ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది! | adorable baby eating to daler mehandi video goes viral on social media | Sakshi
Sakshi News home page

ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది!

Published Wed, Aug 3 2016 9:28 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది! - Sakshi

ఆ పాట వింటేనే.. ఈ పాప తింటుంది!

పంజాబీ సింగర్ దలేర్ మెహందీ పేరు చెబితే మొట్టమొదట గుర్తుకొచ్చే పాట 'తునక్ తునక్ తున్.. తారారా'. ఎప్పుడో 90లలో విడుదల చేసిన ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా చైనాలో ఒక చిన్నారి ఈ పాట పెడితే చకచకా పళ్లు తినేస్తోంది.. పాట ఆగితే మాత్రం మళ్లీ పెట్టమన్నట్లుగా చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. 
 
బూరెబుగ్గలతో చూసేందుకు ముద్దుగా ఉన్న ఈ బుజ్జాయితో తినిపించడానికి వాళ్ల అమ్మకు ఇదే మంచి ఉపాయంలా కనిపించింది. ఈ చిన్నారి వెనక పాట వస్తుండగా చకచకా తినేస్తున్న వీడియోను ఇప్పటికి 4.2 కోట్ల మంది చూడగా, 10 లక్షల మందికి పైగా షేర్ చేశారు. దాదాపు 45 రోజుల క్రితం ఈ వీడియో పోస్టయింది. ప్లేటులో పెట్టిన ముక్కలన్నింటినీ చకచకా తినేసి, ప్లేటు ఎత్తి మరీ ఇంకేమైనా ఉంటే తినేస్తానన్నట్లుగా ఈ చిన్నారి వీడియోలో కనిపిస్తుంది. షాంఘైస్ట్ అనే పేజీలో ఈ పాప వీడియోను షేర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement