video goes viral
-
యమపురికి దారి : యమధర్మరాజు లాంగ్ జంప్ పోటీ, వీడియో వైరల్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024 -
ప్రేమిస్తే.. అంతే! ప్రేయసి పనికి అందరూ అవాక్కు! వైరల్ వీడియో
పిల్లలు ప్రేమించుకుంటారు. అదేదో సినిమాలో అన్నట్టు ‘‘ఈ పెద్దవాళ్లు ఉన్నారే...’’ కారణాలు ఏవైనా పెళ్లికి వ్యతిరేకిస్తారు.. దాదాపు ప్రతీ ప్రేమ కథలోనూ ఈ ట్విస్ట్ ఉంటుంది. కానీ చావనైనా చస్తాను గానీ.. ప్రియుడిని వదిలేది అంటూ పట్టుబట్టిన ఒక ప్రేయసి కథ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్, జముయ్ జిల్లా టెటారియా గ్రామానికి చెందినవర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించు కున్నారు. ఇది తెలిపిన అమ్మాయి తరపు కుటుంబం వీరి ప్రేమను నిరాకరించింది. హడావిడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని చూసి మార్చి 11న పెళ్లి ముహూర్తం నిశ్చయించేశారు. పెళ్లి సన్నాహాలు ఊపందుకున్నాయి. అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో, తెలిసిన వారికి పెళ్లి కార్డులు పంపిణీ చేశారు. ఇక సమయం లేదు మిత్రమా అనుకుందేమో..సరిగ్గా పెళ్లికి ఎనిమిది రోజులు ఉండగా శనివారం రాత్రి వర్ష ఇంట్లోనుంచి పారిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా గుడిలో ప్రియుడు ఉమేష్‌ను పెళ్లాడింది. ఇంతలో కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.వీరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. జముయి జిల్లాలోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధునియామారన్ గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ గ్రామానికి చేరుకుని అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఇక్కడే హై డ్రామా నెలకొంది. #जमुई में तिलक और हल्दी की रस्म के बाद लड़की ने भागकर प्रेमी से शादी रचा ली। शिकायत पर पुलिस ने जब पकड़ा तो दोनों एक दूसरे से लिपट गए। #viralvideo @NavbharatTimes pic.twitter.com/ByfC46eZxp — NBT Bihar (@NBTBihar) March 4, 2024 అమ్మాయిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. పెద్ద తోపులాట జరిగింది. అయితే చావనైనా చస్తాను గానీ భర్తను వీడేది లేదంటూ అతడిని గట్టిగా వాటేసుకుంది. ఇద్దరినీ విడదీసేందుకు పోలీసులుఎంత యత్నించినా పట్టువీడలేదు. చివరికి పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ ఆ తరువాత మేజర్లు కావడంతో పోలీసులు కొత్త జంటను ఇంటికి పంపించారు. ఈ సంఘటన బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్‌గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్‌స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్‌కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
వెకేషన్లో కోలీవుడ్ క్యూట్ కపుల్: రూమర్స్‌కు ఫుల్స్టాప్!
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక విడాకుల వార్త. తాజాగా ఒక్క పోస్ట్‌తో ఈ ఊహగానాలకు చెక్ చెప్పింది నటి జ్యోతిక. భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఫిన్లాండ్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డకట్టే చలి, చిల్లింగ్ స్నోలో హాయిగా గడుపుతున్న బెస్ట్ మూమెంట్స్ , క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా ఈ రియల్ కపుల్ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కమెంట్స్ చేశారు. కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన జ్యోతిక వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని కూడా జ్యోతిక స్పష్టం చేసింది. జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన పోటీపడి మరీ నటించి మెప్పించింది. అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో వస్తున్న బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్‌లో నటిస్తోంది. షైతాన్ గుజరాతీ మూవీ వాష్‌కి రీమేక్‌గా వస్తోంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) /p> -
టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?
టాలీవుడ్ జక్కన ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త అవతార్ మెత్తాడు. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్ మేకింగ్‌లో అగ్ర దర్శకుడు రాజమౌళి తళుక్కుమన్నాడు. ఈ యాడ్‌కు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సెలబ్రిటీలు, స్టార్ ఆటగాళ్లు, సినిమా సూపర్ స్టార్లు మాత్రమే పలు బ్రాండ్లకు నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా కనిపించారు. కేవలం తమ వృత్తి ద్వారా మాత్రమే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్లుగా భారీగానే ఆర్జించారు. కానీ అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లుగా కనిపించి అరుదు. ఈ లోటును పూడ్చేందుకు మన దర్శకధీరుడు రడీ అయిపోయాడు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) ఒప్పో బ్రాండ్ రాజమౌళిని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన రాజమౌళికి టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో తనకున్న పాపులారిటీ, క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్యాన్ ఇండియా ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళితో ఒప్పో తన అప్‌కమింగ్ ఫోన్ రెనో 10 సిరీస్ వస్తున్న ఫోన్ ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. జూలై 10న ఈ ఫోన్ లాంచ్ కానుంది. రాజమౌళి డ్యుయల్ రోల్లో సూపర్బ్‌గా ఉన్న ఈ క్లిప్ వైరల్‌గా మారింది. హీరోలను మించి స్టైలిష్‌గా, హ్యాండ్సమ్గా డ్యుయల్ రోల్లో కనిపించిన తమ అభిమాన దర్శకుడిని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) కాగా కరియర్ పరంగా గురించి ఆలోచిస్తే..రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్లో మరో మూవీ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ రేంజ్లో ఉండబోతోందని హింట్ కూడా ఇచ్చేసి ఈ మూవీపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సూపర్ కాంబో మూవీ 2025లో రిలీజ్‌కానుందని అంచనా. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) @ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm — Hittu Cinma (@HittuCinma) June 28, 2023 -
క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో
ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటలకు హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వివరాలు సేకరించగా ఇద్దరు కూడా తప్పుడు పేర్లు చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డుల్లో తేలింది. వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రిఫిన్ (23), ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ (31)గా గుర్తించారు. తప్పుడు వివరాలు చెప్పడంతో పాటు వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులుకు సహకరించాల్సింది పోయి పెనుగులాటకు దిగాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. వారు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు. 🚨Officer Involved Shooting 📌#MTVernon #Illinois 23-year-old Brandon Griffin and 31-year-old Christine Santos were stopped by the Illinois State Police and both had arrest warrants. Following an altercation: Griffin was later found deceased after shooting at the troopers. pic.twitter.com/LJSxWTIcoZ — Illinois Crime Cam (@illinoiscrime) May 12, 2023 -
రాజమౌళిపై రామ్ చరణ్ ట్వీట్.. వీడియో వైరల్..!
'ఆర్ఆర్ఆర్' అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సాధించిన మూవీ. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళిని మరోస్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీని అమెరికాలోని లాస్ఎంజిల్స్లో బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేశారు రాజమౌళి. ఫారిన్ ఆడియన్స్‌తో కలిసి వీక్షించిన ఆయన థియేటర్లో సందడి చేశారు. తాజాగా ఆ వీడియోను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'వన్ అండ్ ఓన్లీ.. ఎస్ఎస్ రాజమౌళి' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో జక్కన్న పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. లాస్ ఎంజిల్స్‌లోని థియేటర్లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్ ఆడియన్స్ డ్యాన్స్‌తో హోరెత్తించారు. నాటు నాటు పాటకు స్టెప్పులతో అదరగొట్టారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ మార్మోగిపోయింది. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు విదేశీయులు డ్యాన్స్ చేయడాన్ని చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. One and Only @ssrajamouli Garu ❤️🙏 pic.twitter.com/FHOXTfyDQK — Ram Charan (@AlwaysRamCharan) October 2, 2022 Foreigners dancing.. Feel the Highhh💥💥💥 Thank you SSR 🧎 #RRR #RamCharan 🦁 🔥 https://t.co/LCbFJa1wPe pic.twitter.com/wJQ6wIxFlf — Ujjwal Reddy (@HumanTsunaME) October 1, 2022 -
నువ్వు తోపు సామి.. ఉక్రెయిన్ పౌరుడి తెగువకు ఫిదా.. వీడియో వైరల్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా భయాకన వాతావరణం నెలకొంది. యుద్దం వేళ ఎటునుంచి ఏ మిస్సైల్, బాంబు వచ్చి పడుతుందోనన్న భయంతో ప్రజలు బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఉక్రెనియన్లు మాత్రం దేశం కోసం సైనికుల్లా మారి పోరాటం చేస్తున్నారు. తాజాగా రష్యా దళాలు ఉక్రెయిన్ సైనికులపై దాడులను కొనసాగిస్తున్న వేళ ఓ ఆస్తక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యా బలగాల దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్ పౌరుడు ఆ ల్యాండ్‌మైన్‌ను చూశాడు. అయితే, దాని గురించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వకుండనే అనుకున్నదే తడవుగా రోడ్డు మీద ఉన్న ఆ ల్యాండ్‌మైన్‌కు రెండు చేతులతో(రక్షణ దుస్తులు, పరికరాలు లేకుండానే) పట్టుకొని దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. ల్యాండ్‌మైన్‌ను తీసుకువెళ్తున్న సమయంలో బాంబు పట్టుకున్నాననే టెన్షన్ లేకుండా అతను సిగరేట్ తాగుతూ ఓ హీరోలా దాన్ని పట్టుకుని నడిచాడు. A Ukrainian in Berdyansk spotted a mine on the road and didn't wait around for a bomb disposal unit - at great risk to life and limb, he removed the mine, clearing the way for the Ukrainian military.#nucleaire #WARINUKRAINE #RussiaUkraineWar #worldwar3 pic.twitter.com/BbSfHA8DXe — Indian Army Fan Club (@VaadeD) March 1, 2022 ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి తెగువను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వు తోపు సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత జవాన్లతో గడిపారు. ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. దేశాన్ని కాపాడే జవాన్లంటే ఈ ఖిలాడీ హీరోకు ప్రత్యేకమైన అభిమానం అని ఎన్నో సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జవాన్లతో ఓ రోజు గడిపిన కేసరి అక్షయ్ గురువారం నాడు ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) కు కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. కార్గో ప్యాంటు, లేత గోధుమరంగు టీ షర్టుతో తాను ఓ జవానులా మారి వారిలో ఒకరిలా కలిసిపోయారు. అక్కడి జవాన్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ సంప్రదాయంగా జరిగే కార్యక్రమాలకు డీజీ బీఎస్ఎఫ్ ఎస్‌హెచ్. రాకేశ్ అస్థానాతో కలిసి హాజరయ్యారు. అనంతరం అక్షయ్ నటించిన గుడ్ న్యూవ్జ్ చిత్రం నుంచి సౌదా ఖారా ఖారా పాటకు కాసేపు స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. ఈ సందర్భంగా మన కేసరి జవాన్లతో గడిపిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి క్యాప్షన్‌గా.. "ఈ రోజు సరిహద్దులను కాపలాగా ఉన్న ధైర్యవంతులతో ఒక రోజు గడపడం మరచిపోలేను. ఇక్కడకు రావడం నాకు ఎప్పుడూ మాటలతో వర్ణించలేని అనుభుతిని కలిగిస్తుంది. ఈ రోజు నిజమైన హీరోలను కలవడం నాకేంతో సంతోషంగా ఉందంటూ’ అందులో తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్! -
అసభ్యంగా తాకుతూ హోంగార్డు వెకిలి చేష్టలు..
కొచ్చి : రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కొచ్చిలోని తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్ డిపార్డ్మెంట్కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెలిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సీటి పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు శివకుమార్‌పై ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
'వదిలిపెట్టను.. సీఎంను చంపేస్తా..'
సాక్షి, పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. పట్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నితీశ్‌ను త్వరలోనే హత్య చేస్తానని హెచ్చరిస్తూ ఏకంగా సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఫతుహా అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ అలియాస్ పోయామా తన బాడీగార్డ్‌లతో కలిసి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. నితీశ్‌ను త్వరలోనే చంపేస్తానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. అంతకుముందు ముఖ్యమంత్రి నితీశ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన కొద్ది సేపటికే ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ఎందుకు అలా చేశాడని ప్రశ్నిస్తున్నారు. సమీక్ష యాత్ర పేరుతో నితీశ్ గ్రామాల్లో పర్యటిస్తుండగా నందన్ అనే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. రాళ్లను విసిరి కొట్టారు. అయితే, నితీశ్ సురక్షితంగా బయటపడినప్పటికీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం గాయపడ్డారు. ఆ కాసేపటికే ఈ వీడియో బయటకు వచ్చింది. అరెస్టయిన ప్రమోద్‌కుమార్ ఇసుక వ్యాపారి అని తెలిసింది. గత కొద్ది రోజులుగా ఇసుక కొరత కారణంగా తన వ్యాపారం దెబ్బదిన్నదనే ఆగ్రహంతోనే అతడు నితీశ్‌ను చంపేస్తానని అన్నట్లు సమాచారం. -
సైనికుల సంయమనానికి హాట్సాప్?
శ్రీనగర్: కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి గత ఆదివారం జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా విధులను ముగించుకొని ఈవీఎంలతో నిర్దేశిత ప్రాంతాలకు వెనుతిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల పట్ల స్థానిక ప్రజలు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. ఎంతో హేళన చేశారు. వెంటబడి వెంటబడి ఏడిపించారు. యువకులు ‘ఆజాద్, గో బ్యాక్ ఇండియా’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, సైనికులతోనూ ఆజాద్ అంటూ నినాదాలు చేయించారు. అంతటితో ఆగకుండా వారిని చేతుల మీద తన్ని, చెంపల మీద గిల్లారు. తలలమీద కొట్టేందుకు ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా, చేతుల్లో తుపాకులు ఉన్నప్పటికీ సైనికులు ఏ మాత్రం రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. వారి నుంచి తప్పించుకొని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరేందుకే ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతోంది. సైనికులు చూపిన సహనానికి ఇటు పోలీసులు, అటు ప్రజలు ‘హాట్సాఫ్ టు యు’ అంటూ సైనికులకు అభివాదం చేస్తున్నారు. ఏ మాత్రం రెచ్చిపోయి అల్లరి మూకలపైకి కాల్పులు జరిపినా ఎంతో మంది పిల్లల ప్రాణాలు గాల్లో కలసిపోయేవని, ఎంతో మంది తల్లులకు గర్భశోఖం మిగిలేదని ఈ సంఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ వైద్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసిన వారు కూడా ‘సైనికులు ఎందుకు అంత ఉపేక్షించారో, కాల్పులు జరిపితే వారికి తెలిసొచ్చేది’ అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. అప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది యువకులు మరణించారు. అలా మరణించిన వారి శవాలను చూడడం వల్లనే కశ్మీర్ యువత ఇలా రెచ్చిపోయిందని, గతంలో ఎంతో మంది అమాయకులు సైనికుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారన్నకసితోనే వారు ఇలా ప్రవర్తించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమర్థించారు. ఆదివారం నాడు అనేక ప్రాంతాల్లో రీపోలింగ్‌ను వాయిదా వేయడం వల్ల మంగళవారం నాడు తిరిగి శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి రీపోలింగ్ నిర్వహించారు. అయినా ఓటు వేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదు. మొత్తం 27 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. దాదాపు 35 వేల మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకోగా, 38 పోలింగ్ కేంద్రాల్లో కలసి కేవలం 679 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. గత 36 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ పోలింగ్ జరగలేదు. కశ్మీర్ ప్రజల్లో ఎన్నికల పట్ల ఎంత వ్యతిరేకతుందో ఇది స్పష్టం చేస్తోంది. -
సైనికుల సంయమనానికి హాట్సాప్?
-
ప్రతిభకు అడ్డురాని భారీకాయం
-
వైరల్ వీడియో: ఆ ఇద్దరు అన్నదమ్ములే!
కేవీ విద్యార్థిని చితకబాదిన కేసులో అన్నదమ్ములపై ఎఫ్ఐఆర్ ముజఫర్‌పూర్: కేంద్రియ విద్యాలయం (కేవీ)లో ఓ విద్యార్థిని చితకబాదిన వ్యవహారంలో ఇద్దరు తోటి విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరగతి గదిలో ఇద్దరు అబ్బాయిలు ఓ విద్యార్థిని అతి అమానుషంగా, కిరాతకంగా చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వీడియోపై దర్యాప్తు జరిపిన పోలీసులు సెప్టెంబర్ 25న ముజఫర్‌పూర్‌లోని కేంద్రియ విద్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. 12వ తరగతి విద్యార్థులైన ఇద్దరు అన్నదమ్ములు ఈ విధంగా 11వ తరగతి విద్యార్థిని అతి అమానుషంగా కొట్టినట్టు తేలింది. ఈ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న ఓ నేరగాడికి సంబంధం ఉన్నవారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హెచ్చార్డీ శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వావా నివేదిక సమర్పించాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి.. నిందితులైన ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు కాజి మహమ్మద్పుర పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. తరగతి గదిలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఇద్దరు అన్నదమ్ములు అతి అమానుషంగా జూనియర్ విద్యార్థిపై దాడి చేసినట్టు తెలుస్తున్నదని ఆయన వివరించారు. -
ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది!
-
ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది!
పంజాబీ సింగర్ దలేర్ మెహందీ పేరు చెబితే మొట్టమొదట గుర్తుకొచ్చే పాట 'తునక్ తునక్ తున్.. తారారా'. ఎప్పుడో 90లలో విడుదల చేసిన ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా చైనాలో ఒక చిన్నారి ఈ పాట పెడితే చకచకా పళ్లు తినేస్తోంది.. పాట ఆగితే మాత్రం మళ్లీ పెట్టమన్నట్లుగా చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. బూరెబుగ్గలతో చూసేందుకు ముద్దుగా ఉన్న ఈ బుజ్జాయితో తినిపించడానికి వాళ్ల అమ్మకు ఇదే మంచి ఉపాయంలా కనిపించింది. ఈ చిన్నారి వెనక పాట వస్తుండగా చకచకా తినేస్తున్న వీడియోను ఇప్పటికి 4.2 కోట్ల మంది చూడగా, 10 లక్షల మందికి పైగా షేర్ చేశారు. దాదాపు 45 రోజుల క్రితం ఈ వీడియో పోస్టయింది. ప్లేటులో పెట్టిన ముక్కలన్నింటినీ చకచకా తినేసి, ప్లేటు ఎత్తి మరీ ఇంకేమైనా ఉంటే తినేస్తానన్నట్లుగా ఈ చిన్నారి వీడియోలో కనిపిస్తుంది. షాంఘైస్ట్ అనే పేజీలో ఈ పాప వీడియోను షేర్ చేశారు. -
తాంత్రికుడితో సీఎం భేటీ!
♦ వీడియో విడుదల చేసిన బీజేపీ ♦ మహాకూటమిపై నిప్పులు ♦ మంత్ర తంత్రాలతో గెలవరన్న కేంద్ర మంత్రి జైట్లీ పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియో ఎన్నికల ప్రచారంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ జేడీయూ ఎమ్మెల్యే అభ్యర్థితో కలసి నితీశ్ క్షుద్ర విద్యలను ఆచరించే గురువు దగ్గరకు వెళ్లి.. ఆయన పక్కన కూర్చున్న వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరస్‌లా పాకిపోయింది. బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఈ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నితీశ్.. ఓ తాంత్రికుడి పక్కన కూర్చుని ఉన్నారు. ‘ఆర్జేడీ అధినేత లాలూతో మీరెందుకు కలిశారు. మీరు ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేది. నితీశ్ జిందాబాద్.. లాలూ ముర్దాబాద్’ అని ఆ తాంత్రికుడు నితీశ్‌ను ఆశీర్వదించి హత్తుకున్నట్లు వీడియోలో కనబడుతోంది. లాలూ పీడ వదిలించుకునేందుకే నితీశ్.. ఆ తాంత్రికుడిని కలిశారని బీజేపీ విమర్శించింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రిపై విమర్శలు చేస్తూ.. ‘కొన్ని శక్తులను రాష్ట్రం నుంచి బయటకు పంపించేందుకు ఏమేం చేయాలో తమకు తెలుస’ని లాలూ చేసిన వ్యాఖ్యలను గిరిరాజ్ సింగ్ గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాంత్రికులను సంప్రదించటం సిగ్గుచేటని నితీశ్‌పై విరుచుకుపడ్డారు. పరిస్థితి సరిగా లేనప్పుడు మంత్ర, తంత్రాలు పనిచేయవని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. పరోక్షంగా నితీశ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రధాని పదవినే అవమానించారు ఎన్నికల ప్రచారంలో ప్రధాని అనుచిత భాష వాడి ఆయన పదవినే కించపరిచారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘సైతాన్, అహంకారి’ వంటి పదాలను వాడటం ప్రధాని స్థాయికి మంచివి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. దేశంలో 300 జిల్లాలకు పైగా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఉందన్నారు. హరియాణాలో దళిత బాల సజీవ దహనంపై ప్రధాని నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా మోదీ పెదవి విప్పలేదని.. పైగా గాంధీ ఆలోచనలు పాటించాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ‘బిహార్‌లో జంగిల్ రాజ్ అని విమర్శిస్తున్న వారు.. హరియాణాలో మంగళ్ రాజ్(సుపరిపాలన) ఉందా? సమాధానం ఇవ్వాల’ని ఓ ఎన్నికల సభలో డిమాండ్ చేశారు. మాంఝీనే సీఎం అని చెప్పలేదే: షా ‘బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే.. నేనే సీఎం అవుతాన’న్న హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మాంఝీకి అలాంటి భరోసాలేమీ ఇవ్వలేదని ఓ టీవీ చానల్‌తో అన్నారు. సీఎం ఎవరినీ ప్రతిపాదించకపోవటంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. బీజేపీది టీమ్ వర్క్ అని.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో.. పార్టీ గెలిచాకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన విషయాన్ని గుర్తుచేశారు. -
రెప్పపాటులో తప్పిన ముప్పు
ఆ పిల్లాడికి స్కూలుకు వెళ్లడం ఇష్టం లేనట్లుంది.. అయినా తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది. దాంతో స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తూ.. ఫుట్‌పాత్ మీద అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాళ్లతో అక్కడున్న గ్రిల్‌ను తంతున్నాడు. మళ్లీ అక్కడ ఉండబుద్ధి వెయ్యలేదు.. దాంతో అలా పక్కకు వెళ్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి ఓ కారు వేగంగా ఫుట్‌పాత్ మీదకు దూసుకొచ్చింది. ఫుట్‌పాత్‌తో పాటు.. అతడు అప్పుడే దాటిన కరెంటు స్తంభాన్ని కూడా ఢీకొంది. అంతే, ఒక్కసారిగా ఆ పిల్లాడు ఉలిక్కిపడ్డాడు. తనకు భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయని తెలుసుకుని హమ్మయ్య అనుకున్నాడు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.