కామ్నకు పెళ్లయిపోయిందా? | Kamna Jethmalani Secret Marriage Rumors? | Sakshi
Sakshi News home page

కామ్నకు పెళ్లయిపోయిందా?

Dec 13 2013 12:44 AM | Updated on Sep 2 2017 1:32 AM

కామ్నకు పెళ్లయిపోయిందా?

కామ్నకు పెళ్లయిపోయిందా?

కథానాయిక కామ్న జఠ్మలానీకి పెళ్లయిపోయిందా? మూడు నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

కథానాయిక కామ్న జఠ్మలానీకి పెళ్లయిపోయిందా? మూడు నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది. బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్‌తో ఆమె వివాహం జరిగిందని, ఆ వేడుకకు తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు కథానాయికలను మాత్రమే కామ్న ఆహ్వానించారని వినికిడి. ‘ప్రేమికులు’ సినిమాతో నాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ రణం, సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే ‘భాయ్’లో నాగార్జునతో కలిసి నటించారు. ఈ పెళ్లి వార్త రూమరా? ఒకవేళ నిజమైతే కామ్న ఎందుకు రహస్యంగా ఉంచినట్టు? అసలు నిజం కామ్నానే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement