ఆమెతో మళ్లీ కలిసి నటించాలని ఉంది.. కానీ, ఒక కండీషన్‌: సూర్య | Actor Suriya Interested Comments On Acting With His Wife Jyothika, Deets Inside | Sakshi
Sakshi News home page

ఆమెతో మళ్లీ కలిసి నటించాలని ఉంది.. కానీ, ఒక కండీషన్‌: సూర్య

Published Mon, Nov 11 2024 8:49 AM | Last Updated on Mon, Nov 11 2024 9:40 AM

Suriya Interested Comment His Wife Jyothika

నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటించిన కంగువ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. నటి దిశాపటాని నాయకిగా నటించగా.. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా నటించారు. శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన భారీ బడ్జెట్‌ కథా చిత్రం ఇది. కాగా నటుడు సూర్య తన 44వ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. 

ఇదే క్రమంలో సూర్య తన 45 చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే సెట్‌ పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం కంగవ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య ఓ భేటీలో పేర్కొంటూ తన భార్య జ్యోతికతో కలిసి మళ్లీ నటించాలన్న కోరిక కలగానే మారిందన్నారు. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. అయితే,ఆ సినిమా కథకు జ్యోతిక అయితేనే సెట్‌ అవుతుంది అనేలా ఉండాలి కానీ, ఏదో సూర్య చెప్పాడని ఇరికించే ప్రయత్నం చేయకూడదన్నారు. తాను మాత్రం ఏ దర్శకుడిని తమ కోసం కథను సిద్ధం చేయమని కోరనన్నారు. 

సూర్య తన భార్యతో కలిసి మళ్లీ నటించాలన్న కోరికను వ్యక్తం చేయడంతో దర్శక, నిర్మాతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం నటి జ్యోతిక ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈమె తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారన్నది గమనార్హం. కాగా సూర్య, జ్యోతిక కెరీర్‌ ప్రారంభంలో పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌, ఉయి రిలే కలందదు, కాక్క కాక్క, పేరళగన్‌, మాయావి, సిల్ల న్ను ఒరు కాదల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement