'కంగువ' ఫ్లాప్.. విపరీతమైన దైవభక్తిలో జ్యోతిక-సూర్య | Jyothika Trolled For Visiting Kollur And Tirupati Temple | Sakshi
Sakshi News home page

Jyothika Suriya: దేవాలయాల్ని సందర్శిస్తున్న జ్యోతికపై ట్రోల్స్

Published Wed, Nov 27 2024 1:19 PM | Last Updated on Wed, Nov 27 2024 3:15 PM

Jyothika Trolled For Visiting Kollur And Tirupati Temple

తమిళంలో ఇండస్ట్రీలో సూర్య-జ్యోతిక క్యూట్ కపుల్ అని చెప్పొచ్చు. ద్దగా వివాదాల జోలికి పోకుండా తమ పనేదో తమది అన్నట్లు ఉంటారు. గత కొన్నాళ్లుగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిక.. దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాల్ని సందర్శిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమెపై పాత వీడియోల తవ్వి తీసి మరీ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

2020లో ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. దేవాలయాలకు పెయింట్స్ వేయడం, మిగతా ఖర్చులు వృథా. అదే డబ్బుని ఆస్పత్రులు, స్కూల్స్ కోసం ఉపయోగించొచ్చు కదా అని మాట్లాడింది. అయితే డబ్బుని హాస్పిటల్స్, స్కూల్స్ కోసం ఉపయోగించాలని చెప్పడం బాగుంది కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల కోసం అంత ఖర్చు ఎందుకని చెప్పడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్)

అప్పట్లో అసలు గుడికి ఎందుకు వెళ్లడం అనే స్టేట్‌మెంట్ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా భర్త సూర్యతో కలిసి కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంది. చండీకా యాగం కూడా చేయించింది. కొన్నిరోజుల క్రితం ఇదే దేవాలయానికి ఎన్టీఆర్ కూడా వెళ్లాడు. తాజాగా బుధవారం ఉదయం సుప్రభాత సేవ టైంలో జ్యోతిక.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంది.

పెద్దగా బయటే కనిపించని జ్యోతిక.. ఇలా వరసగా ప్రముఖ దేవాలయాల్ని సందర్శించడం కాస్త విచిత్రమే. దీంతో గతంలో ఈమె మాట్లాడిన వీడియోలని బయటకు తీసి.. పలువురు నెటిజన్లు జ్యోతికని ట్రోల్ చేస్తున్నారు. కర్మ.. ఎవరినీ వదిలిపెట్టదు అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా సూర్య 'కంగువ' సినిమా.. థియేటర్లలో రిలీజై ఫ్లాప్ అయింది. భారీ నష్టాలు వచ్చాయి. మరి సినిమా ఫ్లాప్ అయిందని జ్యోతిక-సూర్య.. దేవాలయాల్ని సందర్శిస్తున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement