వెకేషన్‌లో కోలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌: రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌! | Jyotika and Suriya vacation video goes viral amid divorce rumors | Sakshi
Sakshi News home page

వెకేషన్‌లో కోలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌: రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌!

Published Tue, Jan 30 2024 11:51 AM | Last Updated on Tue, Jan 30 2024 12:19 PM

Jyotika and Suriya vacation video goes viral amid divorce rumors - Sakshi

ఇదిగో పులి అంటే అదిగో తోక  అంటూ సోషల్ మీడియాలో వార్తలు  పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్‌ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి  స్టార్‌ హీరో సూర్య, నటి  జ్యోతిక విడాకుల వార్త.   తాజాగా  ఒక్క పోస్ట్‌తో  ఈ ఊహగానాలకు చెక్‌  చెప్పింది నటి జ్యోతిక.

భర్త సూర్యతో కలిసి జ్యోతిక  ఫిన్‌లాండ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.  గడ్డకట్టే చలి, చిల్లింగ్‌ స్నోలో  హాయిగా గడుపుతున్న  బెస్ట్ మూమెంట్స్ , క్యూట్‌ వీడియోని జ్యోతిక తన  ఇన్‌స్టాలో షేర్‌  చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్‌ చేసింది.  తద్వారా  ఈ రియల్‌ కపుల్‌ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్‌ స్టాప్‌  పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్‌ కపుల్‌ అంటూ కమెంట్స్‌ చేశారు. 

కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్‌ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన  జ్యోతిక  వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్‌లో కూడా  ఆఫర్లు  వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్‌మెంట్‌లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని  కూడా జ్యోతిక స్పష్టం చేసింది.

జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్‌లో  అద్బుతమైన నటనతో  ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన  పోటీపడి మరీ నటించి మెప్పించింది.  అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ,  ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో  వస్తున్న  బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్‌లో నటిస్తోంది.  షైతాన్ గుజరాతీ మూవీ వాష్‌కి రీమేక్‌గా వస్తోంది. 
 

/p>

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement