సృష్టించారు. ఇది నిజమని భ్రమపడిన చాలామంది దాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేశారు. తాజాగా ఈ సీక్రెట్ పెళ్లి వార్తలపై స్పందించింది సోనాక్షి. సల్మాన్, తనకు ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉన్న వైరల్ ఫొటో కింద దాన్ని నిజమని నమ్మినవాళ్లని మూర్ఖులుగా అభివర్ణించింది.
చదవండి: సల్మాన్ ఖాన్ సీక్రెట్ పెళ్లి, వైరల్‌గా మారిన ఫొటోలో నిజమెంత?
'రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారయ్యారా?' అంటూనే మూడు లాఫింగ్ ఎమోజీలను తన కామెంట్‌కు జత చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ సోనాక్షి స్పందించకుండా ఉంటే సరిపోయేది, ఈ అటెన్షన్ కోసమే వాళ్లిదంతా చేసింది, చివరకు వాళ్లు అనుకున్నదే జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఫైనల్‌గా సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా ఈ రూమర్ వ్యాపించదు అని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment